సీపీ రాధాకృష్ణన్‌కు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

 

భారత ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్‌కు ఏపీ చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. పదవీకాలం విజయవంతంగా పూర్తి చేయాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. దేశ సేవ, పురోగతికి రాధాకృష్ణన్‌ పనిచేస్తారని భావిస్తున్నట్టు చెప్పారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా తెలిపారు ఆయన అపార జ్ఞానం, అనుభవం ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. రాధాకృష్ణన్‌కు మంత్రి నారా లోకేశ్‌ ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. 

మరోవైపు ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్‌కు దేశ వ్యాప్తంగా అభినందనలువెల్లువెత్తున్నాయి. ప్రజా జీవితంలో  మీ దశాబ్దల అనుభవం దేశ ప్రగతికి ఎంతో దోహదపడునుందని మీ బాధ్యతల్లో విజయవంతమవ్వాలని ఆకాంక్షిస్తున్నా అని రాష్ట్రపతి ముర్ము ట్వీట్ చేశారు. రాధాకృష్ణన్‌ జీవితం ఎల్లప్పుడూ ప్రజాసేవకే అంకిత చేశారని అత్యుత్తమ ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్‌ నిలుస్తారని భావిస్తున్నాని ప్రధాని మోదీ తెలిపారు. అణగారిన వర్గాల సాధికారతకు కృషి చేసిన వ్యక్తి అని రాజ్యాంగ విలువలను రాధాకృష్ణన్‌ బలోపేతం చేస్తారని ఆశిస్తున్నా ప్రధాని పేర్కొన్నారు

Online Jyotish
Tone Academy
KidsOne Telugu