మళ్లీ మన ప్రభుత్వమే వస్తుంది... అధైర్య పడొద్దు : కేసీఆర్

 

బీఆర్‌ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామాల నూతన సర్పంచులు, వార్డు మెంబర్లలు కేసీఆర్‌ను  ఫాం హౌస్‌ కలిశారు. ఈ సందర్బంగా కేసీఆర్ మాట్లాడుతూ అన్ని కాలాలు మనకు అనుకులంగా ఉండవు కొన్ని కష్టాలు వస్తాయి. వాటికి కుంగి పోవద్దని తెలంగాణ పల్లెలకు తిరిగి మంచి రోజులు వస్తాయిని అప్పటి వరకు ప్రజలు అధైర్యపడొద్దని వచ్చేది మన బీఆర్‌ఎస్ ప్రభుత్వమని తెలిపారు. 

కాంగ్రెస్ పాలనలో ఎవరో ఏదో చేస్తారని ఆగం కావొద్దని సూచించారు. గ్రామస్థుల మద్దతుతో ఎన్నికైన సర్పంచులను శాలువాలతో సత్కరించి వారికి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా తన వద్దకు వచ్చిన గ్రామస్థులను గుర్తుపట్టి పేరు పేరునా పలకరించి, వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో గత బీఆర్‌ఎస్‌ పాలనలో గొప్పగా వర్ధిల్లిన గ్రామాల పరిస్థితిని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని రకాలుగా దిగజారిన పరిస్థితిని, గ్రామస్తులు కేసీఆర్ దృష్టికి తెచ్చి ఆవేదన వ్యక్తం చేశారు

Online Jyotish
Tone Academy
KidsOne Telugu