తెలంగాణపై ఫోకస్ చేస్తాం : లోకేష్

 

తెలంగాణపై తెలుగు దేశం పార్టీ ఫోకస్‌ చేస్తుందని ఏపీ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. ఢిల్లీ మీడియా ప్రతినిధులతో లోకేశ్‌ చిట్ చాట్ నిర్వహించారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక పోటీపై పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుదే తుది నిర్ణయమని పేర్కొన్నారు. కవిత టీడీపీలోకి వస్తారా? అనే ప్రశ్నకు లోకేశ్ స్పందించారు. కవిత టీడీపీలో తీసుకోవడం అంటే జగన్‌ను చేర్చుకున్నట్లేనని అన్నారు.ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థికి ఎందుకు ఓటు వేశారో జగన్‌ను వైసీపీ ఎంపీలు అడగాలని నారా లోకేశ్‌ సూచించారు. 

ఇప్పుడే కాదు.. 2029 ఎన్నికల్లోనూ మోదీకి మద్దతిస్తామని స్పష్టం చేశారు. రెడ్‌బుక్‌లో చాలా స్కామ్‌లు ఉన్నాయని నారా లోకేశ్‌ అన్నారు. అవన్నీ బయటకు వస్తాయని తెలిపారు. ఆ భయంతోనే జగన్‌ బెంగళూరులో ఉంటున్నారని విమర్శించారు. ఏపీ లిక్కర్‌ కేసులో ప్రభుత్వ జోక్యం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసు విచారణ పారదర్శకంగా కొనసాగుతోందని తెలిపారు. ఫైబర్‌ నెట్‌ను టాటా సంస్థకు ఇచ్చే చర్చ జరగలేదని స్పష్టం చేశారు. దేవాన్షు ఎందుకు రాజకీయాల్లో వస్తారు అనుకుంటున్నారు హ్యాపీగా చెస్ ఆడుకుంటున్నాడని పేర్కొన్నారు. 
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu