చిరంజీవికి కాంగ్రెస్ లో ప్రాధాన్యత లేదు: రామచంద్రయ్య

congress chiranjeevi, prp congress, chiranjeevi congress, kiran kuma reddy chiranjeeviరాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతోందని దేవాదాయ శాఖ మంత్రి రామచంద్రయ్య అన్నారు. సంప్రదాయ ఓటు బ్యాంక్‌ను కాంగ్రెస్ కోల్పోతుందని. పోయిన ఓటు బ్యాంక్‌ను తిరిగి తెచ్చుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని మంత్రి చెప్పారు. కాంగ్రెస్‌ను బలపరిచేందుకే ప్రజారాజ్యం పార్టీని (పీఆర్పీ) విలీనం చేయడం జరిగిందని, చిరు వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడంలేదని, తమను కలుపుకుని పోవాలని, తమ నాయకుడు చిరంజీవి బలపడితే కాంగ్రెస్ బలపడుతుందని మంత్రి సూచించారు. పార్టీలో చిరంజీవిని బలహీనపరిచే ప్రయత్నాలు జరిగితే కాంగ్రెస్సే నష్టపోతుందని రామచంద్రయ్య వ్యాఖ్యానించారు. చిరంజీవికి రాష్ట్రంలో మంచి ఫాలోయింగ్ ఉందన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu