బ్రిటన్ హైకమిషనర్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
posted on Sep 18, 2025 6:22PM

తెలంగాణ విద్యార్థులకు ఉన్నత విద్యను చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ముందడుగు వేసింది. యూకే ప్రభుత్వం అందించే చెవెనింగ్ స్కాలర్‌షిప్స్ను రాష్ట్ర ప్రతిభావంతులైన విద్యార్థులకు అందించేందుకు బ్రిటన్ అంగీకరించింది. జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి, భారత బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్‌లతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
కో-ఫండింగ్ ప్రాతిపదికన స్కాలర్‌షిప్స్ అందించేందుకు హైకమిషనర్ సుముఖత వ్యక్తం చేశారు. సమావేశంలో నూతన విద్యా విధానం, ఉపాధ్యాయుల నైపుణ్యాభివృద్ధి, రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలు, ముఖ్యంగా మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు, జీసీసీ, ఫార్మా, నాలెడ్జ్, అకాడమీ రంగాలపై చర్చించారు. రేవంత్ ప్రతిపాదనలపై లిండీ కామెరాన్ సానుకూలంగా స్పందించగా, ఈ చర్చలు తెలంగాణ–బ్రిటన్ సంబంధాలకు కొత్త ఊపు ఇస్తాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మూసీ నది అభివృద్ధి, ఇతర రంగాల్లో పెట్టుబడుల కోసం బ్రిటిష్ కంపెనీలను భాగస్వాములుగా చేయాలని సీఎం కోరారు. విద్యా, సాంకేతిక రంగాల్లో తెలంగాణకు సహకారం మెరిట్ విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ శిక్షణ ఇచ్చేందుకు ఆమె అంగీకరించారు.