సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌పై ప్రభుత్వం సీరియస్

 

ప్రజాపాలన దినోత్సవం వేడుకల్లో ప్రోటోకాల్ ఉల్లంఘనపై ప్రభుత్వం సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. కార్యక్రమానికి ఆలస్యంగా హాజరై, ముఖ్య అతిథి విప్ ఆది శ్రీనివాస్‌కు స్వాగతం పలకలేదని ఆరోపణలు వచ్చాయి. 

దీనిపై సీఎంవోకు ఆది శ్రీనివాస్ ఫిర్యాదు చేయడంతో, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కలెక్టర్‌కు నోటీసులు జారీ చేశారు. ఇక, మిడ్ మానేరు నిర్వాసితుడికి పరిహారం చెల్లించడంలో నిర్లక్ష్యం చూపినందుకు తెలంగాణ హైకోర్టు కూడా కలెక్టర్‌పై వారెంట్ జారీ చేసింది. నోటీసులు, వారెంట్‌లు వరుసగా రావడంతో ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ ఝా తీరు ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu