కేంద్ర మంత్రి రామ్మోహన్ చొరవతో మయన్నార్ బాధితులు స్వదేశానికి
posted on Jan 11, 2026 12:44PM
.webp)
ఉద్యోగుల కోసమని మయన్మార్ వెళ్లి మోసపోయి అక్కడే చిక్కుకుపోయిన పది మందిని కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు ప్రత్యక చొరవతో స్వదేశానికి వచ్చేలా చేశారు. భాధితుల ఇబ్బందులను వారి కుటుంబ సభ్యులు ఇటీవల రామ్మోహన్‌నాయుడి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌రే లేఖ రాసి రక్షించమని కోరారు.
దాంతో యాంగోన్‌లోని భారత రాయబా కార్యాలయం అధికారులు అక్కడి ప్రభుత్వ అధికారులతో చర్చించి 10 మందిని ఢిల్లీకి తరలించారు. బాధితులను ఏపీ భవన్ అధికారులు వారి స్వస్థలాలైన విజయనగరం, విశాఖపట్నం, అన్నమయ్య, హైదరాబాద్, జగిత్యాల జిల్లాలకు తరలించాు. మయన్నార్‌లో 80 మందికి పైగా భారతీయులు సైబర్ నేరగాళ్ల చేతుల్లో చిక్కుకున్నారని, వారందర్నీ వెనక్కు రప్పించే ప్రయత్నం చేయాలని రామ్మోహన్‌నాయుడు కేంద్ర మంత్రి జైశంకర్‌ను కోరారు.