సినిమా టికెట్ల రేట్లు పెంపు సీపీఐ నారాయణ ఫైర్

 

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ప్రధాని మోదీ,   హోం మంత్రి అమిత్ షా ప్రశంసల కోసమే పవన్ సనాతన ధర్మం అంటూ వేషం మార్చారని విమర్శించారు. వ్యక్తిగతంగా పవన్ సనాతన ధర్మం వ్యతిరేకి. సనాతన ధర్మంలో విడాకులు ఉండవు. సనాతన ధర్మాన్ని ప్రచారం చేసే పవన్ డిప్యూటీ సీఎంగా ఉండటం మన దురదృష్టమని  నారాయణ ఆరొపణలు చేశారు. మరోవైపు సినిమా టికెట్ ధరల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ మాఫియా, ప్రభుత్వాలు ప్రజలను లూటీ చేస్తున్నాయి. 

సినిమా వాళ్లు సిగ్గులేకుండా టికెట్ ధరలు పెంచమని అడిగితే ప్రభుత్వాలు బుద్ది లేకుండా టికెట్ ధరలు పెంచుతున్నాయి. వందల కోట్లు ఖర్చుపెట్టి ఎవరు సినిమాలు తీయమన్నారు.  మూవీ చూసేందుకు ప్రజలు వెళ్తే వాటర్ బాటిల్, బిస్కెట్లు కూడా తీసుకెళ్లనివ్వరు అని ఆరోపించారు. ఇదిలా ఉంటే కొత్త సినిమాల విడుదలకు ముందు బెనిఫిట్ షోలతో పాటు పదిరోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వాలు అనుమతి ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రీమియర్ షో టికెట్ ధరలు అయితే వెయ్యి రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. దీంతో ధరలు పెంచవద్దని తెలుగు రాష్ట్రాలకు నారాయణ విజ్ఞప్తి చేశారు.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu