బంగారు పాళ్యానికి..దండు పాళ్యం ముఠా

 

ఇదీ జ‌గ‌న్ బంగారు పాళ్యం ప‌ర్య‌ట‌న‌కు ప‌త్రిక‌ల్లో పెడుతోన్న క్యాప్ష‌న్స్. జులై 9న జ‌గ‌న్ చిత్తూరు జిల్లా బంగారు పాళ్యం మామిడి రైతుల ప‌ర‌మార్శ‌కు వ‌చ్చారా? లేక త‌న హంగూ ఆర్భాటం చూపించ‌డానికి వ‌చ్చారా? ఎవ‌రికీ అర్ధం కాలేదు. అద‌స‌లు ప‌ర‌మార్శ యాత్ర‌లా లేదు. దండ‌యాత్ర‌ను త‌ల‌పిస్తోంద‌న్న మాట వినిపిస్తోంది. అధ్య‌క్షుడినే ఏకంగా చొక్కా ప‌ట్టుకుని లాగుతున్నారు, ముట్టుకుంటున్నారు. ఎవ‌రూ ఎవ‌రి మాట విన‌డం లేదు. జ‌గ‌న్ అరుస్తున్నా ప‌ట్టించుకున్న పాపాన పోలేదెవ‌రూ. 10 ల‌క్ష‌ల జ‌నాభా వ‌చ్చినా టీడీపీ స‌భ‌లు స‌జావుగా  జ‌రిగిన‌వి ఎన్ని లేవు. అదే వైసీపీ.. ఆ అరుపులేంటి? కేక‌లేంటి? ర‌చ్చ రావ‌ణ్య‌మేంటి? కొంద‌ర‌న‌నే మాట‌లేంటంటే అర‌లుంగీలు క‌ట్టి వ‌దిలితే వీళ్లు అచ్చం ఆ దండుపాళ్యం బ్యాచీలా లేరూ.. అన్న మాట వినిపించింది స‌ర్వ‌త్ర‌

.అటుమొన్న పొదిలి, మొన్న తెనాలి, నిన్న సత్తెనపల్లి, నేడు బంగారుపాళ్యం.. అంతా ఒక‌టే బ్యాచ్, ఒక‌టే లుక్. ఎలాంటి తేడా లేదు. అల‌జ‌డి  సృష్టించ‌డానికి అంద‌రూ క‌ల‌సి క‌ట్టు క‌ట్టుకుని మూకుమ్మ‌డిగా దిగిన‌ట్టుగా క‌నిపిస్తోందన్న టాక్ వినిపిస్తోంది.ఇది మామిడి రైతుల క‌ష్టాలు తెలుసుకోవ‌డం కాదు.. మ‌న్నాంగ‌డ్డి కాదు. ఇది అదే. శాంతి భ‌ద్ర‌త‌ల స‌మ‌స్య‌కు విఘాతం క‌లిగించేదే.. కాబ‌ట్టి దీన్ని కంప‌ల్స‌రిగా క‌ట్ట‌డి చేయాలంటారు కొంద‌రు. మ‌రి కొంద‌రైతే ఒక ప్ర‌శ్న వేస్తున్నారు. ప్ర‌జాక్షేత్రంలో ప్ర‌జా స‌మ్య‌ల‌ను తెలుసుకుని.. ప్ర‌జా వేదిక‌లైన అసెంబ్లీకి వెళ్లి స‌మ‌స్య ప‌రిష్కారం  క‌నుగొన‌డం ఒక రూట్ మ్యాప్. ఆయ‌న‌స‌లు అసెంబ్లీకే వెళ్ల‌కుండా  ఏం సాధించేట‌ట్టు? అదీ నిజ‌మే క‌దా అంటారు ఇంకొంద‌రు. జ‌గ‌న్ ఇప్ప‌ట్లో అప్ప‌ట్లో అసెంబ్లీకి వ‌చ్చేది లేదు. అక్క‌డ రైతులు కాదు.. ఇత‌రులెవ‌రి స‌మ‌స్య‌ల‌ను చ‌ర్చించే అవ‌కాశమే లేదు. ఇదంతా త‌న రాజ‌కీయ ల‌బ్ధి కోసం చేస్తున్న పోరాటం ఆరాటం. 

అయినా సీజ‌న్ అయిపోయాక వ‌చ్చి ప్ర‌యోజ‌న‌మేంటి? అంటారు కొంద‌రు రైతులు. ఒక వేళ జ‌గ‌న్ నిజంగా చేయాల్సి వ‌స్తే ఇప్ప‌టికే జిల్లాలోని ఫ్యాక్ట‌రీల్లో నిల్వ ఉన్న ల‌క్ష కిలోల ప‌ల్ప్ ని కొనాలి. ఎందుకంటే త‌మ ద‌గ్గ‌ర అంత నిల్వ ఉంది కాబ‌ట్టి.. ఈ సీజ‌న్ కి ప‌ల్ప్ వ‌ద్ద‌న్న‌ది ఫ్యాక్ట‌రీల మాట‌. ఎప్పుడైతే ఉన్న నిల్వ అమ్ముడ‌వుతుందో ఆపై తాము కొంటామ‌ని అంటారు వారు. ఈ సీజ‌న్ లో కూడా అదేమంత సేల్ కాలేదు. వాళ్లు అప్ప‌ట్లో ముప్పై రూపాయ‌లు ప‌ర్ కిలో కొంటే ఇప్పుడు ఐదు రూపాయ‌ల‌కు కూడా కొనే నాథుడే లేరు. దీంతో వారు కాయ కొన‌డం లేదు. ఇక్క‌డ చూస్తే ప‌ల్ప్ ఫ్యాక్ట‌రీలు కొంటున్నాయి క‌దాని.. టేబుల్ ర‌కాలు ప‌క్క‌న పెట్టి, తోతాపురి ర‌కం ఎక్కువ‌గా వేసేశారు రైతులు. 

ఈ క‌మ్యూనికేష‌న్ గ్యాప్ వ‌ల్ల వ‌చ్చిన తంటా ఇది. దానికి తోడు త‌న హ‌యాంలో ఈ రైతుల‌ను ప‌ట్టించుకున్న పాపాన పోలేదు.. జ‌గ‌న్. వారికి ఏదైనా సాయం చేసిన దాఖ‌లాలు కూడా లేవు. ఈ  సారి వ‌ర్షాలు కూడా బాగా ప‌డ్డంతో.. పంట ఏపుగా ఎదిగింది. దీంతో వ‌చ్చిన స‌మ‌స్య ఇది. ఇది జ‌నానికి అర్ధం కావ‌ల్సిన విష‌యం. కానీ  జ‌గ‌న్ ఏం చేస్తున్నారు? బ‌ల ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డానికో వేదిక చేసుకుంటున్నార‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. దీంతో స‌మ‌స్య ఏంటో అర్ధంకాక ఒక గ‌జిబిజి గంద‌ర‌గోళానికి ఆస్కార‌మేర్ప‌డుతోంద‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయ్. ఇది మామిడి రైతుల కష్టాలు తెలుసుకుని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక నివేదిక ఇద్దాం,దీనిపై అసెంబ్లీలో గట్టిగా మాట్లాడదాం అన్న ఆలోచనతో చేసిన పర్యటన లాగా వుందా? ఆ ఆలోచనే లేకపోతే ఈ సమస్యను అధికారంలో లేని నీవు పరిష్కరిస్తావా?ఎంత దండగ మారిన గోల ఇది. ఇదేమన్నా కోటప్పకొండ తిరనాళ్ళా?ఈ పోకడ రాష్ట్రానికి క్యాన్సర్ కంటే ప్రమాదకరం!
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu