లోకేశ్‌ను అభినందించిన సీఎం చంద్రబాబు
posted on Jul 10, 2025 3:31PM
.webp)
మంత్రి లోకేశ్ విద్యాశాఖను అద్బుతంగా తీర్చిదిద్దుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. లోకేశ్ ఏరికోరి ఆ శాఖను ఎంచుకున్నారని తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో మెగా పీటీఎం 2.0 కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతు మీ పిల్లలకు చదువు చెప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. విద్యార్థుల విషయంలో టీచర్లదే కాదు.. తల్లిదండ్రులది కూడా బాధ్యత ఉంటుందన్నారు.
మన పిల్లల్ని తీర్చిదిద్ది జ్ఞానాన్ని ఇచ్చే పుణ్య పాఠశాల చదువుకుని పైకి వచ్చిన వారు స్కూళ్లకు ఎంతకొంత సాయం చేయాలి సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆడ, మగ బిడ్డలను సమానంగా చూసుకోవాలిని పిలుపునిచ్చారు. ఆ ఉద్దేశ్యంతోనే ఎంత మంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం ఇస్తున్నాం అని ముఖ్యమంత్రి తెలిపారు. వేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామన్నారు. మెగా పేరెంట్స్మీటింగ్తో గిన్నిస్‌రికార్డు నెలకొల్పామన్నారు. స్కూల్ పిల్లలకు ఇచ్చే పుస్తకాలు, బ్యాగులపై కూడా గత పాలకులు బొమ్మలు వేసుకున్నారని విమర్శించారు.
నేను అనుకునే లక్ష్యాన్ని నెరవేరుస్తాననే ధైర్యం ఇక్కడ వచ్చిందన్నారు. పేరెంట్స్ కమిటీ ఏర్పాటు చేయాలని 1998లో అనుకున్నానని తెలిపారు. విద్యావ్యవస్థను అద్భుతంగా నిర్వహిస్తున్న మంత్రి లోకేశ్‌కు అభినందనలు తెలిపారు. గడచిన ఐదేళ్లలో ఒక టీచర్‌ను కూడా నియమించలేదన్నారు. టీచర్లు లేకుండా విద్యా సంస్కరణలు ఎలా తెచ్చారో జగన్ చెప్పాలన్నారు. ఆంగ్ల మాధ్యమం పెట్టామంటూ లేనిపోని సమస్యలు తీసుకొచ్చారని ఆరోపించారు. టీచర్లను తాము గౌరవంగా చూస్తాం.. నూతన సంస్కరణలను తీసుకు వస్తామని అన్నారు. ఇప్పటికే 12 డీఎస్సీలు పెట్టి లక్షా 66 వేల మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. ఇటీవలే ఇంకో డీఎస్సీ వేసి 16,347 పోస్టులు భర్తీ చేస్తున్నామని చంద్రబాబు ప్రకటించారు.