వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డికి అస్వస్థత..ఆసుపత్రికి తరలింపు
posted on Jun 21, 2025 1:38PM

ఏపీ లిక్కర్ స్కాం కేసులో జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అస్వస్థత గురైనట్లు తెలుస్తోంది. ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పటంతో ఆయన్ను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఇటీవల చెవిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టగా జులై1 వరకు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. చెవిరెడ్డిపై లుక్ ఔట్ నోటీసు ఉండటంతో బెంగళూరు విమానాశ్రయంలో చెవిరెడ్డిని ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకుని సిట్ కు సమాచారం అందించారు. దీంతో సిట్ అధికారులు విజయవాడ నుంచి హుటాహుటిన బెంగళూరు చేరుకుని చెవిరెడ్డిని అదుపులోనికి తీసుకుని జూన్ 18 కోర్టులో హాజరు పరిచారు.