హరీష్ రావు సభలో రప్పా రప్పా ప్లకార్డులు

 

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో నిర్వహించిన రైతు ధర్నాలో బీఆర్ఎస్ కార్యకర్తలు పుష్ప మూవీ డైలాగ్ ప్లకార్డులు ప్రదర్శించారు. 2028 లో రప్పా రప్పా 3.0 లోడింగ్" అంటూ మాజీ మంత్రి హారీశ్‌రావు, ఫోటోలతో ప్లకార్డులు రూపోందించారు. కాగా మాజీ సీఎం జగన్ సత్తెనపల్లి పర్యాటనలోనూ ఓ యువకుడు ఇదే డైలాగ్‌తో ప్లకార్డులు ప్రదర్శించిగా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల రాజకీయల్లో పుష్ప డైలాగ్ కాక రేపుతోంది. 

పుష్ప-2 సినిమాలో అల్లు అర్జున్  పాపులర్ డైలాగ్స్ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోకి ప్రవేశించాయి. 2029లో వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే గంగ‌మ్మ జాత‌ర‌లో వేట త‌ల‌లు న‌రికిన‌ట్టు  ర‌ప్పా ర‌ప్పా న‌రుకుతాం ఒక్కొక్క‌డినీ! పొట్టేళ్ల‌ను న‌రికిన‌ట్టు న‌రుకుతాం’ అని రాసిన ఫ్లెక్సీల‌ను కార్యకర్తలు ప్రదర్శించడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ డైలాగును వైఎస్ జగన్  సమర్ధించడంతో ఏపీలో పెద్ద రచ్చే నడుస్తోంది.దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల తదితర టీడీపీ నేతలు సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు.