సినీ నటి మాధవిలతపై కేసు
posted on Feb 25, 2025 3:37PM
సినీ నటి మాధవిలతపై అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తాడిపత్రి మహిళలను కించపరిచే విధంగా మాధవిలత వ్యాఖ్యలు చేశారని ఎపి మాల మహనాడు డైరెక్టర్ కొంకణి కమలమ్మ పోలీసులకు ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జెసీ ప్రభాకర్ రెడ్డి, సినీ నటి మాధవిత మధ్య వివాదం రోజుకో మలుపుతిరుగుతోంది. గత సంవత్సరం డిసెంబర్ 31 న తాడిపత్రి మహిళల కోసం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం జెసీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకలకు హాజరు కావద్దని మాధవిలత తాడిపత్రి మహిళలను కోరారు. మహిళలు సేఫ్ గా ఇంటికి రావాలంటే వేడుకలకు హాజరు కావొద్దని ప్రకటన చేయడంతో జెసీ, మాధవిలత మధ్య మాటలయుద్దం కొనసాగుతూనే ఉంది. తాజాగా మాల మహనాడు డైరెక్టర్ ఫిర్యాదుతో వీరి వివాదం మరింత ముదిరింది.