కావేరీ ట్రావెల్స్ బస్సు.. అన్ని ఉల్లంఘనలే
posted on Oct 24, 2025 9:47AM

కర్నూలు సమీపంలోని చిన్న టేకూరు వద్ద కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైన సంగతి విదితమే. అయితే ఈ బస్సు ఒరిస్సాలో రిజిస్ట్రేషన్ అయింది ఇప్పటికే ఈ బస్సు మీద నో ఎంట్రీ, రాంగ్ పార్కింగ్, డేంజరస్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్ వంటి ఉల్లంఘనలకు సంబంధించి 23 వేల రూపాయలకు పైగా చలాన ఉంది. కావేరి ట్రావెల్స్ బస్సు పటాన్ చెరులో ఉన్న ట్రాన్స్పోర్ట్ ఆఫీసు నుండి గురువారం రాత్రి 9 గంటలకు బయలు దేరింది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే కలెక్టర్ సిరి ఘటన స్థలానికి చేరుకున్నారు. హైదరాబాదు నుండి బెంగళూ రుకు వెళ్తుండగా ఈరోజు ఉదయం మూడున్నర, నాలుగు గంటల మధ్య చిన్న టేకూరు వద్ద ప్రమాదానికి గురైంది. ఈ బస్సు అతి వేగంగా వెడుతూ ముందున్న బైక్ ను ఢీకొంది. ఈ సంఘటనలో బైక్ పై వెడుతున్న ఇద్దరు వ్యక్తులూ మరణించారు. అలాగే బైక్ బస్సుకిందకు వెళ్లి ఆయిల్ ట్యాంకర్ ను ఢీకొంది. వెంటనే మంటలు చెలరేగాయి. అంతే కాకుండా ఈ ప్రమాద ఘటనలో బస్సు డోర్ ఓపెన్ అయ్యే కేబుల్ వైర్ కూడా తెగిపోయింది. దీంతో బస్సు డోరు తెరుచుకోలేదు. కొందరు ప్రయాణీకులు ఎమర్జెన్సీ డోర్ ద్వారా బయటకు రాగలిగారు. మరి కొందరు అద్దాలు పగులగొట్టుకుని కిందకు దూకేసారు. అయితే 20 మంది ప్రయాణీకులు మాత్రం బయటకు రాలేక మంటలకు ఆహుతైపోయారు. ఇప్పటి వరకూ 11 మృతదేహాలను వెలికి తీశారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో డ్రైవర్లతో కలిసి 41 మంది ఉన్నారు.
వీరిలో 21 మంది ప్రాణాలతో బయటపడగా, 20 మంది మృత్యువాత పడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కుకట్‌పల్లి నుంచి ఆరుగురు, వనస్థలి పురం నుంచి ఒక్కరు, ఎస్ ఆర్ నగర్ నుంచి ముగ్గురు,కుత్బు ల్లాపూర్ నుంచి నలుగురు,ఎల్ బీ నగర్ నుంచి ఇద్దరు, ఎర్రగడ్డ నుంచి ఇద్దరు,మూసా పేట్ నుంచి ఇద్దరు, భరత్ నగర్ నుంచి ఒకరు,ప్యారడైజ్ నుంచి ఇద్దరునాంపల్లి నుంచి ఒకరు,లక్డీకా పూల్ నుంచి ఇద్దరు, పటాన్ చెరువు నుంచి ఒకరు, బీరంగూడ నుంచి ఒకరు,మియాపూర్ నుంచి ఒకరు బస్సులో ఎక్కారు.. ఇప్పటివరకు వీరి గురించి ఎటువంటి సమాచారం తెలియలేదు.