బీఆర్‌ఎస్ పార్టీ ఓటమికి ఆచట్టమే కారణం : సీఎం రేవంత్
posted on Oct 19, 2025 4:52PM

బీఆర్‌ఎస్ ఓటమికి ధరణి చట్టమే కారణమని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో సర్వేయర్లుగా శిక్షణ పొందిన అభ్యర్థులకు లైసెన్స్‌లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణి విముక్తి కలిగిస్తామని హామీ ఇచ్చామని పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రజా ప్రభుత్వం అధికారంలో రాగానే ఆ చట్టాన్ని తొలిగించి భూభారతి తీసుకోచ్చామని ముఖ్యమంత్రి తెలిపారు.
భూమి మీద ఆధిపత్యం కోసం గతంలో యుద్ధాలు జరిగాయని, సర్వేలో తప్పులు చేస్తే ప్రజలు తిరగబడే అవకాశం ఉందని తెలిపారు. గత ప్రభుత్వంలో ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్లలో దొరికేవి సీఎం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రక్షాళన చేశామని స్పష్టం చేశారు. సంవత్సరంలోనే 60వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. మేం ఉద్యోగాలు ఇస్తుంటే.. కోర్టులో కేసులు వేసి అపాలని చూస్తున్నారు. కోర్టుల్లో పోరాడి అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తున్నాం. త్వరలోనే గ్రూప్-3, గ్రూప్-4 అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తాం. లైసెన్స్ పొందిన సర్వేయర్లంతా బాధ్యతా యుతంగా వ్యవహరించి, రైతులకు సాయం చేయాలి’’ అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.