తిరుపతిలో బాంబు బెదరింపులు.. అలర్టైన పోలీసులు
posted on Oct 3, 2025 2:28PM
.webp)
నగరంలోని పలు ప్రాంతాలలో బాంబులు పెట్టామంటూ వచ్చిన బెదరింపు ఈ మెయిల్స్ తో తిరపతి నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ బెదరింపుల వెనుక ఉగ్ర హస్తం ఉందన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యాయి. ఐఎస్ఐ, ఎల్టీటీఈ మిలిటెంట్లు కలిసి తిరుపతి నగరంలో బాంబు పేలుళ్లకు కుట్రపన్నినట్లు పేర్కొంటూ రెండు ఈ మెయిల్స్ రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.
తిరుపతిలో నాలుగు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లకుపాల్పడతామన్నది ఆ బెదరింపు ఈమెయిల్స్ సారాంశం. దీంతో ఆర్టీసీ బస్టాండ్, శ్రీనివాసం, విష్ణు నివాసం, కపిల తీర్థం ఆలయం, గోవిందరాజుల స్వామి ఆలయం పరిసర ప్రాంతాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. బాంబు స్క్వాడ్స్, డాగ్ స్క్వాడ్స్ తో విస్తృత తనిఖీలు చేపట్టారు. తిరుపతిలోని న్యాయమూర్తుల నివాస సముదాయం, కోర్టు ప్రాంగణం ప్రాంతాలలోనూ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేవారు. అలాగే తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుమల, శ్రీకాళహస్తి దేవస్థానాల్లో కూడా సోదాలు నిర్వహించారు.