నోరు జారారా?... మనసులో ఉన్నదే చెప్పారా?... బీఫ్ పై బీజేపీ స్టాండ్


 

నోరు జారలేదు... మనసులో ఉన్నదే చెప్పారు...  బీఫ్ పై బీజేపీ స్టాండ్

 

ఉత్తరప్రదేశ్ దాద్రిలో గొడ్డుమాంసం తిన్న అక్లాఖ్ హత్య... భారత్ లో ఉండాలంటే గోమాంసం తినడం మానాల్సిందేనన్న వార్నింగ్... జమ్మూకాశ్మీర్ లో బీఫ్ పార్టీ ఇచ్చిన ఎమ్మెల్యేపై అసెంబ్లీలో దాడి... బీజేపీ నాయకుల వివాదాస్పద వ్యాఖ్యలు.... మోడీ సీరియస్... అమిత్ షా నోటీసులు... ఇంతకీ బీఫ్ పై బీజేపీ లీడర్స్ ఏమన్నారు? వాళ్లు నోరు జారారా? మనసులో ఉన్నదే బయటపెట్టారా?



( హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టార్ )

-ముస్లింలు భారత్ లో ఉండాలంటే గోమాంసం తినడం మానాల్సిందే, ఆవు మాంసం తింటూ ముస్లింలు హిందువుల పవిత్రభావజాలాన్ని అవమానిస్తున్నారు, గోవులను హిందువులు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు, మనది ప్రజాస్వామ్యదేశం. ఇక్కడ అందరికీ స్వేచ్ఛ ఉంటుంది, కానీ దానికీ ఓ హద్దు ఉంటుంది. ఇతరుల భావాలను భంగం కల్గించనంతవరకే స్వేచ్ఛకు పరిమితి ఉంటుంది

(ఆరెస్సెస్ పత్రిక ‘పాంచజన్య’)

- గోవధకు పాల్పడేవారిని చంపాలని వేదాల్లో ఉంది. హిందూ సమాజంలో గోవధ అనేది చాలా పెద్ద విషయం. హిందువుల్లో అనేకమందికి ఇది జీవన్మరణ సమస్య

( బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్‌ )

- గోవులను చంపేవారిని హత్య చేసినా తప్పులేదు

( యూపీ బీజేపీ ఎమ్మెల్యే సంగీత్‌ సోమ్‌ )

- గోవులను చంపుతున్న ముస్లింలపై ప్రతీకారం తీర్చుకునే సామర్థ్యం హిందువులకు ఉంది

(కేంద్ర మంత్రి మహేశ్‌ శర్మ) (కేంద్ర మంత్రి సంజీవ్‌ బల్యన్)

- గోమాంసం తిన్నందుకు దాద్రిలో అక్లాఖ్ అనే ముస్లింని కొట్టిచంపిన ఘటన చాలా చిన్న విషయం

Online Jyotish
Tone Academy
KidsOne Telugu