వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

 

రాష్ట్ర వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణ ఆత్మీయతను ప్రతిబింబించే ఈ పండుగ చివరి రోజు మహిళలు పెద్ద ఎత్తున సమీకరించి సాంప్రదాయ ఉత్సాహంతో సంబరాలు చేసుకుంటున్నారు. రంగురంగుల పూలతో భక్తిశ్రద్ధలతో బతుకమ్మలు పేర్చి పాటలు పాడుతూ నృత్యాలు చేస్తున్నారు.హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌, సరూర్‌నగర్‌ పరిసరాలు వెలుగులతో కళకళలాడుతున్నాయి. ప్రత్యేకంగా సరూర్‌నగర్‌ మైదానంలో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవం విశేష ఆకర్షణగా నిలిచింది. 63 అడుగుల ఎత్తయిన భారీ బతుకమ్మను నిర్మించి గిన్నిస్ రికార్డు సాధన లక్ష్యంగా ఈ వేడుకను నిర్వహించారు. 

ఒకేసారి 1,354 మంది మహిళలు బతుకమ్మ ఆడుతూ కొత్త రికార్డును సృష్టించారు.ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మంత్రి సీతక్క బతుకమ్మ పాట పాడి వేడుక వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చారు.హనుమకొండ, నిజామాబాద్‌, ఖమ్మం, కరీంనగర్‌, వరంగల్‌ సహా పలు జిల్లాల్లోనూ మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మను ఆడుతూ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించారు. మరోవైపు సరూర్‌నగర్‌ మైదానంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించాయి. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu