వైసీపీ మాజీ ఎమ్మెల్యే నివాసంపై దాడి

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంపై సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఇంట్లో ఫర్నీచర్ ధ్వంసం చేశారు. నెల్లూరు కొండయ్యపాలెం గేట్ సమీపంలో సుజాతమ్మ కాలనీలో నివాసం ఉంటున్న నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాలుగుదశాబ్దాలుగా రాజకీయాలలో ఉన్న నల్లపరెడ్డి కుటుంబంపై దాడి జరగడం సంచలనంగా మారింది. ఇలా ఉండగా వేమిరెడ్డి వర్గీయులే ఈ దాడికి పాల్పడ్డారని ప్రసన్నకుమార్ రెడ్డి ఆరోపిస్తున్నారు.