కాలినడకన ఇంద్రకీలాద్రిపైకి.. ఆపై క్యూలో వెళ్లి అమ్మవారి దర్శనం!
posted on Sep 22, 2025 2:02PM

ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారికి తెలుగుదేశం సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దర్శించుకున్నారు. శరన్నవరాత్రులు తొలి రోజైన సోమవారం (సెప్టెంబర్ 22) ఆయన కాలినడకన ఇంద్రకీలాద్రి కొండపై ఉన్న కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకుని సాధారణ బక్తుడిలా క్యూలో నిలుచుని అమ్మవారిని దర్శించుకున్నారు.
గత రెండు దశాబ్దాలుగా దేవినేని ఉమ శరన్నవరాత్రులు ప్రారంభమైన తొలి రోజున కాలినడకన ఇంద్రకీలాద్రి కొండకు చేరుకుని దుర్గమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా పాటిస్తూ వస్తున్నారు. విజయవాడ వన్ టౌన్ లోని వినాయకుడి ఆలయం వద్ద నుంచి కాలినడకను ఇంద్రకీలాద్రి చేరుకుని క్యూలైన్ లో నిలుచుని సాధారణ భక్తుడిగా అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ ఏడాదీ అదే చేశారు. అంతకు ముందు వినాయకుడి గుడిలో దేవినేని ఉమ ప్రత్యేక పూజలు నిర్వహించారు.