స్కూల్ బస్సును ఢీకొన్న రైలు.. ముగ్గురు విద్యార్థులు మృతి

తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. పట్టాలు దాటుతున్న ఓ స్కూలు బస్సును రైలు ఢీ కొంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు విద్యార్థులు సంఘటనా స్థలంలోనే మరణించారు. పలువురు విద్యార్థలు గాయపడ్డారు. ప్రమాద తీవ్రతను బట్టి చూస్తుంటే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.

కడలూరు చెమ్మన్ గుప్పం రైల్వే గేటు వద్ద ఈ దుర్ఘటన జరిగింది. రైలు వచ్చే సమయం అయినా కూడా రైల్వే గేటు వేయకపోవడమే ఈ ప్రమాదానికి కారణంగా చెబుతున్నారు.  పట్టాలు దాటుతున్న స్కూలు బస్సును వేగంగా వస్తున్న రైలు ఢీకొనడంతో.. ఆ ధాటికి స్కూలు బస్సు దాదాపు 50 మీటర్ల దూరానికి ఎగిరిపడింది. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది.  స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘట స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం తరలించారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu