రెచ్చిపోయిన అర్ష్‌దీప్‌, సూర్య‌, రాహుల్ .. భారత్ విజ‌యం

ఇటీవ‌ల టీమ్ ఇండియా విజ‌యానికి కీల‌క‌పాత్ర వ‌హిస్తు న్న డాషింగ్ బ్యాట్స్‌మ‌న్ సూర్య‌ కుమార్ యాద‌వ్, ఓపెన‌ర్ కె. ఎల్‌. రాహుల్ స‌మ‌యోచిత బ్యాటింగ్ ప్రావీణ్యం క‌లిసి భార‌త్‌కు సునాయాస విజ‌యాన్ని అందించాడు. తిరువ‌నంత‌పురంలో దక్షిణా ఫ్రికాతో జ‌రిగిన టీ-20లో భార‌త్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. మొద‌ట బ్యాట్ చేసిన ద‌క్షిణాఫ్రికా 20 ఓవ‌ర్ల లో 8 వికెట్ల న‌ష్టానికి 106 ప‌రుగులుచేసింది. భార‌త్ బౌల‌ర్లు అర్ష‌దీప్‌, అక్ష‌ర్ ప‌టేల్ అద్భుత బౌలింగ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో ద‌క్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ పూర్తిగా దెబ్బ‌తిన్న‌ది. కాగా భార‌త్ 16.3 ఓవ‌ర్ల‌లో 2 వికెట్ల న‌ష్టానికి విజ‌యం సాధించింది. ఫామ్‌లో దూసుకు పోతున్న సూర్య‌ కుమార్ యాద‌వ్ తో క‌లిసి ఓపెన‌ర్ కె.ఎల్‌. రాహుల్ రెచ్చిపోయారు. ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ల‌ను సునాయా సంగా ఆడు కున్నారు. రాహుల్ 51 ప‌రుగులు 56 బంతుల్లో చేసి, సూర్య‌కుమార్ 33 బంతుల్లో 50 ప‌రుగులు చేసి అజేయంగా నిలిచారు.  వీరి ద్ద‌రూ 3వ వికెట్‌కి 65 బంతుల్లో 93 ప‌రుగులుచేశారు. 

మొదట బ్యాట్ చేసిన ద‌క్షిణాఫ్రికాకు తొలి ఓవ‌ర్ నుంచే క‌ష్టాలు మొద‌లయ్యాయి. దీప‌క్ చాహ‌ర్ తొలి ఓవ‌ర్లోనే వికెట్ తీశాడు. రెండో ఓవ‌ర్‌లో అర్ష్‌దీప్ తానేమీ త‌క్కువ‌తిన‌లేద‌ని విజృంభించి డీకాక్‌, ర‌సోల్‌, మిల్ల‌ర్ వికెట్ల తీసి జ‌ట్టుని, ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఆశ్చ‌ర్య‌ప‌రిచి అమితానందాన్నిచ్చాడు. అద్భుత ఇన్‌స్వింగ్‌తో డీకాక్ వంటి ఎంతో అనుభ‌వం ఉన్న బ్యాట‌ర్ల‌ను పెవిలియ‌న్ దారి ప‌ట్టించాడు. అలానే చాహ‌ర్ కూడా రెచ్చిపోయాడు. వీరిద్ద‌రి బౌలింగ్ ధాటిని ఎదుర్కొన‌లేక ద‌క్షిణాఫ్రికా పేక‌ముక్క‌ల్లా వికెట్లు కోల్పోవ‌డంతో 2.3 ఓవ‌ర్ల లోనే కేవ‌లం 9 ప‌రుగుల‌కు 5 వికెట్లు కోల్పోయింది. ఇంత‌టి దారున‌మైన బ్యాటింగ్‌ను ప్రేక్ష‌కులు ద‌క్షిణాఫ్రికా నుంచి ఎన్న‌డూ ఊహించ‌లేదు. మొద‌టి ఆరు ఓవ‌ర్ల‌కు ద‌క్షిణాఫ్రికా 5 వికెట్ల న‌ష్టానికి కేవ‌లం 30 ప‌రుగులే చేసింది. అయితే ఒక ఎండ్‌లో మాక్ర‌మ్ ఎంతో జాగ్ర‌త్త‌గా ఆడుతూ జ‌ట్టు స్కోర్‌ను ముందుకు తీసికెళ్లాడు. కానీ 8వ ఓవ‌ర్లో హ‌ర్ష‌ల్ కి దొరికి పోయాడు. అప్ప‌టికి జ‌ట్టు స్కోరు 42 ప‌రుగుల‌కు చేరుకుంది. మ‌క్ర‌మ్ 25 ప‌నుగులు చేశాడు. 9వ ఓవ‌ర్లో సీనియ‌ర్ స్పిన్నర్ అశ్విన్ వ‌చ్చి ప‌రుగులు ఇవ్వ‌కుండా మైడిన్ చేయ‌డంతో ద‌క్షిణాఫ్రికా బ్యాట‌ర్లు మ‌రింత కంగారెత్తారు. 10 ఓవ‌ర్లు పూర్త‌య్యే స‌రికి ద‌క్షిణాఫ్రికా 6 వికెట్ల న‌ష్టానికి 48 ప‌రుగులు చేసింది. అప్ప‌టికి ర‌న్ రేట్ 4.86 ఉంది. అక్ష‌ర్ వేసిన 12వ ఓవ‌ర్లో ద‌క్షిణాఫ్రికా 50 ప‌రుగులు పూర్తి చేసింది. 15 ఓవ‌ర్లు పూర్త‌య్యే స‌రికి 4.20 ర‌న్‌రేట్‌తో 6 వికెట్ల న‌ష్టానికి 63 ప‌రుగులు చేయ‌గ‌లిగింది. పార్న‌ల్ చ‌క్క‌గా బ్యాట్ చేస్తున్నాడ‌నుకుంటుండ‌గానే 16వ ఓవ‌ర్లో అక్ష‌ర్‌కి దొరికిపోయాడు. పార్న‌ల్ 37 బంతుల్లో 24 ప‌రుగులు చేశాడు. కాగా 19 ఓవ‌ర్ వేసిన అర్ష‌దీప్ 14 ప‌రుగులు ఇచ్చాడు. దీంతో ద‌క్షిణాఫ్రికా 7 వికెట్ల న‌ష్టానికి 100 ప‌రుగులు పూర్తి చేసుకుంది. చివ‌రి ఓవ‌ర్లో మహారాజ్ వెనుదిర‌గ‌డంతో ద‌క్షిణాఫ్రికా 5.26 ర‌న్ రేట్‌తో 8 వికెట్ల న‌ష్టానికి 101 ప‌రుగులే చేయ‌గ‌లిగింది. 

109 ప‌రుగుల ల‌క్ష్యంతో బ్యాటింగ్ కి దిగిన భార‌త్ కూడా తొలి ఓవ‌ర్ల‌లో త‌డ‌బ‌డింది. పార్న‌ల్ వేసిన రెండో ఓవ‌ర్లోనే కెప్టెన్ శ‌ర్మ వెనుదిరిగాడు. అప్ప‌టికి జ‌ట్టు స్కోర్ కేవ‌లం9 ప‌రుగులే. త‌ర్వాత 7 వ ఓవ‌ర్లో ఊహించ‌ని వ‌ధంగా కింగ్‌కోహ్లీ పెవిలియ‌న్ దారి ప‌ట్టాడు. అప్పుడు హీరో సూర్య‌కుమార్ రంగంలోకి దిగాడు. అత‌ని రాక‌తో, మ‌రో ఎండ్‌లో కె.ఎల్‌. రాహుల్ కూడా రెట్టించిన ఉత్సాహంతో ప‌రుగుల వ‌ర‌దే సృష్టించాడు. ఇద్ద‌రూ ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ల‌ను బాదుడే బాదుడు. రాహుల్ ఎంతో తెలివిగా నిల‌క‌ డ‌గా ఆడి ఇన్నింగ్ నిల‌బెట్టాడు. మొద‌టి ప‌ది ఓవ‌ర్ల‌లో భార‌త్ 2 వికెట్ల న‌ష్టానికి 47 ప‌రుగులు చేయగా, 15 ఓవ‌ర్ల‌కు 91 ప‌రు గులు చేసింది. 13 ఓవ‌ర్‌కి రాహుల్, సూర్య 3వ వికెట్‌కి 39 బంతుల్లో 51 ప‌రుగులు చేశారు. అక్క‌డి నుంచి మ‌రింత రెచ్చి పోయారు. దీనికి తోడు ద‌క్షిణాఫ్రికా ఫీల్డింగ్ చెప్పుకోద‌గ్గ స్థాయిలో లేక‌పోవ‌డం కూడా క‌లిసి వ‌చ్చింది. 16వ ఓవ‌ర్లో భార‌త్ వంద ప‌రుగులు పూర్తి చేసింది. ర‌బాడా వేసిన ఆ ఓవ‌ర్లో కెప్టెన్ బ‌హుమా క్యాచ్ వ‌దిలేయ‌డం కొంత ఇబ్బందిపెట్టింది. అయితే అప్ప‌టికే ఆట వారి చేతిలోంచి వెళిపోయింది గ‌నుక కెప్టెన్ పెద్ద‌గా బాధ‌ప‌డిన‌ట్టు క‌న‌ప‌డ‌లేదు. మొత్తానికి భార‌త్ 16.4 ఓవ‌ర్ల‌లో 2 వికెట్ల న‌స్టానికి విజ‌యం సాధించింది. కె.ఎల్. రాహుల్ 56 బంతుల్లో 51 ప‌రుగులు చేయగా, డాషింగ్ బ్యాట‌ర్ సూర్య‌కుమార్ 33 బంతుల్లోనే 50 ప‌రుగులుచేశాడు. ఇద్ద‌రూ క‌లిసి 3వ వికెట్‌కి 65 బంతుల్లో 93 ప‌రుగులు జోడించి జ‌ట్టు విజ‌యంలో కీల‌క‌పాత్ర‌పోషించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu