నిశిత్ డ్రైవింగ్... కేవలం 5 సెకన్లలోనే..
posted on May 12, 2017 10:41AM
(1).jpg)
ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. అతనితో పాటు స్నేహితుడు రవిచంద్ర కూడా మృతి చెందాడు. అయితే ప్రమాదం జరగడానికి అతి వేగమే కారణమని.. మద్య కూడా సేవించలేదని ఇప్పటికే మెడికల్ రిపోర్ట్ కూడా అందింది. ఇక పోలీసులు కూడా ప్రమాదం ఎలా జరిగింది.. దానికి కారణాలు ఎంటో తెలుసుకునే ప్రయత్నంలో నిషిత్ కారు నడిపిన విధానాన్ని సీసీటీవీ కెమెరాల నుంచి సేకరించి వివరాలతో విశ్లేషించారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్టు సిగ్నల్స్ నుంచి అత్యంత వేగంతో దూసుకెళ్లిన ఈ కారు కేవలం 5 సెకన్లలోనే 9వ నంబర్ పిల్లర్ ను ఢీకొట్టిందని తేల్చారు. ముందు వెళుతున్న వాహనాలను ఓవర్ టేక్ చేసుకుంటూ నిషిత్ కారు ప్రయాణించిందని చెప్పేందుకు ఖైరతాబాద్, పంజాగుట్ట, బంజారాహిల్స్ లోని సీసీటీవీ ఫుటేజీలను విశ్లేషించారు. తమ సమగ్ర దర్యాఫ్తులో భాగంగా, ప్రతి చిన్న విషయాన్నీ క్షుణ్ణంగా పరిశీలించామని పోలీసు వర్గాలు తెలిపాయి.