త‌లాక్ అని మూడుసార్లు అంటే విడాకులు కాదు.. హైకోర్టు

ఇక నుంచి త‌లాక్ చెప్పి వివాహ‌బంధాన్ని వ‌దిలించుకోవ‌డం కుద‌ర‌దు. తలాక్ అంటూ మూడు ప‌ర్యా యాలు అన‌గానే విడాకులు ఇచ్చిన‌ట్టు కాద‌ని  ఏపీ హైకోర్టు తేల్చి చెప్పింది. ముస్లిం చ‌ట్టం ప్ర‌కారం నోటి మాటగా మూడుప‌ర్యాయాలు తలాక్ చెప్ప‌డం చెల్లుబాటు కాదు. త‌లాక్‌నామా గా రాసుకున్న‌దానికి గుర్తిం పు ఉండ‌ద‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది. అస‌లు అలాటి వివాహ‌ర‌ద్దు వ్య‌వ‌హారం రాజ్యాంగ విరుద్ధ‌మ‌ని స‌యా రా బాను కేసులో సుప్రీం కోర్టు  తీర్పును ఈ సంద‌ర్భంగా కోర్టు గుర్తుచేసింది.  

భార్యాభ‌ర్త‌ల త‌ర‌ఫు పెద్ద‌ల స‌మ‌క్షంలో వీల‌యినంత‌వ‌ర‌కూ స‌యోధ్య కుదిర్చేందుకు ప్ర‌య‌త్నించాలి. అది కుద‌ర‌న‌పుడు ముస్లించ‌ట్టంలో పేర్కొన్న విధంగా స‌రైన కార‌ణాలతో మూడు వేర్వేరు సంద‌ర్భాల్లో త‌లాక్ చెప్పాలన్నది స్ప‌ష్టంచేసింది. కానీ ప్ర‌స్తుత కేసులో మ‌ధ్య‌వ‌ర్తులుగా ఇద్ద‌రు వ్య‌క్తులు భ‌ర్త త‌ర‌ఫు వారే ఉన్నారుగాని  భార్య త‌ర‌ఫువారెవ‌రూ లేరన్న‌ది కోర్టు ప్ర‌స్తావించింది. త‌లాక్ చెప్ప‌డానికి ముస్లిం చ‌ట్టా న్ని అనుస‌రించి ఎలాంటి ఆధారాలు లేవ‌ని తెలిపింది. 

ఇదిలా ఉండ‌గా, త‌ల‌క్‌నామాను పోస్టు ద్వారా పంపిస్తే ఆమె తిర‌స్క‌రించింద‌న్న‌దానికి త‌గిన సాక్ష్యాల‌ను కోర్టు ముందు ఉంచ‌లేద‌ని  కోర్టు పేర్కొన్న‌ది. ఈ నేప‌థ్యంలో ఆమెకు ఇచ్చిన విడాకులు చెల్లుబాటు కావ ని, భార్య‌గానే ఆమెను గుర్తించాల్సి ఉంటుంద‌ని తేల్చింది.  భర్తనుంచి దూరంగా ఉంటున్న మహిళ భరణం పొందేందుకు అర్హురాలని దిగువకోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్ధించింది. సీఆర్పీసీ సెక్షన్‌ 125 ప్రకారం విడాకులు తీసుకున్న ముస్లిం మహిళ జీవితాంతం(మళ్లీ పెళ్లి చేసుకోనంతవరకు) భరణం పొందేందుకు అర్హురాలని స్పష్టం చేసింది. 2006లో గుంటూరు రివిజన్‌ కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. పిటిషనర్‌తో పాటు కుమారుడికి భరణం చెల్లించాలంటూ ట్రయల్‌ కోర్టు(పొన్నూరు) తీర్పును సమర్ధిం చింది.