ఓటు ఎవరికి వేసినా గెలిచేది బీజేపీనే..ఎంపీ అరవింద్ వీడియో వైరల్
posted on Aug 16, 2025 4:32PM

దేశంలో ఓట్ చోరీ తీవ్ర దుమారం రేపుతున్న వేళ నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ గతం చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. మీరు ఎవరికి ఓటు వేసిన గెలిచేది బీజేపీనే అంటూ గతంలో అరవింద్ చేసిన కామెంట్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మీరు నోటాకు ఓటు వేసినా తానే గెలుస్తానని..మీరు కారు గుర్తుకు ఓటు వేసినా తానే గెలుస్తానని అప్పుట్లో అరవింద్ వెల్లడించారు. మీరు ఎవరికి ఓటు వేసినా రాబోయేది మోదీనే అంటూ అర్వింద్ చేసిన వ్యాఖ్యలు ఆందోళన రేపుతోంది.జాతీయ ఎన్నికల సంఘం భారతీయ జనతా పార్టీ కుమ్మక్కై భారీ ఎత్తున ఓటు చోరీకి పాల్పడుతున్నదంటూ లోక్ సభ విపక్షనేత రాహుల్ గాంధీ సహా విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తుంటే ఈ ఆరోపణలను ఈసీ తీవ్రంగా తప్పుపడుతోంది.
ఈ విషయంలో కాంగ్రెస్ ఇక యుద్ధమేనని ప్రకటించింది. ప్రచారానికి వెబ్‌పోర్టల్‌ను సైతం ప్రారంభించి అందులో రిజిస్టర్ చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చింది. నిజానికి అర్వింద్ మాట్లాడిన ఈ వీడియో 2023 ఆగస్టుకు సంబంధించినది అని తెలుస్తోంది. కానీ ప్రస్తుతం ఓటర్ల జాబితా, ఈవీఎంల కాంట్రవర్సీ నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మద్దతుదారులు సోషల్ మీడియాలో అర్వింద్ పాత వీడియోను వైరల్ చేస్తున్నారు. ఎన్నికల్లో బీజేపీ తప్పుడు మార్గాల్లో గెలిచిందనడానికి అర్వింద్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనం అంటూ కామెంట్ చేస్తున్నాయి.