ఆధార్ కార్డు చూపించినా..కండక్టర్‌ల అత్యుత్సాహం
posted on Aug 16, 2025 7:54PM

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది. అయితే కొన్ని ప్రాంతాల్లో కండక్టర్‌లు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఒరిజినల్ కార్డునే చూపించాలని హుకుం జారీ చేస్తున్నారు. దీంతో మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిరాక్స్ ఆధార్ కార్డు చెల్లుబాటు కాదు అంటున్నారు. దీంతో కండక్టర్‌ల తీరు మహిళల అసహనం వ్యక్తం చేస్తున్నారు .మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు వంటి గుర్తింపు పత్రాలను చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చుని ప్రభుత్వం చెబుతుంటే కండక్టర్ తీరుపై సర్వత్ర విమర్శలు వెలువెత్తున్నాయి. ఏలూరు ఏజెన్సీ ప్రాంతం తెలంగాణ సరిహద్దుల్లో ఉండడంతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు.
బోర్డర్ కొంచెం ఏపీలో, కొంచెం తెలంగాణలో ఉండడంతో అవి అంత ర్రాష్ట్ర సర్వీసులుగా గుర్తించారు. దాంతో వాటిలో ఉచితం లేదని అధికారులు చెబుతున్నారు. జంగారెడ్డిగూడెం డిపో నుంచి వేలేరుపాడు కుక్కునూరు, మండలాలకు వెళ్లే సర్వీసులన్నీ.. తెలంగాణ నుంచే వెళ్లడంతో స్థానికల్లో అయోమయం ఏర్పడింది. జంగారెడ్డి గూడెం నుంచి భద్రాచలం వెళ్లే బస్సుకి ఫ్రీ టికెట్ లేదని జంగారెడ్డిగూడెం బస్ డిపో డీఎం తెలిపారు.అదే విధంగా అశ్వరావుపేట షటిల్ సర్వీస్ ఫ్రీ టికెట్ వర్తించదని డీఎం చెబుతున్నారు. దాంతో జంగారెడ్డిగూడెం నుంచి వేగవరం, తాడువాయి, దర్భ గూడెం జీలుగుమిల్లి వెళ్లే ప్రయాణికులకు స్త్రీ శక్తి ఎలా ఉపయోగపడుతుందనే అనుమానం నెలకొంది.