వ్యాయామం చేస్తూ యువతకు ఆదర్శంగా నిలిచిన అసదుద్దీన్ ఓవైసీ

 

యువత చెడు వ్యసనాల బారిన పడకుండా ఉండడమే కాకుండా... ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే ప్రతి రోజు తప్పనిసరిగా వ్యాయామం చేయాలంటూ ఎంఐఎం హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సూచిస్తున్నారు. ఒకవైపు తన ప్రసంగంతో ప్రజల్ని ఆకర్షిస్తూనే... మరోవైపు ప్రతిరోజు ఎక్సైజ్ చేస్తూ యువతకు ఓవైసీ ఆదర్శంగా నిలిచారు. 

ఈరోజు హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని తాడ్ బన్ ప్రాంతంలో ఓ వ్యక్తి జిమ్ పెట్టాడు. ఈ జిమ్ ప్రారంభోత్సవానికి అసదుద్దీన్ ఓవైసీ వెళ్లారు. ప్రారంభోత్సవం అనంతరం ఓవైసీ ఎక్ససైజ్ చేసి అందర్నీ ఆశ్చర్య పరిచారు. అసదుద్దీన్ ఓవైసీ కి జిమ్ చేయడంలో ప్రావీణ్యం ఉంది... అయితే ఓవైసీ జిమ్ చేస్తున్న సమయం లో ఓ వ్యక్తి వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా  మారి చక్కర్లు కొడుతుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu