ఏపీ అసెంబ్లీ ప్రారంభం.... వైసీపీ నేతల ఆందోళన..

 

ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. సమావేవం ప్రారంభమైన వెంటనే దివంగత నేతలు దేవినేని నెహ్రూ, నారాయణరెడ్డిలకు సభ సంతాపం తెలిపింది. ఇక కేంద్రం తీసుకురానున్న జీఎస్టీ బిల్లుకు ఈ సమావేశంలో ఆమోదం తెలపనున్నారు. ఈ నేపథ్యంలో  జీఎస్టీ బిల్లుపై చర్చ ప్రారంభమైన వెంటనే రైతు సమస్యలపై చర్చించాలని ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ప్రతిపక్ష నేతలు స్పీకర్ పోడియంన చుట్టుముట్టారు.