ఏఎస్ఐ పై దాడికి పాల్పడ్డ గంజాయి బ్యాచ్
posted on Oct 19, 2025 5:44PM

నగరంలో రోజు రోజుకీ గంజాయి బ్యాచ్ లు రెచ్చిపో తున్నాయి. యువ కులు గంజాయి సేవించి ఆ మత్తులో తూగుతూ ఇతరు లపై దాడి చేస్తూ రోడ్డు మీద నానా హంగామా చేస్తున్నారు... ఈ గంజాయి బ్యాచ్ రోడ్డు మీద చేసే గొడవ వల్ల వాహ నదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు తాజాగా బండ్లగూడ పరిధిలో గంజాయి బ్యాచ్ నడిరోడ్డు మీద చేసిన హంగామా వల్ల అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
ఇద్దరు యువకులు గంజాయి సేవించి ఆ మత్తులో తూలుతూ బండ్ల గూడ పరిధిలోని చాంద్రాయణ గుట్ట వద్ద ఉన్న ఏఎస్ఐ తో గొడవపడ్డారు. అంతటితో ఆగ కుండా ఏ ఎస్ ఐ చొక్కా పట్టుకొని నన్ను మీరు ఏమీ చెయ్యలేరు రా అంటూ రెచ్చిపోతూ అతనిపై దాడి చేశారు... దీంతో ఆగ్రహం చెందిన ఏఎస్ఐ గంజాయి మత్తులో ఉన్న ఇద్దరిని కొట్టాడు.
మమ్మల్ని కొడతావా అంటూ ఏ ఎస్ ఐ పై దాడి చేశారు. దీంతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకు న్నారు. ఈ దాడుల్లో గంజాయి మత్తులో ఉన్న యువకులకు గాయాలయ్యాయి. ఈ ఘటన స్థానికం గా హంగామా రేగ డం తో స్థానికులు పోలీసులకు సమా చారాన్ని అందిం చారు.
హుటా హుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయా లైన యువకులకు నచ్చజెప్పి పోలీస్ వాహనం ఎక్కించేం దుకు విశ్వ ప్రయ త్నం చేశారు.. అదే సమయంలో యువ కులు పోలీసుల ట్యాబ్ ధ్వంసం చేశారు. గంజాయి మత్తులో ఉన్న ఆ యువ కులు పోలీస్ వాహనం ఎక్కేం దుకు ససేమిరా అంటూ పోలీసు లకు చుక్కలు చూపించారు.. పోలీసు వాహనం ఎక్కకుండా దాదాపు అరగంట పాటు ఆ యువ కులు పోలీసులను నానా తిప్పలు పెట్టారు. అయినా కూడా పోలీసులు ఓపిగ్గా ఆ ఇద్దరు యువకులకు పోలీస్ వాహనంలో తీసుకువెళ్లి చికిత్స చేపించి అనంతరం పోలీస్ స్టేషన్ కి తరలించారు.