ఆయన ఆస్తులు చూస్తే ఎవరికైనా దిమ్మతిరగాల్సిందే!

ఆయన ఏ పని చేపట్టినా ముడుపులు తీసుకోవలసిందే. ముడుపులు అందని పనులను ఆయన ఏ పనీ చేయరు. చివరికి తనతో పాటు అదే ఆఫీసులో పని చేసే తోటి ఉద్యోగులైనా సరే తమ పని కావాలంటే ఆయనకు ముడుపులు చెల్లించాల్సిందే. ఫైల్ ముందుకు కదలాలంటే ఆయన ఎవరైనా సరే ఆయన చేతులు తడపాల్సిందే. ఆయనే విద్యుత్ శాఖ ఏడీఈ అంబేడ్కర్.పైన చెప్పింది అవినీతిలో ఆయన ట్రాక్ రికార్డ్ గురించి.

ఇప్పటి వరకూ పలు కీలక పోస్టులలో పన చేసిన అంబేడ్కర్‌ ముడుపుల బాగోతం ఎట్టకేలకు పండింది. గచ్చిబౌలి, నార్సింగి మణికొండ ప్రాంతాల్లో  విద్యుత్ శాఖలో  దాదాపు 12 ఏళ్లుగా  కొనసాగుతున్న విద్యుత్‌ శాఖ ఏడీఈ అంబేడ్కర్‌ ను ఏసీబీ అధికారులు అదుపులోనికి తీసుకున్నారు.   అంబేడ్కర్ మార్కెట్ విలువ ప్రకారం 300  నుంచి 500 వందల కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు కలిగి ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విద్యుత్‌ శాఖ ఏడీఈ అంబేడ్కర్‌ ను అరెస్టు చేసిన పోలీసులు అంతకు ముందు అంటే మంగళవారం (సెప్టెంబర్ 16) ఉదయం నుంచి ఆయన కుటుంబసభ్యులు, బంధువుల ఇళ్లల్లో   తని ఖీలు నిర్వహిం చారు. అంబేడ్కర్‌ బినామీ నివాసంలో 2.18కోట్ల రూపాయల నగదును గుర్తించారు.  ఇబ్రహీంబాగ్‌లో ఏడీఈగా పని చేస్తున్న అంబేద్కర్ భారీగా ఆస్తులు కూడబెట్టారు. శేరిలింగపంల్లిలో ఇళ్లు, గచ్చిబౌలిలో 5 అంతస్తుల భవనం, హైదరా బాద్‌లోని ప్రధాన ప్రాంతాల్లో 6 ఇళ్లు, ఓపెన్‌ ప్లాట్లు, రెండు కార్లు, బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లు, వ్యవసాయ భూమి ఉన్నట్టు అధికా రులు గుర్తించారు.

శేరిలింగంపల్లిలో ఒక ఫ్లాట్, గచ్చిబౌలిలో ఆరంతస్తుల బిల్డింగ్, 10 ఎకరాల్లో ఆమ్తర్ కెమికల్స్ పేరిట కంపెనీ, హైదరాబాద్ లో 6 రెసిడెన్షియల్ ప్లాట్స్, 1 ఫామ్ ల్యాండ్ అలాగే 2 ఫోర్ వీలర్లు, బంగారం, బ్యాంకు డిపాజిట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పటాన్ చెరువు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి  బినామీ సతీష్‌ ఇంట్లో  2.18 కోట్ల రూపాయలను ఏసిబి స్వాధీనం చేసుకుంది. మొత్తం ఆస్తుల విలువ 300 నుంచి 500 వందల కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. సోదాల అనంతరం ఏసీబీ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu