ఏపీలో దేవాలయాలకు ఛైర్మన్ల నియామకం
posted on Sep 18, 2025 8:24PM
.webp)
ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలకు ఛైర్మన్లను నియమిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా, తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే వివిధ నగరాల్లోని స్థానిక సలహా కమిటీలకు లోకల్ అడ్వైజరీ కమిటీ కూడా కొత్త అధ్యక్షులను నియమించింది. శ్రీశైలం మల్లన్న ఆలయ ఛైర్మన్‌గా రమేష్ నాయుడు, వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయ ఛైర్మన్‌గా వెంకట్రాజు, కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయ ఛైర్మన్‌గా సురేంద్రబాబు, శ్రీకాళహస్తి ఆలయ ఛైర్మన్‌గా కొట్టె సాయిప్రసాద్, విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి ఆలయ ఛైర్మన్‌గా రాధాకృష్ణ నియమితులయ్యారు.
టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీలకు అధ్యక్షులు
1. టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ, జూబ్లీహిల్స్, హైదరాబాద్ – ఏ.వి. రెడ్డి
2. టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ, హిమాయత్‌నగర్, హైదరాబాద్ – నేమూరి శంకర్ గౌడ్
3. టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ, బెంగళూరు – వీరాంజనేయులు
4. టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ, ఢిల్లీ – ఏడుగుండ్ల సుమంత్ రెడ్డి
5. టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ, ముంబై – గౌతమ్ సింఘానియా
6. టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ, విశాఖపట్నం – వెంకట పట్టాభిరామ్ చోడే