నటికి రూ.102 కోట్ల జరిమాన

 

కన్నడ నటి రన్యారావుకు ఈడీ భారీ జరిమాన విధించింది. బంగారు అక్రమ రవాణా వ్యవహారంలో సంబంధం ఉన్న మనీలాండరింగ్ కేసులో ఆమె అరెస్టయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈడీ ఆమెకు రూ.102 కోట్ల జరిమాన విధించింది. ఆమెతో సహా నలుగురు నిందితులకు మొత్తంగా రూ. 270 కోట్ల జరిమాన విధించారు. దుబాయ్ నుంచి గోల్డ్‌ను అక్రమంగా స్మగిలింగ్ చేస్తూ బెంగళూరు విమానశ్రయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది.

మార్చి నెలలో బెంగళూరు విమానాశ్రయంలో కన్నడ నటి రన్యా రావు నుంచి రూ.12.56 కోట్ల విలువ చేసే బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమె ఇంట్లో చేపట్టిన తనిఖీల్లో రూ.2.67 కోట్ల నగదు, రూ.2 కోట్లు విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని పేర్కొంది. మెుత్తంగా రూ.17.29 కోట్ల విలువ చేసే బంగారం, నగదు సీజ్ చేశామని వెల్లడించింది. మార్చి 3న రన్యా రావు దుబాయ్ నుంచి బెంగళూరు విమానాశ్రయానికి రాగా.. అనుమానం వచ్చి డీఆర్‌ఐ అధికారులు తనిఖీలు చేపట్టారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu