దివ్యాంగులకు ఉచిత ప్రయాణం కల్పించాలి

 

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దివ్యాంగులందరికీ ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని దివ్యాంగుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఇండ్ల ఓబులేసు  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కడప జిల్లా బద్వేల్  సిపిఐ కార్యాలయంలో దివ్యాంగ సభ్యుల సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన   మాట్లాడుతూ.. రాష్ట్రంలో స్త్రీ శక్తి పథకం కింద స్త్రీలకు ఉచిత ప్రయాణం కల్పించిన విధంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు  ఉచితంగా ప్రయాణం  సౌకర్యాన్ని కల్పించాలని ఆయన కూటమి ప్రభుత్వాన్ని కోరారు.

ఏపీ వ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది వరకు దివ్యాంగులు ఉంటే వారికి ఉచిత ప్రయాణం కల్పించడంలో ప్రభుత్వం వివక్ష చూపిస్తుందన్నారు. వయోవృద్ధులు వికలాంగులు మరియు హిజ్రాల సంక్షేమ శాఖ తో సంబంధం ఉన్నటువంటి హిజ్రాలకు ఉచిత ప్రయాణం వర్తింపజేసినప్పుడు దివ్యంగు లకు ఎందుకు ఇవ్వరని ఆయన ప్రశ్నించారు. 

స్రీ శక్తి పథకం కింద ఆర్టీసీకి నష్టాలను కట్టే ప్రభుత్వం.. దివ్యాంగులకు ఉచిత ప్రయాణం పెద్ద నష్టమేమి కాదన్నారు.. ఆర్టీసీలో దివ్యాంగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. ప్రభుత్వం దీనిపైన ప్రకటన చేయకపోతే ఆర్టీసీ డిపోల ముందు దివ్యాంగుల ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షులు చింతకుంట రఫీ, కార్యదర్శి కడప చిన్న మౌలాలి, గౌరవ ఆహ్వానితులు గంగన్నపల్లి మురళి తదితరులు పాల్గొన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu