రోజూ మనం చూస్తున్న విషయాల్లో దాచిన అద్భుతమైన రహస్యాలు
posted on Sep 21, 2024 9:30AM
నిత్యం మనం అనేక వాటిని మన అవసరాల కోసం ఉపయోగిస్తూ ఉంటాం. ఆ సందర్భంలో
కొన్ని ఎందుకు ఉన్నాయో కూడా అర్థం కాదు. కానీ అవి మాత్రం అలానే ఉంటాయి. అసలు అవి అలా ఎందుకు ఉన్నాయి అనే ఆలోచనే తట్టదు. అవి మనకు పెద్దగా ఉపయోగపడకపోయినా ప్రతి ఒక్కదాని వెనుక ఏదో ప్రయోజనం ఉండే ఉంటుంది. అలాంటి
నాలుగు విషయాల గురించి తెలుసుకుందాం.
1. లైన్‌లో సంతకం చేయాలా వద్దా.
ఈ ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరం ఎప్పుడో ఒకప్పుడు చెక్ బుక్ ను ఉపయోగింస్తాం. చెక్కుపై సంతకం చేసేటప్పుడు చాలా మంది తరచుగా లైన్ పైన సంతకం చేస్తున్నామా లేదా అనే గందరగోళానికి గురవుతూ ఉంటారు. అటువంటప్పుడు భూతద్దం ఉపయోగించి దగ్గరి నుండి చూస్తే మీకు రహస్యం తెలుస్తుంది. సంతకం చేసే చోట ఉంటే లైన్ గురించి అసలు ఆలోచించం. ఈ లైన్స్ ను పదాలు రిపీట్ అయితే గుర్తించడానికి రూపొందించారు. ముద్రణ చాలా చిన్నగా ఉండటం వల్ల వాటిని కళ్లతో చూస్తే సాధారణ సంతకంలాగే కనిపిస్తుంది కానీ, మైక్రో టెక్నాలజీ అని పిలిచే దాన్ని భద్రతా ప్రయోజనాల కోసం రూపొందించారు. ప్రింటింగ్ చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి దాన్ని ఒకవేళ జిరాక్స్ తెస్తే ఆ లైన్స్ బ్లర్ అయి అస్పష్టంగా కనిపిస్తాయి.
2. ఖాళీ పేజీలు.
మీకు చదవడం ఇష్టమైతే, మీరు ఒక నవల లేదా ఏదైనా పుస్తక చదువుతూ ఉంటే పుస్తకాల చివరలో ఖాళీ పేజీలు చాలా తరచుగా కనిపిస్తూ ఉంటాయి.ఆ పేజీలలో ఎక్కువగా పాఠకులు తమ కళాత్మక డ్రాయింగ్‌లతో లేదా ఇతర విషయాలతో నింపి వేస్తారు. కానీ వాస్తవానికి ఆ పేజీలు ఎందుకు ఖాళీగా ఉంన్నాయి అన్న విషయం ఎవరూ గమనించరు. ఈ కాలంలో పుస్తకాలు అన్నీ కూడా డిజిటల్ ప్రక్రియలో ముద్రిస్తారు. పెద్దగా ఉన్న కాగితపు షీట్లను పేజీలుగా మడిచి ముద్రిస్తారు. అలా ముద్రిస్తున్న వాటిని సిగ్నేచర్ పేపర్ అంటారు. వాటినన్నింటిని కూడా ఒకదానితో ఒకటి జతచేసి బైండ్ చేసి పుస్తకం రూపంలో తీసుకొస్తారు. డిజిటల్‌గా ముద్రించిన వాటిలో ఇలాంటి సిగ్నేచర్ పేపర్లు 2
నుండి 48 పేజీల వరకు ఉండవచ్చు. ఇదంతా కూడా పుస్తకంలో మ్యాటర్ ఎక్కడితో ముగుస్తుంది అనే దానిమీద ఆధారపడి ఉంటుంది.
సాధారణంగా పెద్ద ప్రచురణకర్తలు తమ పుస్తకాలను ముద్రించడానికి, రచయితలు తన స్వీయ రచనలను ముద్రించడానికి తేడా ఉంటుంది. సాధారణంగా ప్రచురణ కర్తలు పెద్ద కాగితంపైనే అనేక పేజీలను ముద్రిస్తారు. అటువంటి సందర్భాల్లో మీకు కొన్ని ఖాళీ పేజీలు వచ్చే అవకాశం ఉంటుంది.
3. ట్రామ్ రైలు క్రిస్ - ఓవర్ హెడ్ లైన్ దాటడం.
ట్రామ్‌లో లేదా ట్రైన్ లో ప్రయాణిస్తున్నప్పుడు క్రిస్ క్రాస్ లైన్లను చూడవచ్చు. ట్రామ్‌లు, కొన్ని రైళ్లు పాంటోగ్రాఫ్ కాటెనరీ వ్యవస్థపై నడుస్తాయి, ఇవి విద్యుత్తును కాటెనరీ వైర్ నుండి లోకోమోటివ్‌కు మార్చబడుతుంది. స్లైడింగ్ స్ట్రిప్ కాటెనరీ వైర్‌తో విద్యుత్ సంబంధాన్ని ఉత్పత్తి చేస్తుంది. పాంటోగ్రాఫ్ స్ప్రింగ్ సిస్టమ్ ఏ వేగంతో ప్రయాణించినా కూడా దాని సంబంధం శాశ్వతంగా ఉండేలా చూస్తుంది. రాగి తీగలను తాకిన స్లైడింగ్ స్ట్రిప్ కోతకు గురవుతూ పైలాన్‌పై రాపిడీని కలిగిస్తుంది. వాస్తవానికి ఈ క్రిస్ క్రాస్ లైన్ల అసలు ఉద్దేశం రాపిడి కలిగిస్తూ విద్యుత్ ను వ్యాప్తి చేయడం.
4. స్నార్కెల్స్.
స్నార్కెల్స్ అంటే నీటి అడుగున ఈత కొడుతున్నప్పుడు ఊపిరి పీల్చుకోవడానికి ఉపయోగించే పైప్ ను స్నార్కెల్స్ అంటారు. వీటికి స్క్యూబా ఎక్విప్మెంట్ కాగా ఆక్సిజన్ టాంకులు ఉండవు. ఈ స్నార్కెల్స్ నీటి బయటి వాతావరణం నుండి గాలిని పీల్చుకోవడానికి శ్వాసక్రియగా పనిచేస్తాయి. చాలావరకు ఈ స్నార్కెల్స్ 30 సెంటీమీటర్ల లోపల వరకు లేదా 40 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వరకు పనిచేయవు. ఎందుకంటే ఇవి ఉపరితలానికి దగ్గరగా మనిషి ఉన్నప్పుడే పనిచేస్తాయి. ఉపరితలానికి దూరంగా ఉన్నప్పుడు అక్కడ నీటిలో పీడనం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అసౌకర్యంగా ఉంటుంది. స్నార్కెల్ ద్వారా ఆక్సిజన్ ను అందుకునేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు లంగ్స్ మీద కూడా ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంటుంది. ఈ స్నార్కెల్ ఉపయోగించడం వల్ల కార్బన్ డి ఆక్సైడ్‌ను తిరిగి పీల్చుకోవడమే కాకుండా సమస్యలను కూడా తెచ్చిపెడుతుంది.