ఫ్యామిలీతో కొత్త ప్రపంచానికి వెళ్ళిన బ్రహ్మముడి కనకం!

కనకం..‌ ఇప్పుడు స్టార్ మా టీవీ ప్రేక్షకులకు ఎంతగానో ఇష్టమైన క్యారెక్టర్. బుల్లితెర ధారావాహికల్లో బ్రహ్మ ముడి ఒక ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించింది. ఈ సీరియల్ మొదలై 125‌ ఎపిసోడ్‌లు పూర్తి కాగా.. ఇందులోని క్యారెక్టర్స్ అన్నీ కూడా సమాజంలో ప్రస్తుతం ‌ఉన్న స్థితిగతులను ప్రతిబింబించేలా ఉండటంతో ప్రేక్షకులు ఈ సీరియల్ కి బ్రహ్మ రథం పడుతున్నారు. ఇందులో కనకం-కృష్ణమూర్తి ల కుటుంబాన్ని మధ్యతరగతి వాళ్ళలాగా చూపించాడు డైరెక్టర్. బ్రహ్మముడి సీరియల్ లో ఈ దంపతులకు ముగ్గురు కూతుళ్ళు ఉండగా.. ఒక్కో కూతురికి ఒక్కో శైలి ఉంది. అయితే కనకం క్యారెక్టర్ ని అద్భుతంగా మలిచాడు. ఒక మధ్య తరగతి తల్లి తన కూతురి కోసం కనే కలలను ఇందులో చక్కగా చూపిస్తున్నాడు. కనకం తన కూతుళ్ళకు గొప్పింటి కోడళ్లను చెయ్యాలని అనుకుంటుంది. బ్రహ్మముడి సీరియల్ లో నీప శివ అలియాస్ కనకం.. ఈ మద్యతరగతి తల్లి పాత్రలో ఒదిగిపోయింది. కనకం మంచి ఫ్యామిలీ ఎమోషనల్ ని చూపించడమే కాకుండా కామెడీ వెర్షన్ తో ఆకట్టుకుంటుంది. కనకంకి తెలుగులో బ్రహ్మముడి మొదటి సీరియల్ అయినప్పటికి ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకుంది.  కనకం తాజాగా తనకంటూ ఒక యూట్యూబ్ ఛానెల్ ని క్రియేట్ చేసి అందులో రెగ్యులర్ గా వీడియోలు చేస్తూ తన ఫ్యాన్ బేస్ ని పెంచుకుంటుంది. అయితే తాజాగా "ఫ్యామిలీతో కొత్త ప్రపంచానికి వెళ్ళామంటూ" ఒక వ్లాగ్ చేసింది కనకం(నీప శివ). అక్కడ అక్వేరియంలో ఫ్యామిలీతో కలసి ఎంజాయ్ చేస్తూ సందడి చేస్తుంది కనకం. అయితే తన యూట్యూబ్ ఛానెల్ ని సబ్ స్కైబ్ చేసుకున్న వాళ్ళకి థాంక్స్ చెప్పింది. అలాగే బ్రహ్మముడి సీరియల్ లో కనకం క్యారెక్టర్ ని ఇంతలా ఆదరిస్తున్న ప్రేక్షకులకు చాలా థాంక్స్ అంటూ తన యూట్యూబ్ ఛానెల్ లో హ్యాపీ నెస్ ని షేర్ చేసుకుంది కనకం.

ఎక్కువ ఎగరకండి.. తర్వాత తల ఎక్కడో పెట్టుకోవాల్సి వస్తుంది!

ఇన్స్టాగ్రామ్ బ్లూ టిక్ మీద చిన్నా పెద్దా సెలబ్రిటీస్ అని చెప్పుకునే వాళ్లంతా కూడా వీడియోస్ మీద వీడియోస్ చేసేసి తమ తమ పేజెస్ లో పోస్ట్ చేసేస్తున్నారు. మొన్న అఖిల్ సార్థక్, నిన్న గీతూ రాయల్ కూడా తమ కోపాన్ని వెళ్లగక్కారు. ఇప్పుడు "నిఖిల్ తో నాటకాలు" అంటూ ఫేమస్ సెలబ్రిటీస్ ని ఇంటర్వ్యూస్ చేసే నిఖిల్ ఇప్పుడు ఒక వీడియో పోస్ట్ చేసాడు.  "నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యే వాళ్లందరికీ ఇప్పుడు బ్లూ టిక్స్ వచ్చేసాయి. ఎవరెవరేమిటో తెలియడం లేదు. 699 కడితే బ్లూ టిక్స్ వస్తున్నాయి అంత దానికి మళ్ళీ కేక్ కటింగ్లు, సెలెబ్రేషన్లు, పార్టీలు. సరే కాదనడం లేదు. ఎవరెవరికి అప్లికేషన్స్ ప్రాబ్లమ్ అవుతాయో వాళ్లకు డబ్బులు కడితే ఈజీ అవుతుంది. సరే రేపటి రోజు ఇంతమంది అప్పొజ్ చేసినప్పుడు అప్పుడు మళ్ళీ ఒక ఆప్షన్ పెట్టి ఎవరెవరైతే డబ్బులు కట్టారో వాళ్ళ ప్లాన్స్ అన్నీ క్యాన్సిల్ చేసి ఎవరెవరైతే నాచురల్ గా అప్లై చేసుకుంటారో వాళ్ళకే బ్లూ టిక్ ఆప్షన్ ఇవ్వాలి అని అనుకుంటే మాత్రం, ఈ బ్లూ టిక్స్ అన్నీ పోయాయి అనుకోండి ..మీ  ముఖం ఎక్కడ పెట్టుకోవాలో మీకు తెలీదు. ముందే చెప్తున్నా ఎక్కువ ఎగరకండి. చేస్తే చేయించుకోండి. అది కొంచెం ఫన్నీగా ఉంది. చాలా మంది కష్టపడతారు కదా. ఆ వెరిఫికేషన్ అయ్యాక బ్లూ టిక్ సంపాదించుకోవడం అనేది ఒక చిన్న అచీవ్మెంట్" అంటూ ఒక రేంజ్ లో నిఖిల్ తన అభిప్రాయాన్ని చెప్పాడు.  దానికి కౌంటర్ గా ఒక నెటిజన్  "బ్లూ టిక్ అనేది హార్డ్ వర్క్ చేసినందుకు రాదు. సర్టిఫై కానీ అకౌంట్స్ వల్ల చాలా మంది ఇబ్బందుల్లో పడుతున్నారు. ఇలా బ్లూ టిక్స్ ఇవ్వడం వలన జెన్యూన్ అకౌంట్ హోల్డర్ ఎవరో కాదో తెలిసిపోతుంది. అందుకోసమే ఈ ఆప్షన్ పెట్టింది. ఇదొక అచీవ్మెంట్ అనుకునే వాళ్ళను చూస్తుంటే నాకు నవ్వొస్తోంది...ఫ్యూచర్ లో ఈ బ్లూ టిక్ ఫ్రీగా ఇచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు" అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చారు. "నువ్వు తలకాయ ఎక్కడా పెట్టుకుంటావ్..ఇన్స్టా లో పెట్టుకోండి మొఖం" అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఇంకొంతమంది నెటిజన్స్. మొత్తానికి బ్లూ టిక్ ఆప్షన్ మాత్రం సోషల్ మీడియాలో ఒక సంచలనం క్రియేట్ చేస్తోంది.

ఆకట్టుకుంటున్న ఉదయభాను కొత్త వ్లాగ్!

యాంకర్ ఉదయభాను.. ఈ పేరు బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమే. ఒక్కప్పుడు ఏ సినిమా ఆడియో ఫంక్షన్ అయినా ఉదయభాను ఉండాల్సిందే.‌ ఏ షో అయినా తను సందడి చెయ్యాల్సిందే అన్నట్లుగా ఉదయభాను క్రేజ్ ఉండేది. ఒకప్పుడు అన్ని ఛానల్స్ కు మోస్ట్ ఛాయస్ గా ఉదయభాను ఉండేది. తన అందంతో అభినయంతో ప్రేక్షకులను సంపాదించుకుంది. లీడర్ లో 'రాజశేఖర ' సాంగ్ లో కన్పించిన ఉదయభాను, ఆ తర్వాత జులాయి మూవీలో  ఐటమ్ సాంగ్ లో మళ్ళీ మెరిసింది. అప్పట్లో రెండు మూడు సినిమాల్లో కనిపించి అందరిని మెప్పించింది. ఉదయభాను పెళ్లి చేసుకొని ఇద్దరి కవలలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. కాగా కొంత కాలం బుల్లి తెరకి దూరంగా ఉంది. ఉదయభాను సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసింది. రీసెంట్ గా ఒక షో కి యాంకర్ గా చేసింది. ఇన్ని రోజులు ఫాన్స్ కి దూరంగా ఉన్నా ఇప్పుడు ఫ్యాన్స్ కి దగ్గర ఉండాలనుకుంది కాబోలు.. తనపేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసింది. అందులో తనకి సంబంధించిన ప్రతీ విషయాన్ని వ్లాగ్ ల రూపంలో చేస్తూ వస్తుంది.  ఉదయభాను ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకి దగ్గరగా ఉంటుంది. అయితే తనకంటూ ఒక యూట్యూబ్ ఛానెల్ ని క్రియేట్ చేసి అందులో ట్రెండింగ్ లో ఉన్న వాటికి సంబంధించిన వ్లాగ్ లు అప్లోడ్ చేస్తుంది. కాగా వాటికి అత్యధిక వ్యూస్ వస్తున్నాయి. తాజాగా హోమ్ టూర్ వ్లాగ్, స్కిన్ కేర్ వ్లాగ్ చేసి అప్లోడ్ చేసిన ఉదయభాను.. ఇప్పుడు తాజాగా ఆదివారమని ఇంట్లోనే చికెన్ చేసింది. 'మై హోమ్ స్టైల్ చికెన్ ఫ్రై' అనే టైటిల్ తో తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేయగా.. ఈ వీడియోకి విశేష స్పందన లభిస్తోంది. 

ఆ బ్యాక్ బెంచ్ అబ్బాయే నా ఫస్ట్ లవ్!

"నీతోనే డాన్స్" షో ఈ వారం మంచి కలర్ ఫుల్ గా జరిగింది. అందరూ మంచి మంచి కాస్ట్యూమ్స్ లో వచ్చి పెర్ఫార్మెన్సులు ఇరగ దీశారు. ప్రపంచంలో ఎప్పుడూ ఎవర్ ఎండింగ్ సబ్జెక్టు లవ్ అని "మూడ్స్ ఆఫ్ లవ్" కాన్సెప్ట్ ఇచ్చింది శ్రీముఖి. ఇక లవ్ అనే మాట వచ్చేసరికి అలనాటి అందాల నటి రాధ తన లైఫ్ లో జరిగిన ఒక మెమరీని అందరితో షేర్ చేసుకున్నారు. "నేను స్కూల్లో చదువుకునేటప్పుడు బ్రేక్ టైంలో ఒక సాంగ్ వచ్చేది.."మేరి సప్పునోమ్ కి రాని కబ్ ఆయే గీతూ" అప్పుడే నాకు హిందీ అంటే చాల ఇష్టం ఏర్పడింది. ఆ బ్రేక్ టైములో నేను రోడ్ క్రాస్ చేసేదాన్ని అక్కడ ఒక ట్యూషన్ సెంటర్ ఉండేది. ఆ ట్యూషన్ సెంటర్ లో బ్యాక్ బెంచ్ లో వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకున్న ఒక అబ్బాయి ఉండేవాడు. ఎప్పుడు ప్రోజ్ చదువుతాడో అప్పుడు తలను కొంచెం పక్కకు తిప్పి చూసేవాడు. అలా రెండేళ్లు సాగింది. ఒక్క మాట లేదు... ఏమీ లేదు..కానీ లవ్ అనే పదం వినిపిస్తే ఆ దృశ్యం నా కళ్ళ ముందు ఉంటుంది.. మే బి అదే నా లవ్వేమో...ఆ విషయాన్ని మా ఆయనకు చెప్పాను..సర్సర్లే..ఎన్ని సార్లు చెప్తావ్ అని మూతి ముడుచుకున్నారు.. ఎప్పుడు మనసులో ఒక ప్రేమ అనేది ఉండాలి.. అప్పుడు మనం ఎప్పుడూ యంగ్ గానే కనిపిస్తాం" అని ప్రేమ గురించి చెప్పారు రాధ. డాన్సర్స్ అంతా కాస్ట్యూమ్స్ లో వచ్చేసరికి మీ గ్రాండ్ లాంఛ్ ఎపిసోడ్ చూసినవాళ్లు రెస్పాన్స్ ఏమిటి అని అడిగింది శ్రీముఖి. "కావ్య ఫ్రెంచ్ కిస్ గురించి ఏమిటి రెస్పాన్స్" అని అడిగింది. "అమ్మా ప్రోగ్రాం చూస్తున్నావా అనేసరికి హా చూసా చూసా మీ ఫ్రెంచ్ కిస్ చాలా బాగుంది. పాపం అబ్బాయేమో ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే నువ్వెంటి సిగ్గులేకుండా ఫ్రెంచ్ కిస్ అన్నావేంటి" అని అంది మా అమ్మ అని కావ్య చెప్పేసరికి "ఆంటీ వాళ్లింకా పెట్టుకోలేదు ఏం బాగుందని అన్నారు...అత్తమ్మ దగ్గర మంచి మార్కులు కొట్టేయడానికి నిఖిలు" అని శ్రీముఖి అనేసరికి "మా అత్తమ్మ ఇంకా నాకు ఫోన్ చేయలేదు" అన్నాడు నిఖిల్. "మీరు ఫిక్స్ అవ్వరు మమ్మల్ని కానివ్వరు..అర్ధమయ్యింది" అని కామెడీ చేసింది శ్రీముఖి.

కృష్ణ కోసం రొమాంటిక్ గా రెడీ అయి వచ్చిన మురారి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -186 లో.. హాస్పిటల్ కి వెళ్దామని మురారి కోసం కృష్ణ ఎదురుచూస్తుంటుంది. మురారి రెడీ అయి వచ్చాక ఇద్దరు కలిసి కార్ లో బయల్దేరి వెళ్తారు. అలా‌ కార్ లో వెళ్తున్నప్పుడు ఇద్దరు కలిసి భార్య, భర్తలలాగా ఎలా ఉండాలో ప్రాక్టీస్ చేస్తారు. ఇద్దరు కలిసి ఒకరొనొకరు నిజమైన భార్యభర్తలు ఎలా ఉంటారో అలా ఉండాలని ప్రాక్టీస్ చేస్తుంటారు. ఆ తర్వాత హాస్పిటల్ దగ్గర కృష్ణని దించి, లంచ్ కి ఇక్కడికే వచ్చేసెయ్ కలిసి వెళ్దామని తనతో మురారి అంటాడు. సరేనని చెప్పేసి కృష్ణ వెళ్తుంది. మరోవైపు కృష్ణ, మురారీల గురించి రేవతి దీర్ఘంగా ఆలోచిస్తుంటుంది. కృష్ణ, మురారీలు కలిసి పూజలో ఒకరంటే ఒకరికి ఇష్టం ఉన్నట్టుగా ప్రమాణం చేశారు. మరెందుకని ఆ అగ్రిమెంట్.. అది వాళ్ళకి తెలియకుండా చేసుకున్నారు. ఇప్పుడు ఒకరంటే ఒకరికి ఇష్టం ఉన్నట్టుగా ఉన్నారు. ఒకవేళ వాళ్ళు నిజంగానే అగ్రిమెంట్ అని అనుకుంటే శాశ్వతంగా భార్యాభర్తలుగా నేను చేస్తాను కదా అని రేవతి అనుకుంటుంది. మరొకవైపు స్టేషన్ లో ఉన్న మురారి ఆకలి అవుతుందని కృష్ణకి కాల్ చేసి.. ఏంటి కృష్ణ రావా ? నాకు ఆకలవుతుందని మురారి అనగానే.. స్టేషన్ బయటకు రండి ఏసీపీ సర్ అనగానే బయటకు వచ్చేస్తాడు మురారి. అప్పటికే కమీషనర్ కృష్ణ దగ్గరకి వచ్చి నిల్చుంటాడు. బయటకెళ్తున్నారా మురారి ఒకసారి లోపలికి రమ్మని పిలుస్తాడు కమీషనర్. లోపలికి వెళ్ళాక.. కృష్ణకి నీ ప్రేమ విషయం చెప్పేయ్ తొందరగా లేట్ చేయకని మురారీతో కమీషనర్ చెప్తాడు. ఆ తర్వాత యూనిఫామ్ తీసేసి ఫార్మల్స్ చేసుకో, కార్ కాకుండా బైక్ తీసుకొని వెళ్ళమని మురారికి కమీషనర్ చెప్తాడు. సరేనని బైక్ కీ తీసుకొని కృష్ణ దగ్గరికి రాగానే మురారిని చూసిన కృష్ణ.. ఇవన్నీ మీ కమీషనర్ చెప్పాడా అని అడుగుతుంది. అదేం లేదని మురారి అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్‌ వరకు ఆగాల్సిందే.

అసలు నిజం చెప్పమని జగతిపై కోప్పడ్డ మహేంద్ర!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -792లో.. రిషి గురించి బాధపడుతుంది జగతి. రిషి ఎప్పుడు వస్తాడో అని ఎదురుచూస్తూ ఉంటుంది. రిషి నువ్వు ఇంటి నుండి వెళ్ళిపోయి ఎన్ని రోజులు అవుతుందని లెక్కలు వేసుకుంటుంది. అంతలోనే ధరణి అక్కడికి వస్తుంది. ఇలా ఎన్ని రోజులని రిషి కోసం ఎదురు చూస్తారు అత్తయ్య అని ధరణి అడుగుతుంది. ఇంతకు మించి ఏం చెయ్యగలను. నా కొడుకు గురించి వెతకని ప్లేస్ లేదు. ఇంక ఎప్పుడు వస్తాడు. ఇంకా ఎన్ని రోజులు చూడాలని జగతి  అంటుంది. ఆ తర్వాత  మీరు ఒక పని చెయ్యాలి. అది చేస్తే కచ్చితంగా రిషి తిరిగి వస్తాడని ధరణి అనగానే.. ఏం చెయ్యాలో చెప్పు ధరణి.. నా కొడుకు గురించి ఏం చెయ్యడానికైనా నేను రెడీ అని జగతి అంటుంది. రిషి గురించి పేపర్ లో గాని  పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ గాని ఇవ్వాలని ధరణి అనగానే.. వద్దు అలా చేస్తే రిషి ఎప్పటికి రాడని జగతి అంటుంది. నేను చేసింది మంచి కోసమే అని భావిస్తే రిషి తప్పకుండా వస్తాడని జగతి అంటుంది. అప్పుడే మహేంద్ర విని కోపంగా.. జగతి, ధరణిల దగ్గరికి వస్తాడు. నా కొడుకుని నాకు దూరం చేసింది నువ్వు. ఇన్నాళ్లుగా నా కొడుకుని ఎందుకు దోషిగా దూరంగా పంపించేసావ్.. అసలు నిజం చెప్పకుండా ఎందుకు ఇలా బాధపెడుతున్నావని మహేంద్ర అంటాడు. బలమైన కారణం ఉంటేనే అలా చేయాల్సి వచ్చిందని జగతి అంటుంది. ఆ బలమైన కారణం ఏంటో చెప్పమను ధరణి అని మహేంద్ర ఆవేశపడుతాడు. "నాకు జగతి దగ్గర అయ్యిందని అనుకునే లోపే నా కొడుకుని జగతే దూరం చేసింది" అని మహేంద్ర అంటాడు. అలా మహేంద్ర అన్న మాటలకు జగతి బాధపడుతుంది. మరొకవైపు వసుధార మనసులో నుండి తనని తాను దూరం చేయాలని రిషి అనుకుంటాడు. వసుధార కాలేజీలో అనుకోకుండా రిషిని చూసి ఆశ్చర్యపోతుంది. వసుధార ఎదురుగా రిషి గుండుతో ఉంటాడు‌. గుండు ని కవర్ చేస్తూ క్యాప్ లో ఉన్న రిషిని‌ చూసి.. సర్ అని వసుధార తన చేతిలో ఉన్న బుక్ ని కిందపడేస్తుంది. మేడం మీ బుక్ అని రిషి వసుధారకి ఇస్తాడు. తనపై ఇక ప్రేమ లేదు అనేలా వసుధారతో రిషి మాట్లాడి వెళ్ళిపోతాడు. వసుధార మాత్రం అలానే చూస్తూ ఉండిపోతుంది. మరొక వైపు నువ్వు ఇప్పటికైనా నిజం చెప్పు జగతి.. ఎవరైనా కుట్ర చేసి ఇదంతా చేసారా అని ఫణింద్ర జగతిని అడుగుతాడు. జగతి ఏం సమాధానం చెప్పదు. అప్పుడే మినిస్టర్ జగతికి కాల్ చేసి రమ్మని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

ఫైమా ఆమెను ప్రేమిస్తోందట!

పటాస్ ఫైమా గురించి అందరికి తెలుసు.. ఈటీవీ ప్లస్ లో ప్రసారమైన  పటాస్ షో ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి జబర్దస్త్ లో లేడీ కమెడియన్ గా తక్కువ కాలంలోనే పాపులర్ ఐపోయింది. ఫైమా వేసే పంచ్ లు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. వాటి మీద మీమ్స్ కూడా వస్తూ ఉంటాయి. దాంతో ఫైమా క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అలా జబర్దస్త్ లో చేస్తుండగానే బిగ్ బాస్ లో ఆఫర్ వచ్చింది. హౌస్ లోకి వెళ్లి  అక్కడ కూడా అందరిని ఎంటర్టైన్ చేసి బయటికి వచ్చింది. ఇప్పుడు "ఆదివారం విత్ స్టార్ మా పరివారం" షోలో  శ్రీముఖితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. అలాంటి ఫైమా రెగ్యులర్ గా ఫాన్స్ తో టచ్ ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్ లో క్వశ్చన్స్ అడగమని చెప్తూ తాను కూడా సరదాగా ఆన్సర్స్ ఇస్తూ ఉంటుంది ఫైమా. అలాంటి ఫైమాని ఇప్పుడు ఆరియానా లవ్ చేస్తోందట. "ఐ లవ్ యు..డు యు లవ్ మీ" అని ఆరియానా అడిగేసరికి "ఐ లవ్ యు టూ...ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటా సిస్టర్" అని ఆన్సర్ చేసింది. "ఎప్పుడూ శారీ ఎందుకు..దిష్టి తగులుతుంది బాబోయ్" అని ఒక ఫ్యాన్ అనేసరికి "థ్యాంక్యూ" అని చెప్పింది. "నువ్వు కలిసిన పెద్ద సెలబ్రిటీ పిక్ పెట్టు" అనేసరికి "ఆలీతో కలిసి దిగిన ఫోటోని పెట్టింది. "రాజ్ లో నచ్చే ఒక మంచి క్వాలిటీ చెప్పండి" అని అడగగా, "నన్ను భరిస్తాడు..ఫ్రెండ్ షిప్ కి వేల్యూ ఇస్తాడు" అంది ఫైమా. "బిగ్ బాస్ హౌస్ లో నచ్చని, నచ్చే హౌస్ మేట్ ఎవరు" అనే ప్రశ్నకు " అలా ఎవరూ లేరు ఎందుకు అంటే అది గేమ్ షో కాబట్టి" అని సమాధానమిచ్చింది. పటాస్ షోలో ఫైమా తన కామెడీతో దూసుకుపోతున్న టైంలో అనుకోకుండా ఆ షో ఆగిపోయింది. దాంతో ఫైమా తన యూట్యూబ్ వీడియోస్ చేసుకుంటూ ఉండిపోయింది. సరిగ్గా అదే టైంలో జబర్ధస్త్ షో ఆఫర్ వచ్చింది. అలా  తర్వాత ఫైమా  వెనుదిరిగి చూసుకోలేదు. కామెడీ టైమింగ్..  భాస్కర్, ఇమాన్యుయేల్, వర్ష, ఫైమా మధ్య వచ్చే కామెడీ స్కిట్స్ ని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేసేవారు. 

కావ్యని ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేసిన స్వప్న!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ 125 లో..  రాహుల్-స్వప్నల పెళ్ళి జరిగాక అప్పగింతల్లో కనకం ఎమోషనల్ అవుతుంది. ఇక నువ్వు నీ ఇంట్లోనే ఉండాలని స్వప్నతో చెప్తూ కనకం ఏడ్చేస్తుంది. అప్పగింతలు జరిగాక కనకం కుటుంబం అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత స్వప్నని కావ్య గదిలోకి తీసుకెళ్లి బెడ్ పై కోపంగా నెట్టివేస్తుంది. ఏంటి అలా నెట్టేస్తున్నావ్ కడుపులో నా బిడ్డ ఏం కావాలని స్వప్న అంటుంది. "నీ కడుపులో బిడ్డా? సరే అయితే  గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్లి నిన్ను చూపిస్తాను" అంటూ కావ్య కోప్పడుతుంది. కావ్య అలా అనగానే స్వప్న షాక్ అవుతుంది. నన్ను ఎందుకు ఇలా మోసం చేసావ్? అసలు నీకు కడుపే లేదు. ఎందుకు అబద్ధాం చెప్పావని కావ్య నిలదీస్తుంది. నేను అబద్దం చెప్పానని నీకెవ్వరు చెప్పారని స్వప్న అడుగుతుంది. అరుణ్ నీ ఫోన్ కి కాల్ చేస్తే నేనే లిఫ్ట్ చేసానని కావ్య అంటుంది. అవును అబద్ధం చెప్పాను.. రాహుల్ నన్ను చీట్ చేసి వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. నేను ఈ ఇంటికి ఎలాగైనా కోడలు కావాలని ఇలా చేశాను. చెల్లుకి చెల్లు అని స్వప్న అంటుంది. నిజం తెలియక నీ తరుపున నిలబడి దగ్గరుండి నీ పెళ్లి జరిపించాను. రాజ్ కి తెలిస్తే జీవితంలో నన్ను క్షమించడు. వెంటనే వెళ్లి రాజ్ కి నిజం చెప్తానని కావ్య వెళ్తుంటే.. స్వప్న తనని ఆపి.. నువ్వు వెళ్లి నిజం చెప్తే నేను చనిపోతానంటూ ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఇది నా సమస్య దీన్ని నేనే పరిష్కారించుకుంటాను. నువ్వు జోక్యం చేసుకోకని కావ్యతో అంటుంది స్వప్న. మరొక వైపు కనకం-కృష్ణమూర్తి కుటుంబం వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇద్దరు కూతుళ్లు ఆ ఇంటికి కోడళ్ళుగా వెళ్లారని హ్యాపీగా ఫీల్ అవుతారు. మరొక వైపు అరుణ్ కి స్వప్న ఫోన్ చేసి నేను ప్రెగ్నెంట్ కాదన్న విషయం మా చెల్లికి ఎందుకు చెప్పావని అడుగుతుంది. ఫోన్ చేశాను లిఫ్ట్ చేసింది నువ్వే అనుకొని మాట్లాడానని అరుణ్ అంటాడు. ఇంకెప్పుడు అలా చెప్పకని స్వప్న తనతో అంటుంది.  మరొక వైపు రాహుల్ స్వప్నల శోభనం చెయ్యాలని ఇందిరాదేవి, అపర్ణ, ధాన్యలక్ష్మి అనుకుంటారు. అక్కడే ఉన్న రుద్రాణి, నాకు ఇష్టం లేకుండా రాహుల్ పెళ్లి చేశారు.. ఏదైనా చేసుకోండని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రాజ్ అక్కడికి రాగానే.. రాజ్, కావ్యలను ఇందిరాదేవి పక్కకు తీసుకొని వెళ్ళి. రాహుల్ స్వప్నల శోభనంకి కావలిసిన ఏర్పాట్లు చెయ్యమని చెప్తుంది. దానికి రాజ్ సరే అంటాడు. ఆ తర్వాత రాహుల్ స్వప్నల శోభనంకి గదిని డెకరేషన్ చేస్తూ స్వప్న చెప్పిన అబద్ధం గురించి ఆలోచిస్తుంది కావ్య. ఈ విషయం రాజ్ కి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో అని కావ్య మనసులో అనుకుంటుంది. అప్పుడే రాజ్ కత్తి పట్టుకొని గదిలోకి వస్తాడు. కావ్య  టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

ఎదవా.. నిజమైన బ్లూ టిక్ వచ్చిన హ్యాపీనెస్ కూడా లేదు కదరా!

ఇన్స్టాగ్రామ్ బ్లూ టిక్ కోసం చాలామంది పడిగాపులు పడుతున్నారు. సెలబ్రిటీస్ అంతా కూడా ఆ బ్లూ టిక్ కోసం కలలు కంటూ చాల హార్డ్ వర్క్ చేస్తున్నామని చెప్తూ డాన్స్ లు, ఫోటో షూట్ లు, ఆస్క్ మీ క్వశ్చన్స్, లైవ్ వీడియోస్ పేరుతో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజీల్లో పోస్ట్ చేస్తూ ఫాలోవర్స్ ని పెంచుకోవడంలో తలమునకలవుతూ ఉండగా మరో వైపు ఇన్ స్టాగ్రామ్ లో 699 కడితే చాలు బ్లూ టిక్ ఆప్షన్ ఇచ్చేస్తుండడంతో సెలబ్రిటీస్ కి ఒళ్ళు మండిపోతోంది. తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. ఇప్పటికే అఖిల్ సార్థక్ ఈ విషయం మీద ఫుల్ గరం ఐపోయాడు. ఇన్స్టాగ్రామ్ ని తిడుతూ ఒక వీడియో పోస్ట్ చేసాడు. ఇప్పుడు ఆ తిట్టే వొంతు గీతూ రాయల్ కి వచ్చింది. "నీ యవ్వా ఇన్స్టాగ్రామ్ సచ్చినోడా...ఎదవా...నిజమైన బ్లూ టిక్ వచ్చిన హ్యాపీనెస్ ని ఒక సంవత్సరం కూడా లేకుండా చేసావ్ కదరా...ఇప్పుడు ప్రతీ ఒక్కరికీ బ్లూ టిక్కులు ఉన్నాయి. ఛ" అంటూ మాములుగా తిట్టడం లేదు...మరో వీడియోకూడా సైడ్ బై సైడ్ పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఒకతను డబ్బులు పెట్టి కొనుక్కుని నవ్వుకుంటూ ఉంటాడు మరో అమ్మాయి కష్టపడి  వీడియోస్ చేస్తూ గోల్స్ రీచ్ అవుతూ ఫాన్స్ ని ఫాలోవర్స్ ని పెంచుకోవడానికి కష్టపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇద్దరూ సమానమైపోయారనే  మెసేజ్ ని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసింది. గీతూ గురించి చెప్పాలి అంటే బిగ్ బాస్ సీజన్ సిక్స్ కి ముందు, ఆ తర్వాత అని చెప్పాలి. అసలు బిగ్ బాస్  సీజన్ 6  జనాలకు గుర్తున్నది అంటే కేవలం గీతూ రాయల్ వల్లనే అని కూడా చెప్పొచ్చు.

ఆ టాటూతో హరితేజ కనెక్ట్ అయ్యిందంట!

హరితేజ.. అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై తనదైన ముద్రని వేసుకున్న నటి, యాంకర్. హరితేజ యాంకర్ గా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుని ఇప్పుడు మంచి ఆఫర్స్ తో బిజీగా ఉంటుంది. అయితే హరితేజ గత ఏడాది ఆడపిల్లకి జన్మనిచ్చిన విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం హరితేజ తన కూతురు భూమిని చూసుకుంటూ సమయం గడుపుతుంది. తనకి సంబంధించిన విషయాలన్నింటిని హరితేజ ఎప్పటికప్పుడు తన యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేస్తుంది. అలాగే హరితేజ ఇన్ స్టాగ్రామ్ లో ఎక్కువ యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా తను పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు వైరల్ గా మారిన విషయం అందరికీ తెలిసిందే. సీరియల్స్ తో మొదలైన తన కెరీర్.. టీవీ షోస్, యాంకరింగ్ అంటూ బిజీ లైఫ్ ని  లీడ్ చేస్తుంది. ఇలా ప్రేక్షకులలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. బిగ్గెస్ట్ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ మొదటి సీజన్ లోనే ఎంట్రీ ఇచ్చి.. తన అటతీరు, మాటతీరుతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసి తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుంది. ఆ తర్వాత పలు సినిమాలలో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ అందరి మెప్పు పొందింది. వీటితో పాటుగా డాన్స్ షోలలో సైతం తన డాన్స్ తో అందరిని ఆకట్టుకుంటుంది హరితేజ. నితిన్, సమంత నటించిన 'అఆ' మూవీ లో హరితేజ చేసిన కామెడీకి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. దాంతో పలువురి ప్రశంసలు అందుకుంది. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మంచి కాంప్లిమెంట్ తీసుకుంది. హరితేజ తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో 'లాంగ్ టైం నో సీ' అంటూ అభిమానులతో ముచ్చటించింది. తన అభిమానులు ప్రశ్నలు అడుగగా వాటికి ఓపికగా సమాధానమిచ్చింది హరితేజ. "యూ ఇన్ స్పైర్ మెనీ ఆఫ్ అజ్" అని ఒకరు చెప్పగా.. చీర్స్ టూ దట్, లోడ్స్ ఆఫ్ లవ్ అని రిప్లై ఇచ్చింది హరితేజ. "రీజన్ బిహైండ్ యువర్ టాటూ" అని ఒకరు అడుగగా.. ఆ టాటూతో నేను కనెక్ట్ అయ్యాను. అందులో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఉన్నాయి. అవన్నీ నాలో ఉండాలని, ఉంటాయని అలా టాటూ వేపించుకున్నానని చెప్పింది హరితేజ. మీరు డెలివరీ తర్వాత వెయిట్ లాస్ అయ్యారు కదా ఆ జర్నీ వీడియో చేయండని ఒకరు అడుగగా.. లాట్ ఆఫ్ మెసేజెస్  వస్తున్నాయి వెయిట్ లాస్ గురించి.. త్వరలోనే చేస్తానని హరితేజ చెప్పింది. మీరు సునీత గారు కలిసి చేసిన మదన మోహన సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని ఒకరు అడుగగా.. నేను కూడా వెయిటింగ్. వచ్చాక షేర్ చేస్తానని హరితేజ చెప్పింది. ఇలా కాసేపు తన ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ తో సరదాగా ముచ్చటించింది హరితేజ.  

ఏంజెల్ ప్రియ, ఛార్మింగ్ త్రిష.. ఇన్ స్టాగ్రామ్ ని తిడుతున్న అఖిల్ !

అఖిల్ సార్థక్.. బిగ్ బాస్ ముందు వరకు ఎవరికి పెద్దగా తెలియదనే చెప్పాలి. బిగ్ బాస్ సీజన్-4 తో ఎంతో పాపులారిటి సొంతం చేసుకున్నాడు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు మోనాల్ గజ్జర్ తో నడిపిన లవ్ ట్రాక్ మామూలుగా లేదనే చెప్పాలి. బిగ్ బాస్ లో ఉన్నన్ని రోజులు తనకి నచ్చినట్టుగా ఉండేవాడు అఖిల్. అతని బిహేవియర్ చాలా మందికి నచ్చేది కాదు. అంతేకాకుండా హౌస్ లో మోనాల్ గజ్జర్ గురించి అఖిల్, అభిజిత్ ల పంచాయతీ వీధుల్లో కుళాయిల దగ్గర ఉండే కొట్లాటలాగా ఉండేది. అఖిల్ బిగ్ బాస్-4 రన్నర్ గా నిలిచిన విషయం అందరికి తెలిసిందే. అంతేకాకుండా బిగ్ బాస్ ఓటీటీలో కూడా మరోసారి ఎంట్రీ ఇచ్చి.. అందులో కూడా రన్నరప్ గానే నిలిచాడు. అయితే తాజాగా అఖిల్ మంచి పాపులారిటీ సంపాదించుకొని.. ఈవెంట్స్, షోస్ తో బిజీ గా ఉంటున్నాడు. అంతేకాకుండా బిబి జోడిలో తేజస్వినితో జతకట్టి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. బిబి జోడి షోలో హాట్ పెర్ఫార్మన్స్ ఎవరంటే అఖిల్-తేజస్వినిల పేరే వినిపిస్తుందని అనడంలో ఆశ్చర్యమే లేదు. బిబి జోడీలో సైతం కౌశల్ తో.. నువ్వా నేనా అంటూ మాటల యుద్ధమే జరిగిందని చెప్పాలి. అయితే కొన్ని కారణాల వల్ల అఖిల్ జోడీ ఫైనల్ వరకు వెళ్ళలేదు. అఖిల్ కి కండరాల నొప్పి వల్ల తన కాలికి శస్త్రచికిత్స కూడా జరిగింది. దీంతో డాక్టర్లు కొన్నిరోజులు అఖిల్ ని డ్యాన్స్ చేయవద్దని చెప్పారట.‌ అందుకనే బిబి జోడీ షో నుండి అఖిల్ తప్పుకున్నాడు.  అఖిల్ తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక వీడియోని పోస్ట్ చేశాడు. " 699 కే బ్లూ టిక్ ఇచ్చుడేందిరా.. ఆ రూపాయి ఎందుకు వదిలేసినవ్ రా లేకి నాయాలా.. మేం ఎక్కడికి పోవాలే. ఇప్పుడు కొత్త కొత్త పేర్లు వస్తాయి.. ఏంజెల్ ప్రియ, చార్మింగ్ త్రిష.. గట్లాంటి పేర్లు వస్తాయి. ఏం తెల్వని పోరగాళ్ళేమో మోసపోతారు. యూజర్స్ మీకే చెప్తున్నా అర్థం చేస్కోండి. ఇలా వెరిఫైడ్ అని చెప్పి మీ డాటా అంతా తీసుకుంటాడు. జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి ఫేక్ వాటిని నమ్మి మోసపోకండి. ఆ తర్వాత బాధపడకండి " అంటూ ఇన్ స్టాగ్రామ్ ఫౌండర్స్ మీద మండిపడ్డాడు‌.  ఒకవైపు ఇన్ స్టాగ్రామ్ లో 699 కే బ్లూ టిక్ ఆప్షన్ ఇస్తుండంటతో.. యూజర్స్ డబ్బులు కట్టి వెరిఫైడ్ చేపించుకుంటున్నారు. మరి అఖిల్ సార్థక్ మాటలు ఎంత మంది వింటారో, ఎంత మంది ఫాలో అవుతారో చూడాలి.    

డెలివరీ తర్వాత మొదటిసారి పుట్టింటికి వెళ్తున్న లాస్య

లాస్య మంజునాథ్.. ఇప్పుడు అందరికీ సుపరిచితమే. యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్న లాస్య ఈ మధ్యే తనకి కొడుకు పుట్టాడని చెప్పింది. ఆ తర్వాత వ్లాగ్ లు చేస్తుంది. పిల్లలు ఉన్న మదర్స్ కి  టిప్స్ చెప్తూ పలు వ్లాగ్ లు చేయగా అవి యూట్యూబ్ లో వైరల్ అయ్యాయి. ఇలా తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేస్తూ లాస్య మరింత ఫాలోయింగ్ ని సంపాదించుకుంటుంది. పలు టీవి కార్యక్రమాలకు యాంకర్ గా చేసిన లాస్య.. చీమ, ఏనుగు జోక్స్ తో బాగా ఫేమస్ అయింది. ఇక యాంకర్ రవి, లాస్య కాంబినేషన్ షో అంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎంత హిట్ అనేది అందరికి తెలిసిందే. సంథింగ్ స్పెషల్ షోకి అప్పట్లో ఎంత క్రేజ్ ఉండేదో తెలిసిందే. కొంతకాలం పాటు బుల్లి తెరకు దూరంగా ఉన్న లాస్య.. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్-4 లో ఎంట్రీ ఇచ్చి విశేషంగా ఆకట్టుకుంది. పోస్డ్ డెలివరీ అంటూ తనకి బాబు పుట్టాక, తను ఎలా ఉంటుందో, పేరు పెట్టేప్పుడు ఒక వ్లాగ్, మదర్స్ డే వ్లాగ్, తనకి బాబు పుట్టాక తన దినచర్య ఏంటో ఒక వ్లాగ్ గా అప్లోడ్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంటూ వస్తోంది లాస్య. డెలివరీ తర్వాత మొదటిసారి తన పుట్టింటికి వెళ్తుందంట లాస్య. దాంతో వాళ్ళ లగేజ్ ప్యాకింగ్ ఎలా ఉంటుందని వివరించింది లాస్య. వాళ్ళ కొడుకులు జున్ను, మున్నుల కోసం తను తీసుకునే జాగ్రత్తలని చెప్పడమే కాకుండా, ఇంకా ఆడుకునే వస్తువులను టాయ్స్ ని అన్నింటిని ప్యాక్ చేసుకొని తీసుకెళ్తుంది లాస్య. అయితే ఇద్దరు బయటకెళ్ళడం ఒకటైతే ఇద్దరు పిల్లలతో బయటకెళ్ళడం మరింత కష్టమని వాటికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ వ్లాగ్ లో చెప్పుకొచ్చింది లాస్య. పిల్లలు ఉన్న ప్రతీ ఒక్కరు వారి సంరక్షణ కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఈ వీడియోలో చెప్పింది. కాగా ఇప్పుడు ఈ వ్లాగ్ కి విశేష స్పందన లభిస్తోంది.

సర్ ప్రైజ్ చేద్దామనుకుంటే షాక్ ఇచ్చాడు!

నేహా చౌదరి.. బిగ్ బాస్ సీజన్-6 తో క్రేజ్ ని సంపాదించుకుంది. అంతకముందు ఒక యాంకర్ గా చేసి పాపులారిటీ సంపాదించుకున్న నేహా.. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాక తన ఫ్యాన్ బేస్ ని ఇంకా పెంచుకుంది. మొదట ఒక ప్రముఖ ఛానల్ లో యాంకర్ గా చేసిన నేహా చౌదరి.. మల్టీ ట్యాలెంటెడ్ అనే చెప్పాలి. న్యూస్ రీడర్ గా కొన్ని రోజులు చేసి, ఆ తర్వాత ఒక సీరియల్ లో యాక్ట్ చేసింది. అంతేకాకుండా నేహా అథ్లెటిక్, యోగా ట్రైనర్ ఇలా చెప్పుకుంటూపోతే చాలానే ఉన్నాయి. ఐపీఎల్ మ్యాచ్ లకి స్టార్ స్పోర్ట్స్ తెలుగులో రెప్రెజెంటర్ గా చేసింది. విమెన్ వరల్డ్ కప్ ప్రోకబడ్డీకి కూడా రెప్రెజెంటెర్ గా చేసింది. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. హౌస్ లోకి వచ్చేముందు తన ఇంట్లో వాళ్ళు తనకి సంబంధాలు చూస్తున్నారని చెప్పిన నేహా, బిగ్ బాస్ గ్రాంఢ్ ఫినాలే రోజు పెళ్ళి కూతురిగా రెడీ అయి వచ్చేయడంతో అందరి దృష్టి ఫినాలే రోజు తనమీదే పడింది. ఆ తర్వాత తను ఇష్టపడిన అబ్బాయినే పెళ్ళి చేసుకుంది నేహా.  నేహా తన సొంతంగా యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేసి తన ప్రతీ అప్డేట్స్ ని ఫ్యాన్స్ కి తెలియజేస్తుంది. ఇటీవల నేహా తన భర్తతో కలిసి జర్మనీకి వెళ్ళిన విషయం అందరికి తెలిసిందే. తన పేరెంట్స్ ని వదిలి వెళ్తూ ఎమోషనల్ అయిన ఒక వీడియోని పోస్ట్ చేసింది నేహా. అది అప్పట్లో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. మళ్ళీ క్రికెటర్స్ ని పెళ్ళి చేసుకోవద్దని ఒక వ్లాగ్ చేసి తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేయగా.. ఆ వీడియో అత్యధిక వీక్షకాధరణ పొందింది. అయితే తాజాగా నేహా తన యూట్యూబ్ ఛానెల్ లో ఒక వీడియోని అప్లోడ్ చేసింది. అందులో తన భర్తకి సర్ ప్రైజ్ ఇద్దామని అనుకుందంట కానీ తనకి షాక్ ఇచ్చాడని చెప్తుంది నేహా చౌదరి.   

డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎలా అవ్వాలో చెప్తున్న ఆర్జే కాజల్!

ఆర్జే కాజల్ .. తన వాయిస్ తో కోట్లాది మందికి పరిచయమైంది. సోషల్ మీడియాలో తనకు క్రేజ్ మాములుగా లేదనే చెప్పాలి. బిగ్ బాస్ సీజన్-5  ముందువరకు తన వాయిస్ తో బిగ్ బాస్ రివ్యూలు చెప్పిన కాజల్.. బిగ్ బాస్ సీజన్-5 లో ఎంట్రీతో లైవ్ లో తన నడవడితో తనకున్న ఫ్యాన్ బేస్ ని పెంచుకుంది. బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నప్పుడు షణ్ముఖ్, సిరిలతో మొదటి నాలుగువారాలు కలిసి ఉన్న కాజల్ ఆ తర్వాత వారికి దూరమైంది. ఆ తర్వాత హౌస్ లో టాప్-6 లో ఉన్న కాజల్.. ఎలిమినేట్ అయి టాప్-5 కి దూరమైంది. బయటకొచ్చాక తనకి సినిమా అవకాశాలు పెరిగాయి. ఆర్జే కాజల్ తన సంబంధించిన విషయాలని ఇన్ స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా షేర్ చేస్తుంటుంది. అదే కాకుండా తన యూట్యూబ్ ఛానెల్ లో కూడా వ్లాగ్ లుగా అప్లోడ్ చేస్తుంటుంది. అయితే తాజాగా తను ఫ్యామిలితో కలిసి ఒక ట్రిప్ ప్లాన్ చేసి వ్లాగ్ చేయగా దానికి అత్యధిక వీక్షకాధరణ లభించగా, తాజాగా మరో కొత్త వ్లాగ్ ని తన ఛానెల్ లో అప్లోడ్ చేసింది. డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎలా అవ్వాలో? ఏం చేయాలో ఈ వ్లాగ్ లో వివరించింది కాజల్. ఆర్జే కాజల్ కి డబ్బింగ్ చెప్పే అవకాశం కల్పించిన డబ్బింగ్ ఇన్ ఛార్జ్ తో కొన్ని విషయాలను షేర్ చేసుకుంది. డబ్బింగ్ యూనియన్ ప్రెసిడెంట్ అండ్ ఇన్ ఛార్జి గోగినేని ప్రసాద్ తో కలిసి మాట్లాడించింది కాజల్. అసలు డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలనుకునేవారికి మీరిచ్చే టిప్స్ ఏంటి అని గోగినేని ప్రసాద్ ని అడుగగా.. "ముందుగా మీ వాయిస్ తో మీరు సాధన చేయాలి. డబ్బుల కోసం కాకుండా డబ్బింగ్ చెప్పాలనే పాషన్ ఉండాలి. అవకాశాలు అంత ఈజీగా రావు. పనికిరాని వాయిస్ అంటూ ఉండదు. కానీ మీకిచ్చిన సన్నివేశంలోని డైలాగ్స్ ని మీరు ఏ టోన్ లో చెప్తున్నారో చూసుకోవాలి. ఏ బేస్ కావాలో కూడా పరీక్షించుకోవాలి. ఎంత ఇన్వాల్వ్ అవుతున్నాడో కూడా చూస్తుంటారు. డబ్బింగ్ స్టూడియోలో మనల్ని చూసే ఇన్ చార్జ్ , డైరెక్టర్స్ అంతా.. మనం డైలాగ్ చెప్తున్నప్పుడు ఎంత ఇన్వాల్వ్ అవుతున్నామో కూడా చూస్తారు‌" అంటూ గోగినేని ప్రసాద్ చెప్పుకొచ్చాడు.

కృష్ణ, మురారి హోమం సక్సెస్.. ముకుంద ప్లాన్ ఫెయిల్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -185 లో.. కృష్ణ మురారి హోమం చేయడం చూసి తట్టుకోలేక ముకుంద కళ్లు తిరిగి కింద పడుతుంది. అది చూసిన కృష్ణ, మురారిలు పూజలో నుంచి లేస్తుండగా.. "నేను చూసుకుంటాను..మీరు కానివ్వండి. మార్నింగ్ నుండి ఏం తినలేదు కదా అందుకే ముకుందకి ఇలా అయ్యింది" అని రేవతి చెప్పి ముకుందని లోపలికి తీసుకొని వెళ్తుంది. ముకుందని పడుకోపెట్టిన రేవతి.. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసిన హోమం ఆగదని అనుకొని వెళ్ళిపోతుంది. వాళ్ళు అలా హోమం చెయ్యడం నచ్చని ముకుంద.. మళ్ళీ పూజ దగ్గరికి వెళ్లి వాళ్లనే చూస్తుంటుంది. మరొకవైపు ఎన్ని జన్మలకు అయినా కృష్ణనే నా భార్యగా రావాలని మురారితో, అదేవిధంగా కృష్ణతో కూడా ఎన్ని జన్మలకైనా మురారినే భర్త గా రావాలని పంతులు ప్రమాణం చేయిస్తాడు. ఏంటి వీళ్ళకి మళ్ళీ నిజమైన  పెళ్లి జరుగుతున్నట్లు ఉందని ముకుంద అనుకుంటుంది. కృష్ణ, మురారి లు హ్యాపీగా ఉంటే ఓర్వలేకపోతుంది ముకుంద. ఆ తర్వాత హోమం పూర్తవుతుంది. మురారి తన గదిలోకి వెళ్ళి ఆలోచిస్తుంటాడు. అసలు ఏసీపీ సర్ ప్రమాణం  చేస్తుంటే మొహంలో హ్యాపీనెస్ కన్పించింది. నేను అంటే ఏసీపీ సర్ కి ఇష్టమేమోనని కృష్ణ అనుకుంటుంది. అదే విధంగా మురారి కూడా అనుకుంటాడు. కృష్ణ సంతోషంగా ఉంది నేను అంటే ఇష్టమేమోనని మురారి అనుకుంటాడు. ఇద్దరు ఎదురెదురుగా ఉండి తమ ప్రేమని ఒకరికొకరు చెప్పాలనుకుంటారు. కానీ ఎక్కడ ఒకరంటే ఒకరికి ఇష్టం లేదని అంటారేమో అని భయం తో ఇద్దరు సైలెంట్ గా ఉంటారు. మరొకవైపు మురారి, కృష్ణ ఇద్దరు కలిసి చేసిన ప్రమాణం గుర్తు చేసుకుంటూ ముకుంద బాధపడుతుంది. "కృష్ణ ఇష్టం కాబట్టి తన పక్కన కూర్చొని హోమం చేసాడు.. ఇష్టం లేకుంటే అంత హ్యాపీగా ఉండేవాడు కాదు కదా.. మన ప్రేమని మర్చిపోయి ఎలా కృష్ణ తో హ్యాపీగా ఉండగలుగుతున్నావ్ మురారి.. ఎలాగైనా నా ప్రేమని కాపాడుకుంటాను" అని ముకుంద అనుకుంటుంది. ఆ తర్వాత ఉదయం కృష్ణ, మురారి నిద్రలేస్తారు. కాసేపు నేను అంటే నేను ముందు వెళ్లి ఫ్రెష్ అవుతానని సరదాగా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

కన్నకొడుకు ఆచూకీ కోసం ఏడ్చేసిన మహేంద్ర!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -791 లో.. వసుధార గురించి మహేంద్ర కాలేజీలో అడుగుతాడు. అలా వసుధార గురించి అడగడం చూసిన రిషి.. నేను ఇక్కడ ఉన్నట్లు డాడ్ కి వసుధార చెప్పిందేమో, అందుకే డాడ్ వచ్చాడని అనుకుని వసుధార దగ్గరికి వెళ్తాడు రిషి. "నేను ఇక్కడ ఉన్నట్లు డాడ్ కి నువ్వే చెప్పావా" అని వసుధారని అడుగుతాడు రిషి. లేదు నేను ఎందుకు చెప్తానని వసుధార అంటుంది. నువ్వు చెప్పకుండానే  డాడ్ ఇక్కడికి వచ్చారా అని రిషి అంటాడు. అన్ని అబద్ధాలు, మోసాలు.. ఇప్పటికే నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది. ఇప్పుడు డాడ్ కి నేను ఇక్కడ ఉన్నట్లు చెప్పకు అని వసుధారకి చెప్పి పక్కన వెళ్ళి నిల్చుంటాడు రిషి. మరొకవైపు వసుధారని వెతుక్కుంటూ మహేంద్ర వస్తాడు. అలా వసుధార దగ్గరికి వచ్చిన మహేంద్రతో.. ఎలా ఉన్నారు సర్.. బాగున్నారా అని వసుధార అనగానే.. నీ కుశల ప్రశ్నలు వినడానికి నీ యోగ క్షేమాలు తెలుసుకోవడానికి నేను రాలేదు.. రిషి ఎక్కడ ఉన్నాడో చెప్పమని మహేంద్ర అడుగుతాడు. నాకు తెలియదు సర్ అని వసుధార అంటుంది. నీకు అలవాటే కదా అబద్ధాలు చెప్పడమని మహేంద్ర అంటాడు. నా కొడుకుని ఒక మోసగాడిలా చేసి నా నుండి నా కొడుకుని దూరం చేశారు. నా కొడుకు ఎక్కడ ఉన్నాడో నీకు తెలియకుంటే నాకు ఫోన్ ఎందుకు చేసావ్? నేను చేస్తే ఎందుకు లిఫ్ట్ చెయ్యలేదని వసుధారతో మహేంద్ర అంటాడు. రిషి సర్ గురించి ఏదైనా తెలిసిందేమో అని కాల్ చేసాను సర్. మళ్ళీ మీరు చేసింది నేను చూడలేదు. అందుకే లిఫ్ట్ చెయ్యలేదని వసుధార అంటుంది. ఇన్ని రోజులుగా చెయ్యనిది.. ఇప్పుడే ఎందుకు చేసావ్.. నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావ్ నా కొడుకు గురించి నీకు తెలుసు. అసలు నా కొడుకు చేసిన తప్పేంటి? నిన్ను ప్రేమించడమా పెళ్లి చేసుకోవాలనుకోవడమా అని మహేంద్ర అంటాడు. అసలు మీరు ఆ రోజు ఆబద్దం చెప్పడానికి కారణమేంటంటే అక్కడ జగతి చెప్పదు.. ఇక్కడ నువ్వు చెప్పవని మహేంద్ర ఎమోషనల్ అవుతాడు. అదంతా దూరం నుండి చూస్తూ రిషి ఎమోషనల్ అవుతాడు. ఆ తర్వాత వసుధార బాధని దాచుకుంటుంది. నాకు రిషి సర్ ఎక్కడ ఉన్నాడో తెలియదు సర్ అని వసుధార అంటుంది. రిషిని మోసం చేసినట్లు నన్ను చెయ్యకండి.. రిషి కనిపిస్తే నాకు చెప్పమని మహేంద్ర అంటాడు. రిషి ఇక్కడే ఉన్నాడేమో అని నా మనసుకి అనిపిస్తుందని మహేంద్ర చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మహేంద్ర అన్న మాటలకు వసుధార బాధపడుతూ రిషి వైపు చూస్తుంది. మహేంద్ర వెళ్తుంటే రిషి ఎమోషనల్ అవుతాడు. ఆ తర్వాత రిషి ఇంటికి వెళ్లి. మహేంద్ర మాటలు గుర్తు చేసుకుంటాడు. ఈ వసుధార ఏంటి ఇంకా నన్ను ప్రేమగా చూస్తుంది. తన కళ్లలో ప్రేమ కన్పిస్తుంది. ఎలా నా మీద ప్రేమని తీసెయ్యలి.. ఇక నుండి నేను వాళ్లకి కొత్తగా కన్పించాలి. నాపై ప్రేమ లేకుండా చెయ్యాలని రిషి అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.   

రాహుల్-స్వప్నల పెళ్ళి జరిగింది.. ఎమోషనల్ గా అప్పగింతలు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -124 లో..  ఇక ఈ పెళ్లి జరగదు. ముహూర్తం దాటిపోయింది. ఇప్పుడు ఒక వేళ స్వప్న వచ్చిన ప్రయోజనం ఉండదు అని రుద్రాణి అంటుంది. అప్పుడే రాజ్ వచ్చి ఈ పెళ్లి జరుగుతుందని అంటాడు. రాజ్ తో పాటు స్వప్న కావ్య కూడా వస్తారు. రాజ్ ఇంట్లో వాళ్లకి కిడ్నాప్ గురించి జరిగిందంతా చెప్తాడు. ఆ తర్వాత అప్పటివరకు రుద్రాణి అన్న మాటలు గుర్తు చేస్తూ సుభాష్ రుద్రాణిపై కోప్పడతాడు. ఒక మాట అనే ముందు అలోచించి మాట్లాడాలి. ఇప్పటికైనా అర్థం చేసుకొని నోటిని అదుపులో పెట్టుకో అని రుద్రాణిని సుభాష్ అంటాడు. నా కొడుకు పెళ్లి ఎక్కడ ఆగిపోతుందోనని నేను భయపడి అలా మాట్లాడాను.. అయిన ఇప్పుడు ముహూర్తం దాటిపోయింది కదా అని రుద్రాణి అనగానే.. అవన్నీ నీకెందుకు పంతులు గారు చూసుకుంటారని అపర్ణ అంటుంది. పంతులు గారు చూసి ఇంకో అరగంటలో మంచి ముహూర్తం ఉందని చెప్తాడు. ఆ లోపు నువ్వు స్వప్నని తీసుకొని వెళ్ళి రెడీ చేసుకురా.. చేతికి గాయం అయినట్లు ఉంది ఫస్ట్ ఎయిడ్ చేసి తీసుకొనిరా అని ఇందిరాదేవి అంటుంది. ఆ తర్వాత రాహుల్ వెళ్లి పెళ్లి పీటలపై కూర్చుంటాడు. 'స్వప్న బ్యాగ్ లో తలంబ్రాలు ఉన్నాయి.. నువ్వు వెళ్ళి తీసుకొనిరా' అని కావ్యని కనకం పంపిస్తుంది. ఆ తర్వాత స్వప్నని పెళ్లి పీటల మీదకి తీసుకొని వెళ్తారు. మరొక వైపు స్వప్న బ్యాగ్ దగ్గరికి వెళ్ళి తలంబ్రాల కోసం చూస్తున్న కావ్యకి.. ఫోన్ రింగ్ వినిపిస్తుంది. అది స్వప్న ఫోన్.. తన  ఫోన్ కి  అరుణ్ కాల్ చేస్తాడు. ఇతనేంటి ఇప్పుడు కాల్ చేస్తున్నాడని కావ్య అనుకొని లిఫ్ట్ చేసి సైలెంట్ గా ఉంటుంది. మాట్లాడేది స్వప్న నే అనుకున్న అరుణ్ మొత్తం మాట్లాడతాడు. "స్వప్న నేను నిన్ను ప్రేమించాను కానీ నువ్వు రాహుల్ ని ప్రేమించావు.. అందుకే నా ప్రేమ త్యాగం చేశాను. నువ్వు ప్రెగ్నెంట్ అని అబద్దం చెప్పేలా చేసావ్. నువ్వు హ్యాపీగా ఉండు" అని అరుణ్ ఫోన్ కట్ చేస్తాడు. అదంతా విన్న కావ్య షాక్ అవుతుంది. ఇదంతా రాజ్ కి తెలిస్తే మా ఫ్యామిలీ మొత్తం ఇలాగే మోసం చేస్తారా అంటాడు. ఎలాగైనా ఈ పెళ్లి జరుగక ముందే నిజం చెప్పాలని అనుకుంటుంది. కానీ కావ్య వచ్చే లోపే  రాహుల్, స్వప్నల పెళ్లి జరుగుతుంది.  ఆ తర్వాత కావ్య అక్క ప్రెగ్నెంట్ కాదన్న విషయం తెలిస్తే ఈ ఇంట్లో అక్క పరిస్థితి.. నా పరిస్థితి ఏంటని టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత స్వప్నని ఎప్పుడు కోడలిగా ఒప్పుకోనని రుద్రాణి చెప్తుంది. పెళ్ళి తర్వాత స్వప్న అప్పగింతల్లో కనకం కృష్ణమూర్తి ఎమోషనల్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. 

బిగ్ బాస్ సీజన్-7 లోకి ఎంట్రీ ఇస్తున్న కార్తీక దీపం నటి!

శోభా శెట్టి ఈ పేరు ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు. కానీ మోనిత అంటే తెలియని వారుండరు. స్టార్ మా టీవీ చూసే ప్రేక్షకులకు మోనిత సుపరిచితమే. బుల్లి తెరపై సంచలనం సృష్టించిన సీరియల్ కార్తీక దీపం. ఈ సీరియల్ లో కార్తీక్, దీప ఇద్దరు ఎంత పాపులరో లేడీ విలన్ మోనిత అంతే ఫేమస్. మోనిత అటిట్యూడ్ కి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని అనడంలో ఆశ్చర్యం లేదు. బుల్లి తెరపై 'లేడి విలన్' అంటే మొదటగా గుర్తుకొచ్చేది మోనిత. పాత్రకి తగ్గట్టు తనని తాను మల్చుకొని, ఆ పాత్రలో ఒదిగిపోయింది మోనిత. ప్రేమించినవాడిని ఎలాగైనా దక్కించుకోవాలనే శాడిస్ట్  క్యారెక్టర్ గా మోనిత చేసిన నటన గురించి ప్రత్యేకంగ చెప్పనక్కర్లేదు. మోనిత(శోభా శెట్టి) కార్తీక దీపం లో కీలకపాత్ర పోషించింది. అయితే కార్తీకదీపం సీరియల్ మంచి క్లైమాక్స్ లేకుండా ముగియడంతో కార్తీక దీపం-2 ఉంటుందనే వార్తలు అప్పట్లో చక్కర్లు కొట్టాయి. దానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయినట్లు వార్తలు వినిపించినా ఇప్పటి వరకు దానికి సంబంధించిన ఏ అప్డేట్ రాలేదు. అయితే శోభా శెట్టి తెలుగులో కార్తీకదీపం తర్వాత ఏ సీరియల్ లో కన్పించలేదు. అయితే శోభా శెట్టి  ప్రస్తుతం తన యూ ట్యూబ్ ఛానల్ లో వ్లాగ్ లు చేస్తూ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటూ వస్తుంది. శోభా శెట్టి బిగ్గెస్ట్ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ షో 7 లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సెప్టెంబర్ లో గ్రాంఢ్ గా లాంచ్ అవుతోన్న ఈ షోకి కంటెస్టెంట్స్ ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యారని, వాళ్లతో అగ్రిమెంట్స్ కూడా పూర్తి అయినట్లుగా సమాచారం. కాగా శోభా శెట్టి కూడా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు దానికి సంబంధించిన అగ్రిమెంట్ కూడా పూర్తి అయినట్లు తెలుస్తుంది. శోభా శెట్టి ఇప్పటికే తన అందం, అభినయంతో అందరిని ఆకట్టుకుంది. 'కార్తీకదీపం' సీరియల్ లో నెగెటివ్ రోల్ తో ఆకట్టుకున్న శోభా శెట్టి.. బిగ్ బాస్ సీజన్-7 లో తనలో ఉన్న పాజిటివ్ ని చూపిస్తుందా లేక సీరియల్ లో మాదిరి నెగెటివ్ ని చూపిస్తుందా అనేది తెలియాల్సి ఉంది. అయితే బిగ్ బాస్ సీజన్-7 ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారని తెలుస్తుంది.    

అబ్బే కొవ్వు తప్ప ఏం లేదండి.. అనసూయ బోల్డ్ రిప్లై!

అనసూయ భరద్వాజ్.. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. టెలివిజన్ రంగంలో యాంకర్ గా అడుగుపెట్టి గుర్తింపు తెచ్చుకుంది. జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న అనసూయ..‌ రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా నటించి ఆకట్టుకుంది. ఆ తర్వాత చాలా సినిమాలలో నటించిన అనసూయ.. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో తను అప్లోడ్ చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి. అయితే ఆ ఫోటోల మీద  విమర్శలు వచ్చాయనేలోపే మళ్ళీ కొత్తగా తన బికినీ ఫోటోలతో హాట్ టాపిక్ గా మారింది. అనసూయ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. వీకెండ్ పార్టీలని, హోమ్ టూర్ అని, సమ్మర్ వేకేషన్ అంటూ తన ప్రతీ అప్డేడ్ ని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంటుంది. అయితే నిన్న మొన్నటిదాకా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తో గొడవ పడుతూ పోస్ట్ లు చేసిన అనసూయ‌.. ఆ గొడవ సద్దుమణిగిందనేలోపే మళ్ళీ హాట్ టాపిక్ గా మారింది. జ్యువలరీ ప్రమోషన్స్, శారీ ప్రమోషన్స్ అంటూ బ్రాండ్స్ కోసం ప్రచారం చేస్తూ బిజీగా ఉంటున్న అనసూయ. వీకెండ్ ప్లాన్స్ అంటూ శుక్రవారం నుండే ఇన్ స్టాగ్రామ్ లో తన అప్డేడ్స్ ని షేర్ చేస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో బికినీ ఫోటోలను షేర్ చేసింది. అయితే అందులో టాటూని చూపిస్తూ ఉన్న ఫోటో ఒకటి, నడుముని చూపిస్తూ మరొక ఫోటో ఉండగా వాటిమీద ఎక్కువగా నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. 'ఒక ప్యామిలీ ఉంది. బయట ఎలా ఉండాలో ఆ మాత్రం తెలియదా' అంటూ ఒకరు కామెంట్ చేయగా, రెచ్చిపోతున్న రంగమత్త అంటూ మరొకరు, అబ్బే కొవ్వు తప్ప ఇంకేం లేదండి అని ఒకరు కామెంట్ చేయగా దానికి అనసూయ.. 'కొవ్వు మీకున్నట్టు మాట్లాడుతున్నారు కదా' అని రిప్లై ఇచ్చింది. అయితే అనసూయ ఇలా రిప్లై ఇచ్చేసరికి 'జస్ట్ అనసూయ థింగ్స్' అని ఒకరు సూపర్ అని మరొకరు తనకి సపోర్ట్ గా నిలుస్తున్నారు. 'లేటు వయసులో ఘాటు అందాలు' అంటూ మరొకరు కామెంట్ చేసారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్లు చేస్తున్నారు. దీంతో మరోసారి హాట్ టాపిక్ గా మారింది అనసూయ.