కోడలికి కడపు లేదని తెలుసుకున్న అత్త ఏం చేయనుంది?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -240 లో.. నేను చెప్పిన పని కావ్య చెయ్యలేదని అపర్ణకి రుద్రాణి చెప్తుంది. మీరు నాకు ఏం పని అప్పజెప్పలేదని కావ్య అంటుంది. నువ్వు మర్చిపోయి నన్ను అంటున్నవా అని రుద్రాణి అనగానే.. వారి మధ్యలో రాజ్ కలుగజేసుకొని కావ్య అబద్ధం చెప్పదు అందుకే ఎవరికి భయపడుదని కావ్యకి సపోర్ట్ చెయ్యగానే.. ఏంటి మరి నేను అబద్ధం చెప్తున్నానని అంటున్నవా అని రుద్రాణి అంటుంది.  ఆ తర్వాత నేను అలా అనలేదని రాజ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. చూసావా వదిన నీ కొడుకు ఆ కావ్యకి ఎలా సపోర్ట్ చేస్తున్నాడో అని అపర్ణని రెచ్చగొట్టేలా రుద్రాణి మాట్లాడుతుంది. మరొక వైపు స్వప్న ఇబ్బంది పడుతుంది. ఈ చీర కట్టుకోవాలి అంటే ఇబ్బందిగా ఉంది. ఎక్కడ నా బెల్ట్ కింద పడిపోతుందో అని స్వప్న అనుకుంటుంది. అప్పుడే స్వప్న దగ్గరికి రుద్రాణి వచ్చి.. ఏంటి ఆలోచిస్తున్నావంటూ అడుగుతుంది. స్వప్నతో ఎప్పుడు లేని విధంగా రుద్రాణి మాట్లాడేసరికి.. మీరు ఎప్పుడు లేని విధంగా నాతో పాజిటివ్ గా మాట్లాడుతున్నారని స్వప్న అనగానే.. నా వారసుడిని నీ కడుపులో మోస్తూన్నావ్ ఈ మాత్రం ఉండదా అని రుద్రాణి డౌట్ గా.. స్వప్న కడుపుని టచ్ చెయ్యబోతుంటే స్వప్న ఆపుతుంది. అప్పుడే రుద్రాణికి స్వప్నకి కడుపు లేదన్న విషయం అర్థమవుతుంది. ఆ తర్వాత స్వప్న గదిలో రిపోర్ట్స్ ని రుద్రాణి ఫోటో తీసుకుంటుంది. మరొక వైపు ఫంక్షన్ కి వచ్చిన ఒక ఆమె అప్పుని చూసి అబ్బాయని అనుకుంటుంది.  ఆ తర్వాత అందరూ తనని చీర కట్టుకొని రమ్మని చెప్పగా.. తను సరే అని అంటుంది. మరొక వైపు   రుద్రాణి స్వప్న గదిలో తీసుకున్న  రిపోర్ట్స్  ఫోటోని  అబార్షన్ కోసం టాబ్లెట్స్ ఇచ్చిన డాక్టర్ కి పంపిస్తుంది. ఆ డాక్టర్ రిపోర్ట్స్ స్వప్న రిపోర్ట్స్ చూసి క్లారిటీ ఇస్తానని చెప్తుంది. మరొక వైపు అప్పు చీర కట్టుకొని వస్తుంటే అందరూ షాక్ అవుతారు. నీకు చీర సెట్ అవ్వలేదంటూ అప్పుని అందరు ఎగతాళి చేస్తారు. కళ్యాణ్ కూడా ఎగతాళి చేసేసరికి అప్పు బాధపడుతుంది. మరొక వైపు అనామిక అందంగా చీరకట్టులో వస్తుంది. చూసావా అనామిక ఎంత అందంగా ఉందోనని కళ్యాణ్ అనగానే అప్పు ఎమోషనల్ అవుతు వెళ్ళిపోతుంది. మరొక వైపు స్వప్నకి కడుపు లేదన్న విషయం రాహుల్ కి రుద్రాణి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ఎలిమినేషన్ లో తప్పు జరిగింది.. సందీప్ మళ్ళీ వస్తున్నాడు!

  అన్న మళ్ళీ వస్తున్నాడు. ఎస్ ఇది నిజమే. బిగ్ బాస్ సీజన్-7 లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కంటెస్టెంట్ ఆట సందీప్. బిగ్ బాస్ సీజన్-7 లో మొట్టమొదటి హౌస్ మేట్ గా నిలిచిన ఆట సందీప్ ఎనిమిదవ వారం ఎలిమినేట్ అయ్యాడు. ఇప్పుడు ఈ ఎలిమినేషన్ పై ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి అసలు కథేంటి.. ఈ ఎలిమినేషన్ వెనుక నిజాలేంటో ఒకసారి చూసేద్దాం. గతవారం జరిగిన నామినేషన్‌లో యావర్ , టేస్టీ తేజ కలిసి ఆట సందీప్ ని నామినేట్ చేసిన విషయం తెలిసిందే. ఇక నామినేషన్‌లో ఉన్న ఆట సందీప్.. ఓటింగ్ విషయంలో లీస్ట్ లో ఉండటంతో బిగ్ బాస్ ఎలిమినేట్ చేసేశాడు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అసలు ఓటింగ్ లో లీస్ట్ లో ఉంది శోభాశెట్టి. కానీ బిగ్ బాస్ ఆడిన ఆటలో ఆట సందీప్ ఎలిమినేట్ అయ్యాడని నెటిజన్లు భావిస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే.. గత ఏడు వారాల నుండి హౌస్ నుండి ఫీమేల్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతున్నారు. కాగా ఈ వారం కుడా శోభాశెట్టి ఎలిమినేషన్ అయితే హౌస్ లో కలరింగ్ తగ్గుతుందని భావించిన బిగ్ బాస్.. ఈ ట్విస్ట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే హౌస్ లో ఆట సందీప్ చాలాసార్లు సంచాలకుడిగా చేశాడు. కానీ అన్నిసార్లు సీరియల్ బ్యాచ్ ని గెలిపించడానికి ఫౌల్స్ చేశాడని ప్రేక్షకులకి తెలిసిందే. మొదట హౌస్ మేట్ గా స్ట్రాంగ్ గా ఉన్న ఆట సందీప్.. సీరియల్ బ్యాచ్ తో కలిసిపోయి తన ఆటని మరిచిపోయాడు. ఇక అక్కడి నుండి వారేం చేస్తే అదే కరెక్ట్ అన్న పంథాలో వెళ్ళడంతో.. హౌస్ లో ఫెయర్ గేమ్ ఆడే యావర్, ప్రశాంత్, శివాజీలని తప్పుగా అర్థం చేసుకున్నాడు. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఫెయర్ గేమ్ ఆడేవారికి ఫ్యాన్ బేస్ ఉంటుందనే విషయం తెలిసిందే. వారంతా ఆట సందీప్ కి వ్యతిరేకంగా నిలిచి ఓటింగ్ చేయకపోవడంతో అతను ఈ వారం ఎలిమినేట్ అయ్యాడు. అయితే ఆట సందీప్ తన ఇన్ స్టాగ్రామ్ లో.. " This is not the 'END'.. ULTA PULTA " అని పోస్ట్ చేశాడు. దీన్ని బట్టి ఆట సందీప్ మళ్లీ హౌస్ లోకి వస్తున్నాడని అర్థమవుతోంది. మరి ఆట సందీప్ మళ్ళీ రీఎంట్రీ ఇస్తాడా? బిగ్ బాస్ ఉల్టా పల్టా చేస్తాడా తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.‌

హెల్త్, కెరీర్ సహా అన్నీ ఖరాబ్.. అయినా చిల్!

విష్ణుప్రియ తక్కువ సమయంలోనే బుల్లితెరపై మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. టీవీ షోలు, ఈవెంట్లతో ఫుల్ సందడి చేసింది. అయితే కొంతకాలంగా బుల్లితెరపై విష్ణుప్రియ సందడి తగ్గిపోయి, సోషల్ మీడియాకే పరిమితమైంది. అప్పుడప్పుడు మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తూ.. ఎప్పుడూ ఫొటోలు, రీల్స్ తో సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. అసలు విష్ణుప్రియ టీవీ షోలు తగ్గించి, సోషల్ మీడియాకి పరిమితం కావడానికి కారణం ఏంటి? అనేది కొంతకాలంగా అందరిలో మెదులుతున్న ప్రశ్న. ఇలాంటి సమయంలో విష్ణుప్రియ చేసిన కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఒక రీల్ ని షేర్ చేసిన విష్ణుప్రియ.. "మెంటల్ హెల్త్ ఖరాబ్, ఫిజికల్ హెల్త్ ఖరాబ్, కెరీర్ ఖరాబ్, రిలేషన్ ఖరాబ్, షెడ్యూల్ ఖరాబ్, అయినా కూడా ఇలా చిల్ అవుతూనే ఉంటున్నాను" అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హెల్త్ ప్రాబ్లెమ్స్ తో పాటు, లవ్ బ్రేకప్.. విష్ణుప్రియ కెరీర్ పై ప్రభావం చూపాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి. బుల్లితెరకు బ్రేక్ ఇచ్చిన విష్ణుప్రియ మొదట ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక బాట పట్టింది. కొంతకాలంగా ఫిజికల్ ఎక్సర్ సైజ్ లు చేస్తుంది. అలాంటి విష్ణుప్రియ ఇప్పుడు సడెన్ గా కెరీర్ తో సహా అన్నీ ఖరాబ్ అయ్యాయి, అయినా చిల్ అవుతున్నాను అంటుంది. దీంతో అసలు విష్ణుప్రియకి ఏమైందని ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

ఆట సందీప్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

బిగ్ బాస్ హౌస్ లో ఏడు వారాలు నామినేషన్లో లేకుండా ఎనిమిదవ వారం నామినేషన్లోకి వచ్చి ఎలిమినేట్ అయిన ఏకైక కంటెస్టెంట్ ఆట సందీప్. ఇతడికి హౌస్ లో చాలావరకు పాజిటివిటి ఉంది. ఎవరు ఇతడిని నామినేట్ చేయకపోవడం ఇతడికి మైనస్ అయిందా అంటే అవుననే చెప్పాలి. ఆట సందీప్ కి పాజిటివిటి ఉంది కానీ అతడు చేసిందల్లా సీరియల్ బ్యాచ్ తో కలిసి ఉండటమే అని అందరికి తెలిసిందే. అయితే ఆట సందీప్ మొదటి హౌస్ మేట్ అయి అయిదువారాల ఇమ్యూనిటి పొంది నామినేషన్లో లేడు. ఆ తర్వాత ఆరవ వారం నామినేషన్లో ఉన్నాడు. అప్పుడే అశ్వత్థామ 2.0 అంటూ గౌతమ్ కృష్ణ సీక్రెట్ రూమ్ నుండి వచ్చి తన పవర్ యూజ్ చేసి నామినేషన్లో ఉన్న ఆట సందీప్ ని తప్పించాడు. అయితే ఆట సందీప్ ని ఇద్దరే నామినేట్ చేశారు. మొదట యావర్ వచ్చి..‌ నువ్వు సేఫ్ ప్లేయర్ అని నామినేట్ చేశాడు. ఇక టేస్టి తేజ.. బ్రో నువ్వు స్ట్రాంగ్ కంటెస్టెంట్ వి, అందుకే నామినేట్ చేస్తున్నానంటూ నామినేట్ చేశాడు. బయట ఫ్యాన్ బేస్ లేకపోవడంతో ఎక్కువ ఓటింగ్ పొందలేకపోయాడు ఆట  సందీప్. ఇక హౌస్ లో చాలాసార్లు సంచాలకుడిగా చేసిన ఆట సందీప్.. ప్రతీసారీ అమర్ దీప్, శోభా శెట్టి, ప్రియాంక జైన్ లకి సపోర్ట్ గా రిజల్ట్ చెప్పడంతో సంచాలకుడిగా మళ్లీ ఫెయిల్ అయ్యావంటూ నాగార్జున చాలాసార్లు అన్నాడు. ఇక ఆట సందీప్ ప్రతీ టాస్క్ లో ఫౌల్స్ ఆడటం, ఫెయిర్ గేమ్ ఆడకపోవడం, గేమ్ ని సరిగ్గా అర్థం చేసుకొని ఆడకపోవడంతో జనాల దృష్టిలో నెగెటివిటిని సొంతం చేసుకున్నాడు. ఆట సందీప్ బిగ్ బాస్ హౌస్ లో ఒక రోజుకి గాను 39 వేల రూపాయలు, వారానికి 2 లక్షల డెబ్బై అయిదు వేలు తీసుకోగ, ఇక ఎనిమిది వారాలకి గాను 22 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది.   

శోభాశెట్టి కోసం ఆట సందీప్ ఎలిమినేషన్.. ఇదే బిగ్ బాస్ ట్విస్ట్!

బిగ్ బాస్ సీజన్-7 చాలా ట్విస్ట్ లతో కొనసాగుతుంది. వారం వారం హౌస్ లో ట్విస్ట్ లు మాములుగా లేవు. ఇప్పటికి హౌస్ లో గత ఏడు వారాల నుండి ఏడుగురు  లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ అయ్యారు. అయితే ఎనిమిదవ వారం ఆట సందీప్ ఎలిమినేట్ అయ్యాడు. దీంతో హౌస్ లోని వాళ్ళంతా తలలు పట్టుకున్నారు. హౌస్ లోని వాళ్ళే కాదు బిగ్ బాస్ అభిమానులకి కూడా మైండ్ బ్లాక్ అయింది. ఎందుకంటే శోభాశెట్టి ఎలిమినేషన్ అవ్వాలని.. హౌస్ లోని మిగతా కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ మొత్తం లీస్ట్ లో ఉన్న ఆట సందీప్, అశ్వినికి ఓట్లు చేశారు. దాంతో అనఫీషియల్ ఓటింగ్ లో శోభాశెట్టి లీస్ట్ లో ఉంది. ఆట సందీప్ కొన్ని ఓట్ల తేడాతో పైన ఉన్నాడు. అయితే శోభాశెట్టి స్టార్ మా బ్యాచ్ కాబట్టి ఎలిమినేషన్ అవ్వకుండా ఆపారని బయట టాక్ నడుస్తుంది. హోస్ట్ నాగార్జున కూడా దీనిపై క్లూ ఇచ్చేశాడు. " ఏడు వారాల నుండి నామినేషన్లో లేవు కదా? మొదడి వారం నుండి నామినేషన్లో ఉంటే బయట ఫాలోయింగ్ ఏర్పడేది" అంటు నాగార్జున అన్నాడు.  అసలు ఈ వారం శోభాశెట్టి ఎలిమినేషన్ అవ్వాలి కానీ ఆడ సందీప్ అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అయ్యాడు. దీనికి కారణం.. శోభాశెట్టి కంటెంట్ ఇస్తుంది. ఆటలో ఎన్ని ఫౌల్స్ ఆడినా, నెగెటివిటి వచ్చిన తను కంటెంట్ ఇస్తుంది. పైగా ఫీమేల్ కంటెస్టెంట్. గత ఏడు వారాలుగా ఫీమేల్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతారని భావించిన బిగ్ బాస్ ఈసారి ఆట సందీప్ ని బయటకు పంపించేసినట్టుగా తెలుస్తుంది. మరి ఆడియన్స్ ఓటింగ్ కి ఇంపార్టెంట్ లేదా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.   

హౌస్ లో డిజర్వింగ్ ఆ నలుగురు.. అంబటి అర్జున్ ఫేక్ అంట!

బిగ్ బాస్ సీజన్-7 లో ఎలిమినేషన్, నామినేషన్ అంటూ ప్రతీ ఎపిసోడ్ హీటెక్కిపోతుంది‌. ఎనిమిదవ వారం ఆట సందీప్ ఎలిమినేట్ అయ్యాడు. ఇక హౌస్ అంత షాక్ లో ఉండిపోయిన విషయం తెలిసిందే. అయితే ఎలిమినేషన్ తర్వాత ఎగ్జిట్ ఇంటర్వ్యూ ఉంటుంది కదా.. మరి ఆ ఎగ్జిట్ ఇంటర్వ్యూ లో గీతు రాయల్ అడిగిన ప్రశ్నలికి ఆట సందీప్ ఆసక్తికరమైన సమాధానాలు చెప్పాడు. సందీప్ మాస్టర్ ఇంత ఫాస్ట్ గా బయటకు వస్తారని అనుకున్నారా అని గీతు రాయల్ అడుగగా.. ఫాస్టా? ఆరవై రోజులు ఉన్నానని ఆట సందీప్ అన్నాడు.  మీ మాస్ పెళ్ళాం మాస్ డ్యాన్స్ తో ఎదురొస్తానని గీతు అనగా.. నా మాస్ పెళ్ళాం మాస్ డ్యాన్స్ చాలాసార్లు చూశానని ఆట సందీప్ అన్నాడు. బిగ్ బాస్ చరిత్రలోనే రెండు రికార్డులు క్రియేట్ చేశారు. ఫస్ట్ ది ఏడు వారాలు నామినేట్ అవ్వకుండా హౌస్ లో ఉన్నారు. రెండవది సంచాలకుడిగా అన్ని తప్పులు చేయడమని గీతు అనగా.. హౌస్ లోని వాళ్ళవి తప్పులు కానప్పుడు నాది ఎందుకు తప్పు అవుతుందని ఆట సందీప్ అన్నాడు. ఇక మీకన్నా హౌస్ లో ఎవరైన అన్ డిజర్వింగ్ వాళ్ళు ఉన్నారని మీరు అనుకుంటున్నారా? అని గీతు అడుగగా.. నేను హీరో అని అనుకుంటాడు కానీ అతము హీరో కాదు జీరో అంటు అక్కడ ఉన్న బెలూన్ ని పగులగొట్టాడు ఆట సందీప్. రతిక.. ఈజ్ బ్లాక్. అంబటి అర్జున్.. బుద్ధి బలం, కండ బలం అన్నీ నాకే ఉన్నాయని అనుకుంటాడు కానీ అంత సీన్ లేదక్కడ, అదంతా ఫేక్. శివన్న.. ప్రశాంత్ , యావర్ ని కెప్టెన్ ని చేశాననే అపోహలో ఉంటాడు. ఇక హౌస్ మొత్తంలో‌‌.. అమర్ దీప్,  శోభాశెట్టి, ప్రియాంక, పల్లవి ప్రశాంత్ డిజర్వింగ్ అని చెప్పాడు ఆట సందీప్. ఇఒ హౌస్ మొత్తంలో పాజిటివిటి ఎక్కువ ఉంది ప్రియాంకకే అని ఆట సందీప్ అన్నాడు.  

ఆట సందీప్ ‘ఆట’ ముగిసింది.. ఎందుకో తెలుసా?

బిగ్ బాస్ సీజన్-7 ఎన్నడు లేని విధంగా ఉత్కంఠభరితంగా సాగుతుంది. ప్రతీ వారం సస్పెన్స్ ట్విస్ట్ లతో ఒక థ్రిల్లర్ సినిమాని చూపిస్తున్నాడు బిగ్ బాస్. నిన్న మొన్నటి వరకు డబుల్ ఎలిమినేషన్ అని అనగా.. ఇప్పుడు సింగిల్ ఎలిమినేషన్ చేశాడు. ఆదివారం నాటి ఎపిసోడ్‌లో మొదటగా కంటెస్టెంట్స్ ఆట, పాటలతో ఎంటర్టైన్మెంట్ చేపించాడు నాగార్జున. మధ్యల మధ్యలో నామినేషన్లో ఉన్న ఒక్కొక్కరిని నాగార్జున సేవ్ చేసుకుంటు వచ్చాడు. నామినేషన్లో చివరగా భోలే షావలి, శోభాశెట్టి, ఆట సందీప్ ముగ్గురు ఉండగా.. భోలే షావలి సేవ్ అయ్యాడు. ఇక ఆట సందీప్, శోభాశెట్టి నామినేషన్లో ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళిద్దరిని యాక్టివిటి ఏరియాకి వెళ్లమని, కంటెస్టెంట్స్ ని హాల్ లోకి వెళ్ళమని నాగార్జున చెప్పాడు. ఇక యాక్టివిటి ఏరియాలోకి వెళ్ళిన శోభాశెట్టి, ఆట సందీప్ లకి బ్లడ్ తీసే పైప్ ఉంచి వారి ' హార్ట్ బీట్' స్క్రీన్ మీద కనపడుతుందని చెప్పాడు. ఇక  కౌంట్ డౌన్ ముగిసే సమయానికి ఆట సందీప్ హార్ట్ బీట్ ఆగింది. శోభాశెట్టి హార్ట్ బీట్ రన్ అవుతుంది. దాంతో శోభాశెట్టి సేఫ్, ఆట సందీప్ ఎలిమినేటెడ్ అని నాగార్జున అన్నాడు. ఇక హౌస్ అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక హౌస్ లోని వాళ్ళకి ఒక్కొక్కరికి బై చెప్పేసి బయటకు వచ్చాడు.

వాడి వల్ల చాలా మోసపోయాను.. నాన్న లేకపోతే ఇంతే!

రీతూ చౌదరి.. ప్రస్తుతం మంచి క్రేజ్‌ ఉన్న నటి. రీతూ తన కెరీర్‌ని ఒక మ్యూజిక్‌ ఛానెల్‌లో యాంకర్‌గా మొదలు పెట్టింది. అంతేకాకుండా యాంకర్‌ ప్రదీప్‌ హోస్ట్‌గా చేసిన పెళ్లి చూపులు షోకి వచ్చి మంచి ఫేమ్‌ని సంపాదించుకుంది. ప్రస్తుతం రీతూ జబర్దస్త్‌లో చేస్తోంది. అంతేకాకుండా ‘ఇంటిగుట్టు’ సీరియల్‌లో నెగెటివ్‌ రోల్‌లో యాక్టింగ్‌ చేసి అందరినీ మెప్పించింది. అప్పట్లో యాంకర్‌ విష్ణుప్రియ, రీతూ కలిసి బ్యాంకాక్‌ బీచ్‌లో సందడి చేసిన ఫోటోస్‌ వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. రీతూ చౌదరి వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత తనకి విపరీతమైన సింపతీ లభించింది. ఆ తర్వాత పలు అవకాశాలు కూడా వచ్చాయి. అయితే ఒకవైపు ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’లో, మరొక వైపు జబర్దస్త్‌ షోలో నటిస్తూ బిజీగా ఉంటోంది రీతూ. అయితే తను సొంతంగా ఒక యూట్యూబ్‌ ఛానెల్‌ని కూడా స్టార్ట్‌ చేసింది. ఫోటో షూట్‌లతో ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండిరగ్‌లో ఉంటూ, ఎప్పుడూ తన అభిమానులకు దగ్గరగా ఉంటోంది. రీతు చౌదరిని ఒకడు మోసం చేశాడంటూ తన యూట్యూబ్‌ ఛానెల్‌లో ఒక వీడియోని అప్‌లోడ్‌ చేసింది. రీతూ వాళ్ళ నాన్న చనిపోయాక ఒక ఇల్లు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ ఇంటికి మంచి డిజైన్‌ కోసం ఒక డిజైనర్‌ ని ఆశ్రయిస్తే వాడు అడ్వాన్స్‌ తీసుకొని పని సరిగ్గా చేయలేదంట. పని రాకపోతే రాదని చెప్పాలి ఇలా వచ్చీ రాని పనితో, సగం సగం డిజైన్స్‌ వేసి ఇల్లంతా పాడు చేస్తారా అంటూ రీతూ చెప్పింది. ఇక మాకొద్దని వాడికి ఫోన్‌ చేసినా, మెసెజ్‌ లు చేసిన స్పందించలేదంట.. దాంతో పోలీసులని ఆశ్రయించింది రీతు. ఆ తర్వాత ఆ డబ్బులని తిరిగిఇచ్చాడని అంది. మా నాన్న చనిపోయాక  ఈ ఇంటికి వచ్చాను. ఎవరికైనా నాన్న లేకపోతే చాలా కష్టంగా ఉంటుంది. నాన్న ఉండి ఉంటే ఇలా మోసం చేసేవారు కాదని రీతూ ఈ వ్లాగ్‌లో చెప్పుకొచ్చింది. కాగా, ఇప్పుడు ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.

ఎన్నో రహస్యాలు దాగి ఉన్న గుర్రంకొండ.. వైరల్‌గా మారిన సద్దాం వ్లాగ్‌!

సద్దాం.. పటాస్‌ షో ద్వారా ఫేమస్‌ అయ్యాడు. తనదైన పంచులతో ఆ షో జడ్జ్‌లని కడపుబ్బా నవ్వించే సద్దాం.. శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చి ఎన్నో స్కిట్లు చేశాడు. ఇతని స్కిట్ల కోసమే సగం మంది శ్రీదేవి డ్రామా కంపెనీ చూస్తారనేది వాస్తవం. ఎందుకంటే సెటైరిల్‌ డైలాగ్స్‌తో, అతని తోటి టీమ్‌ సభ్యులపై పంచ్‌లు వేస్తూ నవ్విస్తుంటాడు. అయితే కొన్ని నెలల క్రితం జబర్దస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు సద్దాం. సద్దాం, యాదమరాజు కలిసి ఒకేసారి జబర్దస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే జబర్దస్త్‌ షోలో రాఘవ, బుల్లెట్‌ భాస్కర్‌ స్కిట్స్‌  తర్వాత మళ్లీ అంతటి ఫ్యాన్‌ బేస్‌ వచ్చింది సద్దాం స్కిట్స్‌కే అని అనడంలో ఆశ్చర్యం లేదు. తాజాగా సద్దాం, యాదమరాజు కలిసి జబర్దస్త్‌ లో ‘ఓసేయ్‌ రాములమ్మ’ స్పూఫ్‌ చేసారు. ఇప్పుడు ఈ స్కిట్‌ ఫుల్‌ ట్రెండిరగ్‌లో ఉంది. అయితే సద్దాం రెండు సంవత్సరాల క్రితం సొంతంగా ఒక యూట్యూబ్‌ ఛానెల్‌ని స్టార్ట్‌ చేశాడు. ఇందులో తన పర్సనల్‌ విషయాలని, టూర్స్‌, లొకేషన్స్‌, స్కిట్స్‌ అంటూ కొన్ని వ్లాగ్‌లని పోస్ట్‌ చేస్తున్నాడు. కాగా ఈ వ్లాగ్‌లకి ఇప్పుడు ఫుల్‌ క్రేజ్‌ వస్తుంది. సద్దాం తాజాగా తన యూట్యూబ్‌ ఛానెల్‌ లో ‘ఎన్నో రహస్యాలు దాగి ఉన్న గుర్రంకొండ’ అనే వ్లాగ్‌ని అప్‌లోడ్‌ చేశాడు. ఇందులో తన జబర్దస్త్‌ టీమ్‌ మేట్స్‌ అండ్‌ ఫ్రెండ్స్‌తో కలిసి ఈ ప్లేస్‌కి వెళ్ళాడు సద్దాం. ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ సరిహద్దులోని అన్నమయ్య జిల్లాలో ఈ గుర్రంకొండ ఉందని, దీనిని ఒకప్పుడు జాఫ్రాబాద్‌ అని పిలిచేవారని సద్దాం చెప్పాడు. అలాగే దానికి దగ్గరలోని ‘రంగిని మహల్‌’ని  చూపించిన సద్దాం.. దీనిని టిప్పు సుల్తాన్‌ కొంత కాలం ఏలారని చెప్పాడు. యుద్దంలో పాల్గొనే గుర్రాలని ఈ కొండచుట్టూ ఉంచేవారట. దానితో పాటు ఆకాశం నుండి చూస్తే ఈ కొండ.. గుర్రం ఆకారంలో ఉంటుందట. అందుకే దీనిని గుర్రంకొండ అంటారని సద్దాం చెప్పాడు. తన ఫ్రెండ్‌ సందీప్‌ ఇంకా ముగ్గరు స్నేహితులతో సద్దాం ఈ గుర్రంకొండకి వెళ్ళాడు. చాలా ఏళ్ళ నాటి చరిత్ర కలిగిన ఈ గుర్రంకొండని చూపిస్తూ వ్లాగ్‌లో వివరించాడు సద్దాం. కాగా ఇప్పుడు ఈ వీడియోకి విశేష స్పందన లభిస్తోంది.

ట్రెండిగ్‌లో బిగ్‌బాస్‌ భోలే షావలి అమ్మ పాట!

అమ్మ గురించి కవులు, పండితులు, విశ్లేషకులు ఇలా ఎంతోమంది ఎన్నో రకాలుగా వివరించారు. అయితే సిరివెన్నెల సాహిత్యంలో అమ్మకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా అంటూ అమ్మ లాలన గురించి సిరివెన్నెల గొప్పగా రాశాడు.  ఇప్పుడు అదే కోవలోకి బిగ్‌బాస్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన భోలే షావలి చేరాడు. మొన్న శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో హౌస్‌లోని గార్డెన్‌ ఏరియాలో కూర్చొని అమ్మ మీద ఒక పాట పాడాడు. ఇప్పుడు ఆ పాట సోషల్‌ మీడియాలో ట్రెండిరగ్‌లో ఉంది. ‘‘అమ్మ నాన్న విలువ తెలుసుకో వారి, నువ్వు పైనుండి ఊడిపడ్డావా జారి’’ అంటూ తనే సొంతంగా లిరిక్స్‌ అనుకొని లైవ్‌లో పాడాడు భోలే షావలి. కాగా ఈ పాటలోని లిరిక్స్‌కి నాగార్జునతో పాటు బిగ్‌ బాస్‌ వీక్షించే ప్రేక్షకులు ఫిధా అయ్యారు. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ ఎక్కడ చూసినా భోలే షావలి అమ్మ పాటే వినిపిస్తుంది. ట్విట్టర్‌లో ట్రెండిరగ్‌లో ఉంది. కాగా ఈ ట్రెండిరగ్‌ ట్వీట్స్‌లో భోలే షావలి పాడిన పాట కూడా ఉండంట విశేషం. బిగ్‌ బాస్‌కి వెళ్ళేకంటే ముందు చాలా పాటలకు మ్యూజిక్‌ డైరెక్టర్‌గా చేశాడు. తెలంగాణ ఉద్యమ కాలంలో అతను పాడిన పాటలు ఎంతో ఫేమస్‌. కిక్‌2 సినిమాలోని ‘కంఫర్ట్‌’ పాట పాడిరది భోలే షావలి అని ఎంతమందికి తెలుసు. ఇక ఈ మధ్య మ్యూజికల్‌ హిట్‌గా నిలిచిన ‘పాలు అమ్మిన’ పాట భోలే షావలీయే పాడిరది. వీటితో పాటు పలు సినిమాల్లో కూడా పాడిన భోలే షావలి.. తెలంగాణ ఫోక్‌ సాంగ్స్‌కి మ్యూజిక్‌ ఇచ్చాడు. అవన్నీ యూట్యూబ్‌లో ఎప్పుడూ ట్రెండిరగ్‌లో ఉండే పాటలే. కాగా అతడికి అభిమానులు చాలానే ఉన్నారు. అయితే ప్రియాంక, శోభా శెట్టి కలిసి నామినేషన్‌లో అతనిపై మాటల యుద్ధం జరిపిన సంగతి తెలిసిందే. ఒక తోటి కంటెస్టెంట్‌ అని కూడా చూడకుండా ‘థూ’ అంటూ భోలేని  ప్రియాంక అంది. కానీ హౌస్‌ మొత్తానికి ఇప్పుడు పాటలతో, మ్యూజిక్‌తో ఆకట్టుకుంటున్నాడు భోలే షావలి. ఇలా సందర్భానుసారంగా అప్పటికప్పుడు లిరిక్స్‌ అనుకొని పాట పాడుతూ మ్యూజిక్‌ ఇస్తూ.. రోజు రోజుకి ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంటున్నాడు భోలే షావలి.

డాక్టర్‌ని నిలదీసిన అత్త.. తప్పుని కోడలి మీదకి తోసేసిందిగా!

స్టార్‌ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్‌ ‘బ్రహ్మముడి’. ఈ సీరియల్‌ శనివారం నాటి ఎపిసోడ్‌ -239 లో.. స్వప్న తాగిన జ్యూస్‌లో ట్యాబ్లెట్‌ కలిపి రాహుల్‌ ఇస్తాడు. ఆ తర్వాత ఆ జ్యూస్‌ తాగిన స్వప్న హాయిగా పడుకొని ఉంటుంది.  ఏంటి ఏం రియాక్షన్‌ లేదని రాహుల్‌ స్వప్నని లేపి ఏమైనా అనిపిస్తుందా అని అడిగేసరికి స్వప్న చిరాకు పడుతుంది. మరొకవైపు స్వప్న నుండి ఎలాంటి రియాక్షన్‌ లేదని వాళ్ళ రూమ్‌ డోర్‌ దగ్గర రుద్రాణి నిల్చొని వింటు ఉంటుంది. అప్పుడే కనకం వచ్చి రుద్రాణి అలా వినడం చూసి ఇదేం పాడుబుద్ది అంటూ కోప్పడుతుంది. అదేం లేదు నైట్‌ వాళ్ళు గొడవ పెట్టుకున్నట్లు అనిపించింది. అందుకే మళ్ళీ గొడవ పడుతున్నారా అని  వింటున్నానని రుద్రాణి కవర్‌ చేసిన కనకం నమ్మదు. ఆ తర్వాత రుద్రాణిని కనకం లాక్కొని వెళ్తుంది. మరుసటి రోజు ఉదయం కావ్య తల స్నానం చేసి వస్తుంది. ఆ తర్వాత పడుకొని ఉన్న రాజ్‌ దగ్గరికి వచ్చి సెల్ఫీ తీసుకుంటుంది. అప్పుడే రాజ్‌ లేవడం చూసి త్వరగా దూరంగా వెళ్లి తల తూడ్చుకుంటుంది. రాజ్‌ లో తన అంతరామ్మ కావ్యని పట్టుకొబోతుంటే రాజ్‌ అపబోయే కావ్యని వెనకాల నుండి  హగ్‌ చేసుకుంటాడు. అప్పుడే ధాన్యలక్ష్మి వస్తుంది. దాన్యలక్ష్మిని చూసిన రాజ్‌ ఇబ్బందిగా ఫీల్‌ అవుతాడు. మరొక వైపు స్వప్న, రాహుల్‌ ఇంకా బయటకు రావడం లేదని రుద్రాణి అనుకుంటుంది. అప్పుడే రాహుల్‌ బయటకు వచ్చి మన ప్లాన్‌ ఫెయిల్‌ అయింది. స్వప్న జ్యూస్‌ తాగి నిద్ర పోయిందని రాహుల్‌ అనగానే.. అసలు ఆ డాక్టర్‌ ఏం టాబ్లెట్‌ ఇచ్చిందో అడగాలని రుద్రాణి అనుకుంటుంది. మరొక వైపు కావ్య కాఫీ తీసుకొని వచ్చి.. రాజ్‌కి ఒక డ్రెస్‌ ఇస్తుంది. ఫంక్షన్‌లో మనమిద్దరిది మ్యాచింగ్‌ ఉండాలని రాజ్‌కి చెప్తుంది కావ్య. మరొక వైపు డాక్టర్‌కి రుద్రాణి ఫోన్‌ చేసి.. నువ్వు ఇచ్చిన ట్యాబ్లెట్‌ పనిచెయ్యడం లేదని  అడుగుతుంది.. మీరు వేరే ట్యాబ్లెట్స్‌ అయిన తీసుకొని వెళ్ళాలి లేదంటే మీరు చెప్పిన అమ్మాయి ప్రెగ్నెంట్‌ కాదైనా అయి ఉండాలని రుద్రాణితో డాక్టర్‌ చెప్తుంది. దీంతో రుద్రాణికి డౌట్‌ వస్తుంది. స్వప్న ప్రెగ్నెంట్‌ అవునో కాదో తెలుసుకోవాలని రుద్రాణి అనుకుంటుంది.. మరొక వైపు కృష్ణ మూర్తి, కనకం స్వప్న శ్రీమంతానికి వస్తారు. ఆ తర్వాత రాజ్‌కి అపర్ణ డ్రెస్‌ ఇచ్చి ఇది వేసుకోమని చెప్తుంది. ఆ తర్వాత రుద్రాణికి అపర్ణ ఒక పని అప్పజెప్పుతే తను మర్చిపోయి కావ్య మీద నెట్టివేస్తుంది. నాకు మీరేం పని చెప్పలేదని రుద్రాణితో కావ్య అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్‌ వరకు ఆగాల్సిందే.

కొడుకు కోడలి శోభనానికి ఏర్పాట్లు చేశాడు.. వారసురాలు కావాలంట!

స్టార్‌ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్‌ ‘గుప్పెడంత మనసు’. ఈ సీరియల్‌ శనివారం నాటి ఎపిసోడ్‌ -906 లో.. అనుపమ అనేసిన మాటలని గుర్తుకుచేసుకుంటాడు మహేంద్ర. అప్పుడే మహేంద్ర దగ్గరికి వసుధార వస్తుంది. డిన్నర్‌ చేశారా అని వసుధారని మహేంద్ర అడుగుతాడు. చేసాం కానీ మేరే చెయ్యలేదని వసుధార అనగానే.. నాకు ఫ్రెండ్‌ కలిస్తే తనతో కలిసి రెస్టారెంట్‌ కీ వెళ్లి డిన్నర్‌ చేశానని మహేంద్ర చెప్తాడు. అలా తను చెప్పగానే ఎవరు ఆ ఫ్రెండ్‌ అని వసుధార అడుగుతుంది. టైమ్‌ వచ్చినప్పుడు చెప్తానని మహేంద్ర అంటాడు. అప్పుడే వసుధారకి ఫోన్‌ రావడంతో బయటకు వచ్చేస్తుంది.  ఆ తర్వాత వసుధారకి ఫోన్‌ చేసింది ఎవరో కాదో శైలేంద్ర.. అరకులో నేచర్‌ ని ఎంజాయ్‌ చేస్తున్నారా అని శైలేంద్ర అంటాడు. నాకెలా తెలుసు అనుకుంటున్నావా నువ్వే చెప్పావని శైలేంద్ర అంటాడు. అవును నేనే చెప్పాను. నాకు తెలుసు ధరణి మేడమ్‌ ఫోన్‌ నుండి మెసేజ్‌ చేసింది మేరేనని అని, మేం అరకులో ఉన్నామని ధరణి మేడమ్‌ కి ముందే తెలుసు. అయిన మళ్ళీ మెసేజ్‌ లో ఎక్కడ ఉన్నారని ఎలా అడుగుతుందని శైలేంద్రకి దిమ్మతిరిగే షాక్‌ ఇస్తుంది వసుధార. ఆ తర్వాత శైలేంద్రకి వసుధార కౌంటర్‌ వేస్తు.. తన స్టైల్‌ లో మాస్‌ వార్నింగ్‌ కూడా ఇస్తుంది. మరొకవైపు శైలేంద్రకి ధరణి కాఫీ తీసుకొని వస్తుంది. నీకు వసుధార వాళ్ళు అరకు లో ఉన్నారని ముందే తెలుసా అని ధరణిని అడుగుతాడు శైలేంద్ర. తెలుసని ధరణి అని చెప్పగానే.. తెలిసి నన్ను వెర్రి వాన్ని చేసారా అని అంటాడు. నిజమైన నటులు అంటే మీరే అని ధరణితో శైలేంద్ర అంటాడు. మరొక వైపు రిషి తనపై జరిగిన ఎటాక్‌ గురించి ఆలోచిస్తుంటాడు. అదే సమయంలో దేవయాని, శైలేంద్ర ఇద్దరు కలిసి ఫణింద్ర తో మాట్లాడుతారు. మహేంద్ర నిన్ను పట్టించుకోవడం లేదు. ఎందుకంటే వెళ్లి ఇన్ని రోజులు అవుతుంది. ఒక్కసారి కూడా ఫోన్‌ చేసి మాట్లాడడం లేదని దేవయాని అనగానే.. అలా అని ఎవరన్నారు. మహేంద్ర, రిషి డైలీ ఫోన్‌ చేసి మాట్లాడుతున్నారని ఫణింద్ర అనగానే.. దేవయాని శైలేంద్ర లు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. అప్పుడే ఫణింద్రకు రిషి ఫోన్‌ చేస్తాడు.  చూసారా రిషి ఫోన్‌ చేసాడంటూ ఫణింద్ర పక్కకి వెళ్తాడు. ఏంటి రిషి మనల్ని పక్కన పెట్టాడా అని దేవయాని అంటుంది. ఇప్పుడు వాళ్ళ గురించి ప్లాన్‌ లు ఏం వెయ్యాకు మన మీద డౌట్స్‌ వస్తుందని దేవాయని చెప్తుంది. మరొక వైపు రిషి, వసుధారలని మహేంద్ర ఎంజాయ్‌ చెయ్యడానికి బయటకు పంపిస్తాడు. ఆ తర్వాత రిషి వసుధారలు బయటకు వెళ్తారు. వాళ్ళు వెళ్ళాక మహేంద్ర వాళ్ల ఫస్ట్‌ నైట్‌ కి ఏర్పాట్లు చేస్తాడు. నాకు ఒకటే ఆశ.. నా జగతి మళ్ళీ  రిషి వసుధారల బిడ్డగా పుట్టాలని మహేంద్ర అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్‌ వరకు ఆగాల్సిందే. 

కూతురి కోసం జైలుకి వెళ్ళిన ప్రభాకర్‌!

స్టార్‌ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్‌ ‘కృష్ణ ముకుంద మురారి’. ఈ సీరియల్‌ శనివారం నాటి ఎపిసోడ్‌ -300 లో.. భవాని పిలవగానే పోలీసులు వచ్చి కృష్ణని అరెస్ట్‌ చేసి తీసుకువెళ్ళాలని అనుకుంటారు. అప్పుడే ప్రభాకర్‌ వచ్చి ఆగండి అని చెప్తాడు. ఇప్పటివరకు భవాని అక్క చెప్పింది నిజమే అని చెప్పగానే.. అందరూ షాక్‌ అవుతారు.. అవును ఇదంతా చేసింది నేనే అంటాడు. ఆ తర్వాత నా కూతురు నీ ఇంట్లో నుండి పంపించేసారన్న కోపంతో నేనే ఈ పని చేసాను. కానీ, ఇదంతా నా కూతురికి గాని, నా భార్యకి గాని తెలియదని పోలీసులకి ప్రభాకర్‌ చెప్తాడు. కృష్ణ మాత్రం చిన్నాన్న అలా ఎందుకు మాట్లాడుతున్నావని అడుగుతుంది. నా కూతురు ఆ ఇంటి కోడలు. తనని ఇంట్లో నుండి గెంటేసారని పోలీసులతో ప్రభాకర్‌ చెప్తాడు.. లేదు భవానిగారి కుటుంబం గురించి నాకు తెలుసు. వాళ్ళు అలా చెయ్యరని భవానిని ఆ ఇన్‌స్పెక్టర్‌ అడుగుతాడు. అది అబద్ధమని భవాని చెప్తుంది. నా కూతురు మాత్రం ఆ ఇంట్లో నే ఉండాలని పోలీసులకి ప్రభాకర్‌ చెప్తాడు.. దానికి పోలీసులు సరేనంటారు. ఆ తర్వాత పోలీసులు ప్రభాకర్‌ని అరెస్ట్‌ చేసి తీసుకొని వెళ్తుంటే.. కృష్ణ వెళ్లి ఎందుకు ఇదంతా చేస్తున్నావ్‌ చిన్నాన్న అని అడుగుతుంది.  నీకు అల్లుడు అంటే ఇష్టం. నువ్వు ఇప్పుడు అక్కడే ఉండాలి. నువ్వు అక్కడ ఉండాలంటే నేను లోపల ఉండాలని ప్రభాకర్‌ చెప్పి వెళ్ళిపోతాడు. మరొకవైపు  ముకుంద తన అన్నయ్యని కలవడానికి స్టేషన్‌కి వెళ్తుంది. హాస్పిటల్‌లో జరిగింది మొత్తం అతనికి చెప్తుంది. నువ్వేం టెన్షన్‌ పడకని ముకుందకి తన అన్నయ్య చెప్పి పంపిస్తాడు.  మరొకవైపు హాస్పిటల్‌ నుండి మురారిని తీసుకొని ఇంటికి వస్తారు. మురారికి ముకుంద హారతి ఇస్తుంది. మరొక వైపు కృష్ణ శకుంతలని తన ఇంటికి పంపించి.. కృష్ణ మురారి దగ్గరికి వస్తుంది. మరొక వైపు మురారికి భవాని ఇంట్లో అందరిని పరిచయం చేస్తుంది. ఆ తర్వాత డాక్టర్‌ వచ్చి మురారిని చెక్‌ చేస్తుంది. ఇతనికి గతం గుర్తుకు చేసే ప్రయత్నం చేస్తే ఇతని ప్రాణానికే ప్రమాదమని డాక్టర్‌ చెప్పగానే అందరూ షాక్‌ అవుతారు. మరొక వైపు భవాని ఇంటికి కృష్ణ వస్తుంది. తనని చూసిన ఇంట్లో వాళ్ళు షాక్‌ అవుతారు. ఆ తర్వాత  ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్‌ వరకు ఆగాల్సిందే. 

అమర్‌ దీప్‌... పల్లవి ప్రశాంత్‌ అంటే ఎందుకంత చిన్నచూపు? 

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌-7లో ఊహించని మలుపులతో అలరిస్తుంది. కొత్త కథేం కాదు.. గత ఏడు వారాల నుండి సాగుతున్న కథే ఇది.. వరుసగా ఏడుగురు అమ్మాయిలు బిగ్‌బాస్‌ హౌస్‌ నుండి ఎలిమినేటెడ్‌ అవ్వడమనేది ఈ సీజన్‌-7లోనే ఉంది. అయితే ఇలాంటి వాటి మధ్య ఈ వారం పెద్ద ట్విస్ట్‌ ఇస్తున్నాడా బిగ్‌ బాస్‌ అనేది తెలియాల్సి ఉంది.  అయితే శనివారం ఎపిసోడ్‌లో నాగార్జున వచ్చీ రాగానే గౌతమ్‌ కెప్టెన్‌గా గెలిచినందుకు కంగ్రాట్స్‌ చెప్పాడు. ఆ తర్వాత అందరూ చప్పట్లతో తమ అభినందనలు తెలిపారు. ఇక ఆ తర్వాత ఒక్కో కంటెస్టెంట్‌ని లేపి వాళ్ళ ఆటతీరు, మాటతీరు చూపిస్తూ వాత పెట్టాడు నాగార్జున. హౌస్‌లో ఏం చేద్దామనుకుంటున్నారు అంటూ రతికకి వార్నింగ్‌ ఇచ్చాడు నాగార్జున. హౌస్‌లోకి గతాన్ని తవ్వుకోవడానికి, కబుర్లు చెప్పుకోవడానికి వచ్చావా? నామినేషన్‌లో లేవనే ధీమానా లేక భయం లేదా అని నాగార్జున అడిగేసరికి.. అదేం లేదు సర్‌. ఇకనుండి చూడండి, నా ఆటేంటో చూపిస్తానంటూ రతిక ప్రామిస్‌ చేసింది. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్‌ అంటే నీకెందుకు అంత చిన్నచూపు అమర్‌ దీప్‌ అని మొదలుపెట్టాడు నాగార్జున. అమర్‌ దీప్‌ దానికి మెలి తిరుగుతూ.. తనలోని స్వాతిముత్యం కమల్‌ హసన్‌ని బయట పెట్టాడు. నాకేం తెలియదు సర్‌. ఆ హీట్‌ మూమెంట్‌లో అలా మాట్లాడేశానని అమర్‌ అన్నాడు. హౌస్‌లో ఎవరైనా బూతు మాట్లాడితే నువ్వు ఊరుకోవు కదా ప్రియాంక.. ఆరోజు శోభా-భోలేల మధ్యకెళ్ళి మరీ బూతు మాట్లాడాడని అన్నావ్‌. మరి పల్లవి ప్రశాంత్‌ని ‘ఏరా నా కొడకా’ అని అమర్‌ దీప్‌ అంటే నీ రక్తం మరగలేదా అని ప్రశ్నించాడు. ఇక ప్రియాంక తనదైన పెర్‌ఫార్మెన్స్‌తో చక్కగా కవర్‌ చేసుకుంది. 

అలా చేస్తే తనతో చెప్పమని శివాజీని రిక్వెస్ట్‌ చేసిన నాగార్జున!

బిగ్‌ బాస్‌ సీజన్‌-7 భారీ స్థాయిలో క్రేజ్‌ని పొందుతోంది. దీనికి కారణం కంటెస్టెంట్స్‌ ఇచ్చే కంటెంట్‌. అయితే హౌస్‌లో ఇప్పటికి ఏడు వారాలు పూర్తయ్యాయి. మరి ఎనిమిదో వారం నామినేషన్‌లో ఉన్నవాళ్ళలో ఎవరు వెళ్తారనే ఆసక్తి ఉండగా శనివారం నాటి ఎపిసోడ్‌లో నాగార్జున వచ్చి ఒక్కొక్క కంటెస్టెంట్‌కి గట్టిగానే వార్నింగ్‌ ఇచ్చాడు. హౌస్‌లో నామినేషన్లు అంటే ఎందుకంత ఫుల్‌ స్వింగ్‌ అవుతున్నారంటూ నాగార్జున ఏకి పారేశాడు. ఇక బెడ్‌ రూమ్‌లో యావర్‌, రతికలు ఉన్నప్పుడు శివాజీ వారితో మాట్లాడిన మాటలని నాగార్జున బిగ్‌ స్క్రీన్‌ మీద వేసి చూపించాడు. ఎవరో ఒకరిని కొట్టి వెళ్తానని అన్నావ్‌. ఎవరు శివాజీ అని నాగార్జున అడిగాడు. ‘అదేం లేదు బాబు గారు.. నా వల్ల కావట్లేదండి. నామినేషన్‌లో ఒక్కొక్కరు హీరోలుగా ఫీల్‌ అయిపోయి ఒకరి మీద ఒకరు బూతులు మాట్లాడుకోవడం, ఆ తర్వాత ఓదార్పు యాత్రలు.. ఇవన్నీ నావల్ల కావట్లేదు సర్‌. పోనీ చెప్దామంటే మళ్లీ నా మీద ఏం ప్లాన్‌ చేస్తారో’ అని శివాజీ అన్నాడు. మాకు నీ  మీద నమ్మకం ఉంది శివాజీ.. తప్పు జరిగితే చెప్పు. మీరు చెప్తేనే కదా తెలిసేదని నాగార్జున అనగా.. ‘చెప్తానండి. ఈ ఒక్క వారం చూసి ఏదో ఒకటి చేస్తానండి’ అని శివాజీ అన్నాడు. నామినేషన్‌లో ఇలా హైపర్‌ అవ్వకూడదు. వ్యాలిడ్‌ రీజన్‌ మాట్లాడాలని, వీకెండ్‌లో బాబుగారు వచ్చినప్పుడు నార్మల్‌గా ఉండాలని ప్రశాంత్‌కి చెప్పాను. యావర్‌తో కూడా ఇదే చెప్పానని శివాజీ అనగా.. వాళ్ళిద్దరికే చెప్తావా అని నాగార్జున అడిగాడు. లేదండి..ఆట సందీప్‌ డల్‌ అయిపోయాడు. పిలిచి మాట్లాడాను. వాడు హౌస్‌ నుండి వెళ్ళిపోతానంటే గంట సేపు మాట్లాడానని శివాజీ అన్నాడు. ప్రతీసారీ వెళ్ళిపోతా అని అనొద్దు, బయట మనం చూస్తుంటాం కదా అని నాగార్జున అనగా.. బయట అయితే కొట్టేసేవాడిని ఇది హౌస్‌ కాబట్టి ఇక్కడ రూల్స్‌కి తగ్గట్టు ఉండాలి కాబట్టి ఇలా ఉన్నాను సర్‌ . ఇంకొక వారంలో వాళ్ళు మారకపోతే చెప్తాను సర్‌ అని శివాజీ అన్నాడు. ఏదైనా ఉంటే నాకు చెప్పు కానీ వెళ్ళిపోతానని మాత్రం అనకు అని శివాజీని నాగార్జున రిక్వెస్ట్‌ చేశాడు.

బొంగు బూతు కాదా సందీప్‌.. ఏకి పారేసిన నాగార్జున!

బిగ్‌బాస్‌ హౌస్‌లో నాగార్జున హోస్టింగ్‌ ఈ సీజన్‌లో అదిరిపోయింది. ఒక్కొక్కరి తప్పొప్పులు చూపిస్తూ నాగార్జున ఏకి పారేశాడు. ఆట సందీప్‌, శోభాశెట్టి, అమర్‌ దీప్‌ , ప్రియాంక జైన్‌లకి గట్టిగా క్లాస్‌ పీకాడు. సింక్‌ అండ్‌ ఫ్లోట్‌ టాస్క్‌లో ప్రియాంక జైన్‌, శోభాశెట్టిలకి అమర్‌ దీప్‌ ఇచ్చిన క్లూలని వాళ్ళు హింట్‌ ఇచ్చింది బిగ్‌ స్క్రీన్‌ మీద వేసి చూపించాడు నాగార్జున. ఇక అంబటి అర్జున్‌ని నువ్వు కెప్టెన్‌ కదా, నువ్వే చూసుకోవాలి కదా అని నాగార్జున అనగా.. ఎవరో హింట్‌ ఇచ్చినట్టు అనిపించింది సర్‌ అదే క్లారిటీ లేదు క్లారిఫై చేసుకోమని సంచాలకుడిగా ఉన్న గౌతమ్‌తో చెప్పానని అర్జున్‌ అన్నాడు. ఇక ఆట సందీప్‌ని లేపి.. ఇప్పుడు మనం బొంగులో డ్యాన్స్‌ మాస్టర్‌ గురించి మాట్లాడదామని నాగార్జున అన్నాడు. సందీప్‌ నువ్వు డ్యాన్స్‌ షోలో పాల్గొన్నావ్‌ కదా? నువ్వు డ్యాన్సరా? లేక కొరియోగ్రాఫరా? అని నాగార్జున అడగ్గా.. రెండూ సర్‌ అని సందీప్‌ అన్నాడు. ఈ బొంగులో సమాధానం నాకొద్దని నాగార్జున అన్నాడు.  డ్యాన్స్‌ చేశానని సందీప్‌ అన్నాడు. మరి అతను నిన్ను డ్యాన్సర్‌వి అని అంటే నువ్వు ఎందుకు బొంగు అని అన్నావ్‌. మరెందుకు ఆ బొంగులో అటిట్యూడ్‌..  బొంగు అంటే తప్పు పదం కాదు కదా అందుకే వాడుతున్నాని నాగార్జున అన్నాడు. బొంగు అనేది తప్పు పదమా కాదా అని హౌస్‌లోని వాళ్లని అడిగాడు నాగార్జున. అందరూ తప్పని చెప్పటంతో సారీ సర్‌ నేను ఆ ఉద్దేశంతో చెప్పలేదు.. ఆ హీట్‌ ఆఫ్‌ ది మూమెంట్‌ అలా వచ్చిందని, ఇకనుండి రిపీట్‌ కాకుండా చూసుకుంటానని ఆట సందీప్‌ అన్నాడు. ఇక మిగిలిన కంటెస్టెంట్స్‌కి కూడా గట్టిగానే వార్నింగ్‌ ఇచ్చాడు నాగార్జున.

సీరియల్‌ బ్యాచ్‌ గ్రూపిజాన్ని బయటపెట్టిన నాగార్జున! 

ఇప్పటికీ బిగ్‌ బాస్‌ ఆరు సీజన్లు పూర్తి చేసుకోగా ఏ కంటెస్టెంట్‌ కూడా ఏడు వారాలు నామినేషన్లో లేకుండా లేడు. కానీ ఈ సీజన్‌-7 లో ఆట సందీప్‌ ఇప్పటివరకు నామినేషన్లో లేడు. ఎనిమిదవ వారం నామినేషన్లోకి వచ్చాడు. అయితే నాగార్జున శనివారం ఎపిసోడ్‌ లో సీరియల్‌ బ్యాచ్‌ ఆగడాలని ప్రేక్షకులకి బిగ్‌ స్క్రీన్‌ మీద చూపించాడు. ఇద్దరు లేదా ముగ్గురు కలిసి రేయ్‌ నువ్వు ఇతన్ని నామినేట్‌ చేయు, రేయ్‌ నువ్వు అతడిని నామినేట్‌ చేయు అని ముందే మాట్లాడుకొని నామినేట్‌ చేస్తే అది గ్రూపిజం సర్‌. కానీ మేము ఫ్రెండ్స్‌ అని టేస్టీ తేజ రెండవ వారం నామినేషన్లో చెప్పినది వేసి చూపించిన నాగార్జున.. కొన్ని వారాల తర్వాత అని మరొక వీడియో చూపించాడు. అందులో ఏముందంటే.. రేయ్‌ నువ్వు పెద్దాయని(శివాజీ) ని చూసుకో, మేం మిగిలిన ఇద్దరిని నామినేషన్లో పెడతాంలే అని టేస్టీ తేజ శోభాశెట్టితో అనేది చూపించాడు నాగార్జున. అక్కడ ప్రియాంక జైన్‌ పాములాగా స్టెప్స్‌ వేస్తూ ఎంజాయ్‌ చేస్తుంది కూడా చూపించాడు నాగార్జున. ఇక నాగార్జున ప్రియాంకని లేపి.. అమర్‌ దీప్‌ పగిలిపోద్ది అని బిగ్‌ బాస్‌ ప్రాపర్టీని తంతే నీ బ్లడ్‌ బాయిల్‌ అవ్వలేదా అని అడిగాడు. నేను తర్వాత చెప్పాను సర్‌ అని ప్రియంక అంది. ఆ రోజు బోలే-శోభాల నామినేషన్లో మధ్యలోనే ఆపి చెప్పావ్‌ కదా, మరి అమర్‌ దీప్‌ తప్పు మాట్లాడితే చెప్పలేదు ఎందుకని నాగార్జున నిలదీశాడు.  మొన్నటి సింక్‌ అండ్‌ ఫ్లోట్‌ టాస్క్‌ లో గ్రూప్‌ గా ఆడిరది చూపించిన నాగార్జున.. ఇలా ఆడటం తప్పు అని ప్రియాంక, శోభాశెట్టి, అమర్‌ దీప్‌ లకి నాగార్జున చెప్పాడు. పల్లవి ప్రశాంత్‌ ని ఏరా కొడకా అని అన్నావ్‌ కదా అమర్‌.. మరి ఆట సందీప్‌, అంబటి అర్జున్‌ లని ఎప్పుడైనా అన్నావా? అని నాగార్జున అడుగగా.. లేదు సర్‌ అని అమర్‌ దీప్‌ అన్నాడు.  మరి ఇతడినే ఎందుకు అన్నావ్‌? పల్లవి ప్రశాంత్‌ అంటే చిన్నచూపా అని ఏకిపారేశాడు నాగార్జున. ఇలా సీరియల్‌ బ్యాచ్‌ అందరికి గట్టిగానే వార్నింగ్‌ ఇచ్చాడు నాగార్జున. ఇక హౌస్‌ లో ఎవరు బూతులు మాట్లాడినా సహించేది లేదంటూ కంటెస్టెంట్స్‌ అందరికి నాగార్జున వార్నింగ్‌ ఇచ్చాడు.

కర్రతో శోభాశెట్టికి క్లాస్ పీకిన నాగార్జున... యావర్ ఈజ్ బ్యాక్!

బిగ్ బాస్ సీజన్-7 లో శనివారం నాటి ప్రోమో కోసం కొన్ని లక్షల మంది జనాలు ఎదురుచూస్తుంటారు. ఎందుకంటే వారం మొత్తం హౌస్ మేట్స్ చేసిన తప్పులని నిలదీస్తూ హోస్ట్ నాగార్జున క్లాస్ పీకుతాడు. కంటెస్టెంట్స్ కి నాగార్జున వార్నింగ్.. ఇది చూడటానికి మేమంతా సిద్ధం అన్నట్టుగా ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు. ఇక ఎనిమిదవ వారం హౌస్ లో శోభాశెట్టి  చేసిన పర్ఫామెన్స్ కి నాగార్జున గట్టిగా క్లాస్ పీకాలని అందరు భావించి ప్రతీ ప్రోమో కింద శోభాశెట్టికి నెగెటివ్ గా కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. అయితే శనివారం నాటి ప్రోమో రానే వచ్చింది. నాగార్జున ఒక కర్ర తీసుకొని వచ్చి విరిచేశాడు. శోభాశెట్టిని లేపి.. గతవారం నామినేషన్‌లో భోలే ఎర్రగడ్డ అని అంటే గింజుకున్నావ్. మరి యావర్ ని పిచ్చోడు అని అనడం కరెక్టేనా..నీకు క్షమించే గుణం లేనప్పుడు నువ్వు మాటలు జారకూడదు కదా అని శోభాశెట్టికి వార్నింగ్ ఇచ్చాడు. నాకు యావర్ ఇచ్చిన రీజన్ వ్యాలిడ్ అని అనిపించలేదని శోభాశెట్టి అంది.  మొన్న కెప్టెన్సీ నుండి శోభాశెట్టిని యావర్ తప్పించినప్పుడు జరిగినది చూపించిన నాగార్జున.. " బిగ్ బాస్ హౌస్ లో కొన్ని రూల్స్ ఉన్నాయి. వాటిని ఎవరు అతిక్రమించకూడదు. బిగ్ బాస్ ప్రాపర్టీని నాశనం చేయకూడదనే రూల్ ఉంది కదా. ఆ వీడియో చూసిన నేనే కాదు ఆడియన్స్ కూడా నిన్ను పిచ్చోడని అనుకుంటారు. మళ్ళీ యూ ఆర్ బ్యాక్ టు ది వొరిజెనల్ బిహేవియర్" అని యావర్ తో అన్నాడు నాగార్జున.

జీ కుటుంబం అవార్డ్స్ ఫంక్షన్ లో కన్నీళ్లు పెట్టుకున్న డాక్టర్ బాబు

  కుటుంబాలన్నా, ఫామిలీస్ అన్నా చాలా చిరాకు నాకు..కానీ జీ కుటుంబానికి ఎక్సెప్షన్ ఇస్తున్నా అంటూ ఆర్జీవీ కామెంట్ జీ కుటుంబం అవార్డ్స్ వేడుకలో హైలైట్ గా నిలిచింది. ఇక ఈ షోలో తారల్ని చూస్తుంటే ఆకాశం నుంచి దేవకన్యలు వచ్చి ఇక్కడ అవార్డ్స్ తీసుకుంటున్నారా అన్నంత అందంగా మురిసిపోయారు. ఇక ఆల్రౌండర్ అనసూయ "అస్సలేం గుర్తుకు రాదు" అనే సాంగ్ కి మెస్మోరైజ్ చేసే పెర్ఫార్మెన్స్ చేసింది. తర్వాత అవార్డ్స్ తీసుకోవడం మద్యమద్యలో డాన్సులు వంటివి ఆడియన్స్ ని అలరించాయి. ఇక ఈ షోకి అనంత శ్రీరామ్ ఎంట్రీ ఇచ్చారు. "పేపర్ మీద పెన్ను పెట్టకుండా జీవితం అవార్డు తీసుకుంటానని అనుకోలేదు" అంటూ కామెంట్ చేశారు. రీసెంట్ గా రిలీజ్ ఐన భగవంత్ కేసరి మూవీలో "ఉయ్యాలో ఉయ్యాలో" సాంగ్ రాశారు. అదే ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలుసు ఇక ఇక్కడ జీ స్టేజి మీద అనసూయ కూతురిగా అనంత శ్రీరామ్ తండ్రిగా ఈ సాంగ్ కి డాన్స్ పెర్ఫార్మ్ చేశారు. ఇక ఫైనల్ గా మంజుల-నిరుపమ్ పరిటాల స్టేజి మీదకు వచ్చారు. వాళ్ళు ఈ అవార్డుని అందుకున్నారు. ఇక నిరుపమ్ వాళ్ళ అమ్మను స్టేజి మీదకు తీసుకొచ్చి సర్ప్రైజ్ చేశారు. "మా అమ్మ స్పోర్ట్స్ కోటాలో 70 స్ లో గవర్నమెంట్ లెక్చరర్ గా వర్క్ చేశారు..నన్ను కూడా మా అమ్మ కొన్నేళ్ల క్రితం వరకు ఎందుకు ఈ సీరియల్స్ చక్కగా జాబ్ చేసుకోక..ఆలోచించు" అన్నారు. తర్వాత నిరుపమ్ వాళ్ళ నాన్న ఓంకార్ గారి వీడియోని ప్లే చేశారు. అది చూసిన నిరుపమ్ వాళ్ళ అమ్మ ఎమోషనల్ అయ్యారు. "నన్ను ఈరోజు ఇలా స్టేజి మీద చూసేసరికి ఆయన ఉండి ఉంటె బాగుండేది" అన్నాడు నిరుపమ్.. ఇలా ఈ జీ తెలుగు అవార్డ్స్ షో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి ఆదివారం రాబోతోంది.