అంబటి అర్జున్ నిజస్వరూపం బయటపడిందిగా.. ఆట సందీప్ కి నాగార్జున వార్నింగ్!

బిగ్ బాస్ సీజన్-7 శనివారం నాటి ఎపిసోడ్ కోసం ఎంత మంది ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారో తెలిసిందే. దానికి కారణం వారమంతా హౌస్ మేట్స్ చేసే తప్పొప్పులని ఎత్తి చూపుతూ ఒక్కొక్కరికి నాగార్జున క్లాస్ తీసుకుంటాడు‌. దాంతో ప్రేక్షకులు వినోదాన్ని పొందుతారు. శని, ఆదివారాల్లో వచ్చే ఎపిసోడ్ లు ప్రేక్షకులు బాగా ఇష్టపడే ఎపిసోడ్స్. ఫన్ అండ్ ఆటలతో బిగ్ బాస్ ని మరింత ఇంట్రెస్ట్ గా తీర్చిదిద్దుతారు మేకర్స్. నాగార్జున వచ్చి రాగానే శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూపించాడు. కెప్టెన్సీ టాస్క్ లో చివరగా ఆట సందీప్, అంబటి అర్జున్ ఉండగా కొన్ని నిమిషాల తేడాతో అంబటి అర్జున్ గెలిచి.. హౌస్ కి కొత్త కెప్టెన్ అయ్యాడు. ఆ తర్వాత హౌస్ లో జరిగిన భోలే షావలి, ప్రియాంక, శోభా శెట్టిల మధ్య జరిగిన గొడవని కూల్ గా పరిష్కరించాడు నాగార్జున. అసలు అలా బూతులు వాడటం కరెక్టేనా అని భోలే షావలిని అడుగగా.. " ఆ డిస్కషన్ లో అలా మాటలు వచ్చాయి సర్. నా నైజం కాదు సర్. సారీ చెప్పాను సర్" అని భోలే షావలి తప్పుకి క్షమించమని చెప్పడంతో నాగార్జున సరే అన్నాడు. ఆ తర్వాత శోభాశెట్టిని లేపి భోలే షావలి తప్పుని యాక్సెప్ట్ చేస్తున్నావంటే లేదని తను చెప్పింది. ఆ తర్వాత ప్రియాంక జైన్ ని లేపి.. హౌస్ లో నువ్వు థూ అని అనడం అసలు కరెక్ట్ కాదని అలా ఇంకెప్పుడు అనకూడదని వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున. ఇక ఎప్పటిలాగే టాస్క్ లో ఆట సందీప్ చేసిన ఫౌల్స్ గురించి చెప్పాడు నాగార్జున. ఆ తర్వాత శివాజీ సంచాలకుడిగా తప్పు జరుగనివ్వడని తెలుసని, మీరు చేసే ఫౌల్స్ చూసాడని నాగార్జున అన్నాడు. అంబటి అర్జున్ కెప్టెన్ అయ్యాక తను కూడా సీరియల్ గ్యాంగ్ లో ఒకడిలాగా ప్రూవ్ చేసుకున్నాడు. మీకు హౌస్ లో నిచ్చెన, పాము లు ఎవరని అడుగగా.. గౌతమ్ కృష్ణని నిచ్చెన అని, శివాజీని పాము అని అంబటి అర్జున్ అన్నాడు. హౌస్ లో అందరు అర్థమయ్యారని కానీ శివాజీ గారే అర్థం కాలేదని అంబటి అర్జున్ అన్నాడు. యావర్ కెప్టెన్సీ ఎలా ఉందని అడుగగా.. ది బెస్ట్ కెప్టెన్ అని హౌస్ అంతా అంగీకరించారు.

గౌతమ్ కృష్ణ ఎలిమినేషన్.. ఉల్టా పల్టా జరుగనుందా?

బిగ్ బాస్ ట్విస్ట్ లకి రోజు రోజుకి మైండ్ బ్లాక్ అవుతుంది. ‌ఉల్టా పల్టా థీమ్ తో హౌస్ మేట్స్ కే కాదు ప్రేక్షకులకి క్రేజీ కిక్కుని ఇస్తున్నాడు.  ఇక హౌస్ లోని కంటెస్టెంట్స్ వారం మొత్తం జరిగిన టాస్క్ లలో ఎవరు ఎలా ఆడారో? ఎవరేం తప్పులు చేశారో క్లాస్ పీకుతాడేమో అని టెన్షన్ పడుతున్నారు. అయితే ఈ వారం కూడా ఫీమేల్ హౌస్ మేట్ ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ లు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే నామినేషన్లో ఉన్నవారిలో లీస్ట్ లో పూజా మూర్తి ఉంది. ఆ పైన గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజ ఉన్నాడు. అందుకేనేమో బిగ్ బాస్ కేక్ తో పాటు తేజకి వార్నింగ్ ఇచ్చాడు. మరి ఈ వారం ఎలిమినేషన్ అవుతారనే ఆసక్తి అందరిలోను నెలకొంది. ఓటింగ్ లో టాప్ వన్ స్థానంలో పల్లవి ప్రశాంత్ ఉండగా, ఆ తర్వాతి స్థానంలో అమర్ దీప్ ఉన్నాడు. ఇక మెరుగైన ఆటతీరుతో అశ్విని మూడవ స్థానంలో కొనసాగుతుంది. ఇక మ్యూజిక్ లవర్స్ భోలే షావలికి ఓట్లు గట్టిగానే వేసునట్టు తెలుస్తుంది. ఇంకా శోభా శెట్టి, ప్రియాంక చేసిన ఆర్గుమెంట్ లో భోలే షావలికి సింపథీ బాగానే వర్కవుట్ అయినట్టు తెలుస్తుంది. అతను నాల్గవ స్థానంలో ఉన్నాడు. ఇప్పటికి వరుసగా ఆరు వారాల నుండి ఫీమేల్ కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ అవ్వడం, ఈ వారం కూడా మరో ఫీమేల్ అవుతుందా లేక ఉల్టా పల్టా చేసి గౌతమ్ లేదా తేజలో ఎవరినైనా బయటకి పంపించేస్తాడా చూడాలి మరి. ఇప్పటికి నమోదైన అనఫీషియల్ ఓటింగ్ పోల్స్ లో గౌతమ్ కృష్ణ ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ లు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అతని మాటతీరు, మెచురిటీ లేకుండా మాట్లాడే విధానం ప్రేక్షకులు తీసుకోలేకపోతున్నారనే చెప్పాలి. అయితే ఈ వారం దసరా వీక్ అవ్వడంతో మరింత వినోదాన్ని అందించడానికి బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

శివాజీ ఎలిమినేషన్.. షాక్‌లో కొడుకు!

బిగ్ బాస్ సీజన్-7 లో టైటిల్ ఫేవరెట్ గా ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్ శివాజీ. తన ఆటతీరుతో, మాటతీరుతో టాప్-5 లో  ఒకడిగా ఉంటు వస్తున్నాడు శివాజీ. అయితే నాల్గవ వారం జరిగిన టాస్క్ లో  శివాజీ చేతికి బలంగా గాయమైంది. అయితే ఆ వయసులో శివాజీ గేమ్ లో చూపించిన ఆసక్తికి మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. అప్పటినుండి శివాజీ తన చేతు నొప్పి ఇబ్బంది పెడుతున్నా మేనేజ్ చేస్తున్నాడు. అయితే మొన్నటి వారం నయని పావని ఎలిమినేషన్ రోజున మోస్ట్ ఎమోషనల్ అయ్యాడు శివాజీ‌. తనకి నొప్పి బాగా ఉందని, ఆ అమ్మాయి చాలా తెలివిగలది, ఆట బాగా ఆడుతుంది. తన స్థానంలో నన్ను బయటకు పంపించండి అంటూ శివాజీ రిక్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.  అయితే నిన్నటి జరిగిన ఎపిసోడ్ లో శివాజీని సీక్రెట్ రూమ్ కి పిలిచాడు. ఏం అయిందని శివాజీని బిగ్ బాస్ అడుగగా.. " నాకు చేయి నొప్పి చాలా ఉంది‌. అసలు ఉండాలనిపించట్లేదు. నాలో సత్తువ ఉన్నంతవరకు ఆడుతాను. అసలెవరికీ బయపడను. కానీ ఈ చేయి నొప్పి ఎక్కువగా ఉంది. తట్టుకోలేకపోతున్నాను. గౌతమ్ కృష్ణ నామినేషన్లో చెప్పినట్టు నేను గేమ్ ఆడలేకపోతున్నాను‌. నా స్థానంలో యంగ్ స్టర్స్ ఉంటే బాగా ఆడతారని నాకనిపిస్తుంది. దయచేసి నన్ను బయటకు పంపించండి బిగ్ బాస్" అని శివాజీ రిక్వెస్ట్ చేశాడు. మరోసారి మిమ్మల్ని హాస్పిటల్ కి తీసుకెళ్తాం అప్పటికి బాగోలేకపోతే మీరు ఇంటికి వెళ్లవచ్చు అన్నట్టుగా బిగ్ బాస్ చెప్పాడు. బిగ్ బాస్ హౌస్ లో టాప్-5 లో మొదటి స్థానంలో శివాజీ, ఆ తర్వాత పల్లవి ప్రశాంత్, యావర్ ఉంటారని ప్రేక్షకులు భావించారు. కానీ శివాజీ చేతిగాయం తనని చాలా ఇబ్బంది పెడుతుందని తెలుస్తుంది. గతవారమే శివాజీ ఎలిమినేషన్ అని అందరు అన్నారు. అయితే చేతి నొప్పి కారణంగా మెడికల్ టెస్ట్ ల నిమిత్తం బయటకు తీసుకెళ్ళారని తెలిసింది. ఇప్పుడు అదే నడుస్తుంది. అయితే శివాజీ తనకి తానే ఎగ్జిట్ అవుతున్నాడు. మరి ఈ సారి మెడికల్ టెస్ట్ తర్వాత శివాజీ బిగ్ బాస్‌లో ఉంటాడా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. తన డాడీ ఆడే అటను డైలీ చూస్తున్న తన చిన్న కోడుకు శివాజీ తీసుకున్న నిర్ణయానికి షాక్ అయ్యాడట. శివాజీ కూడా బిగ్ బాస్ కి వచ్చిన్నప్పటి నుంచి హౌస్ మెట్స్‌తోను మరియు నాగార్జనతోను తన కొడుకు గురించి కొన్ని విషయాలు చెప్పిన విషయం తెలిసిందే.

మురారి చనిపోయాడని భవాని కన్నీటి పర్యంతం.. కృష్ణకి నిజం తెలిసేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -293 లో.. కృష్ణని చూడడానికి ప్రభాకర్, శకుంతల వెళ్తారు.. కృష్ణని ఆ సిచువేషన్ లో చూసి ఇద్దరు బాధపడుతారు. అప్పుడే కృష్ణ స్పృహలోకి వస్తుంది. ఆక్సిడెంట్ జరిగిన విషయాన్ని గుర్తుకుచేసుకొని ఒక్కసారిగా ఏసీపీ సర్ ఎక్కడ అంటూ అడుగుతుంది. ఆ తర్వాత తనతో పాటు మురారి ఉన్న విషయం కూడా ప్రభాకర్ కి చెప్తుంది కృష్ణ. మరొక వైపు ప్రభాకర్ మురారి కోసం వెతుకుతుంటాడు. మరొక వైపు రేవతి వచ్చి.. ఏమైనా కావాల అని భవానిని అడుగుతుంది. రేవతితో భవాని మాట్లాడకుండా ఇండైరెక్ట్ గా ప్రసాద్ తో మాట్లాడుతుంది. మీరు ఒక ముకుంద మాటలు పట్టుకొని వాళ్లని తప్పుగా అర్థం చేసుకోవడం తప్పు. వాళ్ళకి ఒకరంటే ఒకరు ఇష్టమని రేవతి అనగానే.. రేవతిపై భవాని అరుస్తుంది. నువ్వు కూడ ఒక్క మాట కూడా చెప్పలేదని అంటుంది. నువ్వు తప్పని అనుకోవడం లేదు కనీసం వాళ్ళైన తప్పని అనుకుంటున్నారు. దానికి సంతోషమని భవాని అంటుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరితో ఇంట్లో ఎవరు మాట్లాడడానికి వీలు లేదని భవాని చెప్తుంది. మరొక వైపు ముకుంద దేవుడికి మొక్కుతూ.. నేను చేసేది తప్పే నన్ను క్షమించండి. ఇప్పుడు జరగబోయే విషయం పట్ల అందరూ ఎలా రియాక్ట్ అవుతారో భయం వేస్తుందని ముకుంద అనుకుంటుంది. మరొక వైపు కృష్ణ, మురారి ఇంకా ఫోన్ చెయ్యడం లేదు ఏంటని రేవతి అనుకుంటుంది. ఆ తర్వాత భవాని ఇంటికి అంబులెన్స్ వస్తుంది. ఒక కానిస్టేబుల్ వచ్చి మురారి గారికి దెబ్బలు తగిలి చనిపోయాడని చెప్పి మురారి బాడీని భవాని వాళ్లకి ఇస్తాడు. మురారిని ఆ సిచువేషన్ లో చుసిన ఇంట్లో అందరూ ఏడుస్తుంటారు. మరొక వైపు ప్రభాకర్ అన్ని చోట్ల మురారి గురించి వెతికి భవాని ఇంటికి వచ్చి మధుకి కాల్ చేస్తాడు. మధు ఫోన్ లిఫ్ట్ చేయకుండా, బయటకు వచ్చి ప్రభాకర్ కి జరిగింది చెప్తాడు. ఇంట్లో అందరు కృష్ణ ఎక్కడికి వెళ్ళిందని చాలా కోపంగా ఉన్నారని మధు చెప్పగానే.. ప్రభాకర్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

కెప్టెన్సీ టాస్క్ లో గెలిచిందెవరో తెలుసా?

బిగ్ బాస్ సీజన్-7 రోజు రోజుకి  ఆసక్తిగా మారుతుంది. ఇప్పటికి ఆరు వారాలు పూర్తిచేసుకొని ఏడవ వారంలోకి అడుగుపెట్టగా, కెప్టెన్సీ టస్క్ లు మరింత ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. గత అయిదు రోజుల నుండి సాగుతున్న గ్రహాంతర వాసులని సంతోషపరిచే టాస్క్ లు నిన్నటితో ముగిసాయి. జిలేబీపురం టీమ్ గెలిచి కెప్టెన్సీ రేస్ లో నిలిచారు. ఇందులో పల్లవి ప్రశాంత్, అంబటి అర్జున్, ఆట సందీప్, శివాజీ,  ప్రియాంక జైన్ ఉన్నారు. దాంతో బిగ్ బాస్ వీరికి మరో టాస్క్ ఇచ్చాడు. అదేంటంటో కెప్టెన్సీ రేస్ లో ఉన్నవారిలో ఎవరు కెప్టెన్ కి అనర్హులని భావిస్తారో వారి బోట్ ని స్విమ్మింగ్ పూల్ లో పడేయాలని చెప్పాడు బిగ్ బాస్. అయితే మొదటగా శివాజీని అమర్ దీప్ కెప్టెన్సీ రేస్ నుండి తప్పించాడు. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ ని పూజా మూర్తి తప్పించింది. ఇక ఆ తర్వాత బజర్ కి ఎవరు సెలెక్ట్ చేసుకోకపోయేసరికి బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చాడు. ఇక శోభాశెట్టి కంటెంట్ కోసం మాములుగా పర్ఫామెన్స్ ఇవ్వలేదు. అందరు సేఫ్ గేమ్ ఆడుతున్నారంటూ యావర్ మీద సీరియస్ అయింది శోభాశెట్టి. మాకు డెసిషన్ తీసుకోవడానికి సమయం కావాలని యావర్ చెప్పాడు. ఆ తర్వాత యావర్ బాగా డిసైడ్ అయి ప్రియాంక జైన్ ని తప్పించాడు. దాంతో సీరియల్ బ్యాచ్ అంతా కెప్టెన్సీ రేస్ నుండి అవుట్ అయ్యారు. ఇక కెప్టెన్సీ రేస్ లో  ఆట సందీప్, అంబటి అర్జున్ ఉన్నారు. ఇక ఆ తర్వాతి గోస్ట్ రూమ్ కి హౌస్ మేట్స్ అందరిని పిలిపించాడు బిగ్ బాస్. అందులో ' మ్యాన్షన్24' వెబ్ సిరీస్ దర్శకుడు ఓంకార్,  నటీనటులు అవికా గోర్, నందు, వరలక్ష్మీ శరత్ కుమార్ ఉన్నారు. ఇక వాళ్ళ వెబ్ సిరీస్ ప్రమోషన్ చేసుకొని అందులోని కొంతమందిని తమ తర్వాతి సినిమాకి సెలెక్ట్ చేసుకున్నాడు ఓంకార్. యావర్, ఆట సందీప్ లని తన సినిమాకి ఎంచుకున్నాడు డైరెక్టర్ ఓంకార్.

కార్ కొన్న ఫైమా..విషెస్ చెప్పిన నెటిజన్స్

జబర్ధస్త్ ఫైమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు పటాస్ ఫైమా. తన కామెడీ టైమింగ్ తో  పంచులతో బులెట్ భాస్కర్ టీమ్ లో కంటెస్టెంట్ గా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. కేవలం ఫైమా కామెడీ కోసం జబర్ధస్ షో చూసేవాళ్ళు చాల మంది ఉన్నారు.  అతి తక్కువ సమయంలోనే బుల్లితెరపై తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.  జబర్ధస్త్ షోతో పాటు ఆదివారం విత్ స్టార్ మా పరివారం లో అలాగే చేస్తోంది. అలాగే  బిగ్‏బాస్ కి వెళ్ళొచ్చింది. తన గోల్ సొంత ఇల్లు. అలాగే వాళ్ళ అమ్మ నాన్న కోసం సొంత ఇల్లు తీసుకుంది. ఇక ఇప్పుడు ఆమె వాళ్ళ కోసం కార్ కూడా కొనేసింది. తన చిన్నప్పుడు తన నాన్నకు చిన్న సైకిల్ మాత్రమే ఉండేదని..వాళ్ళ అమ్మ ఎక్కడికైనా వెళ్ళాలి అంటే బస్సు, ఆటో రిక్షాల్లోనే వెళ్లేదని చెప్పింది ఫైమా. అలాగే తన కార్ కొనడం కోసం బులెట్ భాస్కర్ ని కూడా ఇన్వైట్ చేసింది అలా వాళ్ళ పేరెంట్స్ తో భాస్కర్ తో షో రూమ్ కి వెళ్ళింది. వీళ్ళతో పాటు పటాస్ ప్రవీణ్ కూడా వచ్చాడు. షో రూమ్ లో కేక్ కోసింది ఫైమా. హ్యుందాయ్ రెడ్ కలర్ కార్ కొన్నది ఫైమా. ఇక భాస్కర్, ఫైమా ట్రయల్ రైడ్ వేశారు. పటాస్ ప్రవీణ్ అలిగేసరికి ఇప్పుడు ఫైమాకి కార్ కొన్నా కాబాట్టి తర్వాత ప్రవీణ్ కి తీసుకుంటాను అని చెప్పాడు భాస్కర్. ఇక నెటిజన్స్ మాత్రం ఫైమా కస్టపడి ఎదిగి ఇల్లు, కార్ అన్ని తీసుకుంటోంది అంటూ విషెస్ చెప్తున్నారు. పటాస్ షో ఆపేసిన టైంలో  జబర్ధస్త్ షో ఆఫర్ వచ్చింది. ఈ షోలోకి అడుగుపెట్టిన తర్వాత ఫైమా మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు. తన కామెడీ టైమింగ్.. పంచులతో ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేస్తుంది. అతి తక్కువ టైంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. భాస్కర్, ఇమాన్యుయేల్, వర్ష, ఫైమా మధ్య వచ్చే కామెడీ స్కిట్స్ ఆడియన్స్ బాగా  ఎంజాయ్ చేస్తారు.

అరకులో కొత్తజంట!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -899 లో.. మహేంద్రతో ఫణీంద్ర మాట్లాడి అక్కడ నుండి శైలేంద్ర దేవయానిలను తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వసుధారని లగేజ్ సర్దుమని రిషి చెప్తాడు. రిషి, వసుధారలు కలిసి మహేంద్రని ప్రశాంతంగా జగతి జ్ఞాపకాల నుండి దూరం చెయ్యడానికి అరకు తీసుకొని వెళ్తారు. ఆ తర్వాత అరకులో ఒక రిసార్ట్ దగ్గరకి వస్తారు. మహేంద్ర ఒక్కసారిగా ఆ ప్లేస్ చూసి ఏవేవో జ్ఞాపకాలు వచ్చినట్లు ప్రవర్తిస్తాడు. నన్ను ఇక్కడకు ఎందుకు తీసుకొచ్చావ్ రిషి అంటూ మహేంద్ర అడుగుతాడు. మీరు ప్రశాంతంగా ఉండాలంటే ఇలాంటి ప్లేస్ అయితే కరెక్ట్ అని ఇక్కడకి తీసుకొని వచ్చానని రిషి చెప్తాడు. మహేంద్రని రిషి బలవంతంగా అక్కడ ఉండడానికి ఒప్పిస్తాడు. ఆ తర్వాత గదిలోకీ వెళ్లిన మహేంద్ర.. డల్ గా కూర్చొని ఉంటాడు. ఏమైంది ఈ రూమ్ మీకు నచ్చలేదా అని రిషి అడుగుతాడు. మీ కంఫర్ట్ కోసమే ఈ రూమ్ తీసుకున్నానని రిషి చెప్తాడు. మరొకవైపు వసుధార మరొక రూమ్ లో ఉంటుంది. ఆ తర్వాత కాసేపటికి మహేంద్ర గురించి రిషి బయట నిల్చొని ఆలోచిస్తుంటాడు. అప్పుడే రిషి దగ్గరికి వసుధార వచ్చి మాట్లాడుతుంది. ఇద్దరు కలిసి మహేంద్రని ఎలాగైనా మాములుగా చెయ్యాలని అనుకుంటారు. మరొక వైపు జగతి ఫొటో దగ్గరికి దేవయాని వెళ్లి.. నువ్వు ఉన్నప్పుడు నా కొడుకుని ఎండీ సీట్ లో కూర్చోనివ్వకుండా చేసావ్. నువ్వు లేనప్పుడు కూడా ఎండీ సీట్ లో కూర్చోలేదు. అందుకు నువ్వు సంతోషంగా ఉన్నట్లున్నావని దేవయాని అనుకుంటుంది. ఆ తర్వాత ఒక్కసారిగా ఏదో గాలి వచ్చినట్లు దేవయానికి అనిపిస్తుంది.  అది చూసి ఏంటి జగతి ఆత్మలాగా మరి నా మాటలు వింటున్నావా అని దేవయాని అంటుంది. అప్పుడే శైలేంద్ర వచ్చి నేను కాలేజీకీ వెళ్తున్నానని చెప్తాడు. అదే సమయంలో ఫణింద్ర వచ్చి కాలేజీకి ఎందుకని అడుగుతాడు. రిషి వసుధారలు లేరు కదా, కాలేజీ నీ చూసుకోవాలి కదా అని శైలేంద్ర అనగానే.. ఫస్ట్ నీ భార్యని మంచిగా చూసుకోమని ఫణింద్ర అంటాడు. ఆ తర్వాత ఇద్దరు బయటకు వెళ్తారు. మరొక వైపు ఇక్కడే మనప్రేమ మొదలైంది నీ జ్ఞాపకాలు దూరం చెయ్యాలని చెప్పి, తెలియకుండానే రిషి మళ్ళీ ఇక్కడికి తీసుకొని వచ్చాడని మహేంద్ర అనుకుంటాడు.. అప్పుడే రిషి, వసుధారలు వచ్చి బయటకు వెళ్దామని మహేంద్రతో అనగానే.. మీరు ఇద్దరు వెళ్ళండి. నేను ఎందుకని మహేంద్ర అంటాడు. మహేంద్ర సర్ ని వదిలి వెళ్లొద్దు సర్ అని వసుధార అనగానే.. రిషి నీ భర్త ఇప్పుడు కూడా సర్ అంటున్నావేంటని మహేంద్ర అడుగుతాడు.  ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

రాహుల్ అడ్డంగా దొరికిపోయాడు.. వెనకేసుకొచ్చిన స్వప్న!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -232 లో.. మీ అమ్మ తీసుకొని రమ్మని చెప్పిందని అప్పుని కళ్యాణ్ తీసుకొని బయటకు వస్తాడు. బయటకు రాగానే అనామిక కూడా ఉంటుంది. షాపింగ్ కి అంటే రావని అలా చెప్పాను. మీ అమ్మ కూడా రమ్మంది. ఆ పని చూసుకొని షాపింగ్ కీ వెళదామని అప్పుతో కళ్యాణ్ అనామిక అంటారు. ఇక చేసేదేమీ లేక అప్పు వాళ్లతో బయల్దేరుతుంది. మరొక వైపు కావ్య ఇంట్లో అందరికి కాఫీ ఇస్తుంది. సారి అత్తయ్య లేట్ అయిందని అపర్ణకి కావ్య చెప్తుంది. తప్పు చేయడమెందుకు? సారీ చెప్పడం ఎందుకని అపర్ణ అనగానే.. లేట్ అయిందని అలా అనడం కరెక్ట్ కాదని సుభాష్ అంటాడు. కావ్య ఒక్కతే చకచక  పనులు చేస్తంటే సీతారామయ్య ఇందిరాదేవి చూసి మురిసిపోతుంటారు. ఈ కాలంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉండడం గ్రేట్ అనుకుంటు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత కావ్య ఒక్కతే పనులు చేస్తుందని కనకం వచ్చి హెల్ప్ చెయ్యడానికి ట్రై చేస్తూ ఉంటే.. కనకంపై అపర్ణ కోప్పడుతుంది. ఈ ఇంట్లో కోడలు చెయ్యాలిసినవి తనని చెయ్యనివ్వండి. అప్పుడే బాధ్యతలు తెలుస్తాయని అపర్ణ అనగానే.. అవును అమ్మ నేను చేసుకుంటాను నువ్వు వెళ్ళు అని కనకంకి కావ్య చెప్తుంది. మరొక వైపు రాహుల్ లాయర్ కి ఫోన్ చేసి మైఖేల్ కీ బెయిల్ అప్లై చెయ్యండని చెప్తాడు. పది లక్షలు ఇస్తేనే బెయిల్ కి అప్లై చేస్తానని లాయర్ అంటాడు. ఇప్పటికిప్పుడు పది లక్షలంటే ఎలా అని రాహుల్ ఆలోచిస్తుంటాడు. అప్పుడే స్వప్న తన నగలు చూస్తు మురిసిపోతుంటుంది. స్వప్న దగ్గరికి వెళ్లి నగలు కావాలని అడుగుతాడు. నగలెందుకు? తాకట్టు పెట్టడానీకా, నేను ఇవ్వను. నాకు తాతయ్య వాళ్ళు ఇచ్చినవి. వాళ్ళు అడిగితే మళ్ళీ ఏం సమాధానం చెప్పలేనని స్వప్న అవి బీరువా లో పెట్టుకొని వెళ్తుంది. ఆ తర్వాత స్వప్నకి తెలియకుండా రాహుల్ నగలు తీసుకొని వెళ్తాడు.  హాల్లో ఉన్న రాజ్ ఏంటవి అని అడుగుతాడు. ప్రకాష్ ఏంటి అవి చూస్తుండగా.. అందులో నుండి నగలు కిందపడిపోతాయి. కిందపడి ఉన్న నగలు చూసి ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావంటు అందరు అడుగుతారు. రాహుల్ టెన్షన్ పడుతు సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉంటాడు. అప్పుడే స్వప్న వచ్చి.. ఎందుకు రాహుల్ ని అందరు దొంగని చూసినట్లు చూస్తున్నారు. నేనే నగలు మెరుగుపెట్టించుకు రమ్మని చెప్పానని స్వప్న చెప్తుంది. ఆ తర్వాత రాహుల్ తన నటన మొదలుపెడతాడు. నన్నెవరు నమ్మడం లేదని, ముఖ్యంగా రాజ్ నన్ను నమ్మడం లేదని యాక్ట్ చేస్తాడు. మరొక వైపు షాపింగ్ పూర్తి చేసుకొని అప్పు, కళ్యాణ్, అనామిక వస్తుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

అషు రెడ్డి 5 గంటలు... ఏంటి నీలో ఇంత మార్పు!

సోషల్ మీడియాలో అష్షు రెడ్డి అల్లరి, ఆ రచ్చ మాములుగా ఉండదు. ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూతో సెన్సేషన్ సృష్టిస్తూనే ఉంటుంది. కానీ ఈ మధ్య కొంత సైలెంట్ గా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక ఈ విషయాన్ని నోటీస్ చేసిన కొంతమంది ఫాన్స్ కూడా ఆమెను ఇదే ప్రశ్న అడుగుతున్నారు. ఇక అష్షు పాపా మాట్లాడుకుందామా అని అడిగేసరికి ఇదే టైం అని ఫాన్స్ వాళ్లకు నచ్చిన ప్రశ్నలు అడిగేసారు..అందులో ఫస్ట్ ప్రశ్న ఇదే "ఈ మధ్య కాలంలో మీరు డిసిప్లిన్ గా మారడానికి కారణాలు ఏమిటి" అనేసరికి "నేను మెంటల్ గా, ఫిజికల్ గా కూడా చాలా డెవలప్ కావాలనుకుంటున్నా..అలా ఎదగాలనుకున్నప్పుడు  మొదటగా అలవాటయ్యేది డిసిప్లిన్.. నాలో మార్పును గమనించినందుకు థ్యాంక్యూ" అని చెప్పింది. "ఉదయాన్నే  4 గంటలకు ఎలా లేస్తారు" " రోజు రాత్రి త్వరగా నిద్రపోతే..ఉదయాన్నే లేచేలా నన్ను నేను పరీక్షించుకుంటాను..కన్సిస్టెన్సీ అనేది నా ఫ్రెండ్ దగ్గర నుంచి నేర్చుకున్నా" "హారర్, కామెడీ, యాక్షన్, రొమాన్స్ మూవీస్ ఏది ఇష్టం" "నాకు డిస్నీ మూవీస్" అంటే ఇష్టం. "బిగ్ బాస్ లో చూసిన అష్షు యేనా..లేదా ఏదైనా పారలల్ యూనివర్స్ కి వచ్చానా" "చాలా కష్టపడుతున్నా..నా ట్రైనర్స్ కి వాళ్ళ ఓపికకు నా ధన్యవాదాలు" అని చెప్పింది అష్షు..ఏదేమైనా ఈరోజుల్లో అందరూ హెల్త్ మీద వర్క్ మీద చాల కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అలాగే జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ ఫిజిక్ ని చాల మెయింటైన్ చేస్తూ హెల్తీగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక అష్షు కూడా అదే బాటలో 5 గంటలకల్లా జిమ్ లో ప్రత్యక్షమవుతోంది. జిమ్ కి జతగా  మెడిటేషన్ కూడా చేయండి అంటూ ఆమె డెడికేషన్ కి ఫిదా ఐపోయిన ఆమె ఫాన్స్ ఇలా సలహా కూడా ఇస్తున్నారు.  

సంచాలకుడిగా శివాజీ తోపు.. సీరియల్ బ్యాచ్ ఆటకట్టించాడుగా!

కొత్త కంటెస్టెంట్స్, పాత కంటెస్టెంట్స్ అందరిని కలిపి బిగ్ బాస్ హౌస్ మేట్స్ గా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వారం జిలేబిపురం వర్సెస్ గులాబీపురం టీమ్ ల మధ్య టాస్క్ లు జరుగుతున్న విషయం తెలిసిందే. అందులో ఎవరు ఫౌల్(తప్పు) గేమ్ ఆడారు? ఎవరు కరెక్ట్  గేమ్ ఆడారో ఒకసారి చూసేద్దాం. గ్రహాంతర వాసులని సంతోషపరిచాడనికి వారికి ఫ్యూయల్ కావాలని అది స్విమ్మింగ్ పూల్ లో ఉందని, దానిని తీసుకురావాలని చెప్పగా ఆట సందీప్ స్విమ్మింగ్ పూల్ లో ఉండగా, ప్రియాంక జైన్ బయట ఉన్న ఒక్కో తాళం చెవిని ఇస్తుంది. అయితే ఈ ఆటలో ఇద్దరు కలిసి స్ట్రాటజీనీ ప్లే చేశారు. అదేంటంటే మొదటగా సందీప్ మాస్టర్ కి ప్రియాంక జైన్  తాళం చెవి ఇవ్వగా అది వస్తుందని చెప్పి, తన ప్యాంట్ లో దాచుకున్నాడు. ఇక సంచాలకుడిగా వ్యవహరిస్తున్న శివాజీ అది చూసేశాడు. ఒకసారి తీసుకెళ్ళిన తాళం చెవిని మళ్ళీ తిరిగి ఇస్తేనే మరో తాళం చెవి తీసుకెళ్ళాలని షరతుని ఉంచాడు. దాంతో వాళ్ళ పాచిక పారలేదు. వెంటనే ఆ కీని తిరిగి ప్రియాంకకి ఇచ్చేశాడు సందీప్. ప్రతీ టాస్క్ లో ఫౌల్ ఆడుతూ దానిని స్ట్రాటజీ అని చెప్పుకునే సీరియల్ బ్యాచ్ కి శివాజీ సంచాలకులుగా ఉంటేనే బుద్ధి వస్తుందని మరోసారి ఋజువు చేశాడు. ఇక ఆ తర్వాత ఈ టాపిక్ ని టేస్టీ తేజ, పల్లవి ప్రశాంత్, యావర్ లతో  శివాజీ డిస్కస్ చేశాడు.  ఆట ముగిసాక అమర్ దీప్, ప్రియాంక జైన్, ఆట సందీప్ కలిసి మాట్లాడుకుంటున్నారు. "స్విమ్మింగ్ పూల్ లో నాకు కోపం వచ్చి వాడి బనియన్ పట్టుకున్నాను. అమర్ ప్లేస్ లో ఎవరున్నా గట్టిగా గొడవ అయ్యేది"  అంటూ అమర్ , ప్రియాంకలతో ఆట సందీప్ అన్నాడు. హౌస్ లో మొదటి నుండి అమర్ దీప్, ప్రియాంక జైన్, శోభాశెట్టి, టేస్టీ తేజ, ఆట సందీప్ అందరు కలిసి గ్రూప్ గా  గేమ్ ఆడుతున్న విషయం తెలిసిందే. అదే ఇప్పుడు మరోసారి ప్రూవ్ అయింది. అయితే వీరికి శివాజీ సంచాలకుడిగా ఉంటేనే కరెక్ట్ అని బిగ్ బాస్ అభిమానులు భావిస్తున్నారు.  

బిగ్ బాస్ హౌస్ లో గులాబీపురం వర్సెస్ జిలేబీపురం!

బిగ్ బాస్ సీజన్-7 లో టాస్క్ ల పరంపర కొనసాగుతుంది.  గ్రహాంతర వాసులని సంతోషపరిచే టాస్క్ లు హౌజ్ మేట్స్ వేషధారణ, మాట తీరు, ఆటతీరు అంతా కలిసి కామెడీని కలిగిస్తున్నాయి. నిన్న జరిగిన ఎపిసోడ్ లో స్విమ్మింగ్ పూల్ లో ఉన్న బాక్స్ కి తాళాలు వేసి ఉండగా వాటిని బయట ఉన్న తాళం చెవిల సహాయంతో ఓపెన్ చేసి అందులో ఉన్న ఫ్యూయల్ బాటిల్ ని బయటకు తీసుకురావాలని బిగ్ బాస్ చెప్పాడు. గులాబీపురం నుండి టేస్టీ తేజ, అమర్ దీప్, జిలేబీపురం నుండి ప్రియాంక జైన్, ఆట సందీప్ ఈ టాస్క్ లో పాల్గొనగా ఇందులో మొదటగా అన్నీ తాళాలు ఓపెన్ చేసింది జిలేబీపురం. ఆట సందీప్ ఫాస్ట్ గా అన్ని తాళాలు ఓపెన్ చేశాడు. అయితే ఆ బాక్స్ మూతని తీసేటప్పుడు ఆట సందీప్, అమర్ దీప్ ల మధ్య ఫిజికల్ అయింది. ఆ తర్వాత ఆట సందీప్ ఫ్యుయల్ ఉన్న బాటిల్ ని తీసి ప్రియాంక జైన్ కి ఇవ్వగా, తను టార్గెట్ లో పెట్టి రౌండ్ ముగించింది. దీంతో జిలేబీపురం ఈ టాస్క్ లో గెలిచింది. ఆ తర్వాత టేస్టీ తేజ, శోభాశెట్టి మధ్య టాటు గురించి డిస్కషన్ రాగా, బిగ్ బాస్ సీరియస్ గా తీసుకున్నాడు. ఇక ఆ తర్వాత స్పేష్ షిప్ కి ఉండే వైర్ లు అన్నీ గజిబిజిగా ఉన్నాయని , వాటిని ఎవరైతే సరిగ్గా కనెక్షన్ చేసి తమ జెండాలని అందులో మొదటగా అమర్చినవారే అర్హులని బిగ్ బాస్ చెప్పాడు. అయితే ఈ టాస్క్ లో పల్లవి ప్రశాంత్, గౌతమ్ కృష్ణ పాల్లొనగా అతి తక్కువ టైమ్ లో గౌతమ్ కృష్ణ గెలిచాడు. దీంతో జిలేబీపురంలోని హౌజ్ మేట్స్ మెజారిటీ టాస్క్ లు గెలిచి ఫైనల్ టాస్క్ కి చేరుకున్నారు. మరి ఈ ఫైనల్ టాస్క్ లో గెలిచేదెవెరో? ఈ వారం కెప్టెన్ గా ఎవరు అవుతారనే క్యూరియాసిటి ఇప్పుడు ప్రేక్షకులలో నెలకొంది.

తేజకి బిగ్ బాస్ వార్నింగ్.. ఎపిసోడ్-47 రివ్యూ!

బిగ్ బాస్ సీజన్-7 లో ఇప్పటికే ఆరు వారాలు పూర్తయ్యాయి. ‌ఇప్పుడు ఏడో వారం కొనసాగుతుంది. అయితే ఇందులో వరుసగా అమ్మాయిలే ఎలిమినేట్ అయి బయటకు వెళ్లారు. కాగా ఇప్పుడు నామినేషన్లో ఉన్నవారిలో అశ్విని, పూజామూర్తి, టేస్టీ తేజ లీస్ట్ లో ఉన్నారు. నలభై అయిదవ రోజు మైండ్ బ్లాక్ పాటతో మొదలైంది. పాటకి హౌస్ మేట్స్ అంతా అదిరిపోయే స్టెప్పులేసి రోజుని ప్రారంభించారు. ఆ తర్వాత టీ స్టాల్ బంటి గా అమర్ దీప్, అందమైన అమ్మాయిగా అశ్విని, అంబటి అర్జున్ రౌడీగా, అతనికి చెంచాగా పల్లవి ప్రశాంత్, విడిపోయిన భార్యభర్తులుగా శోభాశెట్టి, టేస్టీ తేజ, పెద్ద మనిషిగా శివాజీ వారి వారి పాత్రలలో పర్ఫామెన్స్ మొదలెట్టారు. అయితే మళ్ళీ స్విమ్మింగ్ ఫూల్ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. అందులో అటువైపు ఆట సందీప్, ప్రియాంక జైన్ స్ట్రాటజీతో గెలిచారు. ఇక ఇటు వైపు అమర్ దీప్, టేస్టీ తేజ అలా గెలవలేకపోయారు‌. అదంతా చూసిన శోభా శెట్టిలో మోనిత బయటకొచ్చేసింది. మాస్టర్ అండ్ ప్రియాంక ఫౌల్ ఆడుతున్నప్పుడు నువ్వు కూడా అలానే ఆడాలి కదా తేజ అని అడుగగా.. అది ఫౌల్ కదా నాకు అలా రాదని తేజ అంటాడు. దాంతో అలా రానప్పుడు ఎందుకెళ్ళావ్ అంటూ తెగ ఫీల్ అయిపోయింది. ఆ తర్వాత బ్యాటరీ వైర్స్ టాస్క్  ఇచ్చాడు బిగ్ బాస్. పల్లవి ప్రశాంత్, గౌతమ్ కృష్ణ మధ్యలో జరిగిన ఈ టాస్క్ లో స్వల్ప తేడాతో గౌతమ్ కృష్ణ గెలిచాడు. గేమ్ ముగిసాక బిగ్ బాస్ శోభా అనే పేరు రాసి ఒక కేకు పంపించాడు. దానికి ఒక వార్నింగ్ కూడా పంపించాడు. ముందుంది ముసళ్ళ పండగ తేజ అని వార్నింగ్ ఇచ్చాడు. నామినేషన్లో ఈసారి టేస్టీ తేజ చివర్లో ఉన్నాడు. బహుశా ఇది అతనికి ఒక హెచ్చరిక కావొచ్చు. మరి ఇది అర్థం చేసుకొని తేజ ఆడతాడో లేదో చూడాలి.  

కృష్ణ ముకుంద మురారి సీరియల్ లో ఊహించని మలుపు.. అసలేం జరిగిందంటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -292 లో.. ముకుంద వాళ్ళ అన్నయ్య ఎంట్రీ ఇస్తాడు. కార్ కి ఆక్సిడెంట్ అయిన దగ్గరికి వెళ్లి చూస్తాడు.. పడిపోయి ఉన్న మురారి దగ్గరికి వెళ్లి బ్రతికి ఉన్నాడో లేదో చూస్తాడు. బ్రతికి ఉన్నాడని అనుకొని తను ఆక్సిడెంట్ చేపించిన రౌడీల దగ్గరికి వెళ్లి.‌. నేను చెప్పినట్టు చేశారని చెప్తాడు. ఆ తర్వాత మురారిని హాస్పిటల్ కీ తీసుకొని వెళ్తారు. మరొక వైపు రేవతి అన్న మాటలు గుర్తుకు చేసుకుంటూ ప్రభాకర్ వెళ్తుంటాడు. ఇంతలో దారి పక్కన కొంతమంది ఉండడం చూసి ప్రభాకర్ బండి ఆపి అక్కడకీ వెళ్లి చూస్తాడు.  అక్కడ దెబ్బలు తగిలి పడిపోయి ఉన్న కృష్ణని చూసి ఏడుస్తు కొంతమంది మంది సహాయంతో హాస్పిటల్ కి తీసుకొని వెళ్తాడు. మరొక వైపు మురారి గురించి డాక్టర్ లు మాట్లాడుకుంటారు. ట్రీట్ మెంట్ బాగా చెయ్యండని ముకుంద వాళ్ళ అన్నయ్య డాక్టర్స్ కి చెప్తాడు. మరొక వైపు అన్నయ్య మురారి గురించి మాట్లాడాలని హాస్పిటల్ ఎందుకు రమ్మన్నాడని హాస్పిటల్ కి వచ్చిన ముకుంద ఆలోచిస్తుంది. అప్పుడే తన అన్నయ్య వచ్చి మురారికి దెబ్బలు తగినట్టు చెప్తాడు.  తనే అదంతా చేసినట్టు ముకుందకి చెప్పడు. మురారి బాగయ్యాక పెళ్లి చేస్కోమని తన ముకుందకి వాళ్ళ అన్నయ్య చెప్తాడు. మరొక వైపు డాక్టర్స్ కృష్ణకి ట్రీట్ మెంట్ చేస్తుంటారు. ప్రభాకర్ దగ్గరికి శకుంతల వస్తుంది. తనకి ప్రభాకర్ జరిగిందంత చెప్తాడు. మరొక వైపు ముకుంద వాళ్ళ అన్నయ్య మురారికీ ట్రీట్ మెంట్ చేస్తున్న డాక్టర్ కేబిన్ దగ్గరికి వస్తాడు. నేను చెప్పినట్లు చెయ్యండంటు బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఆ తర్వాత డాక్టర్స్ చేసేదేమీ లేక ఒప్పుకుంటాడు. మరొక వైపు కృష్ణ బాగయ్యాక మనతో తీసుకొని వెళదామని ప్రభాకర్ తో శకుంతల అంటుంది. ఆ తర్వాత కృష్ణ స్పృహలోకి వస్తుంది‌. దాంతో ప్రభాకర్, శకుంతల ఇద్దరు కృష్ణ దగ్గరికి వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

జీతాలు పెంచమని లెక్చరర్స్ డిమాండ్.. పరిష్కరించిన రిషి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -898 లో.. వసుధార దగ్గరికి కాలేజీ ఫాకల్టీ వచ్చి జీతాలు పెంచాలని అడుగుతారు. ఇప్పటికిప్పుడు జీతాలు పెంచాలంటే ఎలా కొంచం టైం కావాలని వసుధార చెప్తుంది. మాకు జీతాలు పెంచితేనే క్లాస్ లు చెప్తామని ఫాకల్టీ చెప్పి వెళ్ళిపోతారు. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు. వీళ్ళతో ఎవరైనా ఇలా మాట్లాడిస్తునారా అని వసుధారకి అనుమానం కలుగుతుంది. మరొక వైపు ఆ ఫాకల్టీ వెళ్లి శైలేంద్రని కలుస్తారు. మీరు చెప్పినట్టే ఎండీ దగ్గరికి వెళ్లి మాట్లాడాము సర్ అని ఫాకల్టీ చెప్పగానే.. మంచి పని చేశారు. జీతాలు పెంచే వరకు కాలేజీకీ రాకండి వాల్లే జీతాలు పెంచుతారని శైలేంద్ర చెప్తాడు. మరొకవైపు వసుధారతో రిషి ఫోన్ మాట్లాడుతాడు. అన్ని ఫైల్స్ చెక్ చెయమని రిషి చెప్తాడు. ఆ తర్వాత ఫాకల్టీ వచ్చిన దాని గురించి రిషికి వసుధార చెప్తుంది. నువ్వేం టెన్షన్ పడకు నా దగ్గర ఒక ఐడియా ఉందని వసుధారకి రిషి చెప్తాడు. కాసేపటికి వసుధార దగ్గరకు రిషి వస్తాడు.  మీరు ఏదో ఐడియా ఉందని అన్నారని వసుధార అడుగుతుంది. లెక్చరర్ కోసం పోస్ట్ పెట్టాను. వాళ్ళు శాలరీకి పని చేసే వాళ్ళు కాదని రిషి వసుధారకి చెప్పగానే వసుధార హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత స్టూడెంట్స్ లీడర్ ని రిషి పిలిచి లెక్చరర్స్ గురించి చెప్తాడు. అంతే కాకుండా నేను కూడ లెక్చరర్ గా జాయిన్ అవుతున్నానని రిషి చెప్పగానే స్టూడెంట్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత రిషిని వసుధార హగ్ చేసుకోని.. లవ్ యూ అని చెప్తుంది. ఇంత చిన్న ప్రాబ్లమ్ కి కంగారు ఎందుకని వసుధారతో రిషి చెప్తాడు. ఆ తర్వాత శైలేంద్ర, ఫణింద్ర, దేవయాని ముగ్గురు కలిసి మహేంద్ర దగ్గరకు వస్తారు. మీరు అక్కడకు రండి అని దేవయాని అంటుంది. లేదు డాడ్ ఇక్కడ కూడా అలాగే ఉన్నారు ఇంకెక్కడికైన కొన్ని రోజులు తీసుకొని వెళ్ళాలని అనుకుంటున్నానని రిషి అంటాడు. ఎక్కడకని శైలేంద్ర అడుగుతాడు. ఎక్కడకైతే నీకెందుకని ఫణింద్ర అంటాడు. నేను కూడ వస్తానని దేవయాని అడుగుతుంది. వద్దని ఫణింద్ర అంటాడు. శైలేంద్ర నువ్వు వెళ్ళు వాళ్లతో అని దేవయాని  చెప్పగానే..  సరే అని శైలేంద్ర అంటాడు. పానకంలో పుడక లాగా నువ్వు ఎందుకని శైలేంద్రతో ఫణీంద్ర అంటాడు. నేను వెళ్తున్నాను. వాళ్ళని నేను చూసుకుంటానని వసుధార చెప్తుంది. కాసేపటికి మహేంద్రతో ఫణీంద్ర మాట్లాడి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

అప్పు కోసం కళ్యాణ్.. రాహుల్ ని బ్లాక్ మెయిల్ చేసిన మైఖేల్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -231 లో... రాజ్ కావ్య ఇద్దరిని దొంగలు అంటూ షాప్ ఓనర్ పోలీసులని పిలుస్తాడు. ఆ తర్వాత మేం దొంగలం కాదని రాజ్, కావ్య చెప్పే ప్రయత్నం చేసిన వాళ్ళు నమ్మరు. అయితే మీరు భార్యభర్తలు అనడానికి సాక్ష్యం చూపించండని పోలీస్ అడుగుతాడు. అయ్యో ఫోన్ ఇంటిదగ్గరే మర్చిపోయామని చెప్తారు. రాజ్ కావ్య ఇద్దరు పోట్లాడుకుంటారు. వాళ్ళు అలా చిలిపిగా గొడవ పడడం చూసి.. మీరు భార్యభర్తలని నేను ఒప్పుకుంటున్న అని పోలీస్ చెప్తాడు. దాంతో రాజ్ కావ్య ఇద్దరు అక్కడ నుండి ఇంటికి బయల్దేరుతారు. మరొకవైపు రుద్రాణి నిద్రలేచేసరికి తన కాస్ట్లీ చీరలు అన్ని కప్పుకొని పడుకొని ఉన్న కనకాన్ని చుసిన రుద్రాణి.. తనని చిరాకుగా లేపుతుంది.  నా చీరలు ఎందుకు చుట్టుకున్నావని అడుగుతుంది.  చలి భరించలేక కప్పుకున్నా అని చెప్పి,  అన్ని చీరలు తీసి రుద్రాణికి ఇచ్చి వెళ్తుంది. మరొక వైపు రాహుల్ కి మైఖేల్ కాల్ చేస్తాడు. మైఖేల్ అని అనగానే రాహుల్ కంగారుగా గదిలో నుండి బయటకు వస్తాడు. రాహుల్ కంగారుగా రావడం చూసి ఏమైందని స్వప్న రాహుల్ వెనకాలే వస్తుంది. ఆ తర్వాత మైఖేల్ మాట్లాడుతూ.. పోలీస్ లు పట్టుకొని పోగానే నీ పని అయిపొయిందని అనుకోకు. నన్ను బయటకు తీసుకొని రా, లేదంటే నువ్వు నీ భార్యని చంపమని చెప్పిన ఆడియో రికార్డులు ఉన్నాయని రాహుల్ నీ బెదిరిస్తాడు మైఖేల్. అప్పుడే స్వప్న వచ్చి ఎవరతను? అంత కంగారు పడుతున్నావని రాహుల్ ని అడుగుతుంది. రాహుల్ ఏదో కవర్ చేసి స్వప్నని లోపలికి పంపిస్తాడు. ఆ తర్వాత మైఖేల్ ని బయటకు తీసుకొని వస్తానని చెప్తాడు.  వీడు ఇలాగే ఎప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తూనే ఉంటాడు. బెయిల్ పై తీసుకొని వచ్చి చంపెయ్యాలని రాహుల్ అనుకుంటాడు. మరొక వైపు కళ్యాణ్ ఎన్ని సార్లు కాల్ చేసిన అప్పు లిఫ్ట్ చేయదు. దాంతో కళ్యాణ్ డైరెక్ట్ గా ఇంటికి వచ్చి మీ అమ్మ బట్టలు తీసుకొని రమ్మని చెపింది. నిన్ను కూడ తీసుకొని రమ్మందని అప్పుని తీసుకొని వెళ్తాడు కళ్యాణ్. మరొక వైపు రాజ్ కావ్య ఇద్దరు ప్రొద్దున ఇంటికి వస్తారు. ఇంట్లో వాళ్ళు చూసి ఎక్కడికి వెళ్లారని అడుగుతారు.. రాజ్ బయటకు వెళదామని తీసుకొని వెళ్లారని కావ్య చెప్పి వెళ్ళిపోతుంది. రాజ్ కూడా తర్వాత మాట్లాడుతానంటు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

గ్రహాంతరవాసులని సంతోషపరిచే టాస్క్.. విజేత ఎవరో తెలుసా?

బిగ్ బాస్ హౌజ్ లో గత రెండు రోజులుగా నామినేషన్లతో హీటెడ్ ఆర్గుమెంట్ జరిగిన విషయం తెలిసిందే. అయితే బుధవారం నాటి ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ కి మొదటి టాస్క్ ఇచ్చాడు. మొదటి జట్టు లో.. అశ్విని శ్రీ, పల్లవి ప్రశాంత్, అంబటి అర్జున్, ఆట సందీప్, ప్రియాంక జైన్ ఉండగా, రెండవ జట్టులో శోభా శెట్టి, యావర్, టేస్టీ తేజ, గౌతమ్ కృష్ణ ఉన్నారు. ఇక మొదటి టాస్క్ కి సంచాలకులుగా శివాజీ వ్యవహరిస్తాడని బిగ్ బాస్ చెప్పాడు. హౌస్ లోని కంటెస్టెంట్స్ రెండు టీమ్ లుగా విభజించాడు బిగ్ బాస్.  జిలేబీపురం వర్సెస్ గులాబీపురం టాస్క్ మొదలైంది. ఈ రెండు ఊరి శివార్లలో ఒక గ్రహాంతరవాసుల  షిప్ ఆగిపోయిందని, వాళ్ళ వస్తువులు కొన్ని పోయాయని.. జిలేబీపురం, గులాబీపురంలో అవి ఉన్నాయని మీరు గెలిచి అవి తీసుకొస్తే మీలో ఒకరు కెప్టెన్సీ కంటెస్టెంట్ అవుతారని బిగ్ బాస్ చెప్పాడు. ఇదంతా గ్రహాంతరవాసులని సంతోషపరిచే టాస్క్ అని బిగ్ బాస్ చెప్పాడు. అయితే టాస్క్ జరిగేముందు రెండు ఊరిలోని వాళ్ళ క్యారెక్టర్ లతో ఫన్ జనరేట్ చేశాడు బిగ్ బాస్. అది పూర్తిగా సక్సెస్ అయిందనే చెప్పాలి. పర్ఫామెన్స్ వైజ్ గా అందరూ ఇరగదీశారు. ఛాయ్ అమ్మే వ్యక్తిగా అమర్ దీప్, జిలేబీపురం సర్పంచిగా శోభాశెట్టి, గులాబీపురం సర్పంచిగా ప్రియాంక జైన్, జిలేబీపురం సర్పంచి శోభా శెట్టి మాజీ భర్త పాత్రలో టేస్టీ తేజ, అంబటి అర్జున్ ఊరిలో రౌడి, అతనికి అసిస్టెంట్ కమ్ చెంచాగా పల్లవి ప్రశాంత్, ఇక ఊరిలో అందమైన అమ్మాయి అశ్విని శ్రీ.. తన చుట్టే అందరు అబ్బాయిలు తిరుగుతుంటారు. ఇక భోలే షావలి జ్యోతిష్యం చెప్పే వ్యక్తి, ఇక రెండు ఊర్లకి పెద్ద శివాజీ ఇలా హౌజ్ మేట్స్ అంతా తమ పాత్రలలో బాగా చేశారు. ఇక మొదటి టాస్క్ లో జిలేబీపురం అత్యధిక గుడ్లని తీసుకెళ్ళి గెలిచారు. అశ్విని శ్రీ, పల్లవి ప్రశాంత్, అంబటి అర్జున్, ఆట సందీప్ కలిసి ఈ టాస్క్ ఆడి గెలిపించారు. అయితే ఇరు జట్లకి ఒక్క గుడ్డు తేడానే ఉండటంతో శోభా శెట్టి ఎమోషనల్ అయింది. ఇది గేమ్ అంతే, నెక్స్ట్ గేమ్ మనం గెలుస్తామంటూ తనని ఓదార్చారు వాళ్ళ టీమ్ సభ్యలు. ఇక టాస్క్ లో ఇరు జట్లు తగ్గేదేలే అన్నట్టుగా చేశారు‌.  

రతిక రీఎంట్రీ.. బిగ్ బాస్ ఉల్టా పల్టాతో మైండ్ బ్లాక్!

బిగ్ బాస్ హౌస్ లో రతిక శకం ముగిసిందని  అనుకున్నారంత. కానీ ఆట మళ్ళీ మొదలవబోతుంది. బిగ్ బాస్ ఇచ్చే ట్విస్ట్ లకి అటు కంటెస్టెంట్స్ కి ఇటు ఆడియన్స్ కి మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే హౌస్ లో వీళ్ళు బాగా ఆడట్లేదని అనుకున్న ప్రతీసారీ వాళ్లని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా మారుతున్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటికే కిరణ్ రాథోaడ్, షకీల, రతిక, దామిణి, శుభశ్రీ, నయని పావని వరుసగా అమ్మాయిలే ఎలిమినేట్ అయి బయటకు వెళ్ళారు. దీంతో బిగ్ బాస్ ఆట మరింత క్రేజ్ పొందడానికి ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఇస్తున్నాడు. హౌస్ లోకి 2.0 గా అయిదుగురు కొత్త కంటెస్టెంట్స్  ని తీసుకొచ్చి ఒక ట్విస్ట్ ఇవ్వగా, ఇప్పుడేమో దామిణి, శుభశ్రీ, రతికరోజ్ లలో ఒకరిని హౌస్ లోకి తీసుకురావటానికి ఓటింగ్ పెట్టాడు బిగ్ బాస్. గత వారం వీళ్ళ ముగ్గురిని హౌస్ లోకి పిలిపించిన నాగార్జున.. ఓటింగ్ రిక్వెస్ట్ చేపించాడు. ఎవరైతే హౌస్ లో బాగుంటుందని అనుకుంటున్నారే వారికే ఓటేయ్యండని హౌస్ మేట్స్ తో బిగ్ బాస్ చెప్పగా ఎక్కువ మంది శుభశ్రీకి వేసినట్లు, ఇక మిగతా సగం దామిణికి వేసినట్లుగా తెలుస్తుంది. అయితే అందరు ఓటింగ్ చేసాక నాగార్జున ట్విస్ట్ ఇచ్చాడు. ఇది ఉల్టా పుల్టా అంటూ ట్విస్ట్ ని రివీల్ చేశాడు. ఎక్కువ ఎవరికి ఓటింగ్ చేస్తారో వారు కాదు ఎవరికి లీస్ట్ ఓటింగ్ పడుతుందో వారే హౌస్ లోకి రీఎంట్రీ ఇస్తారని చెప్పగా హౌస్ మేట్స్ అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.  ఇటు ఆడియన్స్ కూడా ఆశ్చర్యపోయారు. అయితే తాజాగా రతిక ఇన్ స్టాగ్రామ్ లో రీ ఎంట్రీ గురించి పోస్ట్ చేసింది. " లైఫ్ లో ఎవరికి సెకెండ్ ఛాన్స్ రాదు‌. వచ్చిందంటే దానిని సరిగ్గా వాడుకోవాలి‌. మనం గతంలో చేసిన తప్పులని సరిదిద్దుకోవాలి" అని మా నాన్న చెప్పాడంటూ పోస్ట్ లో చెప్పుకొచ్చింది రతిక. ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఒకసారి రతిక హౌస్ లోకి ఎంట్రీ ఇస్తే అపోజిట్ కంటెస్టెంట్స్ కి బ్యాండ్ బాజే అని తన అభిమానులు అంటున్నారు.  

కృష్ణ ముకుంద మురారి సీరియల్ లో కొత్త క్యారెక్టర్ ఎంట్రీ.. ఆ విలన్ ఎవరు?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ లో కథ కొత్తగా మలుపు తిరిగింది. నిన్న మొన్నటిదాకా ముకుంద చేసే పనులతోనే కృష్ణ, మురారీల మధ్య దూరం పెరిగిందంటే.. ఇప్పుడు మరో కొత్త విలన్ ఎంట్రీ ఇచ్చాడు. అసలెవరితను? ఎందుకొచ్చాడంటూ ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తుండగా అతనెవరో కాదు. ముకుందకి అన్నయ్య అని తెలస్తుంది. మరి ఇతనేం చేశాడు? ఇంతకముందు ఎక్కడున్నాడంటు పలు ఆసక్తికరమైన ప్రశ్నలు అభిమానులు అడుగగా.. వారి ప్రశ్నలకి సమధానంగా నిన్నటి ఎపిసోడ్ లో.. అతను ముకుంద వాళ్ళ అన్నయ్య అని తెలిసింది. తన ప్రేమని మురారి అర్థం చేసుకున్నాడని లెటర్ చదివి  తెలుసుకున్న కృష్ణ.. కార్ లో వెళ్తూ.. సంతోషంగా ఐ లవ్ యూ ఏసీపీ సర్ అని అనగానే వెనుకాల నుండి లారీ వచ్చి ఢీ కొడుతుంది. ఆ తర్వాత ఒక అంబులెన్స్ వస్తుంది. అందులో నుండి దిగిన వ్యక్తి గాయాలతో పడిఉన్న కృష్ణ, మురారీలని చూసి నవ్వుకొని వెళ్ళిపోతాడు. కాసేపటికి ముకుంద వాళ్ళ నాన్న శ్రీనివాస్ ఇంటికి వెళ్లి కాలింగ్ బెల్ నొక్కగానే.. శ్రీనివాస్ వస్తాడు. ఈ విలన్ ని చూసిన శ్రీనివాస్.. నువ్వా? జైలు నుండి ఎప్పుడొచ్చావ్? ఎందుకు వచ్చావని అడుగుతాడు. అవేమీ పట్టించుకోకుండా ముకుంద ఎలా ఉంది. నేను అన్నం తినేసి వెళ్తానని అంటాడు. ఆ తర్వాత ముకంద వస్తుంది. తనని చూసిన ఈ విలన్ వచ్చి కౌగిలించుకొని.. ఎప్పుడు తనని సంతోషంగా చూసుకుంటానని మాటిస్తాడు. ముకుందకి అన్నగా కొత్త పాత్రగా ఈ కథలోకి వచ్చాడు విలన్‌. అయితే ముకుంద ఇతనితో ముందే చెప్పిందా లేక ఇతను ముకుంద జీవితాన్ని దగ్గరుండి తెలుసుకున్నాడా అనేది సస్పెన్స్ గా మారింది. మరి యాక్సిడెంట్ లో గాయాల పాలైన కృష్ణ, మురారీలు బ్రతుకుతారా? ఈ విలన్ రోల్ ఎలా ఉండబోతుందని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

మీ ఇద్దరి కోసమే హౌస్ లో ఉంటున్నాను.. శివాజీ ఎమోషనల్!

బిగ్ బాస్ హౌస్ లో శివాజీ ఎమోషనల్ అయ్యాడు. అతని చేతికి ఎంత నొప్పి ఉన్నా భరిస్తున్నాడు. ఎవరు మాటలన్నా సానుకూలంగా స్పందిస్తూ, నవ్వుతూ పలకరిస్తున్నాడు శివాజీ. అయితే నామినేషన్లో శివాజీని గౌతమ్ కృష్ణ అన్న మాటలకి అతను బాగా హర్ట్ అయినట్టు తెలుస్తోంది. నామినేషన్లు  పూర్తయ్యాక శివాజీ బెడ్ మీద కూర్చొని ఉండగా.. యావర్ అక్కడ ఉంటాడు. ఇక అతడితో తను అనుభవిస్తున్న నొప్పి గురించి శివాజీ చెప్తాడు. " నేను ఇక్కడ ఉండలేనురా.. రాత్రి నుంచి చాలా దిగులుగా ఉంది.. నా బిడ్డల మీద ఒట్టేసి చెబుతున్నా.. కేవలం మీ ఇద్దరి కోసమే నేను ఇక్కడున్నాను.. లేకపోతే నాగార్జున బాబు గారిని అడిగి ఎప్పుడో వెళ్లిపోయే వాడిని" అంటూ యావర్‌తో చెబుతూ బాధపడ్డాడు శివాజీ. దీంతో వెంటనే శివాజీని హగ్ చేసుకొని.. ఏంటి సార్ మీరు ఇలా అంటారు.. మీరు చాలా స్ట్రాంగ్ అని యావర్ ధైర్యం చెప్పాడు. "నా వల్ల కావట్లేదురా.. నేను స్ట్రాంగే కానీ ఇంత బాధ ఎప్పుడూ అనుభవించలేదని చెప్తూ శివాజీ ఎమోషనల్ అయ్యాడు.  ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ రాగానే. ‌ మీ ఇద్దరి కోసమే ఈ హౌస్ లో ఉన్నానురా, నాకు నొప్పి ఉన్నా మీ కోసం ఉంటున్నానంటు శివాజీ కన్నీళ్ళు పెట్టుకున్నాడు. గురువు కన్నీళ్ళని చూసిన పల్లవి ప్రశాంత్, యావర్ లు ఏడ్చేశారు. ఇదంతా మోస్ట్ హార్ట్ టచింగ్ గా సాగింది. ఇప్పుడు వీళ్ళకి మరింత ఫ్యాన్ బేస్ పెరిగే ఛాన్స్ ఉంది. బిగ్ బాస్ చరిత్రలో ఇప్పటివరకు ఏ సీజన్‌లోను గురుశిష్యుల రిలేషన్ లేదు. మొట్టమొదటి సారి ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్, శివాజీల మధ్య ఒక ప్యూర్ గురుశిష్యుల రిలేషన్ ఉంది. దీనిని బిగ్ బాస్ చూసే ప్రేక్షకులు తెగ ఇష్టపడుతున్నారని తెలుస్తుంది. ఎందుకంటే ఈ ముగ్గురిలో ఎవరు నామినేషన్లో వాళ్ళే టాప్ లో ఉంటున్నారు. ఇప్పటికే నామినేషన్లో ఉన్న పల్లవి ప్రశాంత్ నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు.