కవితక్కతో బతుకమ్మ ఆడిన జ్యోతక్క.. వైరల్ గా మారిన వ్లాగ్!
తెలంగాణలో బతుకమ్మ పండుగని ఎంత గ్రాండ్ గా జరుపుకుంటారో తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ప్రతీ ఏటా బతుకమ్మ ఆటలో పాల్గొంటుంది. ఈ సారి కవితక్కతో కలిసి జ్యోతక్క బతుకమ్మని సెలబ్రేట్ చేసుకుంది. బతుకమ్మ పండుగలో భాగంగా తెలంగాణలో అతిముఖ్యమైన చివరి రోజుని 'సద్దుల బతుమ్మ' అంటారు. ఈ రోజుని తెలంగాణ మొత్తం అత్యంత వైభవంగా గౌరీదేవిని పూజిస్తూ పండుగలా జరుపుకుంటారు. గౌరీదేవి అనగా పార్వతీదేవిని కొలుస్తూ తీరొక్క పూవు తీసుకొచ్చి బతుకమ్మగా పేర్చి జరుపుకునే ఈ పండుగ అంటే ప్రతీ ఆడబిడ్డ గౌరవంగా భావిస్తుంది.
కవితక్కతో కలిసి బతుకమ్మ పండుగని జరుపుకుంది జ్యోతక్క. శివజ్యోతి అలియాస్ తీన్మార్ సావిత్రి.. అందరికి సుపరిచితమే. అందరిని కలుపుకుపోయే శివజ్యోతి మాటతీరుని చూసి ఇష్టపడని వారంటు ఎవరూ ఉండరు. బిగ్ బాస్ ద్వారా కోట్లాది ప్రేక్షకులకు దగ్గర అయింది శివజ్యోతి. బిగ్ బాస్ తో సెలబ్రిటీ లిస్ట్ లో చేరింది. తీన్మార్ సావిత్రిగా ప్రముఖ టీవీ ఛానల్ లో న్యూస్ రీడర్ గా చేసిన శివజ్యోతి.. తన మాట తీరుతో అందరిని ఆకట్టుకుంది. తెలంగాణ యాసతో పాటు తను మాట్లాడే తీరు ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా చేసింది. దాంతో మంచి క్రేజ్ సంపాదించుకుంది శివజ్యోతి. అంతే కాకుండా బిగ్ బాస్ 3 లో ఎంట్రీ ఇచ్చి హౌస్ లో మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చి అందరిని ఆకట్టుకుంది. బిగ్ బాస్ 3 లో మోస్ట్ ఎమోషనల్ గా శివజ్యోతి ని చెప్తారు... బిగ్ బాస్ తర్వాత శివ జ్యోతి కి కెరీర్ కి బ్రేక్ పడింది మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేనంత మంచి సక్సెస్ఫుల్ లైఫ్ ని గడుపుతుంది. శివజ్యోతి ఒక యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసి ప్రేక్షకులకు న్యూస్ ని అందిస్తుంది. శివజ్యోతి న్యూస్ చదవడంలో ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చింది. చమాత్కరంతో వార్తలు చదవడంలో శివజ్యోతి తర్వాతనే మరొకరని అనడంలో ఆశ్చర్యం లేదు. అయితే శివజ్యోతి తన యూట్యూబ్ ఛానెల్, ఇన్ స్టాగ్రామ్ ద్వారా ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు దగ్గరగా ఉంటూ వస్తుంది. శివజ్యోతి భర్త గంగూలీ కూడా అందరికి సుపరిచితమే. అప్పట్లో శివజ్యోతి, గంగూలీ కలిసి ఇస్మార్ట్ జోడిలో పార్టిసిపేట్ చేసి అందరిని మెప్పించారు. అయితే కొన్నిరోజుల క్రితం శివజ్యోతి చేసిన ' పెద్దమ్మ తల్లికి యాటను కోసినం' అనే వ్లాగ్ ఎంత వైరల్ అయిందో అందరికి తెలిసిందే.
ఈసారి అటు ఎన్నికలు, ఇటు బతుకమ్మ రెండు ఒకేసారి వచ్చాయి. రెండింటిని ఎలా మేనేజ్ చేస్తున్నారని కవితక్కని శివజ్యోతి అడుగగా.. మన సంస్కృతిని మర్చిపోకూడదు కదా, దేనికి ఇవ్వాల్సిన ఇంపార్టెంట్ దానికి ఇవ్వాలి. వేరుని మర్చిపోతే చెట్టు పడిపోతుంది. మన తెలంగాణ సంస్కృతిని కాపాడుతూ రసమయి అన్న పాటలు, ఉద్యమంలో పాల్గొన్న యువత, ఆడబిడ్డల బతుకమ్మ అన్నీ మనవే.. వాటిని మనమే కాపాడుకోవాలని కవిత అంది. అప్పటికి ఇప్పటికి బతుకమ్మ చాలా వ్యత్యాసం ఉంది కదా అని జ్యోతక్క అడుగగా.. అవునని, అప్పుడు మైక్ లు పెట్టుకొని బతుకమ్మ ఆడితే పోలీసుల లాటీఛార్జ్ లు కూడా అయ్యాయని, ఇప్పుడు తెలంగాణ మొత్తం జరుపుకుంటున్నామని, ఇక్కడే కాదు పక్క దేశాల్లో కూడా మనవాళ్ళు బతుకమ్మ జరుపుతున్నారని కవిత అంది. మొన్న న్యూజిలాండ్ లో బతుకమ్మ పండుగ చేస్తే అక్కడి ప్రధాని వచ్చాడని, ప్రపంచవ్యాప్తంగా మన బతుకమ్మ పాపులారిటీ తెచ్చుకుంటుందని కవిత అంది. ఇలా కవితక్కతో జ్యోతక్క బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోవడం దానిని తన యూట్యూబ్ ఛానెల్ లో వ్లాగ్ గా చేయడంతో ఫుల్ వైరల్ గా మారింది.