కుమారి ఆంటీ పిక్ స్పూఫ్...లేడీ గెటప్ లో జెస్సి!

  ఢీ సెలబ్రిటీ స్పెషల్ ఈ వారం షో ఫుల్ గా ఎంటర్టైన్ చేసింది. డాన్సస్ తో పాటు స్కిట్స్ కూడా ఉండే షో ఇది.  ఎంటర్టైన్ తో పాటు ఎలిమినేషన్స్ హడావుడితో కాసేపు కంటెస్టెంట్స్ ని టెన్షన్ కూడా పెట్టింది. ఇక ఈ వారం ఎపిసోడ్ లో హైపర్ ఆది కెమెరా మ్యాన్ గా అందరినీ ఫోటోలు తీస్తూ ఫన్ క్రియేట్ చేసాడు. ఇక ఇందులో శ్వేతానాయుడుని ఫొటో తీస్తాను అని చెప్పి స్టేజి మీదకు పిలిచి ఆమెను ఫొటోస్ తీసాడు. ఐతే  ఆ ఫొటోస్ సరిగా రాకపోయేసరికి కెమెరా ప్రాబ్లమ్ అనుకున్నా కానీ శ్వేతా నాయుడు మొహమె ప్రాబ్లమ్ అనుకోలేదంటూ ఆమె ఫేస్ గురించి కామెడీ చేసాడు. తర్వాత ఆ ఫోటోని మార్ఫింగ్ చేసి ఫిష్ మార్కెట్ లో చేపలు తరిగే అమ్మాయిలా మార్చి స్క్రీన్ మీద చూపించేసరికి అందరూ షాకైపోయి తర్వాత నవ్వేశారు. అలాగే సునంద మాలను కూడా ఫొటోస్ తీసి ఆ ఫోటోని కూడా మార్ఫింగ్ చేసాడు. ఈమధ్య సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న కుమారి ఆంటీ పిక్ లా చేసి బ్యాక్ స్క్రీన్ మీద వేసాడు. అలా ఆది కుమార్ ఆంటీ పిక్ స్పూఫ్ తో షోలో ఉన్న అందరినీ నవ్వించేసాడు. "రెండు లివర్ ఎక్కువేస్తే వెయ్యి రూపాయలు" అంటూ కూడా కామెడీ చేసాడు. తర్వాత జెస్సి ఫోటోని ఒక హీరోయిన్ ఫొటోతో కలిపి  మార్ఫింగ్ చేసేసరికి శేఖర్ మాస్టర్  ప్రణీత ఇద్దరూ కలిసి ఆ పిక్ ఒరిజినల్ అనుకుంటా అంటూ కామెడీ చేశారు. ఇక చివరికి ఈ షోలో జెస్సి, శ్రీప్రియ ఎలిమినేషన్ లో ఉండేసరికి మిగతా కంటెస్టెంట్స్ తో ఓట్స్ వేయించాడు హోస్ట్ నందు. ఐతే జెస్సికి కంటెస్టెంట్స్ అంతా ఎక్కువ ఓట్లు చేశారు. డాన్స్ తో పాటు మంచి ఫన్ కూడా చేస్తాడు అని చెప్పారు. ఐతే లాస్ట్ మినిట్ లో శేఖర్ మాష్టర్ ఈ వారానికి ఎలిమినేషన్ లేదని కానీ నెక్స్ట్ వీక్ మాత్రం ఎలిమినేషన్ ఉంటుందని  కచ్చితంగా చెప్పారు. ఇలా ఈ వారం షో ఎండ్ అయ్యింది.  

అన్నీ మూసుకుని ఉండండి..తినడానికి లేని సిగ్గు వండడానికి ఎందుకు ?

  ఫిబ్రవరి 14 వేలంటైన్స్ డే వస్తోందంటే చాలు ప్రపోజ్ డే అని, చాక్లేట్ డే అని, రోజ్ డే అని ఈ వారం మొత్తం ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఐతే వాలెంటైన్స్ డేని సమర్ధించేవాళ్ళు కొంతమంది ఉంటే దానికి  తిరస్కరించేవాళ్ళు మాత్రం చాలామందే ఉన్నారు. ఇక ఇలా వాలెంటైన్స్ అంటూ రెచ్చిపోయే కొందరిని నటి మాధవి లతా ఘాటుగా తిడుతూ ఒక వీడియోని రిలీజ్ చేసింది. "ఛి దీనెమ్మ.. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు..వాలెంటైన్స్ డే వస్తోంది ప్లాన్స్ ఏంటి రా అని ఒక ఏఐ వాయిస్ అడిగితే నువ్వు దిక్కులేని వాడివి, నేను దిక్కులేని వాడిని ఇద్దరం ఒకరికొకరం తోడు..మీ బొంద..మీ  బొంద..అబ్బాయిలకైతే డబ్బులు బొక్క.. అమ్మాయిలకైతే అన్నీ బొక్క..మూసుకుని మడతేసుకుని ఇంట్లో కూర్చోండి... అర్దమైతాందా.. వాలెంటైన్స్ డే వస్తే సింగల్ స్టేటస్ మావా సింగల్ స్టేటస్..ఏ ఉండలేరా" అంటూ గట్టిగానే ఇచ్చిపడేసింది. ఇక నెటిజన్స్ కొందరు ఆమెకు రిప్లైస్ ఇచ్చారు "బాగా చెప్పారు మేడం ట్రూ లవ్ ఎక్కడుంది అంతా డబ్బే...చాలా బాగా చెప్పారు...మీ డ్రెస్ బాగుంది" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే పెళ్ళైన మగవాళ్ళను కూడా ఘాటుగా తిట్టిపారేసింది. "తినడానికి లేని సిగ్గు వండడానికి ఎందుకు...సమానంగా నువ్వు కూడా గాలి పీల్చుకుంటున్నప్పుడు సమానంగా పని చేయాలి..పెళ్లాలంటే ఇంట్లో పని మనుషులా..మీ అమ్మ పని చేసేటప్పుడు మీరు బాధపడ్డారు కదా...ఇంట్లో మీరు కూడా తిరుగుతారు కదా క్లీన్ గా  ఉంచుకునే బాధ్యత మీకు లేదా. సిగ్గుపడేంత పని ఏం చేస్తున్నావేంటి...షేర్ చేసుకుంటే సిగ్గు పడడానికి.. బానిసత్వం వద్దని స్వాతంత్రం తెచ్చుకుని ఇప్పుడు ఆడోళ్లకు బానిసత్వం ఎందుకు ఇస్తున్నార్రా మీరు " అని కడిగిపారేసింది.

Eto Vellipoyindhi Manasu : ఆ రింగ్ కోసం ఇల్లు తాళం పగులగొట్టారు.. నా కష్టాన్ని డబ్బుతో వెలకడుతున్నారా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -15 లో.. రింగ్ దొరికింది అమ్మ అని సీతాకాంత్ తన తల్లికి హ్యాపీగా చెప్తాడు. క్యాబ్ లో పడిపోయింది ఆ అమ్మయి కీ ఫోన్ చేస్తున్నా కట్ చేస్తున్నారు. నేను ఆఫీస్ కీ వెళ్తున్నా మీటింగ్ ఉంది అంటు సీతాకాంత్ వెళ్తాడు. ఆ తర్వాత శ్రీవల్లి పరుగున వచ్చి గోల్డ్ షాప్ కి వెళదామా మీ సవతి కొడుకుకి ఇంకొక రింగ్ కొనడానికి అని తన అత్త శ్రీలతతో అంటుంది. ఆ తర్వాత సీతాకాంత్ వాళ్ళ అమ్మ శ్రీలత పీఏకీ ఫోన్ చేసి క్యాబ్ అమ్మాయి డీటెయిల్స్ లొకేషన్ ని షేర్ చెయ్యమని చెప్తుంది. అంటే ఇప్పుడు మీరు ఆ డ్రైవర్ వాళ్ళ ఇంటికి వెళ్తారా అని శ్రీవల్లి అడుగుతుంది. వెళ్తాను ఆల్రెడీ వాళ్ళు ఆ రింగ్ పట్టుకొని పారిపోయి ఉంటారని అతను అనగా.. కానీ నేను అంత తేలికగా వదిలి పెట్టనని శ్రీలత అంటుంది. ఆ తర్వాత శ్రీలత తన సెక్యూరిటీ వాళ్లని తీసుకొని రామలక్ష్మి ఇంటికి వస్తుంది. వాళ్ళ ఇంటికి తాళం వేసి ఉండడంతో సెక్యూరిటీ తాళం పగులగొట్టి ఇల్లంతా చిందర వందర చేస్తారు. అప్పుడే రామలక్ష్మి అమ్మ మరియు పింకీ ఇద్దరు గుడికి వెళ్లి వస్తుంటే.. ఒక అబ్బాయి కలిసి మీ ఇంటి తాళం ఎవరో పగులగొట్టారని చెప్పగానే.. ఇద్దరు ఇంటికి పరుగున వెళ్తారు. ఎవరు మీరు? ఏం చేస్తున్నారని అడుగుతారు. రింగ్ ఎక్కడ పెట్టారో చెప్పమని ఓ సెక్యూరిటీ అతను రామలక్ష్మి వాళ్ళ అమ్మని అడుగుతాడు.. మాకేం తెలియదని వాళ్ళు చెప్తారు.  మరొకవైపు సీతాకాంత్ ని కలవడానికి రామలక్ష్మి తన ఆఫీస్ కి వెళ్తుంది. సీతాకాంత్ దగ్గరికి వెళ్లిన రామలక్ష్మి రింగ్ ఇస్తుంది. ఆ రింగ్ చూసి అతను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ.. ఇది మా అమ్మ ఇచ్చిన గిఫ్ట్ అంటూ చెప్తాడు. రింగ్ తోసుకొని వచ్చినందుకు కృతజ్ఞతగా.. కొంత డబ్బును సీతాకాంత్ ఇస్తాడు. నా నిజాయితి కీ వెలడుతున్నారా అంటు రామలక్ష్మి చెప్పి తీసుకోదు. మరొక వైపు మాణిక్యంం తన ఇంటికి ఎవరో వచ్చి గొడవ చేస్తున్నారని తెలిసి కోపంగా వెళ్తాడు. సీతాకాంత్ తన అమ్మ శ్రీలతకి ఫోన్ చేసి.. రింగ్ దొరికింది అని చెప్తాడు. దాంతో శ్రీలత తన సెక్యూరిటీ వాళ్ళని తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత మాణిక్యం ఇంటికి వస్తాడు. కాసేపటి తర్వాత రామలక్ష్మి ఇంటికి వస్తుంది. చిందర వందరగా ఉన్న వస్తువులని చూసి.. ఏమైంది అని అడుగుతుంది. రింగ్ పోగొట్టుక్కున్న వాళ్ళ అమ్మ అంట.. రింగ్ ఎక్కడ అంటు తన మనుషులని తీసుకొని వచ్చి ఇలా చేసిందని పింకి చెప్పగానే.. రామలక్ష్మి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Krishna Mukunda Murari : ఆ కాంపిటీషన్ ఇక ఇంట్లోనే.. ముకుందలో మొదలైన టెన్షన్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి '. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -387 లో.. నాకు ఈ కాంపిటేషన్ లో పాల్గొనాలని లేదు.. ప్లీజ్ ఏదో ఒకటి చేసి ఇది క్యాన్సిల్ చేయండి అని ఆదర్శ్ ని ముకుంద రిక్వెస్ట్ చేస్తుంది. ఇక పూర్తిగా ముకుంద మాయలోనున్న ఆదర్శ్.. తను ఏం చెప్పినా చేస్తుంటాడు. ఆ తర్వాత ముకుంద అన్న మాటల గురించి ఆదర్శ్ ఆలోచిస్తుంటాడు. ఆ తర్వాత ఆదర్శ్ దగ్గరికి మధు వచ్చి.. దేని గురించి అంత డీప్ గా ఆలోచిస్తున్నావు.. ఏం కష్టం వచ్చింది చెప్పు అంటూనే, అసలు ఆ తొండ అక్కడికి ఎలా వచ్చింది అంటు మళ్ళీ తొండ టాపిక్ తీస్తుంటాడు. ఎలా వచ్చిందో చెప్తాను అంటు ఆదర్శ వెటకారంగా తొండ గుడ్డులో నుoడి వచ్చిందని చెప్పి వెళ్ళిపోతాడు. మధు అలాగే చూస్తూ ఉండిపోతాడు. మరొకవైపు తన ఫ్రెండ్ తో కాల్ మాట్లాడి మురారి కోపంగా ఫోన్ కట్ చేస్తాడు. ఏమైంది మీ ఫ్రెండ్ తో మాట్లాడి అలా చేస్తున్నారని కృష్ణ అడుగుతుంది. తను మనకి ఈ కాంపిటేషన్ కండక్ట్ చేసి హెల్ప్ చేస్తున్నాడని చెప్పాను కదా, ఆ కాంపిటేషన్ క్యాన్సిల్ చేసాడనే కోపంగా ఉందని మురారి అంటాడు. క్యాన్సిల్ అయి మంచి పని అయింది.. ఎందుకంటే ఇప్పుడు ఈ కాంపిటీషన్ ని మనమే ఇంట్లో కండక్ట్ చేసుకుందాం.. మనమే విన్నర్ ని డిసైడ్ చేద్దామని కృష్ణ అనగానే.. అవును నిజమే తింగరి అని మురారి అంటాడు. ఈ విషయం వెళ్లి ఇంట్లో వాళ్ళకి చెప్పాలని ఇద్దరు అనుకుంటారు. ఆ తర్వాత ముకుంద, ఆదర్శ్ ఇద్దరు కిందకి వస్తారు. ఆదర్శ్ కాంపిటీషన్ వద్దని భవానికి చెప్పాలని అనుకుంటాడు. ఆ తర్వాత నువ్వు ఏం చెయ్యాలని అనుకుంటున్నావు.. జాబ్ మానేశావ్ కదా? ఇప్పుడేం చేస్తావని భవాని అడుగుతుంది. నువ్వేం చెప్తే అదే చేస్తానమ్మ అని ఆదర్శ్ చెప్తాడు. అప్పుడే కృష్ణ, మురారి ఇద్దరు అక్కడికి వస్తారు. కాంపిటేషన్ ఎక్కడ వరకు వచ్చింది.. ముకుంద డాన్స్ ఇరగదీస్తుందని నందు అనగానే.. అసలు కాంపిటీషన్ క్యాన్సిల్ అయిందని మురారి చెప్తాడు. ముకుంద హ్యాపీగా ఫీల్ అవుతుంది. అక్కడ క్యాన్సిల్ అయినా.. దాన్ని మనం ఇంట్లో చేసుకుందాం.. మనమే విన్నర్ ని అనౌన్స్ చేద్దామని కృష్ణ చెప్పగానే.. మళ్ళీ ముకుందలో టెన్షన్ మొదలవుతుంది. ఆ తర్వాత బయటకు వెళ్ళాలని కృష్ణ, మురారి వాళ్ళతో పాటు ఆదర్శ్, ముకుంద కూడా అనుకుంటరు. నువ్వు ఇలా రెడీ అయ్యావ్ ఏంటని ఆదర్శ్ లో మురారిని ఉహించుకొని‌ ముకుంద  మాట్లాడుతుంది. నిజంగానే ముకుంద తనతో ప్రేమగా మాట్లాడుతుందని ఆదర్శ్ ఆ భ్రమలో ఉండి.. ఇప్పుడే వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకుంటానని వెళ్తాడు.. ఆ తర్వాత కృష్ణ రెడీ అవుతుంటే మురారి తన బ్లౌస్ హ్యాంగింగ్స్ సెట్ చేస్తుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలాంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Guppedantha Manasu : వసుధారని కాపాడిన ఆ అజ్ఞాతవ్యక్తి ఎవరు.. ఇదంతా వాడి పనేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -993 లో.... ఒంటరిగా ఉన్న వసుధారని రాజీవ్ లాక్కొని వెళ్తుంటాడు. అప్పుడే అక్కడికి ఓ అజ్ఞాతవ్యక్తి వస్తాడు. ఎక్స్ క్యూజ్ మి అని అతను అనగానే‌‌.‌ వసుధార, రాజీవ్ ఇద్దరు అతని వంక చూస్తారు‌. ఇక అటువైపు‌ తిరిగి అతడిని చూసిన రాజీవ్.. ఎవరు నువ్వు.. అడ్రెస్ కావాలా అని అడుగుతాడు.  కాదు ఆ అమ్మాయిని వదిలేయ్ అని అతను అనగానే రాజీవ్ పట్టించుకోకుండా వసుధారని లాక్కొని వెళ్తుంటాడు. ఇక అతను వచ్చి రాజీవ్ చేతిని పట్టుకుంటాడు. చేతిని వదులు అని అతను అన్నా సరే రాజీవ్ వదలకుండ.. వదలని ఏం చేస్తావని పొగరుగా మాట్లాడతాడు. ఇక అతను గన్ తీసి రాజీవ్ కి గురి పెడతాడు. ఆమెని వదలకపోతే నిజంగానే కాలుస్తానని అతను అనగానే..‌కాసేపు ఆలోచించిన రాజీవ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రాజీవ్ వెళ్ళగానే.. మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయాలో చెప్పండి నేను డ్రాప్ చేస్తానని వసుధారని ఆ అజ్ఞాతవ్యక్తి అడుగగా.. నాకు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. మీరు వెళ్ళిపోండి అని అంటుంది. దాంతో అతను వెళ్ళిపోతాడు‌. మరోవైపు రిషి చనిపోయాడని ఇంట్లోవాళ్ళంతా అతడి ఫోటోకి దండ చేసి ఏడుస్తుంటారు. ఇక కాసేపటికి అక్కడికి వసుధార వచ్చి రిషి ఫోటోకి దండ చేసి ఉండటం గమనించి పరుగెత్తుకుంటూ వచ్చి ఆ ఫోటోకి ఉన్న దండ అవన్నీ తీసి పారేస్తుంది. ఎవరు ఈ పని చేసింది. మీరంతా ఏం అనుకుంటున్నారు.. ‌నా రిషి సర్ బ్రతికే ఉన్నాడు అని వసుధార ఎమోషనల్ అవుతుంది. మీకేం కాలేదు కదా సర్ అంటు రిషి ఫోటోని చూసి ఎమోషనల్ గా మాట్లాడుంది. అది చూసి మహేంద్ర, అనుపమ, ధరణి అందరు ఎమోషనల్ అవుతారు. ఇక ఆ ఫోటోకి దండ అవన్నీ తీసేసిన వసుధారని బెదిరిస్తుంది దేవయాని. అలా చనిపోయిన వారి ఫోటోకి ఉన్నవాటిని అలా తీయకూడదని, అది అరిష్టమని వసుధార అంటుంది. మీరు నా కళ్ళముందు ఉండకండి.. మీరు మీ కొడుకు శైలేంద్ర ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని వసుధార కోపంగా చెప్తుంది. దాంతో ధరణి, దేవయాని, శైలేంద్ర అక్కడి నుండి వెళ్తారు. మరోవైపు ఓ చోట అనుపమ, ముకుల్ ఇద్దరు కలుసుకొని మాట్లాడుతుంటారు. అసలు రిషి నిజంగానే చనిపోయాడా అని ముకుల్ ని అడుగగా.‌‌. హాస్పిటల్ లో ఉన్న బాడీ DNA.. మన మహేంద్ర DNA తో మ్యాచ్ అయింది. అది చూడగానే నా గుండె ఆగినంత పనైందని ముకుల్ అంటాడు. మళ్ళీ మళ్ళీ చెక్ చేసావా అని అనుపమ అడుగుతుంది. ఎందుకు మేడమ్ అలా అడుగుతున్నారని ముకుల్ అనగా.. రిషి బ్రతికే ఉన్నాడని వసుధార అంటుందని చెప్తుంది. రిషిని చంపిందెవరో అని నీకెవరిమీదైనా అనుమానం ఉందా అని అనుపమ అనగా.. భద్ర అని ముకుల్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : శోభనం గదిలోకి వెళ్ళిన కళ్యాణ్ కి నిరాశే...ఇంటి బాధ్యతలు కావ్య గుప్పట్లో!

స్టార్ మా టీవిలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -326 లో.. కావ్య ముందు కావాలనే శ్వేతతో రాజ్ మాట్లాడుతుంటాడు. అది కావ్య వినాలని, మాటతీరుతో తనకి కోపం వచ్చేలా చేస్తాడు. శ్వేతతో వీడియో కాల్ లో స్వీటి అంటు ప్రేమగా మాట్లాడతాడు రాజ్. కావ్యని అలా మోసం చెయ్యడం శ్వేతకి నచ్చదు కానీ రాజ్ చెప్పాడని శ్వేత భావిస్తుంది. రాజ్ మాట్లాడిన దానికి సమాధానం చెప్తంటుంది. వాళ్ళు వీడియో కాల్ లో మాట్లాడుతుంటే వాళ్ళని కావ్య డిస్టబ్ చేస్తు.. అటు ఇటు వెళ్తుంటుంది. ఆ తర్వాత భార్యాభర్తలు ఉన్నప్పుడు.. ఇలా మాట్లాడుకోవడం సంస్కారం కాదని కొంతమందికి తెలియదా అని శ్వేతని ఉద్దేశించి కావ్య అంటుంది. ఇక కావ్య కావాలనే ఫోన్ లో సాంగ్స్ వింటుంది లైట్ అఫ్ చేస్తుంది. ఆ తర్వాత జరగబోయేది చూసి కూడా నీ కాన్ఫిడెంట్ ఇలాగే ఉంటుందేమో చూస్తానని రాజ్ అనుకుంటాడు. మరొకవైపు కళ్యాణ్ శోభనం కోసం హుషారుగా ఏర్పాట్లు చేసుకుంటాడు. పాల గ్లాస్ తో అప్పుడే అనామిక లోపలికి ఎంట్రీ ఇస్తుంది. నీకు ఒక విషయం చెప్పాలి అంటు నాకు ఈ రోజుకి మూడు రోజులు తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అనగానే కళ్యాణ్ గుక్క పట్టి ఏడుస్తుంటాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు.. మళ్ళీ శోభనం ఆగిపోయిందా అని అందరు అనుకుంటారు. అనామిక అలా అనగానే కళ్యాణ్ సరే అంటాడు. నిన్ను నా వాడిని చేసుకునే దాకా నేను నీ దాన్ని అవ్వను.. ఆఫీస్ పగ్గాలు నీకు.. ఇంట్లో మహారాణిలా నేను ఉండాలని అనామిక అనుకుంటుంది. ఆ తర్వాత అప్పు దగ్గరికి కృష్ణమూర్తి వచ్చి మాట్లాడుతాడు. నేను నిజంగానే పోలీస్ అవ్వాలని అనుకుంటున్నా అని అప్పు అనగానే కృష్ణమూర్తి హ్యాపీగా ఫీల్ అవుతు సపోర్ట్ చేస్తాడు. మరుసటి రోజు ఉదయం కళ్యాణ్ బయటకు వస్తుంటే శోభనం జరిగిందని అందరూ అనుకునేలా కళ్యాణ్ ని రెడీ చేసి అనామిక బయటకు పంపిస్తుంది. కళ్యాణ్ ని చూసిన సుభాష్, ప్రకాష్ ఇందిరాదేవిలు నవ్వుకుంటారు.. వెళ్లి రెడీ అయిరా అంటూ కళ్యాణ్ ని పంపిస్తారు. అందరు నమ్మారా అని అనామిక అడుగుతుంది. మరోవైపు అప్పు రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తు ఉంటుంది. తరువాయి భాగంలో ఇక ఈ ఇంటికి పెద్ద కోడలిగా అన్ని బాధ్యతలు నీకే ఇస్తున్నా.. ఇదిగో తాళాలు ఇక ఎవరికి ఏం అవసరం వచ్చిన నీ దగ్గరికే రావాలని కావ్యకు అపర్ణ చెప్తుంది. అది విని రుద్రాణి, ధాన్యలక్ష్మి ఇద్దరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ట్రెండింగ్ ని ఫాలో అయ్యేవారికి సవాలు విసిరిన హిమజ!

కుర్చీ మడతబెట్టి .. అని ఆ తాత ఏ ముహుర్తానో అన్నాడో గానీ ఎక్కడ చూసిన అదే మ్యూజిక్ అదే బాదుడు. 'గుంటూరు కారం' సినిమాలో థమన్ మామ ఆ డైలాగ్ కి తగ్గట్టుగా బీట్ చేయడం..  దానికి తగ్గట్టుగా మహేశ్ బాబు, శ్రీలీల అదిరిపోయే స్టెప్స్ వేయడంతో ఈ పాట మరింత ఫేమస్ అయ్యింది. ఇక ఎప్పుడు అయితే ఈ పాట మొదలైందో అప్పటి నుండి ఇదే మ్యూజిక్.. అవే స్టెప్స్.‌ ఎక్కడ లేని జనాలంత ఇన్ స్ట్రాగ్రామ్ పై దాడి చేసినట్టుగా .. చిన్న పెద్ద తేడా లేకుండా అందరు ట్రెండింగ్ ని ఫాలో అవుతున్నారు. అయితే ఈ ట్రెండింగ్ గురించి హిమజ ఓ సన్సెషనల్ కామెంట్ చేసింది‌. హిమజ తాజాగా ఓ ఇష్యూతో ఒక్కసారిగా వైరల్ గా మారి వార్తల్లోకొచ్చింది‌. ఇక ఇప్పుడు ఆ వైరల్ గా పొడిగిస్తూ తన ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేసింది‌. సినిమాల్లో చిన్న పాత్రలు చేస్తూ క్రమంగా ఫేమస్ అయ్యింది నటి హిమజ. నటిగా మంచి పేరు తెచ్చుకొని కొన్ని సీరియళ్లలోను నటించింది. వీటితో పాటు పలు టీవీ షోలు కూడా చేసింది హిమజ. అయితే, బిగ్‍బాస్ ద్వారా ఆమె చాలా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత కూడా చాలా చిత్రాల్లో నటించింది. హిమజ వాళ్ళ నాన్న చంద్రశేఖర్ రెడ్డి సినిమాలకి మాటలు, పాటలు రాసేవాడు. అలా తను మాటలు, పాటలు రాసిన 'సర్వాంతర్యామి' అనే టెలీఫిల్మ్ లో తొలిసారి నటించింది హిమజ. ఆ తర్వాత కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ లో‌ నటించింది. ఆ తర్వాత బుల్లితెరపై అడపాదడపా సీరియల్స్ లో నటించిన హిమజ.. హీరో రామ్, హీరోయిన్ రాశిఖన్నా నటించిన 'శివమ్' చిత్రంలో హీరోయిన్ కి స్నేహితురాలి పాత్రలో తొలిసారిగా వెండితెరకు కనిపించింది. ఆ తర్వాత నేను శైలజ, చందమామ రావే, జనతా గ్యారేజ్, ధృవ, శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ సినిమాలలో చేసింది. ట్రెండింగ్ ని ఫాలో అయ్యేవారి మీదకి ఓ సెటైర్ వేసింది హిమజ. ఇన్ స్ట్రాగ్రామ్ లో ఓ వీడియో షేర్ చేసింది. కుర్చీ మడతబెట్టి.. మడతబెట్టి అనే మ్యూజిక్ మొదట ప్లే అవ్వగా.. అయిపోయిందా .. మడతబెట్టిర్రా కుర్చీనీ.. మీ అందరి ఇంట్ల ఓ కుర్చీ ఉంటుంది. ఆ కుర్చీ పైన బట్టలు పడేసి ఉంటాయి. ఫస్ట్ పోయి ఆ బట్టలు మడతబెట్టండి. కుర్చీ మడతబెడతారంట.. ఎన్నడైనా బట్టలు మడతబెట్టిర్రారా మీరు.. ఏదైన ఒక ట్రెండింగ్ మొదలయ్యిందంటే చాలు ఒకటే మ్యూజిక్.. ముందు బట్టలు మడతబెట్టండి అని హిమజ అంది. తను అన్న ఈ మాటలు ట్రెండింగ్ ని ఫాలో అయ్యే ప్రతీ ఒక్కరిని ఉద్దేశించి చెప్పడంతో ఈ పోస్ట్ కి కామెంట్లు తెగ  వస్తున్నాయి. అయితే ఇందులో పాజిటివ్ తో పాటు నెగెటివ్ కామెంట్లు కూడా వస్తున్నాయి. మరి హిమజ వీటికి ఎలా స్పందిస్తుందో చూడాలి. అయితే ఇప్పుడు ఈ వీడియో ఇన్ స్ట్రాగ్రామ్ లో వైరల్ గా మారింది.  

సింగర్ హేమ చంద్ర ఇంట్లో వంట చేసిన కుమారి ఆంటీ!

సందీప్‌ కిషన్‌ రీసెంట్ గా తాను నటించిన "ఊరి పేరు భైరవ కోన"  మూవీ ప్రమోషన్లలో భాగంగా కుమారీ ఆంటీ ఫుడ్‌ స్టాల్‌ కి వచ్చారు. ఆయనతో పాటు  హీరోయిన్‌ వర్ష బొల్లమ్మ  కూడా  అక్కడకు వచ్చి భోజనం చేశారు. భోజనం చేసి ఆమె చేతిలో పదివేలు పెట్టాడట సందీప్ కిషన్. ఈ విషయాన్ని కుమారి ఆంటీ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది.. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగిస్తున్నారంటూ  పోలీసులు కుమారీ ఆంటీ స్టాల్‌ పై కేసు పెట్టినప్పుడు  సందీప్ కిషన్‌ ఆమెను సపోర్ట్ చేస్తూ ట్వీట్‌ చేశాడు.   తర్వాత ఆమె ఫుడ్‌ స్టాల్‌ను రీఓపెన్‌ చేయించాక  సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాడు సందీప్ కిషన్.  సోషల్‌ మీడియాలో ఫుల్ ఫేమస్ ఐన  కుమారీ ఆంటీ చేతి వంట రుచి చూసేందుకు ఎగబడుతున్నారు. ఐతే ఈమెను చాలామంది ఇంటర్వ్యూ చేస్తున్నారు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన కుమారి ఆంటీ దగ్గర   టాలీవుడ్‌ సెలబ్రిటీలు కూడా కర్రీస్‌ తీసుకెళ్లారని చెప్పింది . ఆలీ గారు కర్రీస్ తీసుకెళ్లారని, జూనియర్ ఎన్టీఆర్ గారు వాళ్ళ డ్రైవర్ ని పంపి కర్రీస్ పట్టుకెళ్లారు. మా టీవీ సీరియల్స్ వాళ్ళు ఎక్కువగా వస్తారని చెప్పింది. కరోనా టైంలో వాళ్ళ ఊరిలో చిక్కుబడిపోయి అక్కడ కూరగాయలు అమ్ముకున్నట్లు చెప్పింది. సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ కూడా బిజినెస్ స్టార్టింగ్ లో చాలా హెల్ప్ చేసినట్లు చెప్పింది. అలాగే వాళ్ళ ఇంట్లో అందరి దేవుళ్లను కొలుస్తామని..ఒంట్లో బాగోలేనప్పుడు సెలవు పెట్టుకుని పెద్దమ్మ తల్లి టెంపుల్ కి  వెళ్తామని చెప్పింది కుమార్ ఆంటీ. అలాగే  హోటల్‌ పెట్టక ముందు ప్రముఖ సింగర్ హేమ చంద్ర ఇంట్లో వంట మనిషిగా చేశానని అప్పటి విషయాలను గుర్తుకు తెచ్చుకుంది.  ఇక సందీప్ కిషన్ లేటెస్ట్ మూవీ ఈనెల 9 న రిలీజ్ కాబోతోంది. దీంతో అన్ని వేదికలను బాగా యూజ్ చేసుకుంటూ మూవీ ప్రొమోషన్స్ చేస్తున్నాడు సందీప్ కిషన్...

కంటతడి పెట్టించే అమ్మ కథ.. ఈ పరిస్థితిలో ఏం చెయ్యాలి?

జానకి కలగనలేదు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకి దగ్గర అయింది ప్రియాంక. బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో మొదటి కంటెస్టెంట్ గా అడుగుపెట్టి తన ఆటతీరుతో, మాటతీరుతో ఎంతో ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది.  హౌస్ లో ఉన్నప్పుడు సీరియల్ బ్యాచ్ గా పేరుతెచ్చుకున్న అమర్, శోభాశెట్టి, ప్రియాంక.. ఎప్పుడు కలిసి ఉండేవారు. గేమ్ అయిన బయట అయిన గ్రూపిజం చేస్తు ఉండటంతో ప్రేక్షకులలో వీరిపట్ల నెగెటివిటి పెరిగిపోయింది. దాంతో శోభాశెట్టిని గ్రాంఢ్ ఫినాలే ముందు వారంలో బయటకు పంపించారు.  ఇక టాప్-5 లో ఒకరిగా ఉన్న ప్రియాంక జైన్.‌ అయిదవ కంటెస్టెంట్ గా ఎలిమినేషన్ అయి బయటకొచ్చింది.  కొన్ని రోజుల క్రితం వాళ్ళ అమ్మకి క్యాన్సర్ అని ఏడుస్తూ ఓ వ్లాగ్ చేసిన ప్రియాంక.. ఇప్పుడు దానికి కంటిన్యూ చేస్తూ మరో వ్లాగ్ చేసింది. అయితే ఇలా వ్లాగ్స్ చేయడానికి కారణం చెప్పుకొచ్చింది ప్రియాంక జైన్. మీరు ఇలా సింపతీ పేరుతో జనాలని మానిపులేట్ చేస్తున్నారని చాలామంది అంటున్నారు. కానీ మేమ్ ఏదైనా ప్రోగ్రామ్ గానీ సీరియల్ గానీ చేస్తేనే మాకు డబ్బులు వస్తాయి. మేము ఇలా కన్పిస్తేనే కదా ఈ వీడియోలని జనాలు చూసేది మాకు డబ్బులు వచ్చేవి. మీరు ఆఫీస్ లకి ఎలా వెళ్తారో మేము ఇలాగే కన్పిస్తాం.. మాకు వచ్చేది ఈ యూట్యూబ్ నుండే కాబట్టి మాకు వేరే ఆప్షన్ లేదు. దయచేసి మా పరిస్థితిని అర్థం చేస్కోండి. ఎంకరేజ్ చేయండి డిస్కరేజ్ చేయకండి అని ప్రియాంక జైన్ ఎమోషనల్ గా చెప్పుకొచ్చింది.  ప్రియాంక యూట్యూబ్ ఛానెల్ లో రెగ్యులర్ గా వ్లాగ్స్ చేస్తూ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంటుంది. నా కళ్ళకి సర్జరీ వళ్ళ మీ ముందుకు రాలేకపోతున్నానంటూ రీసెంట్ గా చేసిన వ్లాగ్ ఫుల్ వైరల్ అవ్వగా.. ' నాకు ఈ పరిస్థితిలో ఏం చెయ్యాలో అర్థం కాలేదని '  వీడియోని షేర్ చేసి ఇందులో తన బాధనంతా వివరించింది ప్రియాంక. కాగా ఇప్పుడు ఈ వీడియోకి అందరు పాజిటివ్ గా కామెంట్లు చేయడంతో పాటుగా తమకి తోచిన సలహాలు ఇస్తున్నారు.  

నువ్వు నా ప్రాపర్టీ...యశ్వంత్ కి శోభా వార్నింగ్!

కార్తీకదీపంలో మోనితగా అందరికీ దగ్గరైన శోభా శెట్టి బిగ్ బాస్ లోకి వెళ్లి దుమ్ము దులిపేసింది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికొచ్చాక ఫుల్ బిజీగా మారిపోయింది. అంతేకాదు  తన ప్రియుడు యశ్వంత్‏తో  ఎంగేజ్మెంట్ కూడా చేసేసుకుంది. పనిలో పనిగా కొత్త ఇల్లు కూడా కొనేసుకుంది. కాబోయే అత్తగారిని కూడా కలిసి ఆమెను కూడా చూపిస్తూ ఒక వీడియో చేసి తన యూట్యూబ్ లో పోస్ట్ చేసింది. ఐతే ఇప్పుడు శోభా శెట్టి యశ్వంత్ ని ఇప్పటి నుంచే గ్రిప్ లో పెట్టుకోవడానికి రెడీ ఐపోయింది. తన మనసులో మాటల్ని యశ్వంత్ కి వినిపించేలా వీడియో స్టేటస్ లను తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. "నువ్వు నన్ను కాకుండా వేరే అమ్మాయి వైపు చూసావంటే చంపేస్తా..నువ్వు నా ప్రాపర్టీ...నాకు మాత్రమే బెస్టు..గుర్తుపెట్టుకో ..ఇది లవ్ లో ఒక టైపాఫ్ పొసెసివ్నెస్" అంటూ ఒక రీల్ ని ఈ కాప్షన్ ని పోస్ట్ చేసుకుంది. అలాగే తన ఫాంటసీస్ కి దగ్గరగా ఉన్న ఒక వీడియోని పోస్ట్ చేసింది. "నేనంటే పడి చచ్చిపోవాలి..చాలా బాగా ప్రేమించాలి. ఎంతలా అంటే వాడి పిచ్చి ప్రేమ చూసి నాకు పిచ్చెక్కిపోవాలి" అని చెప్పింది. ఇక శోభా శెట్టి  బిగ్‌బాస్ సీజన్-7 లో టాప్ 6లో ఒక కంటెస్టెంట్‌గా నిలిచింది. జెంట్స్ తో సమానంగా ఆడి తన సత్తా చూపించింది ఈ కన్నడ క్యూటీ బ్యూటీ. ఎంత పాపులారిటీని తెచ్చుకుందో.. అంతే నెగిటివిటీని కూడా సంపాదించుకుంది.. బిగ్ బాస్ హౌస్ లో తన లవర్ గురించి చెప్పింది తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీలో ప్రొపోజ్ చేసింది. అలా యశ్వంత్ కూడా ఆమెకు రింగ్ పెట్టాడు. ఇక త్వరలో వీళ్ళు ఒకింటివారు కాబోతున్నారు. అందుకే ఇప్పటినుంచి శోభా చాలా జాగ్రత్త పడుతోంది.  

ఇనయా అందాల జాతర.. హద్దులు దాటిందా!

ఇన్ స్టాగ్రామ్ లో హట్ అండ్ స్పైసీ ఫోటోలతో కుర్రాళ్ళకి పిచ్చెక్కిస్తుంది బిగ్ బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా. ఎవరి ఊహకి అందకుండా అంచనాలు తారుమారు చేస్తూ..కొత్త కొత్త ఫోటోలతో ఇన్ స్టాగ్రామ్ ని షేక్ చేస్తోంది. బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో డేరింగ్ లో శివంగిలా.. ఆటతీరుతో మాటతీరుతో ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న ఈ భామ.. బయటకొచ్చాక నెటిజన్లకి తన అందాన్ని చూపిస్తూ మైమరపిస్తుంది‌. బిగ్ బాస్‌కి ముందోలెక్క.. బిగ్ బాస్ తరువాత మరోలెక్క అన్నట్టుగా మారిపోయింది బిగ్ బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా. నాలోని టాలెంట్ చూసే వరకూ చూపిస్తూనే ఉంటా అనుకుందో ఏమో కానీ.. తనలోని గ్లామర్ యాంగిల్స్‌ని వివిధ భంగిమల్లో చూపిస్తూ నెక్స్ట్ లెవల్ అనిపిస్తుంది.  తాజాగా బ్లూ ఇన్నర్ టాప్‌లో ఇన్ స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలని అప్లోడ్ చేయగా అవి ప్రస్తుతం ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాయి. బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో తన పర్ఫామెన్స్ తో తనకంటు ఫ్యాన్ బేస్ పెంచుకుంది. బిగ్ బాస్ షో తర్వాత కుకింగ్ వీడియోలని, ట్రావెలింగ్ అంటు జర్నీ వీడియోలని పోస్ట్ చేసింది ఇనయా. ఊటీలో హాట్ ఫోటోషూట్స్ తో అందరిచేత విమర్శించుకుంది ఇనయా. ఇనయా సుల్తానా యూట్యూబ్ లో తనకంటూ ఓ ఛానెల్ ని క్రియేట్ చేసి వ్లాగ్స్ చేస్తూ ఎప్పుడు ట్రెండింగ్ లో ఉంది. అయితే ఎప్పుడు ఏదో ఒక హాట్ ఫోటో పోస్ట్ చేసి ట్రెండింగ్ లో ఉండే ఈ భామ.‌. బ్లూ ఇన్నర్ టాప్ లో ఉన్న ఫోటోలు మరీ బోల్డ్ గా ఉండటంతో నెటిజన్లు కామెంట్లతో పోటీపడుతున్నారు. మరికొందరైతే తన అందాలను చూసి సినిమా అవకాశాల కోసం మరీ ఇంత దిగజారాలా అంటు విమర్శిస్తున్నారు.

దంచవే మేనత్త కూతురా..

దివి అంటే చాలు చాలామంది దివి నుంచి భువికి వచ్చిన దేవకన్య అంటూ ఉంటారు. ఇక దివి కూడా అంతే అందంగా ఉంటుంది.  మోడలింగ్ నుంచి మూవీ ఇండస్ట్రీలోకి  అడుగుపెట్టిన  ఈ ముద్దుగుమ్మ లెట్స్ గో, సీన్ నెంబర్ 72 లాంటి మూవీస్ లో నటించింది . తరువాత  బిగ్ బాస్ ద్వారా  ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుని  సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో వచ్చిన ‘మహర్షి’ మూవీలో కాలేజ్ స్టూడెంట్‌గా నటించింది. అలాంటి దివి హాట్ షూట్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. ఎప్పుడూ అవే ఫోటో షూట్స్ అంటే అందరికీ కూడా చాలా బోరింగ్ గా ఉంటుంది. అందుకే దివి ఇప్పుడు ఒక అద్భుతమైన వీడియోని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అందులో దివి నైటీ వేసుకుని వాళ్ల అమ్మ చెప్పే డైరెక్క్షన్ లో గారెపప్పు  దంచుతూ కనిపించింది. ఇక ఈ వీడియోని చూసిన నెటిజన్స్ వెరైటీగా కామెంట్ చేస్తున్నారు. "ఎంత మోడరన్ అమ్మాయిని ఐనా నైటీ వేయాల్సిందే.. ఇప్పుడు నేచురల్ బ్యూటీలా ఉన్నావ్ దివి...దివి దంచిన పచ్చడి తింటే భువి నుండి దివికే...నీ పొడవైన జుట్టును ఎందుకు కత్తిరించేసావ్..బంగారు హుండీని చిల్లర వేయడానికి వాడుతున్నారా...నేనే డైరెక్టర్ ని అయ్యి నీతో ఒక సినిమా తీసేస్తా...బయటేమో అలాంటి పనులు ఇంట్లో ఇలాంటి పనులు...దీనికి కూడా రీల్ చేయాలా...మంచి మనసున్న అమ్మాయి...మా అతిలోక సుందరి ఏదో నూరుతుంది చేతులు కందిపోతున్నాయి సుందరి...దంచవే మేనత్త కూతురా..గారెలు నువ్వే వెయ్యి.. " అంటూ ఇలా రకరకాల కామెంట్స్ ని పోస్ట్ చేశారు. బిగ్ బాస్ 4 నుంచి బయటికొచ్చాక  వరుస ఆఫర్స్ తో  బిజీ ఆర్టిస్ట్ అయ్యింది దివి. వెబ్ సిరీస్, ప్రైవేట్ ఆల్బమ్స్ తో పాటు వరుస సినిమాలు చేస్తోంది. జిన్నా మూవీలో దివి మూగ అమ్మాయి అయిన హీరో ఫ్రెండ్ పాత్రలో నటించి మెప్పించింది దివి. మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్‌లో కీలక పాత్రలో మెరిసింది.

మగవాళ్లకు కూడా పింపుల్స్ వస్తాయండి.. పింపుల్స్ పై ఆడవాళ్లకే రైట్స్ ఉన్నాయండి!

యాంకర్ రవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రవి ఏది చేసినా ఎం మాట్లాడినా వెరైటీగా ఉంటుంది. రవికి కొంచెం సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఎక్కువగానే ఉంటుంది. అలాగే కొంత కొంటె తనం కూడా ఉంది. రీసెంట్ గా ఒక వీడియోని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు. అందులో మస్త్ స్వీట్ ఖీర్ తింటూ తన నుదిటి మీద వచ్చి పింపుల్ ని చూపించాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గా "నెక్స్ట్ టైం ఎప్పుడైనా పింపుల్ వస్తే ఈ సాంగ్ ప్లే చేయండి..అందమైన ప్రేమ రాణి చేయి తగిలితే చిన్న మొటిమ కూడా ముత్యమేలే" అంటూ ప్రేమికుడి మూవీ సాంగ్ ని ప్లే చేసాడు. ఈ చిన్న మొటిమను బూతద్దంలో చూపిస్తూ మరీ కామెడీగా ఫీలవుతున్నాడు రవి. ఇక ఇది చూసిన నెటిజన్స్ కూడా మస్త్ కామెడీ రిప్లైస్  ఇస్తున్నారు. "పింపుల్స్ పై రైట్స్ టోటల్ గా గర్ల్స్ కే సర్...సర్ మీరు మేడం ఆ అని అడగాలనుకుంటున్నా...అందమైన మిల్క్ బాయ్ లేత బుగ్గపై చిన్న మొటిమ కూడా ముత్యమేలే..నువ్వు అమ్మాయి కాదు..అది బుగ్గ కూడా కాదు... అంటే నువ్వు అందమైన ప్రేమ రాణివా...సూపర్ బ్రో" అంటున్నారు. ఇక బిగ్ బాస్ సీజన్ 5 లో యాంకర్ రవి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. రవి సెలవు దొరికితే తన కూతురు వియాతో, వైఫ్ తో కలిసి అన్ని ప్లేసెస్ కి వెళ్లి ఎంజాయ్ చేసి వస్తుంటాడు . అలాగే రవి   వెండితెరపై కొన్ని మూవీస్ లో నటించాడు కానీ అవి పెద్దగా గుర్తింపు తేలేదు. కానీ యాంకర్ గా మాత్రం బాగా పేరు తెచ్చుకున్నాడు.  రవి సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటాడు. ఎప్పుడూ  ఏదో ఒక పోస్ట్ తో, వీడియోతో  బాగా సందడి చేస్తూ ఉంటాడు. తన ప్రాజెక్ట్ అప్ డేట్స్ గురించి కూడా షేర్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు రవి కొన్ని షోస్ కి హోస్టింగ్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు.

శివ్ కంటే ముందు మౌనరాగం సీరియల్ ఆఫర్ టేస్టీ తేజకు వచ్చిందట

బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ ఐన ప్రియాంక జైన్, శివ్ , టేస్టీ తేజ ముగ్గురూ కలిసి ఒక ఫుడ్ వ్లాగ్ చేశారు. ఇక ఇందులో తేజ తనకు మౌనరాగం సీరియల్ లో హీరో ఆఫర్ వచ్చిందని చెప్పి షాకిచ్చాడు. ఆ ఆఫర్ తాను వదులుకున్నాడు కాబట్టి శివ్ కి ఆ ఛాన్స్ వచ్చిందని చెప్పాడు .  తర్వాత  శివ్ ని ముందు ప్రియాంక ప్రొపోజ్ చేసిందని..తనకు   ఐ లవ్ యు   చెప్పిందని చెప్పాడు. దానికి శివ్ రెండు వారాలు  టైం తీసుకుని ఐ లవ్ యు టూ అని చెప్పాడట. "అదేంటి శివ్ ఆ ఒక్క మాట చెప్పడానికి రెండు వారాల టైం తీసుకున్నావా.. ఇప్పుడు ఫీలవుతున్నా అసలు మౌనరాగం ఎందుకు వదిలేసుకున్నానా" అని అన్నాడు తేజ. "ప్రియాంక మూడు నెలలు లేకపోయేసరికి చాలా హ్యాపీగా ఉన్నాను మూడు ఫారెన్ ట్రిప్పులు కూడా వేసాను.. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చి వన్ మంత్ అయ్యింది ఇంతవరకు ఎక్కడికీ పోలా" అని ఫీలవుతుంటే తేజ అద్భుతమైన సలహా ఇచ్చాడు "నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ కోసం ట్రై చెయ్యి అన్నా" అనేసరికి "బిగ్ బాస్ జోలికి కూడా వెళ్ళను నేను అన్నాడు..." "నువ్వు బిగ్ బాస్ హౌస్ కి  వెళ్ళిపోతే నేను తేజ, శోభా ముగ్గురం కలిసి ఫారెన్ ట్రిప్ వెళ్తాం" అంది ప్రియాంక. "ఒక వేళా బిగ్ బాస్ నుంచి ఆఫర్ వస్తే టేస్టీ తేజ కూడా నాతో  కలిసి హౌస్ కి రావాలని డిమాండ్ చేస్తా" అని చెప్పాడు శివ్. ఇక తేజ "ఇండియా వదిలేసి అమెరికా వెళ్ళిపోతున్నావా" అంటూ ఫాన్స్ అడుగుతున్నారు అనేసరికి "ఇండియా వదిలి ఎక్కడికీ వెళ్ళను" అని చెప్పింది. "సీరియల్స్ కి ముందు తనను ఆ సీరియల్ క్యారెక్టర్స్ తో పిలిచేవాళ్ళు కానీ తర్వాత బిగ్ బాస్ ప్రియాంక అని పిలవడం స్టార్ట్ చేశారు. బిగ్ బాస్ వాళ్ళు కాంటాక్ట్ చేసినప్పుడు ఈ గొడవలు అవీ వద్దు అని నో చెప్పా కానీ తర్వాత ఇంట్లో వాళ్ళు వెళ్ళమని గట్టిగా పట్టుబట్టేసరికి బిగ్ బాస్ హౌస్ కి వెళ్లాను" అంటూ ఎన్నో విషయాలు చెప్పింది.

డోస్ పెంచిన గుప్పెడంత మనసు జ్యోతిరాయ్.. వర్త్ వర్మ వర్త్!

సినిమా హీరోయిన్ లకి ధీటుగా జ్యోతిరాయ్ అందాల విందు ఇస్తోంది. నెటిజన్లకి ఎవరీ భామ అని చూసేంతలా రెచ్చిపోతుంది జ్యోతి రాయ్. అందరికి ఈమె ఎవరో తెలిసి ఉండకపోవచ్చు గానీ బుల్లితెర ప్రేక్షకులకు జగతి మేడమ్ అంటే తెలియని వారు ఉండరు. స్టార్ మాటీవీ ఛానల్ లో ప్రసారమయ్యే "గుప్పెడంత మనసు" ప్రేక్షకులకు జగతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన నటనతో అందరిని మెప్పిస్తూ, ఒక తల్లిగా కొడుకుపై చూపించే ప్రేమని వ్యక్తపరచడంలో జగతి పాత్ర అందరిని ఆకట్టుకుంటుంది. తక్కువ సమయంలోనే బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘గుప్పెడంత మనసు’ సీరియల్ నటుల గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. రిషీ తల్లిగా నటిస్తున్న జగతి(జ్యోతి రాయ్) వయసు ముప్పై ఎనిమిదేళ్లేనని తెలిసిందే. గుప్పెడంత మనసుతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ చేశారు. జ్యోతి రాయ్ కన్నడ నటి.. కన్నడలో పలు సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటించి, తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. జీ తెలుగులో ప్రసారమైన 'కన్యాదానం' సీరియల్ లో నిరుపమ్ పరిటాలతో కలిసి మొదటిసారి జ్యోతిరాయ్ నటించింది. ఆ తర్వాత  'గుప్పెడంత మనసు' సీరియల్ లో ప్రస్తుతం నటిస్తుంది. గత కొంతకాలం నుండి గుప్పెడంత మనసు సీరియల్ టాప్ రేటింగ్ లో ఉంటు వస్తుంది. జ్యోతిరాయ్ అలియాస్ జగతి.. అలనాటి నటుడు సాయి కిరణ్ కి భార్యగా గుప్పెడంత మనసు సీరియల్ లో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. తన అందంతో పాటు హావభావాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది జగతి. జ్యోతి రాయ్ ఒకవైపు ఈ సీరియల్ మరొక పక్క ఒక వెబ్ సిరీస్ తో బిజీగా ఉంటుంది.  

Eto Vellipoyindhi Manasu : పారేసుకున్న ఆ డైమండ్ రింగ్ ని సీతాకాంత్ కి దక్కించుకోగలడా?

స్టార్ మా టీవీ లో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -14 లో.. రింగ్ ఎక్కడ పోయిందని సీతాకాంత్ ఆలోచనలో పడతాడు. ఆ తర్వాత తన క్యాబ్ లో రామలక్ష్మికి రింగ్ కనిపిస్తుంది. అది పట్టుకొని ఇంట్లో వచ్చి ఈ రింగ్ ఎవరిదని ఆలోచిస్తుంది. ఆ రింగ్ చూసి రామలక్ష్మి  వాళ్ళ అమ్మ బంగారo ఉంగరమా అని అడుగుతుంది. లేదు రోల్డ్ గోల్డ్ లాగా  ఉందని అని ధన అంటాడు. ఆ తర్వాత ఆ రింగ్ ఇవ్వు అని పింకీ తీసుకొని.. నెట్ లో సెర్చ్ చేసి చూస్తుంది. ఆ రింగ్ డీటెయిల్స్ చూసి పింకీ షాక్ అవుతుంది. ఏమైంది అంటూ రామలక్ష్మి వాళ్ళు అడుగుతారు. ఇది బంగారo కాదు డైమండ్ రింగ్ అనగానే అందరు షాక్ అవుతారు. దీని కాస్ట్ యాభై లక్షలు అనగానే వాళ్ళ అమ్మ కళ్ళు తిరిగి కిందపడిపోతుంది. ఆ తర్వాత డోర్లు వేసి ఆ రింగ్ ని చూస్తుంటారు. అప్పుడే మాణిక్యం వచ్చి డోర్ కొడుతాడు. నాన్న గానీ ఈ రింగ్ చూస్తే ఇక అంతే సంగతులని ధన అంటాడు. అందరు ఎప్పటిలాగే ఉందామని అనుకుని డోర్ తీస్తారు. ఇప్పుడే తాగి వచ్చిన తిట్లతో స్వాగతం పలికే తన భార్య నవ్వుతు లోపలికి రమ్మనడం చూసి మాణిక్యం షాక్ అవుతాడు. అందరు రోజులాగా కాకుండా డిఫరెంట్ బెహేవ్ చేసేసరికి.. ఏం జరిగిందని మాణిక్యం అడుగుతాడు. ఏం లేదని అనగానే వెళ్లి మాణిక్యం పడుకుంటాడు. ఆ తర్వాత సీతాకాంత్ వాళ్ళ అమ్మాకి రింగ్ ఎక్కడో పడిపోయిందని చెప్తాడు. అది విని శ్రీవల్లి గొడవ చెయ్యాలని ట్రై చేస్తుంది కానీ తన అత్తయ్యకి బయపడి సైలెంట్ గా ఉంటుంది. ఆ తర్వాత రింగ్ చూస్తూ రామలక్ష్మి ఫ్యామిలీ ఉంటుంది. రింగ్ ఏమైందని సీతాకాంత్ గుర్తుకుచేసుకుంటు రామలక్ష్మి క్యాబ్ లో పడేసుకున్నాన అని ఆలోచించుకుని తనకి ఫోన్ చేస్తాడు. ఎక్కడ మాణిక్యం లేస్తాడో అని రామలక్ష్మి సీతాకాంత్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చెయ్యదు. ఆ తర్వాత రింగ్ చేతులో ఉండగానే అందరు పడుకుంటారు. మాణిక్యం నిద్రలేచి రింగ్ తీసుకోగానే అందరు లేస్తారు... ఆ రింగ్ యాభై లక్షలు విలువైనదని తెలుసుకున్న మాణిక్యం అది అమ్మి సెటిల్ అవ్వాలని అనుకుంటాడు. వద్దు నాన్న అది వాళ్ళది.. వాళ్ళకి ఇచ్చేయాలని రామలక్ష్మి అన్న కూడా మాణిక్యం పట్టించుకోడు. మరుసటి రోజు ఉదయం సీతాకాంత్ వాళ్ళ అమ్మకి రింగ్ దొరికిందని చెప్పి ఆఫీస్ కి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో 

Krishna Mukunda Murari : లవ్ ప్రపోజ్ తో కంగుతిన్న ముకుంద.. నాకు కంఫర్ట్ గా ఉండదు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -386 లో..  పూజారిని కృష్ణ కలిసి జరిగింది చెప్తుంది. నువ్వు కర్పూరం దేవుడి ముందు వెలిగించని పూజారి చెప్పగానే కృష్ణ అలాగే చేస్తుంది. ఆ తర్వాత కృష్ణ వెలిగించిన కర్పూరం ఆరిపోతుంది. మళ్ళీ ఏంటి ఇలా జరిగిందని కృష్ణ టెన్షన్ పడుతు పూజారిని అడుగుతుంది. ఏం లేదంటు తన భయాన్ని పొగుడుతాడు. ఆ తర్వాత కృష్ణ వెళ్ళిపోయాక.. ఇలా జరగకూడదు కానీ ఆ అమ్మాయి బయపడుతుందని ఏం కాదని చెప్పాను.. ఆ అమ్మాయికి ఏదో సమస్య రాబోతుందని పూజారి అనుకుంటాడు. ఆ తర్వాత బెస్ట్ కపుల్ కాంటెస్ట్ గురించి ముకుంద టెన్షన్ పడుతుంది. నేను అందరి ముందు కాంటెస్ట్ లో ఆదర్శ్ తో ఎలా క్లోజ్ గా ఉండాలి. నా మనసు ఒప్పుకోవడం లేదని ముకుంద అనుకుంటుంది. అప్పుడే ఆదర్శ్ రోజ్ ఫ్లవర్స్ పట్టుకొని వచ్చి హ్యాపీ వాలింటైన్ డే అని చెప్పగానే ముకుంద షాక్ అవుతుంది. ఏంటిప్పుడు చెప్తున్నావ్వని ముకుంద అడుగుతుంది. బెస్ట్ కపుల్ కాంటెస్ట్ లో ఇలాంటివి ఉంటాయి కదా.. అందుకే ప్రాక్టీస్ చేస్తున్నానని ఆదర్శ్ అనగానే.. నాకు ఇలాంటివి అన్ని ఇష్టం ఉండవని ముకుంద చెప్తుంది. అసలు నన్ను నిజంగానే తీసుకొని రమ్మని కృష్ణ, మురారీలని నువ్వే పంపించావా? ఎందుకిలా చేస్తున్నావని ఆదర్శ్ అడుగుతాడు. అంటే నాకు బయట అందరి ముందు ఇలా చేయడం నచ్చదు. కృష్ణ అంటే సరదాగా ఉంటుంది. అందరిముందు డాన్స్ చేస్తుంది నాకు కంఫర్ట్ గా ఉండదని ముకుంద అంటుంది. సరదాగా బయటకు వెళదామంటే డస్ట్ ఎలర్జీ అంటావ్.. ఏది అందరి ముందు చెప్పవని ఆదర్శ్ అంటాడు. అదేం లేదని ముకుంద కవర్ చేస్తుంది. ఇప్పుడు ఈ కాంపిటేషన్ కూడా వద్దని చెప్తే ఏమని అనుకుంటారోనని ఆదర్శ్ అంటాడు. ఏదో ఒకటి చెయ్యండి నన్ను అర్థం చేసుకోండి అని ముకుంద అంటుంది. ఆ తర్వాత కృష్ణ, మురారి ఒక హోటల్ దగ్గర ఆగుతారు. ప్రొద్దున టిఫిన్ చేయకుండా బయటకు వచ్చాము. అందుకే టిఫిన్ చేద్దామని మురారి అంటాడు. ఆ తర్వాత గుడిలో దీపం ఆరిపోయిన దాని గురించి టెన్షన్ పడుతుంది కృష్ణ. మురారి ఆ టెన్షన్ పోగేట్టేలా చేస్తాడు. ఆ తర్వాత మురారికి చట్నీ పెదాలకి అంటుంది. కృష్ణ ప్రేమగా అది తుడుస్తుంటే అందరు వాళ్ళనే చూస్తుంటారు. కృష్ణ సిగ్గు పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.   

Guppedantha Manasu : ముకుల్ చెప్పిన ఆ నిజం వసుధార నమ్మేనా..  అ కొత్త వ్యక్తి ఎవరు?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -992 లో.. మహేంద్ర ఐడెంటిఫికేషన్ కోసం హాస్పిటల్ కి వెళ్ళాడని తెలిసి ఫణీంద్ర బాధపడుతుంటాడు. వాళ్ళింటికి వెళదాం అని ఫణీంద్ర అనగానే.. వాళ్ళే కాల్ చేస్తారులే అని దేవయాని అంటుంది. అలా అనగానే ఫణీంద్ర తనపై కోప్పడతాడు. కాసేపటికి అందరు మహేంద్ర ఇంటికి వెళ్తారు. ఆ తర్వాత మహేంద్ర కి ఫోన్ చేసి.. అక్కడ ఏం అన్నారో కనుక్కోమని చక్రపాణి అనగానే.. ఏం అంటారు అది రిషి సర్ బాడీ కాదు అని చెప్తారు. లాస్ట్ టైమ్ కూడ ఇలాగే జరిగిందని అనువసు అంటుంది. ఆ తర్వాత రిషి సర్ కి ఏం కాదు కదా మేడమ్ అని అనుపమని వసుధార అడుగుతుంది. ఏం కాదు నువ్వు కంగారుపడకని అనుపమ దైర్యం చెప్తుంది. ఆ తర్వాత మహేంద్ర, ముకుల్ అక్కడికి వస్తారు. ఏమైంది మావయ్య అక్కడ రిషి సర్ కాదు కాదా అని అడుగుతుంది. లేదమ్మ అక్కడ రిషినే అంటూ మహేంద్ర ఏడుస్తాడు. అయిన వసుధార నమ్మకుండా మీరు చెప్తుంది అబద్ధమని అంటుంది. లేదు మేడమ్ నిజమని ముకుల్ చెప్పిన కూడా వసుధార నమ్మదు. అంతలోనే ఫణీంద్ర, దేవయాని, శైలేంద్ర అక్కడికి వస్తారు. ఏం జరిగింది మహేంద్ర అని ఫణీంద్ర అడగ్గానే.. రిషి లేడని చెప్తూ మహేంద్ర ఏడుస్తాడు. ఫణీంద్ర, ధరణి ఇద్దరు షాక్ అవుతారు. కానీ శైలేంద్ర, దేవయాని ఇద్దరు మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. ఆ తర్వాత నువ్వే ఏదో చేసావ్? రిషి సర్ ఎక్కడ అంటు శైలేంద్ర కాలర్ పట్టుకొని వసుధార అడుగుతుంది. దేవయాని, ముకుల్ ఇద్దరు కలిసి వసుధారని ఆపుతారు. ఆ తర్వాత రిషి చనిపోయాడని అనడానికి సాక్ష్యం ఇదిగో అని ముకుల్ వసుధారకి ఫోన్ లో ఏదో చూపిస్తాడు.. అయిన నేను నమ్మను.. నేను తెలుసుకుంటాను అంటు వసుధార బయటకు వస్తుంది. ఆ తర్వాత వసుధార ఒక చోటుకి వచ్చి.. రిషి లేడని మహేంద్ర చెప్పిన విషయాన్ని గుర్తుకుచేసుకొని ఏడుస్తుంది. అప్పుడే వసుధారకి ఎవరో వాటర్ ఇస్తారు. ఎవరని వసుధార చూసేసరికి.. అక్కడ ఉంది రాజీవ్. ఇద్దరికీ కాసేపు గొడవ అవుతుంది. రిషి లేడంట కదా.. ఇక నిన్ను పెళ్లి చేసుకుంటానని రాజీవ్ వసుధార చెయ్యి పట్టుకొని లాక్కొని వెళ్తుంటే.. అప్పుడే ఎక్స్ క్యూజ్ మి అంటూ ఒకతను వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : పోలీసు అవ్వాలనేది అప్పు కల.. సవతిపోరుతో కావ్య ఇక్కట్లు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -325 లో.. మనల్ని కావ్య ఇలా తప్పుగా అర్థం చేసుకోవడం నాకు ఇష్టం లేదని శ్వేత అనగానే.. నువ్వు తన గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావని రాజ్ అంటాడు. అసలు నువ్వు  ఆలోచిస్తున్నావా?నా లాగా కావ్య జీవితం అవ్వకూడదు.. నీకు నా భర్తకి ఏం తేడా లేదు.. వాడు తెలిసేలా, నువ్వు తెలియకుండా కాపురాలు చెడగొట్టుకుంటున్నారని రాజ్ తో శ్వేత అంటుంది. ఆ తర్వాత నేను ఇప్పుడు వెళ్లి ఈ అపార్థాలన్ని తొలగిస్తాను అని శ్వేత వెళ్తుంటే రాజ్ వద్దని ఆపుతాడు. ఆ తర్వాత కావ్య కోపంగా కళ్యాణ్ కి ఫోన్ చేసి మాట్లాడుతుంది. వీళ్ళు సరసాలలో తెలిపోతున్నారంటూ కావ్య పూర్తిగా రాజ్, శ్వేతలని అపార్ధం చేసుకొని కళ్యాణ్ కి చెప్తుంది. కావ్య కోపంలో వయిలెంట్ గా మాట్లాడుతుంటే కళ్యాణ్ కి భయమేస్తుంది. ఆ తర్వాత రాజ్ శ్వేతని చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్తుంటాడు. నా కాపురంలో సమస్య వస్తే నువ్వు సాల్వ్ చేస్తున్నావ్.. నీ కాపురం లో సమస్య లు వస్తే నేను సాల్వ్ చేయకూడదా అని శ్వేత అంటుంది. అప్పుడే వస్తున్న కావ్యని రాజ్ చూసి.. కావాలనే శ్వేతపై చెయ్యి వేసి మాట్లాడుతు పంపిస్తాడు. కావ్యకి ఇంకా కోపం వస్తుంది. ఆ తర్వాత అప్పుని మా అబ్బాయి ఎక్కడో చూసి ఇష్టపడ్డాడంట అని తల్లి కొడుకులు కనకం ఇంటికి వచ్చి మాట్లాడతారు. మాకు మీ గురించి తెలుసు.. అప్పు గురించి కూడా తెలుసు. ఎవరినో ప్రేమించింది అతనికి పెళ్లి అయిపొయిందని కూడా తెలుసంటూ అప్పుపై చాలా ఇష్టంతో మాట్లాడుతుంటే కనకం వాళ్ళు సరే అంటారు. అప్పుడే అప్పు వస్తుంది. ఏం జరుగుతుందంటు కోపంగా మాట్లాడేసరికి.. అప్పుని కనకం గదిలోకి  తీసుకొని వెళ్లి మాట్లాడుతుంది. నాకు ఇప్పుడు పెళ్లి వద్దని కనకానికి, ఆ పెళ్లిచూపులకి వచ్చిన వాళ్ళకి అప్పు చెప్తుంది. ఆ తర్వాత అప్పు నిర్ణయం మార్చుకుంటే కాల్ చెయ్యండి అంటు వాళ్ళు వెళ్ళిపోతారు. కాసేపటికి ఎందుకు వద్దని అంటున్నావని అప్పుని కనకం అడుగుతుంది. నేను పోలీస్ అవ్వాలనుకుంటున్నానని అప్పు చెప్పి వెళ్ళిపోతుంది. కనకం కృష్ణమూర్తి ఆశ్చర్యంగా చూస్తారు. మరొకవైపు కావ్య కార్ కి అడ్డుగా శ్వేత భర్త కార్ పెడతాడు. నిన్ను నీ భర్త.. నన్ను నా భార్య మోసం చేసారు. వాళ్ళు విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారని శ్వేత భర్త అనగానే కావ్య అతనిని తిడుతుంది. భార్య అలా చేస్తుంటే ఏం చేస్తున్నావంటూ అతనిని తిడుతుంది. తరువాయి భాగంలో కావ్య, రాజ్ ఇద్దరు ఎప్పటిలాగే మాటలతో యుద్ధం చేసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.