Karthika Deepam2 : నా కూతురు కోసం వచ్చాను.. పారిజాతానికి షాకిచ్చిన కొడుకు! 

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీకదీపం 2'(karthika Deepam2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -125 లో.... జ్యోత్స్న దీప రూమ్ కి తాళం వేస్తుంది. అలా ఎందుకు వేస్తున్నావని సుమిత్ర అడుగుతుంది. దీపని తీసుకొని‌ బావ రెస్టారెంట్ కి వెళ్ళాడని జ్యోత్స్న అనగానే.. నేనే శౌర్యకి ఆకలిగా ఉందంటే తీసుకొని వెళ్ళమన్నానని సుమిత్ర అంటుంది. అంటావ్ ఎటైనా సరదాగా కూడా తిరిగి రమ్మని బావని పంపిస్తావ్ అని జ్యోత్స్న అనగానే..  తనని కొట్టడానికి చెయ్ ఎత్తుతుంది సుమిత్ర. అప్పుడే దీప రావడం చూసి ఆగిపోతుంది. ఇదిలా తయారవ్వడానికి కారణం మీరే అంటు పారిజాతాన్ని సుమిత్ర తిడుతుంది. అ తర్వాత జ్యోత్స్న, పారిజాతం లు వెళ్ళిపోతారు.‌ జరిగిన దాని గురించి సుమిత్ర కవర్ చేస్తుంటే.. అంత చూసానని దీప అంటుంది. ఇప్పుడు మనసు కొంచెం తేలిక అయింది కానీ అలా జ్యోత్స్న ఎప్పుడు అవుతుందో అని దీప అనగానే.. థాంక్స్.. జ్యోత్స్నని అర్థం చేసుకున్నందుకు అని సుమిత్ర అంటుంది. అ తర్వాత శౌర్య ఎక్కడ కన్పించడం లేదని సుమిత్ర అడుగగా.. అదిగో అక్కడ కూర్చొని ఉంది.. అలిగిందని చెప్తుంది. తనకి ఇష్టమైనవి వండాలంట.. నేనే వండుతానని దీప అంటుంది. మరొకవైపు కార్తీక్ ఇంటికి వెళ్లడంతోనే శ్రీధర్.. శౌర్యకి కార్తీక్ తినిపిస్తున్న ఫోటో చూపించి.. అవసరమా వాళ్ళని తీసుకొని వెళ్లడమని శ్రీధర్ కోప్పడతాడు. శౌర్యకి ఆకలిగా ఉందంటే తీసుకొని వెళ్ళాను.. అక్కడ తినిపించింది శౌర్యకి, దీపకి కాదని కార్తీక్ కోప్పడతాడు. అ ఫోటో పంపిన వాళ్లు ఎంత బాధపడుతున్నారో తెలుసా అని శ్రీధర్ అనగానే.. అది జ్యోత్స్న పంపించింది కదా.. తనని మనసుతో ఆలోచించమని చెప్పండని కార్తీక్ అంటాడు. మరొకవైపు స్వప్న బాయ్ ఫ్రెండ్ సిటీ కి వస్తాడు. ఇన్ని రోజులు నాకు దూరంగా ఉన్నావంటూ స్వప్న అతనితో గొడవపడుతుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి రెస్టారెంట్ కి వెళ్తారు. అ తర్వాత కుబేర్ ఫోటో చూసి దీప ఎమోషనల్ అవుతుంది. మరొకవైపు పారిజాతం తన కొడుకు దాస్ గురించి ఆలోచిస్తుంది. అప్పుడే దాస్ వస్తాడు. ఎలా ఉన్నావని, ఎందుకు వచ్చావని పారిజాతం అడుగుతుంది. నా కూతురు కోసం వచ్చానని దాస్ అనగానే.. అది చనిపోయింది కదా అని పారిజాతం అంటుంది. నా కూతురు బ్రతికే ఉందని.. ఆ విషయం నాకు తెలుసని నీకు తెలియదని దాస్ అనుకుంటాడు. తన కూతురు ఉందన్న విషయం దాస్ కి తెలియదని పారిజాతం అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : నందినితో డీల్ కుదుర్చుకున్న సందీప్.. ఆ వేడుకల్లో తను చెప్పగలదా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu ).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -177 లో... శ్రీలత కావాలనే సీతాకంత్ చూడాలని.. దేవుడు ముందు చేతిలో కర్పూరం వెలిగిస్తూ.. నా బిడ్డ సీతాకాంత్ ఎప్పుడు బాగుండాలని అంటుంది. అప్పుడే సీతాకాంత్ వచ్చి ఎందుకు ఇలా చేస్తున్నావ్ అమ్మ అని శ్రీలత ప్రేమని చూసి పొంగిపోతుంటాడు. ఈవిడ ఇంత ఎక్స్ ట్రా చేస్తుందంటే మళ్ళీ ఏదో ప్లాన్ లో ఉన్నట్టుందని రామలక్ష్మి అనుకుంటుంది. అ తర్వాత సీతాకాంత్ కి అందరు బర్త్ డే విషెస్ చెప్తుంటారు. పెద్దాయన దగ్గర సీతాకాంత్ ఆశీర్వాదం తీసుకంటాడు. శ్రీలత దగ్గర తీసుకోబోతుంటే.. ఇప్పుడు ఎందుకు? ఈవెనింగ్ బర్త్ డే కి వచ్చిన వారి ముందు తన భాగోతం బయటపెట్టి ఆశీర్వాదం తీసుకోమని రామలక్ష్మి అనగానే.. అందరూ షాక్ అవుతారు. అదే మంచితనం గురించి చెప్పి ఆశీర్వాదం తీసుకోండి అని రామలక్ష్మి కవర్ చేస్తుంది. దానికి సీతాకాంత్ సరేనంటాడు. ఆ తర్వాత నందిని దగ్గరకి రామలక్ష్మి బొకేతో వెళ్తుంది. రామలక్ష్మి థాంక్స్ అంటూ నందినికి చెప్తుంది. ఎందుకు థాంక్స్ ఒకరకంగా నా కంపెనీ డెవలప్ అవ్వాలని స్వార్థం కూడా ఉందని నందిని అంటుంది. మీ భర్త పుట్టిన రోజు ఏర్పాట్లు జరుగుతున్నాయా అని నందిని అనగానే.. ఈ రోజు మా అయన పుట్టిన రోజు అని మీకెలా తెలుసని రామలక్ష్మి అంటుంది. అలా అనగానే కలిసి పని చేయబోతున్నాం.. ఆ మాత్రం తెలియదా అని నందిని అంటుంది. ఈ రోజు బర్త్ డే కీ రండి అని రామలక్ష్మి అనగానే.. నాకు వీలవ్వదని నందిని చెప్తుంది. ఎలాగైనా రావాలని రామలక్ష్మి అనగానే.. సరేనని నందిని అంటుంది. అదే టైమ్ కి నందిని దగ్గర కి సందీప్ వస్తాడు. రామలక్ష్మి చూస్తుందని దాక్కుంటాడు. రామలక్ష్మి వెళ్లకా నందిని దగ్గరికి సందీప్ వెళ్లి.. నాకు ఎండీ అవ్వాలని కోరిక మీరు సపోర్ట్ చెయ్యండి.. మీకు బెనిఫిట్ ఉందని సందీప్ అనగానే.. నాకు ఓకే అని నందిని అంటుంది. ఆ విషయం ఈ రోజు బర్త్ డే కి వస్తున్నాను కదా అక్కడ చెప్తానని నందిని అంటుంది. అ తర్వాత నందిని డీల్ కీ ఒప్పుకున్న విషయం.. సందీప్ హ్యాపీగా ఫీల్ అవుతూ శ్రీలతకి చెప్తాడు. మరొకవైపు రామలక్ష్మి బర్త్ డే ఏర్పాట్లు చెయ్యండని పనిమనిషికి చెప్తుంది. అప్పుడే శ్రీలత వచ్చి.. ఏంటి బర్త్ డే ఏర్పాట్లు చేస్తున్నావా.. ఎంత ఆనందపడితే అంత బాధపడతావని శ్రీలత అనగానే.. మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తున్నట్లుందని రామలక్ష్మి అనుకుంటుంది. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Guppedantha Manasu : ఎండీగా రిషి.. మరోసారి శైలేంద్రని ఫూల్ చేశాడుగా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'(Guppedantha Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1155 లో ... ఫణీంద్రకి దేవయాని ఫోన్ చేసి.. మీటింగ్ లో ఏం జరుగుతుంది? ఎవరు ఎండీగా నిర్ణయం తీసుకున్నారని అడుగుతుంది. ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఫణీంద్ర అంటాడు. శైలేంద్ర ఏం చేస్తున్నాడని దేవయాని అడుగగా.. వాడు ఇక్కడ లేడు.. ఎక్కడ ఏ రాచకార్యాలు వెలగపెడుతున్నాడో వాడికే ఫోన్ చేసి కనుక్కోమని ఫణీంద్ర కోపంగా ఫోన్ కట్ చేస్తాడు. నేను అనుకున్నదే కరెక్ట్.. శైలేంద్ర ఏదో ప్రాబ్లమ్ లో ఉన్నాడని దేవయాని అనుకుంటుంది. వెంటనే తన రూమ్ లోకి వచ్చి మనుకి వసుధార రాసిన లెటర్ ని ఫోటో తీసి శైలేంద్రకి పంపిస్తుంది. అదంతా దూరం నుండి ధరణి చూస్తుంటుంది. మరొకవైపు మీటింగ్ లో  అందరూ రిషిని ఎండీ గా ఉండాలని అంటారు. వసుధార గారు అన్నట్లు మీరు ఉండగా వేరొకరు ఎండీ పదవికీ తగరని బోర్డు మెంబర్స్ అంటారు. అందరు అనడంతో రిషి ఎండీగా ఉండడానికి ఒప్పుకుంటాడు. మరొకవైపు శైలేంద్ర ఫోన్ కి దేవయాని పంపిన లెటర్ ని మను చదివి షాక్ అవుతాడు. అది నిజం..వసుధార వెళ్లిపోయినప్పుడు నీకు ఆ లెటర్ రాసింది .. నేనే మార్చేసా అని శైలేంద్ర చెప్తాడు. మను ఆ లెటర్ చదివి షాక్ అవుతాడు. అప్పుడే దేవయాని ఫోన్ చేసి.. నువ్వు శైలేంద్రని కిడ్నాప్ చేసావని నాకు తెలుసు.. కానీ ఇప్పుడు శైలేంద్రని వదిలిపెట్టు.. మా కల నిజమయ్యే టైమ్.. నువ్వు ఏదైనా ఉంటే ఆ మహేంద్ర, అనుపమలతో తేల్చుకోమని దేవయాని అంటుంది. ఈ విషయం ఎవరితో చెప్పనంటేనే నేను వదిలి పెడతానని మను అనగానే.. ఎవరితో చెప్పమని దేవయాని అంటుంది. ఆ తర్వాత శైలేంద్రని మను వదిలిపెడతాడు. అ తర్వాత శైలేంద్ర కాలేజీకీ వెళ్లి.. నేనొచ్చాను కదా ఇక ఎండీని ప్రకటించండి అని అనగానే ఆల్రెడీ ఎండీగా రిషి అని నిర్ణయం తీసుకున్నామని ఫణీంద్ర అనగానే.. అలా ఎలా అవుతాడని శైలేంద్ర అనగానే తనపై ఫణీంద్ర కోప్పడతాడు. ఇంత మోసం చేస్తాడా అని రిషిపై శైలేంద్ర కోపంగా ఉంటాడు. కాని రిషి నే రివర్స్ గా..  టైమ్ కి ఎక్కడికి వెళ్ళావ్ .. ఆ మేడమ్ నా పేరు చెప్పింది. అయినా నేను వద్దనన్నానంటూ శైలేంద్రని ఫూల్ ని చేస్తాడు రిషి. నువ్వు అయితే రేపు అయిన నన్ను చేస్తావ్ గా అంటూ శైలేంద్ర ధీమాగా ఉంటాడు. మరొకవైపు మహేంద్రనే నీ కన్నతండ్రి అని శైలేంద్ర చెప్పిన విషయాన్ని మను గుర్తుకుచేసుకుంటాడు. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : రాజభోగాలు అనుభవించాల్సింది నా కొడుకే.. ధాన్యలక్ష్మి చేసిన రభస!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -490 లో... కళ్యాణ్, అప్పులని తీసుకొని రాకుండా రాజ్ ఒక్కడే వస్తాడు. దాంతో ఏమైంది రానని చెప్పాడా? ఎందుకు రాను అన్నాడని ధాన్యలక్ష్మి అడుగుతుంది. అప్పుని మా అమ్మ కోడలుగా ఒప్పుకుందా అని అడిగాడు. నాకు పిన్ని అ విషయం గురించి ఏం చెప్పలేదు.. నేను కళ్యాణ్ కి ఏం చెప్పలేదు.. అప్పుని కోడలుగా ఒప్పుకొని తనే స్వయంగా వచ్చి తీసుకొని వెళ్తే వస్తానని కళ్యాణ్ అన్నాడని రాజ్ చెప్పగానే.. అంటే ధాన్యలక్ష్మి వెళ్లి అప్పు కాళ్ళు పట్టుకొని రా మహాలక్ష్మి అంటూ పిలవాలా అని రుద్రాణి అంటుంది. అలా తను అనడంతో అందరు రుద్రాణిపై కోప్పడతారు. ఇద్దరు అక్కల కంటే అప్పు ముదురు.. కళ్యాణ్ ని కొంగున కట్టేసుకొని ఆడిస్తుందని రుద్రాణి అనగానే.. మీ అబ్బాయి ఏమైనా నా కొంగు పట్టుకొని తిరుగుతున్నాడా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావని స్వప్న అంటుంది. కావ్యని నేను పెళ్లి చేసుకోవడం వల్ల.. కావ్యని కొన్ని రోజుల వరకు అమ్మ కోడలుగా ఒప్పుకోలేదు. దాంతో కావ్య చాలా కష్టాలు పడింది. ఇప్పుడు కూడా నేను అప్పుని తీసుకోని వస్తే అదే జరుగుతుందని కళ్యాణ్ అన్నాడంటూ రాజ్ చెప్తాడు. ఈ ఆస్తులన్నీ మన వారసులకి కాదు.. కనకం కన్నబిడ్డలకి ధారపోయడానికి అని ధాన్యలక్ష్మి అంటుంది. మరొకవైపు కళ్యాణ్ తన కవితలకు సంబంధించిన జాబ్ ని సెర్చ్ చేస్తుంటాడు. ఎక్కడ ఖాళీ లేదని చెప్పడంతో ఒక దగ్గర వచ్చి కూర్చొని ఉంటాడు. అప్పుడే ఒక పెద్దాయన బొమ్మలు అమ్ముకుంటు నీరసంగా వచ్చి కూర్చొని ఉంటే.. నేను అమ్మి పెడతానని కళ్యాణ్ అమ్ముతుంటాడు. అప్పుడే రుద్రాణి, ధాన్యలక్ష్మిలు కళ్యాణ్ ని చూస్తారు. అది చూసి ధాన్యలక్ష్మి బాధాపడుతుంటే.. రుద్రాణి ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. నీ కొడుకు ఇలా ఉంటే రాజ్ మాత్రం రాజాభోగాలు అనుభవిస్తున్నాడు.. నువ్వు వెళ్లి ఇంట్లో నీలదియ్యాలని ధాన్యలక్ష్మికి రుద్రాణి చెప్తుంది. ఆ తర్వాత కళ్యాణ్ హెల్ప్ చేసినందుకు.. అ పెద్దాయన థాంక్స్ చెప్తాడు. మరొక వైపు ఎప్పటిలాగా రాజ్ వచ్చి కావ్యతో గొడవపడతాడు. ఆ తర్వాత కళ్యాణ్ రాసిన పుస్తకం బయట ఒకతను అమ్ముతూ కన్పిస్తాడు. తరువాయి భాగంలో. రాజ్ ఆఫీస్ కీ వెళ్తుంటే.. కళ్యాణ్ అన్ని కష్టాలు పడుతున్నాడు. రాజ్ మాత్రం రాజభోగాలు అనుభవిస్తున్నాడు.. ఈ ఆస్తులు ముక్కలు చెయ్యాలని ధాన్యలక్ష్మి అంటుంది. దాంతో కళ్యాణ్ వచ్చే వరకు రాజ్ ఇంటి బాధ్యతల నుండి తప్పుకుంటాడని సీతారామయ్య అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

గుప్పెడంత మనసు..పార్ట్ 2 త్వరలో..

బుల్లితెర మీద కార్తీక దీపం ఎంత సెన్సేషన్ సృష్టించిందో అందరికీ తెలుసు. ఆ తర్వాత గుప్పెడంత మనసు కూడా అదే రేంజ్ మంచి ఫీల్ గుడ్ స్టోరీతో ఆడియన్స్ అలా తన వైపు తిప్పేసుకుంది. కానీ ఇప్పుడు సడెన్ గా ఈ సీరియల్ ని ముగించేస్తున్నారు సీరియల్ మేకర్స్. దీంతో ఆడియన్స్ మాత్రం బాగా ఫీలవుతున్నారు. ఈ టీమ్ మొత్తం వీడియోస్ ని ఫొటోస్ ని షేర్ చేయడం అలాగే కట్ చేసి తినిపించుకోవడం చూసాక ఈ సీరియల్ ఎండ్ ఐపోతోంది అని నమ్మారు ఆడియన్స్. ఇక ఆడియన్స్ కూడా బాగా ఎమోషనల్ అవుతున్నారు. కార్తీక దీపం ఎలా ఐతే పార్ట్ 2 తో వచ్చిందో అలాగే గుప్పెడంత మనసు కూడా పార్ట్ 2 తో రావాలి అని రిక్వెస్ట్ చేస్తున్నారు ఈ సీరియల్ ఫాన్స్.. "ప్లీజ్ డైరెక్టర్ గుప్పెడంత మనసు పార్ట్  2 రావాలి. హీరొ గోల్ , హీరోయిన్ గోల్  చూపించకుండానే ఆపేస్తున్నారు. ఈ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ మీద మాకు సీరియల్ కావాలి. కేక్ కటింగ్ టైములో మీరు అన్నారు కదా పార్ట్  2 చేద్దాం అని. ఆ మాట నిలబెట్టుకోండి.   ఫ్యాన్స్ వెయిటింగ్ పార్ట్ 2 చూడడానికి. ఎన్నో పనికిమాలిన సీరియల్స్ ఉన్నాయి. ఎండ్ చేయమన్నా చెయ్యట్లేదు. ఈ గుప్పెడంత మనసులో తల్లి, తండ్రితో కొడుకుకు ఉన్న బంధం ఎంతో బాగా చూపించారు. ఎన్ని సంవత్సరాలు ఈ సీరియల్ ప్రసారమైన కూడా చూసేవాళ్ళం...సీరియల్ అప్పుడే ఇపోతోందంటే బాధగా ఉంది.  ప్లీజ్ ఎండ్ చేయకండి" అంటూ నెటిజన్స్ తెగ మెసేజెస్ పెడుతున్నారు. మరి ఈ సీరియల్ మేకర్స్ కూడా అభిమానుల కోరిక మేరకు గుప్పెడంత మనసు పార్ట్ 2 ని తీసుకొస్తారేమో చూడాలి.

Eto Vellipoyindhi Manasu : కొడుకు బర్త్ డే వేడుకల్లో సవతి తల్లి శ్రీలత ఏం చేయనుంది?

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -176 లో..... సీతాకాంత్ కంపెనీ షేర్ డైరెక్టర్స్ వేరొక కంపెనీకి షేర్ అమ్ముకుంటుంటే.. వద్దని సీతాకాంత్ చెప్పి.. సందీప్ ని చైర్మన్ ని చేస్తానని సంతకం చేయబోతుంటాడు. అప్పుడే నందిని పిఏ వచ్చి సంతకం పెట్టకండి.. మా కంపెనీ మీ కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి రెడీగా ఉందని చెప్పగానే.. అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. అంత పెద్ద కంపెనీ ఈ కంపెనీలో పెట్టుబడి పెడుతుంటే మేమ్ వేరే దగ్గరికి ఎందుకు వెళ్తాము.. ఇక్కడే ఉంటామని బోర్డు మెంబర్స్ అంటారు. ఆ తర్వాత సీతాకాంత్ పిఏకీ థాంక్స్ చెప్పగా.. మాకు కాదు చెప్పాలిసింది రామలక్ష్మి గారికి అనగానే.. సీతాకాంత్ ఆశ్చర్యంగా చూస్తాడు. నువ్వు అనుకున్నది సాధించావ్ అమ్మ అని పెద్దాయన అంటాడు. ఆ తర్వాత సీతాకాంత్ బయటకు వచ్చి.. ఎంప్లాయిస్ కి గుడ్ న్యూస్ అంటూ మన కంపెనీ ఎవరి చేతుల్లోకి వెళ్లట్లేదని చెప్తాడు. అ తర్వాత అందరు వెళ్ళిపోయాక థాంక్స్ రామలక్ష్మి అని సీతాకాంత్ చెప్తాడు. మీరు మంచివారు మంచి వాళ్లకి మంచే జరుగుతుంది సర్.. ఒకావిడ అ రోజు మిమ్మల్ని స్టేషన్ నుండి తీసుకొని రావడానికి హెల్ప్ చేసింది. ఇప్పుడు వచ్చి ఇలా కంపెనీని సేవ్ చేసిందని రామలక్ష్మి అనగానే.. ఎవరు ఆవిడా పేరు తెలుసా అని సీతాకాంత్ అనగానే.. తెలియదు కానీ ఆవిడకి మనకి ఏదో సంబంధం ఉందని రామలక్ష్మి అంటుంది. అ తర్వాత శ్రీవల్లి తన ఆశలు మొత్తం ఆవిరి అయిపోయాయంటూ బాధపడుతుంది. చివరివరకు వచ్చి ఇలా జరిగిందని సందీప్ అంటాడు. అ తర్వాత సీతాకాంత్, పెద్దాయన మాట్లాడుకుంటుంటే.. అప్పుడే సిరి వచ్చి అన్నయ్య బర్త్ డే కదా.. ఆ సెలెబ్రేషన్స్ లో ఉన్నానని అనగానే.. అయితే నా సెలెబ్రేషన్స్ లో నేను ఉంటానని పెద్దాయన అంటాడు. ఆ తర్వాత సీతాకాంత్ కి రామలక్ష్మి సర్ ప్రైజ్ ఇస్తుంది. కేక్ కట్ చేయిస్తుంది. నాకు జీవితాంతం గుర్తు ఉండి పోయే గిఫ్ట్ ఇవ్వమని సీతాకాంత్ అనగానే.. ఈ రోజు నైట్ లోపు మీకు అలా గుర్తుండిపోయే గిఫ్ట్ ఇస్తానని రామలక్ష్మి అనగానే.. నా మనసులో మాట కూడా చెప్తానని సీతాకాంత్ అనుకుంటాడు. అ తర్వాత సీతాకాంత్ బర్త్ డే అని తెలుసుకొని ఈ రోజు జీవితాంతం గుర్తు ఉండిపోయేలా చేస్తానని శ్రీలత అనుకొని చేతిలో కర్పూరం వెలిగిస్తూ ఉంటుంది. అప్పుడే సీతాకాంత్ వస్తుంటాడు. తరువాయి భాగంలో బర్త్ డే ఏర్పాట్లు చెయ్యండి అని రామలక్ష్మి పనిమనిషికి చెప్తుంది. బర్త్ డే ఎలా జరుగుతుందో చూస్తానని శ్రీలత అనగానే.. ఈవిడ ఏదో ప్లాన్ చేసిందని రామలక్ష్మి అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2: కన్నతండ్రి చెంప పగులగొట్టిన కూతురు...

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' కార్తీకదీపం-2'( Karthika Deepam2). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-124 లో..  దీప, శౌర్యల దగ్గరికి కార్తీక్ వస్తాడు. బూచోడు ఇక రాడు.. నువ్వు అమ్మ చెప్పినట్లు వినాలి.. ఎక్కడికి వెళ్ళకూడదని కార్తీక్ చెప్తాడు. ఇలా అంటున్నావంటే నువ్వు మళ్ళీ రావా అని శౌర్య అనగానే.. కార్తీక్, దీప ఒకరినొకరు చూసుకుంటారు. ఇక ఇదంతా చాటుగా జ్యోత్స్న, పారిజాతం చూస్తారు. ఒక తల్లి, తండ్రి, పిల్ల సినిమా చూపిస్తున్నారని పారిజాతం అనగానే.. నేను వాళ్ళకి సినిమా చూపిస్తానని వాళ్ళ ఫోటోని తీస్తుంది జ్యోత్స్న. మరోవైపు శోభ ఉండే ఇంటికి నరసింహా వెళ్ళి.. అమ్మ అమ్మ అంటూ ఆవేశంగా అరుస్తాడు. ఇక శోభ వచ్చి.. నువ్వు, మీ అమ్మ బాగానే నాటకం ఆడి నన్ను మోసం చేశారు కదా అని అంటుంది‌. మీ అమ్మ వచ్చేలోపు తన బట్టలు అన్నీ సర్దేసి బయట పడేయమని శోభ అంటుంది. అంత అవసరం లేదు.. నేనే వెళ్ళిపోతానంటూ అనసూయ వస్తుంది. నిజం చెప్పొద్దని చేతులు పట్టుకొని బతిమాలాను కదా అయినా కొడుకు కోసం ఆ మాత్రం కూడా చేయలేవా.. ఇప్పుడు దీప కేసు పెడితే నేను జైలుకి వెళ్తానని నరసింహా అంటాడు. నువ్వు జైలుకెళ్తే నష్టపోయేది నేను.. ఈవిడకేం బాగానే ఉంటుందని శోభ అంటుంది. ఇక శోభ, అనసూయ కాసేపు ఒకరికొకరు తిట్టుకుంటారు. నువ్వు నిజం చెప్పకపోయి ఉంటే నా కూతురు నా దగ్గరే ఉండేది కదా అని నరసింహా అనగానే.. ఏంట్రా నీ కూతురు కన్నప్పుడే వదిలేసి పోయావ్ ఏ రోజు అయినా దానికి కడుపు నిండా అన్నం పెట్టావా అప్యాయంగా దగ్గరకు తీసుకున్నావా దాని పేరు కూడా నేను చెప్తే నీకు తెలిసింది. దీప బిడ్డని ప్రాణంగా చూసుకుంది. బిడ్డ కోసం అయినా వస్తావని ఎదురు చూసిందిరా. దాన్ని నువ్వు దారుణంగా మోసం చేశావ్. ముగ్గురు ఆడవాళ్ల నమ్మకంతో ఆడుకున్నావ్ ఇంకా నీ కూతురి జీవితంతో కూడా ఆడుకోవాలి అనుకున్నావా దీప పాపని అల్లారు ముద్దుగా పెంచిందిరా ఆ చంటిది దీని చేతిలో పడితే బోరు బావిలో పడినట్టే. దీప మీద నీకు పగ ఉందని నాకు తెలుసు నువ్వు దాన్ని బతకనిస్తావా. ఇవన్నీ ఆలోచించి చేసిన పాపం కడిగేసుకున్నాను. నేను నా దారి చూసుకుంటాను. నేను ఎవరి పంచ తొక్కను నా దారి నేను చూసుకుంటానని అనసూయ చెప్పేసి వెళ్లిపోతుంది. ఇక నరసింహా, ‌శోభ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. పారిజాతం, జ్యోత్స్న రెస్టారెంట్ కి వెళ్ళగా అదే రెస్టారెంట్ కి దాస్ కూడా వస్తాడు. బేరర్ వాటర్ తీసుకెళ్తుండటం అతను అక్కడికి వచ్చి ఆయన్ను ఢీ కొట్టడంతో వాటర్ జ్యోత్స్న మీద కొడుతుంది. దాంతో జ్యోత్స్న వెయిటర్‌తో పాటు తన కన్నతండ్రిని కొడుతుంది. పారిజాతం షాక్ అయిపోతుంది. అలాంటి వాళ్లని చెప్పుతో కొట్టాలని జ్యోత్స్న అంటే పారిజాతం జ్యోత్స్నని కొట్టడానికి చేయి ఎత్తుతుంది. నువ్వు కొట్టింది ఎవర్నో తెలుసా అని పారిజాతం అనగానే.. ఎవర్నీ అని జ్యోత్స్న అంటుంది. నీ కన్నతండ్రి అని చెప్పలేను.‌. నా కొడుకు అని చెప్పలేనని పారిజాతం మనసులో అనుకొని మౌనంగా ఉంటుంది. నీకు ఎందుకు ఇంత కోపం వస్తుందో నాకు తెలీడం లేదు గ్రానీ అని జ్యోత్స్న అంటుంది. కాసేపటికి ఇద్దరు ఇంటికి వస్తారు. జ్యోత్స్న ఇంటికి వచ్చి దీప ఉండే ఇంటికి తాళం వేస్తుంది. విడాకులు తీసుకున్న మనిషి ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదని జ్యోత్స్న అంటుంది. అప్పుడే సుమిత్ర వచ్చి.. ఎందుకు తాళం వేశావని అడుగుతుంది. దీప ఇక ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదని అనగానే.. అది నువ్వు చెప్పకూడదని సుమిత్ర అంటుంది. మరి ఎవరు బావ చెప్తాడా అని జ్యోత్స్న అని.. కార్తీక్, దీప పాప కలిసున్న ఫొటోని చూపిస్తుంది. అది చూసిన సుమిత్ర.. వాళ్లని రెస్టారెంట్ కి తనే పంపానని అంటుంది. దీపకి ఈ రేంజ్ ఎంక్‌రేజ్ మెంట్ ఉంటే.. ఇక నాకు పెళ్లి ఎందుకు అవుతుందని జ్యోత్స్న అంటుంది. నిన్ను చూస్తుంటే దీప బాగా కష్టపడింది.. రెండు రోజులు అలా సరదాగా రండి అని దీప, బావలని తీసుకెళ్లమనేలా ఉన్నావని జ్యోత్స్న అనగానే.. సుమిత్ర కోపంతో కొట్టబోతూ దీపని చూసి ఆగిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Guppedantha Manasu: నీ తండ్రి ఎవరో కాదు, మా బాబాయ్ మహేంద్రే.. షాక్ లో‌ మను!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ గుప్పెడంత మనసు(Guppedantha Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-1154లో..  తనని కిడ్నాప్ చేసింది మనునే అని శైలేంద్ర షాక్ అవుతాడు.  ఎందుకు నన్ను కిడ్నాప్ చేశావని శైలేంద్ర అడుగగా.. మను మౌనంగా ఉంటాడు. సరే.. గతంలో నేను నిన్ను ఇబ్బంది పెట్టాను.. నిన్ను బాధపెట్టాను.. దానికి నువ్వు ప్రతీకారం తీర్చుకోవడం కరెక్టే కానీ.. దానికి ఇది సరైన సమయం కాదని శైలేంద్ర అంటాడు. నాకు ఇదే సరైన సమయమని మను అంటాడు. కరెక్ట్ టైమ్ చూసి దెబ్బ కొట్టాడు వెధవ అని శైలేంద్ర మనసులో తిట్టుకుంటూ.. పైకి మాత్రం మన వదిలేయమని మనుని బ్రతిమిలాడతాడు.  నేను ఎన్నో ఏళ్లుగా కంటున్న కల.. ఈరోజుతో నెరవేరబోతుంది. నీకు కూడా తెలుసు కదా.. దాని కోసం నేను ఏమేమి చేశానో.. ఆ పదవి కోసం నేను దేనికైనా తెగిస్తానని నీకు తెలుసుకదా.. ఆ పదవి ఈరోజు నా సొంతం కాబోతుందని శైలేంద్ర అంటాడు. కలకంటున్నావా? అని మను అంటే.. లేదు.. నిజం.. టైమ్ ఎంత అవుతుందని శైలేంద్ర అడుగుతాడు. 11 అయ్యిందని మను చెప్పడంతో.. 11 అయ్యిందా?? రేయ్.. నన్ను ఎండీగా ప్రకటించే టైమ్ అయ్యిందిరా.. నన్ను వదిలెయ్ రా.. నీకు దండం పెడతాను. ప్లీజ్ రా.. కావాలంటే 12 గంటలకు వచ్చి నీకు లొంగిపోతానని శైలేంద్ర అంటాడు.  నా ప్రశ్నకి సమాధానం కావాలి అని మను అంటాడు. నీ ప్రశ్నకి నా దగ్గర సమాధానం ఎలా ఉంటుందిరా అని శైలేంద్ర అడుగుతాడు. సమాధానం ఉంది కాబట్టే.. నిన్ను బంధించాను.. నా తండ్రి ఎవరు? నా కన్న తండ్రి పేరేంటి? అని అడుగుతాడు మను. దాంతో శైలేంద్ర.. నాకు తెలియదు అని అంటాడు. నీకు తెలుసని నాకు తెలుసు.. మర్యాదగా చెప్పమని మను అంటాడు. నాటకాలు ఆడొద్దు శైలేంద్రా.. నిజం చెప్పమని మను అంటాడు. నేను చెప్పను.. ఏం చేస్తావ్.. నీ తండ్రి ఎవరో తెలుసు కానీ చెప్పను. ఏం చేస్తావని శైలేంద్ర ఎదురుతిరుగుతాడు. ప్లీజ్ శైలేంద్రా.. నా తండ్రి ఎవరో చెప్పు.. 25 ఏళ్ల నుంచి ఈ ప్రశ్నకి సమాధానం దొరక్క.. నిరీక్షిస్తున్నానని మను అంటాడు. అబ్బా.. నువ్వెలా అడిగినా నేను నిజం చెప్పను... ఏం చేస్తావో చేసుకో.. నన్ను ఇక్కడ బంధీగా ఉంచినా కూడా నేను నిజం చెప్పను.. నాకు ఎలాంటి సమస్య లేదని శైలేంద్ర అంటాడు. నువ్వు అక్కడ లేకపోతే ఎండీగా ప్రకటించరు కదా అని మను అంటాడు. ఇక ఫణీంద్రకి మను కాల్ చేస్తాడు. కొత్త ఎండీనీ నేనే కదా అని శైలేంద్ర అనగా.. నువ్వు ఎండీవి ఏంట్రా.. వసుధార మాజీ ఎండీగా తనే ఒక వ్యక్తిని ఎండీగా ప్రకటిస్తానని చెప్తుందని ఫణీంద్ర అంటాడు. నా కల చెదిరిపోతుంది నీ కన్నతండ్రి ఎవరో చెప్తానని మనుతో శైలేంద్ర అంటాడు.  దాంతో శైలేంద్ర.. నీ తండ్రి ఎవరో కాదు.. మా బాబాయ్ మహేంద్రే అని నిజం చెప్పేస్తాడు. ఆ మాట వినగానే షాక్ అయిపోయిన మను.. ఏంటీ.. నా తండ్రి మహేంద్రా అని అడుగుతాడు. అవును మను.. మహేంద్ర భూషణే నీ కన్నతండ్రి అని శైలేంద్ర అంటాడు. దాంతో శైలేంద్రని లాగిపెట్టి కొడతాడు మను‌. నిజం చెప్తే కొడతావ్ ఏంట్రా అని శైలేంద్ర అడగడంతో.. నువ్వు అబద్ధం చెప్తున్నావ్.. నీ దగ్గర ఏ సాక్ష్యం ఉందని మహేంద్ర సర్ నా తండ్రి అని చెప్తున్నావని మను అడుగుతాడు. సాక్ష్యమా ఉంది.. అది చూపిస్తే నమ్ముతావా? అని శైలేంద్ర అంటాడు. గన్ తీసి శైలేంద్రకి మను గురిపెట్టి.. మహేంద్ర సర్ నా కన్నతండ్రి కాదని నాకు పక్కాగా తెలుసు.. మర్యాదగా నిజం చెప్పు.. లేదంటే పుచ్చ పేలిపోద్దని అంటాడు. రేయ్ రేయ్.. సాక్ష్యం చూపిస్తానని చెప్పాను కదా.. నా ఫోన్ నుంచి మా మమ్మీకి ఫోన్ చేయమని శైలేంద్ర ఫోన్ చేయిస్తాడు. అప్పుడు.. మను తండ్రి గురించి వసుధార రాసిన లెటర్ గురించి మాట్లాడి.. అది వెంటనే ఫొటో తీసి.. అర్జెంట్‌గా పంపించు.. మిగిలిన విషయాలు తర్వాత మాట్లాడతానని శైలేంద్ర అంటాడు. వీడేదో ప్రమాదంలో ఉన్నాడని, కాలేజ్‌లో లేడని దేవయాని తెలుసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : ధాన్యలక్ష్మి మాటని కాదన్న కళ్యాణ్.. రానని తెగేసి చెప్పాడు కదా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి(Brahmamudi)' . ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-489 లో.. కవి, అప్పులని తీసుకురావడానికి రాజ్ వెళ్తాడు. మరోవైపు వాళ్ళిద్దరు రూమ్ ని నీట్ గా సర్దుకుంటారు. ఇంట్లోకి కావాల్సిన సరకులు, సామాన్లు కొనుక్కోవాలని కళ్యాణ్ అంటాడు. నేను మళ్లీ పిజ్జా డెలివరీకి వెళ్తానని అప్పు అనగానే.. వద్దు అప్పూ.. నువ్వు కష్టపడటం నాకు ఇష్టం లేదు.. నేను కష్టపడతాను.. మనకు రాత్రికి గది కూడా లేదు. ఇప్పుడు అది దొరికింది. కావాల్సిన వస్తువులు కూడా అలానే వస్తాయని కళ్యాణ్ అంటాడు.  కాసేపటికి అప్పు ఫ్రెండ్స్ వస్తారు. ఏం కవి సర్.. మీరన్న గెస్ట్ హౌస్ ఇదేనా.. చాలా బాగుందని ఒకడు అంటాడు. వాళ్ల చేతిల్లో కుకర్, చాప, చీపురు, ప్లేట్లు అన్నీ ఉంటాయి. మీ ఫ్రెండ్ బంటీ గాడేనని మాకు కూడా చెప్పొచ్చు కదా అని మరో ఫ్రెండ్ అంటాడు. మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదనే కదా మీరు వెళ్లిపోయారని ఒకతను అనగానే.. అవునురా.. రాత్రి మీరు చలిలో పడుకోవడం చూసి బాధేసిందని అప్పు అంటుంది. పోనీలే ఏదైతేనేం.. మీకు కూడా ప్రైవసీ ఉండాలి కదా అని మొదటివాడు అంటాడు. అసలు ఇవన్నీ ఏంట్రా అని అప్పు అంటుంది. మీకు కావాల్సిన సామాన్లు.. ఇది కుకర్, ఇది బకెట్, మగ్ అంటూ అన్నీ చూపిస్తూ.. ఇప్పుడు మేము ఇస్తాం.. రేపు మా పెళ్లికి మీరు తిరిగి కొనిచ్చేయండంటూ సరదాగా మాట్లాడుతుంటారు. ఇంతలో రాజ్ వస్తాడు. అంతా విని ఎమోషనల్ అవుతాడు. మీ జీతమేంటీ.. మీ ఖర్చులేంట్రా అంటు అప్పు తిడుతుంది. నిజానికి మీ శక్తికి మించి ఇవన్నీ తెచ్చారు.. మా కోసం మీరు చాలా శ్రమతీసుకున్నారని కళ్యాణ్ అంటాడు. అలా ఏం లేదు కవి సర్ అని మరో అబ్బాయి అంటాడు. కాసేపటికి వాళ్ళంతా వెళ్ళిపోతారు. ఇంటికి రమ్మని, పిన్ని ఒప్పుకుందని కళ్యాణ్ తో రాజ్ అనగానే.. నేను రానని, మీ అందరు అడిగేసరికి అలా అందని కళ్యాణ్ అంటాడు‌. ఇదంతా నీకు ఎలా తెలుసురా అని రాజ్ అంటాడు. అన్నయ్యా తను నీకు పినతల్లి మాత్రమే.. నాకు కన్నతల్లి.. మా అమ్మ గురించి నీకు తెలియదా అన్నయ్యా అయినా.. తనకు మొదటి నుంచి అప్పు అంటే ఇష్టం ఉండదు కదా అని కళ్యాణ్ అంటాడు. హూ.. అయినా ఇవన్నీ తాత్కాలికంరా, కాలమే మనుషుల్ని మారుస్తుందిరా అని రాజ్ అనగానే.. ఎంతకాలంలో మారుస్తుంది అన్నయ్యా అని కళ్యాణ్ అనగానే.. రాజ్ మౌనంగా అంటాడు. వదినను అర్థం చేసుకోవడానికి నీకు, పెద్దమ్మకి సంవత్సరకాలం పట్టింది. అంతవరకూ వదిన కాబట్టి ఓపిక పట్టింది అన్నయ్యా.. మా అమ్మ మాట్లాడే మాటలు అప్పుకి నచ్చవు. అప్పూ ప్రవర్తన మా అమ్మకు నచ్చదు.. స్వప్నకు కూడా అలాంటి అవమానాలే జరిగాయి కదా? ఆ ఇంటికి ఇష్టం లేని కోడళ్లు వస్తే ఎలాంటి మర్యాదలు జరుగుతాయో నాకు తెలుసు అన్నయ్యా.. మేము రాము అని కళ్యాణ్ తెగేసి చెప్పేస్తాడు‌. దాంతో రాజ్ ఏం చేయలేక అక్కడి నుండి బయల్దేరి వెళ్ళిపోతాడు. మరోవైపు దుగ్గిరాల వారి ఇంట్లో అంతా అప్పు, కళ్యాణ్‌లని రాజ్ తీసుకొస్తాడని ఎదురు చూస్తుంటారు. అయితే రాజ్ ఒక్కడే రావడంతో అంతా షాక్ అవుతారు. ఎక్కడా కళ్యాణ్ అప్పు అని అంతా అడగడంతో.. రాను అన్నాడని రాజ్ అంటాడు. ఏ ఎందుకు రాను అన్నాడు? అంటుంది ధాన్యలక్ష్మి ఎమోషనల్‌గా. నువ్వు ఇద్దరిని కలిపి పిలిచావంటే నమ్మడం లేదు పిన్ని.. కేవలం కళ్యాణ్ కోసమే ఇద్దరినీ రమ్మన్నావనుకున్నాడని రాజ్ అంటాడు. అది నిజమే కదా అంటుంది స్వప్న. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi: బంటీతో కావ్య చెప్పిన ప్లాన్ అదేనా.. అప్పు, కళ్యాణ్ లు ఇంటికి వస్తారా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -488 లో.....కళ్యాణ్ , అప్పులు గుడిలో ప్రసాదం తింటూ ఉంటారు. నన్ను నమ్ముకొని వస్తే నిన్ను ఇక్కడ కూర్చోపెట్టానని కళ్యాణ్ బాధపడతాడు. కోట్ల ఆస్తులు నాకోసం వదులుకొని వచ్చావ్.. నన్ను ప్రేమించినదుకు నీ బతుకు ఇలా అయిందని నేను కూడా బాధపడాలి కదా అని అప్పు అంటుంది. నిన్ను వదులుకోవడం కన్నా, ఆస్తులు వదులుకోవడం కష్టమేమీ కాదని కళ్యాణ్ అంటాడు. నీ కోసం నేనే ఏదో ఒకటి చెయ్యాలని అప్పు అనగానే.. ఇప్పుడు నేను నీ భర్తని.. నేనే ఆ మాట అనాలని కళ్యాణ్ అంటాడు. ఇద్దరు నవ్వుకుంటారు. మరొక వైపు అప్పు, కళ్యాణ్ ని కావ్యకి చూపిస్తాడు బంటి. వాళ్ళు ఏమైనా భాదపడుతున్నారా అని కావ్య అడుగగా.. వాళ్ళు చూడు కుళ్ళు జోకులు వేస్తు ఎలా నవ్వుకుంటున్నారోనని బంటి అంటాడు. అయితే నేను చెప్పినట్టు చెయ్ అని కావ్య బంటికి ఏదో చెప్తుంది. ఆ తర్వాత బంటి వాళ్ళ ముందు నుండి కావాలనే వెళ్తుంటాడు. అప్పుడు అప్పు కళ్యాణ్ లు బంటిని చూసి మాట్లాడతారు. మీరు ఇక్కడ ఉండడమేంటి నా రూమ్ కీ రండి అని బంటి అనగానే.. వాళ్లు ఒప్పుకొని బంటితో వెళ్తారు. ఆ తర్వాత కావ్య దేవుడి దగ్గరకి వచ్చి మొక్కుకొని వెళ్తుంది. మరొకవైపు ధాన్యలక్ష్మి దగ్గరకి రుద్రాణి వచ్చి.. నువ్వు ఇలా ఏడిస్తే నీ కొడుకు రాడు. ముందు వాళ్లు రావడం ఇష్టమేనని చెప్పి ఇద్దరిని ఇంటికి రమ్మని చెప్పు.. ఆ తర్వాత అప్పు వెళ్లిపోయేలా చెయ్యొచ్చు అని రుద్రాణి అనగానే.. సరేనని ధాన్యలక్ష్మి అంటుంది. ఆ తర్వాత అప్పు, కళ్యాణ్ లు బంటి రూమ్ కి వెళ్తారు. అక్కడ ఓనర్ గొడవ చేయడంతో ఎక్కువ రెంట్ ఇస్తానని బంటి చెప్తాడు. దాంతో ఓనర్ ఒప్పుకుంటాడు. ఆ తర్వాత ధాన్యలక్ష్మి హాల్లోకి వచ్చి.. వాళ్ళని ఇంటికి తీసుకొని రావడం నాకు ఇష్టమేనని చెప్తుంది. ఎందుకు ఇంత సడన్ గా నిర్ణయం తీసుకున్నారని కావ్యకి డౌట్ వస్తుంది. పిన్ని ఒప్పుకుంది కదా వెళ్లి వాళ్ళని తీసుకొని వద్దాం పదా అని రాజ్ అనగానే.. నేను రాను ఇది చినత్తయ్య నిర్ణయం.. అందులో నేను కలుగజేసుకోనని కావ్య అంటుంది. తరువాయి భాగంలో అప్పు, కళ్యాణ్ దగ్గరకి రాజ్ వెళ్తాడు. పిన్ని మీ  ఇద్దరిని ఇంటికి తీసుకొని రావడానికి ఒప్పుకుందని రాజ్ అంటాడు. ఆ తర్వాత రాజ్ ఇంటికి ఒక్కడే వెళ్తాడు. ఏంటి వాళ్లు రాలేదా అని ప్రకాష్ అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : కథలోకి దాస్.. కీలకంగా మారిన కార్తీక దీపం ఎపిసోడ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -123 లో.... కోర్టులో అమ్మతోనే ఉంటానని శౌర్య చెప్పగానే.. దీప హ్యాపీగా ఫీల్ అవుతుంది. శౌర్యని దీప హగ్ చేసుకొని ఎమోషనల్ అవుతుంది. ఈ రోజు ఇచ్చిన తీర్పు మనసుకి నచ్చిందని జడ్జ్ అంటాడు. ఆ తర్వాత అనసూయ వెళ్లిపోతుంటే దీప వెళ్లి.. తన కాళ్ళపై పడి థాంక్స్ అని చెప్తుంది. నాకు తల్లి ఉంటే కూడా ఇలా సాయం చేసేది కాదేమోనని దీప అంటుంది. మీ కొడుకు కోడలు ఇంట్లోకి రానివ్వరు.. నా దగ్గరకి రండి ఊర్లో ఉన్నట్టే ఇక్కడే ఉందామని దీప అనగానే.. లేదు గాని కూతురుని తీసుకొని వెళ్ళమని చెప్పి అనసూయ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత దీప లాయర్ జ్యోతికి థాంక్స్ చెప్తుంది. మీ అత్త గారి వాళ్ళే నువ్వు ఈ కేసు గెలిచావని దీపతో జ్యోతి అంటుంది. మరొకవైపు పారిజాతం కొడుకు దాస్.. ఆటో దిగి ఒక దగ్గరకి వస్తాడు. ఆ ప్లేస్ దగ్గర ఆగి ఆ సంఘటన జరిగి కొన్ని సంవత్సరాలు అవుతున్నా ఇప్పుడే జరిగినట్లు ఉంది. అది ఇద్దరు తలరాతలు మార్చేసిన రాత్రి.. ఒక పనిమనిషి కూతురు యజమాని అయింది. ఒక యజమాని కూతురు అనాధ అయింది. ఆ అనాధ ఒక అభాగ్యుడి చేతిలో పడింది. వాడు ఎవడో తెలియదు ఎక్కడుంటాడో తెలియదు. ఆ బిడ్డ ఏమైంది. నన్ను ఆ శివన్నారాయణ ఇంట్లో నుండి గెంటేసినా,  వాడి మనవరాలిని నా తల్లి అనాధని చేసినా.. నా కూతురుని ఆ ఇంటికి వారసురాలిని చేసింది. ఇప్పుడు నా కూతురు ఎలా ఉందో.. ఆ వారసురాలు ఎలా ఉందో.. అందరికి దూరం వెళ్లి మళ్ళీ రావాల్సి వచ్చింది. కాలం మళ్ళీ ఎందుకు తీసుకొని వచ్చిందోనని దాస్ అనుకుంటాడు. నా కూతురు ఎలా ఉందో చూడాలని దాస్ అనుకుంటాడు. ఆ తర్వాత టీ తాగి డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోతుంటే.. డబ్బులు అని టీ షాప్ అతను అడుగుతాడు. ఎక్కువ డబ్బులు ఇచ్చి మళ్ళీ వచ్చి తాగుతాను. ఈ ప్లేస్ కి నాకు చాలా దగ్గర సంబంధం ఉంది. ఒక పుట్టుక, ఒక చావు అని చెప్పి వెళ్ళిపోతాడు. మరొకవైపు జ్యోత్స్న, పారిజాతం లు రెస్టారెంట్ కి వెళ్తారు. అక్కడికి దీప, కార్తీక్, శౌర్యలు వస్తారు. వాళ్ళని చూసి జ్యోత్స్న కోప్పడుతుంది. దీప బాధపడుతుంటే ఇక ప్రాబ్లమ్ సాల్వ్ అయింది కదా.. ఎందుకు బాధ.. మీ శ్రీయోభిలాషిగా నేను ఎప్పుడు ఉంటానని దీపతో కార్తిక్ అంటాడు. అలాగే బూచోడు ఎప్పుడు రాడు హ్యాపీగా ఉండు అంటు శౌర్యతో కార్తిక్ అంటాడు. తరువాయి భాగంలో దాస్ ని జ్యోత్స్న కొడుతుంది. పారిజాతం షాక్ అవుతుంది. మరొకవైపు దీప ఇంటికి జ్యోత్స్న తాళం వేస్తుంది. దీప గురించి జ్యోత్స్న తప్పుగా జ్యోత్స్న మాట్లాడుతంటే తనని సుమిత్ర కొట్టబోతుంది. అప్పుడే దీప వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Eto Vellipoyindhi Manasu : భర్తని జీవితాంతం గుర్తుండిపోయే గిఫ్ట్ ఇవ్వమన్న భార్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -175 లో.... సీతాకాంత్ కంపెనీ గురించి ఆలోచిస్తూ డల్ గా ఉంటే రామలక్ష్మి కార్ అపమని ఐస్క్రీమ్ తీసుకుంటుంది. మీరు జరగదు అనుకున్నది జరిగింది ఏదైతే ఉందో అది గుర్తుకు చేసుకోండి అని రామలక్ష్మి అనగానే.. రామలక్ష్మితో పెళ్లి జరిగింది గుర్తుకుచేసుకుంటాడు సీతాకాంత్. మీరు నవ్వుతున్నారంటే ఏదో మీరు అనుకున్నది జరిగినట్లు ఉంది అయితే ఇప్పుడు ఐస్క్రీమ్ తినండి అంటు సీతాకాంత్ మూడ్ ని రామలక్ష్మి డైవర్ట్ చేస్తుంది. మరొకవైపు ఇంటికి సందీప్ రాగానే.. మీరు చైర్మన్ అయితే నాకు గోల్డ్ తీసుకోవాలంటూ సందీప్ కి చెప్తూ శ్రీవల్లి చిరాకు తెప్పిస్తుంది. మరుసటి రోజు ఉదయం రామలక్ష్మి లేవకముందే సీతాకాంత్ లేచి.. ఆఫీస్ కి వెళ్తాడు. ఎక్కడికి వెళ్ళాడని రామలక్ష్మి కిందకి వచ్చి పెద్దాయనని అడుగుతుంది. మన కంపెనీ లో షేర్స్ పెట్టండి అని అడగడానికి వెళ్ళాడని చెప్తాడు. ఈ రోజే కదా షేర్స్ ని వేరే కంపెనీకీ అమ్ముతాం అన్నారు.. నేను వెంటనే ఆఫీస్ కీ వెళ్ళాలని రామలక్ష్మి రెడీ అయి ఆఫీస్ కి బయలుదేర్తుంది. ఆ తర్వాత రామలక్ష్మి ఆలోచిస్తూ నందిని వస్తున్నా కార్ కి ఎదురు పడుతుంది. దాంతో కోపంగా నందిని కార్ దిగుతుంది. తీరా చుస్తే రామలక్ష్మి. ఏంటి అంతలా ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తున్నారు.. పదండి నేను డ్రాప్ చేస్తానని నందిని అనగానే రామలక్ష్మి తనతో వెళ్తుంది. దార్లో ప్రస్తుతం ఆఫీస్ లో ఉన్న సమస్య గురించి నందినికి చెప్తుంది. ఆ తర్వాత రామలక్ష్మి కార్ దిగి తన కార్ లో వెళ్ళిపోతుంది. మీటింగ్ జరుగుతుంటుంది. ఇక మా షేర్స్ అమ్ముకోవడానికి రెడీగా ఉన్నామని బోర్డు డైరెక్టర్స్ అంటారు. అప్పుడే రామలక్ష్మి వచ్చి.. మీ ఇష్టం.. ఇంత రిక్వెస్ట్ చేస్తున్న వినకపోతే ఏం చేస్తామని రామలక్ష్మి అంటుంది. ఇప్పుడు మీరు ఇలా చేస్తే కంపెనీ ఎంప్లాయిస్ నష్టపోతారని సీతాకాంత్ అంటాడు. అయితే సందీప్ ని చైర్మన్ ని చెయ్యండి అంటారు. అందుకు నాకు ఇష్టమేనని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత సీతాకాంత్ సంతకాలు చేయబోతుంటే.. అప్పుడే నందిని పిఏ వచ్చి ఆపండి సర్.. మీపై మాకు చాలా నమ్మకం ఉంది. మీ కంపెనీలో షేర్స్ మేమ్ కొంటాం.. మీతో కలిసి వ్యాపారం చెయ్యడం మాకు ఇష్టమేనని అనగానే అందరు షాక్ అవుతారు. తరువాయి భాగంలో సీతాకాంత్ బర్త్ డే ని రామలక్ష్మి సెలబ్రేట్ చేస్తుంది. జీవితాంతం గుర్తుండి పోయే గిఫ్ట్ ఇవ్వమని రామలక్ష్మిని సీతాకాంత్ అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Guppedantha Manasu : కొత్త ఎండీ అతనేనా.. శైలేంద్రని కిడ్నాప్ చేసింది ఎవరంటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'(Guppedantha Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1153 లో....రిషి మా సరోజ హైదరాబాద్ వచ్చిందట అని వసుధారతో అనగానే.. ఏంటి మీ సరోజ అంటూ రిషిపై వసుధార కోప్పడుతుంది. ఏంటి జెలస్ గా ఫీల్ అవుతున్నావా అని రిషి అనగానే.. అవును జెలస్ గానే ఫీల్ అవుతున్నా.. మీ విషయంలో నేను ఇలాగా ఫీల్ అవుతాను. ప్రతీ భార్య భర్త విషయంలో ఇలాగే ఉంటుంది. అది మీకు అర్ధం కాదంటూ వసుధార అంటుంది. ఆ తర్వాత పాండు దగ్గరకి శైలేంద్ర వస్తాడు. పదండి సర్ ఇద్దరం పోలీస్ స్టేషన్ లో లొంగిపోదామని అంటాడు  నువ్వేంట్రా ఇలా ఉన్నావ్.. ఎన్ని రోజుల నుండి నా కల నెరవేరబోతుందని శైలేంద్ర అంటాడు. ఆ తర్వాత శైలేంద్రని పాండు మనుషులు వెనకాల నుండి వచ్చి మాస్క్ ఏసుకొని తీసుకొని వెళ్తారు. మరొకవైపు శైలేంద్ర అంటూ ఇంట్లో ఉన్న ఫణీంద్ర పిలుస్తుంటాడు. వాడు కాలేజీకీ వెళ్ళాడని దేవయాని చెప్తుంది. వాడు కాబోయే ఎండీ అని ఫీల్ అవుతున్నాడా ఏంటి అని ఫణీంద్ర అంటాడు. నేను కాలేజీకీ వస్తానని దేవయాని అనగానే.. నువ్వు వద్దు.. వచ్చిన ప్రతీసారీ ఏదో ఒక గొడవ జరుగుతుందని ఫణీంద్ర అంటాడు. అలా అంటారేంటి ఈ రోజు కాలేజీలో ఎండీ ఎవరో నిర్ణయం తీసుకంటున్నారు కదా.. నేను కూడా ఉండాలి కదా అని దేవయాని అనగానే.. అయితే నువ్వే వెళ్ళు నేను వెళ్ళనని ఫణీంద్ర అంటాడు. అదేంటి అలా అంటున్నారని దేవయాని చిరాకుపడుతుంది. అయితే నువు వెళ్ళు లేదా నేను వెళ్తానని ఫణీంద్ర అనగానే మీరే వెళ్ళండి అని దేవయాని అంటుంది. ఆ తర్వాత రిషి, వసుధారలు మీటింగ్ కీ వెళ్తారు. మీ అన్నయ్య అమెరికా నుండి వచ్చాకే ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందని వసుధార అనగానే.. నాకు అన్ని అర్ధం అవుతున్నాయని రిషి అంటాడు. మరి ఎందుకు సైలెంట్ గా ఉంటారని వసుధార అంటుంది. బంధాలకి బానిసని అందుకే రంగాగా మారిపోయాను రంగాకి అలాంటివి ఉండవని రిషి అంటాడు. ఆ తర్వాత మిమ్మల్ని కిడ్నాప్ చేయమని ఒక డీల్ వచ్చింది.. అందుకే కిడ్నాప్ చేసానని పాండు శైలేంద్రకి చెప్తాడు. మరొకవైపు ఇంకా మీటింగ్ కీ శైలేంద్ర రాలేదని అందరు అనుకుంటారు. ఆ తర్వాత శైలేంద్ర ని కిడ్నాప్ చేయమని పాండుకి చెప్పింది మను. మను రాగానే పాండు.. డబ్బులు వద్దు సర్ మేం రౌడీలమని ప్రూవ్ చేసుకున్నామంటూ మనుకి డబ్బులు తిరిగి ఇచ్చేసి వాళ్లు వెళ్ళిపోతారు.ఆ తర్వాత శైలేంద్ర మనుని చూసి షాక్ అవుతాడు. మరొకవైపు బోర్డు మెంబెకర్స్ అందరూ మీటింగ్ కి వస్తారు. శైలేంద్ర రాకుండా నే మీటింగ్ స్టార్ట్ చేస్తారు.. అందరు రిషి గురించి మాట్లాడుతారు. ఎండీగా రాజీనామా చేసిన వాళ్లే కొత్త ఎండీ పేరు చెప్పాలి కాబట్టి నేనే ఎండీ ఎవరో చెప్పాలి.. చెప్తానని వసుధార అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

తమ్ముళ్లను గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకున్న రష్మీ

శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ ఎపిసోడ్ రాఖీ స్పెషల్ ఎపిసోడ్ గా మల్లెమాల తీసుకొచ్చింది. ఈ షోకి బాలాదిత్య ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఆటో రాంప్రసాద్ రాగానే "ఏంటి అందరూ సైలెంట్ గా కూర్చున్నారు" అనేసరికి "ఎం చెప్తావయ్యా రాంప్రసాద్  భయం" అన్నాడు బాలాదిత్య. "మావోయిస్టులు ఏమన్నా దాడి చేస్తున్నారా" అన్నాడు. "అంతకన్నా ప్రమాదం..సిస్టర్స్ అయ్యా" అన్నాడు బాలాదిత్య. దానికి లేడీస్ నుంచి సత్యశ్రీ వచ్చి మనం ఈరోజు అక్కాచెల్లెళ్లలా బిహేవ్ చేయకూడదు స్టువర్ట్ పురం దొంగల్లా బిహేవ్ చేయాలి" అంటూ వాళ్ళ వాళ్ళ అన్నాతమ్ముళ్లను రాఖీ కట్టి ఏమేం అడగాలో గొంతెమ్మ కోరికలన్నీ చెప్పుకొచ్చారు లేడీస్. ఇక ఈ షోకి నివేత థామస్ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఇంకో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే లేడీస్ అంతా అచ్చమైన పదహారణాల ఆడపిల్లల్లా చీరలు కట్టి పూలు పెట్టుకుని వచ్చారు. ఇక రష్మీ తనకు ఉన్న ఇద్దరు తమ్ముళ్ళని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంది. ఇక స్టేజి మీద అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల రాకీలు కట్టుకుని రాకీ పౌర్ణమిని సెలెబ్రేట్ చేసుకున్నారు. ఇక అన్నలు, తమ్ముళ్లు కలిసి గోరింటాకు రుబ్బి అక్కలు, చెల్లెళ్ళ చేతికి పెట్టారు. ఇక రాఖీ మూవీ జూనియర్ ఎన్టీఆర్ కోర్ట్ సీన్ రిక్రియేషన్ ని బాలాదిత్య చేసి చూపించాడు. బాలాదిత్య చెప్పిన డైలాగ్ కి ఆడియన్స్ కళ్ళల్లో నీళ్లు తిరగకుండా ఉండవు. ఇలా ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీ ఎమోషనల్ టచ్ తో అందంగా ముస్తాబు చేసి తీసుకురాబోతున్నారు.  

శేఖర్ మాష్టర్ ని చుట్టుముట్టిన అమ్మాయిలు...

  కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇది సెమి ఫినాలే వీక్ అని చెప్తూ అందరికీ పవర్ థీమ్ ఇచ్చింది శ్రీముఖి. ఇక ఈ ఎపిసోడ్ కి అనసూయ వచ్చిన గెటప్ చూస్తే ఓ రేంజ్ లో ఉంటుంది. అంటే టూటన్ఖామున్  మాస్క్ లాంటి కాస్ట్యూమ్ తో వచ్చింది.  ఇక ఇందులో అబ్బాయిలకు అమ్మాయిలకు హ్యాండ్ టు హ్యాండ్ రెజ్లింగ్ పెట్టింది. దాంతో కిరణ్ ఒక అమ్మాయి ఇలా రెజ్లింగ్ చేస్తున్నప్పుడు బ్రహ్మముడి కావ్య వచ్చి కిరణ్ ని కి ముద్దులిచ్చి అతని మైండ్ ని డైవర్ట్ చేసి ఆ గేమ్ ఓడిపోయేలా చేసింది. తర్వాత శేఖర్ మాస్టర్ కి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది "మిమ్మల్ని రెండింతలు ఎక్కువగా డిస్ట్రాక్ట్ చేయొచ్చు" అనేసరికి నన్నెవరూ ఏమీ చేయలేరు అని చెప్పారు శేఖర్ మాష్టర్. సరే రండి అని అనసూయకి శేఖర్ మాష్టర్ కి మధ్య హ్యాండ్ టు హ్యాండ్ రెజ్లింగ్ పోటీ పెట్టారు. ఇక శేఖర్ మాష్టర్ ని చుట్టుముట్టారు అమ్మాయిలంతా.. శేఖర్ మాష్టర్ కి చక్కిలిగింతలు పెట్టి గేమ్ నుంచి పక్కకు తప్పుకునేలా చేసారు. తర్వాత సాంగ్స్ కి డాన్స్ చేశారు బాయ్స్ అండ్ గర్ల్స్. ఇక లాస్ట్ లో ఈ రెండు టీమ్స్ మధ్య గొడవయింది. విష్ణుప్రియ త్వరగా ఆ గేమ్ అర్ధం చేసుకుని ఆడుతుండేసరికి అసలు అమ్మాయిలూ ఇలా ఇంత త్వరగా ఎలా అర్ధం చేసుకుంటున్నారని శ్రీకర్ గట్టిగా అడిగేసరికి అనసూయ ఫైర్ అయ్యింది. "అమ్మాయిలు బాగా ఆడుతున్నారంటే నమ్మశక్యంగా ఎందుకు ఉండదు" అని అడిగింది. దాంతో శ్రీకర్, అనసూయ, విష్ణుప్రియ మధ్య గట్టిగానే ఫైటింగ్ అయ్యింది.

Karthika Deepam2: కేసు గెలిచిన దీప.. తల్లీకూతుళ్ళ ఎమోషనల్ సీన్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-122 లో.....లాయర్ జ్యోతి విచారణ కోసం సుమిత్రని బోనులోకి పిలుస్తుంది. దీప మీకు ఎలా తెలుసని జ్యోతి అడగ్గా.. దీప మా అవుట్ హౌస్ లోనే ఉంటుంది. చాలా మంచిది నాకు పెద్ద కూతురు లాగా ఆత్మాభిమనం కలిగిన అమ్మాయి అని, తన భర్త తనని మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్నాడని సుమిత్ర చెప్తుంది. కార్తీక్ చేస్తుంది మీ దృష్టిలో మంచి పని అంటారా అని జ్యోతి అడగ్గానే.. నాకు మంచి పని అనిపిస్తుంది.. సాయం చేస్తున్నాడు.. తల్లి బిడ్డ వేరు కాకుండా చూస్తున్నాడని సుమిత్ర అంటుంది. చూసారా కాబోయే అత్త గారే కార్తీక్ తప్పు లేదని చెప్తున్నారని దీపకి సపోర్ట్ గా జ్యోతి మాట్లాడుతుంది. ఆ తర్వాత అనసూయని బోనులోకి పిలిచి లాయర్ VV విచారిస్తాడు. మీ కోడలు ఆ కార్తీక్ తో తిరగడం మీరు చూసారా అని లాయర్ అడుగుతాడు. చాలాసార్లు చూసానని అనగానే అందరు షాక్ అవుతారు. అందరూ ఇక దీప కేసు ఓడిపోయింది అని అనుకుంటారు. అయితే కార్తీక్ , దీపలకి నిజంగానే సంబంధం ఉందని అంటున్నారా అని లాయర్ అనగానే.. ఎవడన్నాడు కలిసి తిరిగితే సంబంధం ఉన్నట్లేనా.. అది నా పెంపకంలో పెరిగిన పిల్ల.. తప్పు చెయ్యదని అనసూయ అంటుంది. అయితే నరసింహ రెండో పెళ్లి చేసుకున్నాడా అని అడుగగా.. చేసుకున్నాడు, ఊరు అంతా అప్పులు చేస్తే వాడిని వెతుక్కుంటూ దీప వచ్చింది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాక.. వాడు దీన్ని మోసం చేసి, రెండో పెళ్లి చేసుకున్నాడని తెలిసింది. అప్పుడే సుమిత్ర అమ్మ కార్తీక్ బాబులు సాయం చేసారు. ఇక ఆ శోభకి పిల్లలు పుట్టరని తెలిసి శౌర్యని తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. దయచేసి తల్లి బిడ్డని దూరం చేయకండి అని అనసూయ చెప్పగానే.. నరసింహా తరుపున లాయర్ షాక్ అవుతాడు. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు.  కాసేపటికి దీపకి అనుకూలంగా తీర్పు వస్తుంది. విడాకూలు కూడా వస్తాయి. నరసింహాకి ఆరు నెలల జైలు శిక్ష జరిమానా విధిస్తారు. శౌర్య గురించి కూడా చెప్పండి అని జడ్జ్ ని జ్యోతి అడుగుతుంది. కాసేపటికి శౌర్యని పిలిపిస్తారు. అమ్మ దగ్గర ఉంటావా.. నాన్న దగ్గర ఉంటావా అని అడుగుతారు. నేను ఆ బూచోడి దగ్గరికి వెళ్ళను.. అమ్మ అయిన నాన్న అయిన నాకు అమ్మే అని శౌర్య అనగానే.. దీప వచ్చి శౌర్యని హగ్ చేసుకొని ఎమోషనల్ అవుతుంది. తరువాయి భాగంలో దీప, కార్తీక్, శౌర్యలు బయటకు వస్తారు. వాళ్ళను పారిజాతం, జ్యోత్స్న చూస్తారు. ఆ తర్వాత కార్తీక్ కి దీప తన బాధని చెప్పుకుంటుంది. మరొక వైపు జ్యోత్స్న కన్నతండ్రి పారిజాతం సొంత కొడుకు దాస్ ఎంట్రీ ఇస్తాడు. దీప సుమిత్ర కూతురు అన్న విషయం తెలిసిన ఏకైక వ్యక్తి దాస్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : సవతి తల్లి నమ్మకద్రోహాన్ని సీతాకాంత్ కనిపెట్టగలడా.. రామలక్ష్మి ఏం చేయనుంది!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -174 లో....బోర్డు మెంబర్స్ అందరు సందీప్ ని చైర్మన్ చెయ్యాలంటున్నారు.. అప్పుడే రామలక్ష్మి వచ్చి అవసరం లేదు.. ఏదో ఎవరో కావాలని నిందలు వేస్తే అది నిజమని నమ్మి ఇంత కష్టపడి.. ఈ స్థాయికి తీసుకొని వచ్చింది సీతా సర్ .. ప్రలోభాలకి భయపడి నిర్ణయం తీసుకుంటారా అని రామలక్ష్మి అంటుంది. కంపెనీ గురించి మంచి నిర్ణయం తీసుకున్నామని బోర్డు మెంబర్ అంటాడు. అయితే ఒకసారి ఈ వీడియో చూడండి అంటూ రామలక్ష్మి నమిత మాట్లాడిన వీడియోని చూపిస్తుంది. అందులో సీతా సర్ మంచి వారు డబ్బుకి ఆశపడి నేనే అలా చేసానని ఉంటుంది. ఇప్పటికైనా సర్ ఏ తప్పు చెయ్యలేదని నమ్ముతారా అని రామలక్ష్మి అంటుంది. మాకు సందీప్ ని చైర్మన్ చేస్తే ఉంటాం లేకపోతే మా షేర్స్ వేరే వాళ్లకు అమ్ముకుంటామని వాళ్లు అనగానే.. అయితే వెళ్ళండి కష్టంలో ఉన్నప్పుడు మీరే సాయం చేయకుండా.. ఇలా మాట్లాడితే మీలాంటి వాళ్ళు మాకు అవసరం లేదని రామలక్ష్మి చెప్తుంది. మేమ్ లేకుండా ఈ కంపెనీని ఎలా నిలబెడుతారో మేమ్ చూస్తామని బోర్డు మెంబర్స్ వెళ్ళిపోతారు. ఆ తర్వాత సీతాకాంత్ దగ్గరికి రామలక్ష్మి వెళ్లి.. ఇంకా బోర్డు మెంబెర్స్ అన్న దాని గురించి ఆలోచిస్తున్నారా అని అంటుంది. సందీప్ నా తమ్ముడే.. వాడు ఉంటే ఏంటి.. కంపెనీ నమ్ముకొని చాలా మంది ఉన్నారని సీతాకాంత్ అనగానే.. అందుకే సందీప్ ని వద్దని అంటున్నాను. ఏదైనా తప్పు చేస్తే పరిస్థితి ఏంటని రామలక్ష్మి అంటుంది. అవును రామలక్ష్మి చెప్పింది కూడా కరెక్ట్ అని పెద్దాయన అంటాడు. ఆ తర్వాత రామలక్ష్మి దగ్గరకి శ్రీలత వచ్చి.. ఎలాగైన సందీప్ ని చైర్మన్ ని చేస్తానని శ్రీలత అనగా.. అది జరగనివ్వనని రామలక్ష్మి అంటుంది.ఆ తర్వాత తెలిసిన వాళ్ళకి రామలక్ష్మి సీతాకాంత్ లు షేర్స్ గురించి కాల్ చేస్తుంటారు. ఎందుకు అంత త్వరగా ఇలా మారిపోయారని సీతాకాంత్ అంటాడు. మీకు ద్రోహం చెయ్యాలని చూసేవారు ఎవరో మీరు దృష్టిపెడితే కనిపెట్టగలరని రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత రామలక్ష్మి, సీతాకాంత్ లు ఇంటికి వెళ్తారు. సీతాకాంత్ డల్ గా ఉండడంతో ఐస్క్రీమ్ దగ్గర అపి తింటారా అని అడుగుతుంది. వద్దని సీతాకాంత్ అనగానే తను ఒక్కతే తింటూ ఉంటుంది. మనకి టైమ్ లేదు అంటూ కంపెనీ గురించి సీతాకాంత్ ఆలోచిస్తుంటాడు. మీరు అది కాకుండా మీకు నచ్చిన విషయం గుర్తుచేసుకోండి అనగానే రామలక్ష్మిని సీతాకాంత్ పెళ్లి చేసుకుంది గుర్తుకు చేసుకొని హ్యాపీగా ఫీల్ అవుతాడు. తరువాయి భాగంలో.. మా షేర్స్ అమ్ముకోవడానికి రెడీగా ఉన్నామని బోర్డు డైరెక్టర్స్ అంటారు. సందీప్ ని చైర్మన్ చెయ్యడానికి నేను ఒప్పుకుంటున్నానని సీతాకాంత్ సంతకాలు చేస్తుంటే.. ఆగండీ సర్ అంటు నందిని పిఏ వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Guppedantha Manasu : శైలేంద్ర కలని  రౌడీలు నాశనం చేస్తారా.. రిషి నిర్ణయం అదేనా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'(Guppedantha Manasu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -1152 లో... శైలేంద్ర కాలేజీకీ వెళ్తూ దేవుడికి మొక్కుంటాడు. అప్పుడే బావ బావ అంటూ సరోజ లోపలికి వస్తుంది. శైలేంద్ర చూసి నువ్వు ఇక్కడికి వచ్చావేంటి.. ధనరాజ్ తనని ఇక్కడకి ఎందుకు తీసుకొని వచ్చావంటూ అడుగుతాడు. తన బావ కోసం వచ్చిందని ధనరాజ్ అంటాడు. అప్పుడే ఇంట్లో వాళ్లు బయటకు వస్తారు. ఎవరు కావాలి అమ్మ అంటు ఫణీంద్ర అడుగుతాడు. మా బావని ఇతను తీసుకొని వచ్చాడు. అందుకే ఇక్కడికి వచ్చానని సరోజ చెప్తుంది. మీ బావనా ఎవరు ? ఫోటో ఉంటే చూపించమని ధరణి అనగానే.. ఉంది అంటు సరోజ చూపించబోతుంటే ఫోటో ఎందుకు గానీ ఆల్రెడీ మీ బావ వెళ్ళాడు.. ఇంట్లో లేడని శైలేంద్ర అంటాడు. సరోజని తీసుకొని ధనరాజ్ వెళ్ళిపోతాడు. ఎవడురా వాళ్ళ బావ? ఇదంతా ఏంటని ఫణీంద్ర కోప్పడుతాడు. అంటే వాళ్ళ బావ నాకు తెలుసు. అందుకే అలా అంటుందని శైలేంద్ర కవర్ చేస్తాడు. ఆ తర్వాత అది ఇక్కడికి ఎందుకు వచ్చింది. కొన్ని గంటల్లో మన కల నెరవేరబోతుంది.. ఏ ప్రాబ్లమ్ రాకుండా చూసుకోమని శైలేంద్రకి చెప్తుంది. మరొకవైపు వసుధార, రిషిలు కాలేజీ కి వెళ్తుంటారు. సర్ ఎండీగా ఎవరనేది నిర్ణయం తీసుకున్నారా అని రిషిని వసుధార అడుగుతుంది. నువ్వు అర్హత ఉన్నా చెయ్యనంటున్నావ్ .. నేను ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని రిషి అంటాడు. మరొకవైపు ధనరాజ్, సరోజలు వెళ్తుంటే.. రిషి వసుధారలు కన్పిస్తారు. వాళ్ళని ఫాలో అవుతూ ఇద్దరు వెళ్తారు. ఆ వసుధార మా బావ అవతారం కూడా మార్చేసిందని సరోజ అంటుంది. కొద్దీ దూరం వెళ్ళాక.. నేను డ్రైవ్ చేస్తానని సరోజ స్కూటీ తీసుకొని ధనరాజ్ స్కూటీ ఎక్కకుండానే వెళ్ళిపోతుంది. మరొకవైపు పాండు శైలేంద్రకి  ఫోన్ చేసి చివరిసారిగా మీతో మాట్లాడాలని కాల్ చేశానని అంటాడు. ఎందుకు ఫైనల్ సెటిల్ మెంట్ కోసమా? ఆ వసుధారని చంపామని చెప్పి చంపలేదని శైలేంద్ర అనగానే.. ఇప్పుడు అంతా పోలీసులకి చెప్పి లొంగిపోదామని వచ్చాము.. అందుకే చివరిసారి మాట్లాడాలని చెప్పానని పాండు అనగానే.. శైలేంద్ర కోపంగా మాట్లాడుతాడు. ఆ తర్వాత రిషికి శైలేంద్ర ఫోన్ చేసి.. వస్తున్నావ్ కదా నేను చెప్పినట్టు చెయ్ అని చెప్తాడు. దానికి రిషి సరే అంటాడు. మరొకవైపు రిషి, వసుధారలు వెళ్తున్న కార్ డైవర్ట్ అయిపోతుంది. దాంతో సరోజ చూస్తుంటుంది. అప్పుడే ధనరాజ్ వచ్చి ఏంటి వదిలేసి వచ్చావ్.. అసలు నువ్వు నాకోసం వచ్చావా.. మీ బావ కోసం వచ్చావా అంటూ అడుగుతాడు. నీ కోసమే వచ్చాను. ఇంటిదగ్గర అమ్మమ్మ.. బావ గురించి బెంగ పెట్టుకుంది. ఆ విషయం బావకి చెప్పాలి అందుకే అని సరోజ అంటుంది. ఇంత పెద్ద సిటీలో మీ బావని ఎక్కడ వెతుకుతామని ధనరాజ్ అంటాడు. ఆ తర్వాత రిషికి బుజ్జి ఫోన్ చేసి.. సరోజ నీ కోసం హైదరాబాద్ వచ్చిందని చెప్తాడు. ఏంటి అంటా అని వసుధార అడుగగా.. మా సరోజ సిటీకి వచ్చిందట అని రిషి అనగానే.. మీ సరోజ అంటున్నారని వసుధార కోపంగా మాట్లాడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : కొత్తజంటని ఇంటికి తీసుకురమ్మన్న ధాన్యలక్ష్మి.. షాకిచ్చిన కావ్య!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -487 లో.....అప్పు ఫ్రెండ్స్ రాగానే.. మేమ్ ఇక వెళ్ళిపోతామని  వాళ్ళతో అప్పు అంటుంది. ఎందుకు మా వల్ల ఏదైనా ఇబ్బంది కలిగిందా అని వాళ్లు అడుగుతారు. అదేం లేదు.. కళ్యాణ్ వాళ్ళ ఫ్రెండ్ ఫామ్ హౌస్స్ ఉందట.. అందుకే వెళ్తున్నామని అప్పు చెప్తుంది. మరొకవైపు కావ్య అందరికి కాఫీ తీసుకొని వచ్చి ఇస్తుంది. ధాన్యలక్ష్మి రాలేదా అని ఇందిరాదేవి అడుగుతుంది. అయినవాళ్లే వెన్నుపోటు పొడిచాక ఎలా వస్తుందని అక్కడే ఉన్న రుద్రాణి అంటుంది. అయినవాళ్లు ఎవరని ఇందిరాదేవి అడుగగా.. ఇంకెవరు రాజ్ , కావ్య అని రుద్రాణి అంటుంది. ఆ తర్వాత ధాన్యలక్ష్మి వస్తుంది. కాఫీ తీసుకొండి అని కావ్య అనగానే.. విషమా అని కోపంగా ధాన్యలక్ష్మి అంటుంది. నాకు ఇవ్వమ్మ అని ప్రకాష్ అంటాడు. ప్రకాష్ కాఫీ తాగుతూ కళ్యాణ్ అంటు పిలుస్తాడు. అందరు షాక్ అవుతారు. ధాన్యలక్ష్మి కోపంగా వెళ్లి.. ఎక్కడ కళ్యణ్ ఆ అప్పుని చేసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు కదా అని అంటుంది. ధాన్యలక్ష్మి బాధపడుతుంటే రాజ్ వెళ్లి అందరికి బాధ ఉందని అంటాడు. అందరికి ఉంటే ఇలా చేసేవాడివి కాదని ధాన్యలక్ష్మి అంటుంది. వాడు ఇష్టపడ్డాడు కాబట్టి పెళ్లి చేసుకున్నాడు.. రాజ్ ని అంటువేంటని అపర్ణ అంటుంది. అవును వెనకాల ఉండి నడిపించిన కావ్యని వదిలేసావ్ ఏంటని రుద్రాణి అనగానే.. తనపై అపర్ణ కోప్పడుతుంది. చూసారా ఇందుకే నన్ను అంటరానే ఈ పెళ్లి వద్దని చెప్పానని రాజ్ తో కావ్య అంటుంది. ఆ తర్వాత ప్రకాష్ ఏడుస్తూ.. కళ్యాణ్ ని ఇంటికి తీసుకొని రా అని రాజ్ కి చెప్తాడు. వాళ్ళిద్దరిని ఒప్పించి ఇంటికి తీసుకొని వస్తానని రాజ్ అనగానే.. ఇద్దరు ఎవరు నాకు ఒక్కడే కొడుకు వాడే ఇంటికి రావాలని ధాన్యలక్ష్మి అంటుంది. దానికి ఎంత కావాలో అంత ఇస్తానని ధాన్యలక్ష్మి అనగానే.. నీకెంత కావాలి నన్ను వదిలిపెట్టి వెళ్ళడానికి అని ధాన్యలక్ష్మిని ప్రకాష్ కోప్పడతాడు. ఆ తర్వాత కళ్యాణ్ అప్పు మెడలో తాళి కట్టాడు.. కానీ నువ్వు ఒక్కడినే తీసుకొని రమ్మని అంటున్నావ్ .. అది పాపమని రాజ్ అనగానే.. నాకు అవసరం లేదు నాకు నా కొడుకు మాత్రమే కావాలి.. అప్పుని ఎప్పటికి నా కోడలిగా ఒప్పుకోనని చెప్పి ధాన్యలక్ష్మి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రాజ్ కావ్యలు గొడవపడతారు. తరువాయి భాగంలో నా కొడుకుని దూరంగా ఉంచి ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను.. వాళ్ళని ఇంటికి తీసుకొని రావడానికి ఒప్పుకుంటన్నానని రాజ్ తో ధాన్యలక్ష్మి అంటుంది. దాంతో చూసావా పిన్ని ఒప్పుకంది.. పదా వెళ్లి వాళ్ళని తీసుకొని వద్దామని కావ్యతో రాజ్ అనగానే.. నేను రానని కావ్య అంటుంది. దాంతో అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.