బీజేపీలో చేరిన ప్రముఖ సినీ నటి

Publish Date:Dec 20, 2025

  ప్రముఖ సినీ నటి ఆమని భారతీయ జనతా పార్టీలో చేరారు. నాంపల్లి సెంట్రల్ ఆఫీసులో రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఆమెకు కాషాయ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.  అనంతరం పార్టీ సభ్యత్వాన్ని అందజేశారు. ఈ సందర్బంగా ఆమని మాట్లాడుతు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం సాధిస్తున్న ప్రగతిని చూసి గర్వపడుతున్నాని తెలిపారు. ప్రధాని చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితురాలినై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు.  ఆయన సనాతన ధర్మం కోసం మోదీ ఎంతో పాటుపడుతున్నారు" అని ఆమె పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా పోరాటాలపై నెమ్మదిగా స్పందిస్తున్న బీజేపీ, ఇప్పుడు అనూహ్యంగా సినీ తారలను చేర్చుకోవడంపై దృష్టి పెట్టడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా విజయశాంతి, జయసుధ, జీవితా రాజశేఖర్ వంటి వారిని పార్టీలోకి ఆహ్వానించింది. కొందరు అగ్ర హీరోలతో బీజేపీ జాతీయ నేతలు భేటీ కావడం, దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌కు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి  

కవితను నియంత్రిస్తేనే కేసీఆర్ ఎంట్రీ క్లిక్!?

Publish Date:Dec 20, 2025

తెలంగాణ సెంటిమెంట్ రాజేయడం వినా తమ పార్టీ పుంజుకోవడానికి మరో మార్గం లేదని బీఆర్ఎస్ భావిస్తోంది. అది కూడా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు క్రియాశీలంగా మారి.. గతంలోలా తన మాటల మాయాజాలం ప్రయోగిస్తేనే పార్టీ  ఉనికి, భవిష్యత్ ఉంటాయనీ, లేకుంటే నానానిటీ తీసికట్టు అన్నట్లుగా రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి దిగజారడం ఖాయమన్న భావన బీఆర్ఎస్ శ్రేణుల్లో బలంగా వ్యక్తం అవుతోంది. అంతే కాదు కేసీఆర్ మళ్లీ యాక్టివ్ కావడానికి ఇదే మంచి తరుణమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.   ఈ నేపథ్యంలోనే.. కేసీఆర్ కూడా యాక్టివ్ కావడానికి  తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీలను లేవనెత్తి జనంలో సెంటిమెంట్ ను రేకెత్తించాలని భావిస్తున్నట్లు కనిపిస్తున్నది.  నీటి కేటాయింపులు, హక్కులను  ప్రధాన అజెండాగా కేసీఆర్ గళమెత్తేందుకు సమాయత్తమౌతున్నారని బీఆర్ఎస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.  అయినా కూడా పరిశీలకులలో కేసీఆర్ గతంలోలా తన మాటలతో మాయ చేయగలరా? ఆయన ప్రవేశంతో రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా బీఆర్ఎస్ కు అనుకూలంగా మారుతుందా? అన్న సంశయాలను వ్యక్తం చేస్తున్నారు. అన్నిటికీ మించి కేసీఆర్ పొలిటికల్ గా యాక్టివ్ అవ్వడమంటూ జరిగితే.. ఆయన తొలుత తన విమర్శల గళమెత్తాల్సింది తన తనయ, తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవితపైనే. పార్టీ నుంచి బయటకు వెళ్లిన తరువాత కల్వకుంట్ల కవిత.. ప్రణాళికా బద్ధంగా బీఆర్ఎస్ పై విమర్శల దాడి చేస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు, సంతోష్ లను లక్ష్యంగా చేసుకుని ఆమె ఆరంభించిన విమర్శల దాడి క్రమక్రమంగా విస్తరిస్తూ వచ్చింది. బీఆర్ఎస్ హయాంలో అవినీతిపై ఆమె చేస్తున్న విమర్శలకు జనం నుంచి స్పందన వస్తుండటంతో బీఆర్ఎస్ ఇరకాటంలో పడింది. ఒకరిద్దరు నేతలు కవితపై ప్రతి విమర్శలు చేస్తున్నప్పటికీ కల్వకుంట్ల కుటుంబం నుంచి స్పందన లేకపోవడంతో తెలంగాణ రాజకీయాలలో బీఆర్ఎస్ ప్రభావం అంతంత మాత్రంగా మారింది. ముఖ్యంగా కేసీఆర్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కాళేశ్వరంపై ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం సృష్టించాయి.   ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్ వెనుకబడటంతో కేసీఆర్ రంగంలోకి దిగక తప్పని అనివార్య పరిస్థితి బీఆర్ఎస్ కు ఏర్పడింది. అయితే కేసీఆర్ ఇప్పుడు తన కుమార్తె విమర్శలకు దీటుగా సమాధానం చెప్పకుండా నీటి సమస్యలు, సెంటిమెంట్ అంటూ మాట్లాడితే జనం వినే అవకాశాలు అంతంత మాత్రమేనన్నది పరిశీలకుల విశ్లేషణ.  కేసీఆర్ రంగంలోకి దిగి పార్టీని బలోపేతం చేయాలంటే ముందుగా ఆమె కవిత విమర్శల ధాటిని ఆపగలిగేలా విమర్శనాస్త్రాలు సంధించాల్సి ఉంటుంది. అది కేసీఆర్ చేస్తారా? సొంత కుమార్తెపైనే  మాటల దాడికి దిగుతారా అన్నది వేచి చూడాల్సిందే. 

మాట మార్చిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

Publish Date:Aug 28, 2025

  ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని వ్యాఖ్యానించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇవాళ మాట మార్చారు. 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని నేను ఎవరికీ చెప్పలేదు అన్నారు. 75 ఏళ్ల తర్వాత కూడా చురుగ్గా పనిచేసే శక్తి ఉందని ఆయన తెలిపారు.సంఘ్ ఎలా చెప్తే అలా నడుచుకుంటామని వెల్లడించారు. కేంద్రం, ఆర్‌ఎస్‌ఎస్‌ మధ్య ఎలాంటి విభేదాలు లేవని  ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ స్పష్టం చేశారు.  . రాష్ట్రీయ స్వయం సేవక్‌  సంఘ్‌ వందేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొన్ని విషయాల్లో అభిప్రాయ బేధాలు ఉండొచ్చు.. వివాదం కాదంటూ చెప్పుకొచ్చారు. దేశ ప్రయోజనాలే ఇద్దరి ప్రాధాన్యతగా పేర్కొన్న మోహన్‌ భగవత్‌..  బీజేపీ అధ్యక్షుడి ఎన్నికను ఆర్‌ఎస్‌ఎస్‌ శాసించదన్నారు. ‘మేం సలహా ఇవ్వగలం  .. తుది నిర్ణయం వారిదేని తెలిపారు.  నూతన విద్యా విధానానికి మేం మద్దతిస్తున్నాం. ఇంగ్లీష్‌ నేర్చుకోవడంలో తప్పులేదు’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ తరఫున ఆర్‌ఎస్‌ఎస్‌ నిర్ణయాలు తీసుకుంటుందని  ప్రతిపక్షాల నుండి వస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలతో తమకు మంచి సమన్వయం ఉందని మోహన్ భగవత్ వెల్లడించారు.  

ఈ తప్పులు చేస్తే ధనవంతుడు పేదవాడు అవుతాడు.!

Publish Date:Dec 19, 2025

మన జీవితంలో మనకు తెలియకుండానే చాలా తప్పులు చేస్తాం. కానీ ఆ తప్పుల వల్ల మనం డబ్బు పోగొట్టుకుంటాం. చాణక్యుడి ప్రకారం, కొన్ని తప్పులు ధనవంతులను కూడా పేదలుగా మారుస్తాయి. ఆ తప్పులేంటో చూద్దాం. ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు అన్నది అందరికీ తెలిసిన విషయమే. చంద్రగుప్త మౌర్యుడిని రాజుగా చేయడంలో అతని పాత్ర గొప్పది. చాణక్యుడి ఈ తత్వశాస్త్రం మన జీవితంలో చాలా ముఖ్యమైనది.ఆచార్య చాణక్యుడు రచించిన నీతిశాస్త్రంలో జీవితం, డబ్బు, సమాజం, సంబంధాలు, వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో ఆలోచనలు ఇచ్చారు. ఆయన సూత్రాలను పాటిస్తూ జీవనం సాగిస్తే విజయం వరిస్తుంది.అలాగే, చాణక్యుడు ప్రకారం, జీవితంలో మనం చేసే తప్పులు డబ్బు నష్టానికి,  బాధకు దారితీస్తాయి. అదేవిధంగా మన సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి పెరుగుతాయి. ప్రధానంగా డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బును కుటుంబ పోషణ,  ఇతరుల సంక్షేమం కోసం ఉపయోగించాలి.  మిగిలిన డబ్బును పెట్టుబడి పెట్టాలి.మీరు సంపాదించిన డబ్బును జూదం, బెట్టింగ్ మొదలైన వాటిపై ఎప్పుడూ వృధా చేయకండి. ఆనందం కోసం డబ్బును దుర్వినియోగం చేయడం సమీప భవిష్యత్తులో మిమ్మల్ని మరింత సమస్యగా మార్చే అవకాశం ఉంది.డబ్బు ఎప్పుడూ ఇతరుల మంచికే ఉపయోగించాలి. ఇతరులకు హాని కలిగించడానికి ఎప్పుడూ ఉపయోగించకూడదు. ఇది లక్ష్మీ దేవికి కోపం తెప్పిస్తుంది. తద్వారా మనం డబ్బును కోల్పోవచ్చు.మరీ ముఖ్యంగా డబ్బు ఆదా చేసే అలవాటు ఉండాలి. ఎంత డబ్బు వచ్చినా ఖర్చు పెట్టకూడదు. మనం వీలైనంత తక్కువ డబ్బు ఖర్చు చేయాలి. ఇది మీకు ప్రయోజనం చేకూరుస్తుంది.
[

Health

]

ఆరోగ్యానికి మంచిది కదా అని పల్లీలు తెగ తినేస్తుంటారా? ఈ నష్టాలు తప్పవు..!

Publish Date:Dec 19, 2025

ఆరోగ్యకమైన ఆహారాలలో పల్లీలు కూడా ఒకటి.  పల్లీలు అటు ఆరోగ్యాన్ని ఇస్తూనే ఇటు మంచి స్నాక్స్ గా కూడా ఉంటాయి.  పల్లీలలో మంచి కొవ్వులు, ప్రోటీన్ ఉంటాయి. వీటిని పేదవారి బాదం అని అంటారంటే వీటిలో ఎన్ని పోషకాలు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.  అయితే అతి సర్వత్ర వర్జయేత్ అనే మాటకు తగ్గట్టు పల్లీలు అయినా సరే.. ఎక్కువగా తినడం చాలా చెడ్డదని ఆహార నిపుణులు అంటున్నారు. రుచిగా ఉంటాయి కదా అని పల్లీలను అతిగా తింటే.. ఆరోగ్యానికి మేలు చేయకపోగా చేటు చేస్తాయని అంటున్నారు. మరీ ముఖ్యంగా పల్లీలు అంటే తెగ ఇష్టపడేవారు ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాలి.  పల్లీలను ఎక్కువగా తినడం వల్ల కలిగే నష్టాలేంటో తెలుసుకుంటే.. బరువు.. పల్లీలు అతిగా తింటే బరువు కూడా అతిగా పెరుగుతారట.  పల్లీలలో కేలరీలు, కొవ్వులు అధికంగా ఉంటాయి.  100గ్రాముల పల్లీలలో దాదాపు 567కేలరీలు ఉంటాయట.  ఎక్కువగా పల్లీలు తింటూ ఉంటే కేలరీలు కూడా పెరిగి బరువు పెరగడం కూడా వేగంగా జరుగుతుందట. జీర్ణ సమస్యలు.. పల్లీలు వేడి కలిగించే గుణం కలిగి ఉంటాయి. వీటిలో ఫైటేట్ లు ఉంటాయి.  పల్లీలు ఎక్కువగా తింటే ఉబ్బరం,  గ్యాస్,  కడుపులో యాసిడ్ ఫీలింగ్,  గుండెల్లో మంట వంటివి పెరుగుతాయి. పోషకాలు.. వేరుశనగలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తింటే పోషకాల శోషణకు ఆటంకం కూడా కలుగుతుంది. ముఖ్యంగా వీటిలో పైటిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఇది శరీరంలో ఐరన్, జింక్ వంటి ముఖ్యమైన ఖనిజాల శోషణకు ఆటంకం కలిగిస్తుంది.  దీన వల్ల శరీరంలో ఐరన్,  జింక్ లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎన్ని తినాలి.. ఆరోగ్య నిపుణులు,  ఆహార నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజుకు ఒక గుప్పెడు పల్లీలు తినడం మంచిది.  అంతకంటే ఎక్కువ తినడం వల్ల పైన చెప్పుకున్న సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.                      *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...