మాది చాలా చిన్న పార్టీ: విజయమ్మ

  ఇంత కాలం కిరణ్ ప్రభుత్వం తమ దయాదాక్షిణ్యాల మీదనే నడుస్తోందని, దానిని జగన్ కనుసైగతో కూల్చేయగలమని భ్రమలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మొన్న పెట్టిన అవిశ్వాస తీర్మానంతో తన సత్తా ఏమిటో స్పష్టంగా తెలిసొచ్చింది. ఇంత కాలం వాపును చూసి బలుపనుకొన్న ఆ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి పక్కలో బల్లెంలా ఉన్న తమ శాసనసభ్యులను బయటకి రప్పించినా కూడా ప్రభుత్వాన్ని కూల్చలేకపోవడంతో నలుగురిలో నవ్వుల పాలయింది. ఆ అక్రోశంతోనే ఆ పార్టీ చంద్రబాబుపై విరుచుకుపడింది.   బహుశః చంద్రబాబు ఆ పార్టీకి తన సత్తా ఏమిటో అర్ధం అయ్యేలా చేసేందుకే అవిశ్వాస తీర్మానం విషయంలో చాల ఖచ్చితమయిన నిర్ణయం తీసుకోవడంతో అది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తగిన గుణ పాఠం నేర్పింది.   ఈ సంఘటనతో ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మకు కూడా పరిస్థితి పూర్తిగా అర్ధం అయినందున, ఆమె ఈ రోజు విద్యుత్ సమస్యపై నిరవధిక నిరాహార దీక్ష చెప్పటే ముందు మీడియా తో మాట్లాడుతూ “మాది చాల చిన్న పార్టీ. తెలుగుదేశం పార్టీ వంటి పెద్ద పార్టీలే ప్రభుత్వాన్ని లొంగ దీయలేన్నపుడు మావంటి చిన్న పార్టీలు చేసే ఈ నిరాహార దీక్షల వలన ప్రభుత్వం దిగివస్తుందని నమ్మకం లేదు. కానీ, బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై పోరాడవలసిన బాధ్యత మాపై ఉంది గనుకనే మేము ఈ రోజు నిరహార దీక్షకు పూనుకోన్నాము” అని ఆమె మీడియాతో అన్నారు.   మొత్తం మీద అతివిస్వాసంతో అవిశ్వాసానికి పోయిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆత్మవిశ్వాసం కూడా కోల్పోయి ఆత్మన్యూనతా భావంతో బాధపడుతున్నట్లు కనిపిస్తోంది. దీనికి మరో కారణం గత రెండు రోజులుగా హైదరాబాదులో సీబీఐ, డిల్లీలో ఎన్ఫోర్స్మెంటు డైరెక్టరేట్ చేస్తున్న హడావుడి అని కూడా చెప్పవచ్చును.   ఏప్రిల్ నెలలో ఖచ్చితంగా జగన్ జైలు నుండి విడుదల అవుటాడని అనుకొంటున్న తరుణంలో సీబీఐ అనుబంధ చార్జ్ షీటు దాఖలు చేయడం, యధావిధిగా కోర్టు జగన్ మోహన్ రెడ్డికి మళ్ళీ ఈ నెల 8వరకు రిమాండ్ పొడిగించడం వంటివి ఆ పార్టీ నేతలని, ముఖ్యంగా జగన్ కుటుంబ సభ్యులను చాలా క్రుంగదీస్తున్నట్లు కనిపిస్తోంది.   ఇంకా మరో పక్క ‘ఆలూ లేదు, చూలు లేదు కానీ, అల్లుడు పేరు సోమలింగం’ అన్నట్లు ఎన్నికలకి ఇంకా ఏడాది సమయం ఉండగానే ఆ పార్టీలో చిన్నా పెద్దా నేతలందరూ గ్రూపులుగా విడిపోయి పార్టీ టికెట్స్ విషయంలో గొడవలు పడుతూ మీడియాకు మేతనందిస్తునడటం ఆ పార్టీ అధినాయకులకి మరింత ఇబ్బందికర పరిస్థితులు సృష్టించింది.   ఆ పార్టీ పరిస్థితి మళ్ళీ చక్కబడాలంటే వెంటనే జగన్మోహన్ రెడ్డి జైలు నుండి విడుదల అవడం చాల అత్యవసరం. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి విడుదల అనుమానమేనని చెప్పవచ్చును. అందువల్ల ఆ పార్టీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడం మేలు. లేదంటే ఆ పార్టీ మరింత సంక్షోభంలోకి కూరుకు పోయే ప్రమాదం ఉంది.

కేసీఆర్ కాంగ్రెస్ ని బ్లాక్ మెయిల్ చేశారా?

  రాష్ట్రంలో ఎండలు క్రమంగా పెరుగుతుంటే తెలంగాణ ఉద్యమాలు వేడి మాత్రం పూర్తిగా చల్లబడిపోవడంతో కాంగ్రెస్ నేతలందరికీ మళ్ళీ నోరు విప్పే దైర్యం కలిగిస్తోంది. వాయలార్ రవి వేసిన తెలంగాణా దోశని చాలా తేలికగా జీర్ణించుకొన్న తెరాస నేతలను చూసిన తరువాత కాంగ్రెస్ నేతలకు మరింత దైర్యం వచ్చిందిపుడు. పైగా తెరాస నేతలప్పుడు తమ తెలంగాణా ఉద్యమాలను పక్కన బెట్టి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, సాధారణ ఎన్నికల ప్రయత్నాలలో పడటంతో ఇప్పుడు వారిని విమర్శించడానికి కాంగ్రెస్ పార్టీకి మరింత దైర్యం చిక్కింది.   ఖమ్మం కాంగ్రెస్ యంపీ రేణుకా చౌదరి నిన్న డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, తెరాస పార్టీ తెలంగాణా ఉద్యమాలను ఒక పెద్ద వ్యాపారంగా మార్చుకొందని టీబీ, కేన్సర్, గుండెపోటు వంటి జబ్బులతో చనిపోయినవారిని కూడా తెలంగాణా కోసం ఆత్మబలిదానాలుగా చిత్రిస్తూ అటు ప్రజలను, ఇటు ప్రభుత్వాన్ని కూడా మోసం చేస్తోందని ఆరోపించారు. తెలంగాణా కోసం నిజంగా ఆత్మహత్యలు చేసుకొన్న యువత మరణాలకు మాత్రం స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకోసం ఉద్యమాలు నడిపిస్తున్న కేసీఆర్ దే బాధ్యత అని ఆమె అన్నారు. కొద్ది రోజుల క్రితం మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానంలో జరిగిన ఉపఎన్నికలలో తెరాస అభ్యర్ధి ఓడిపోవడమే తెరాసపై అది చేస్తున్న ఉద్యమాలపై తెలంగాణా ప్రజలు క్రమంగా నమ్మకం కోల్పోతున్నట్లు ఋజువు చేస్తోందని ఆమె అన్నారు.   తెరాస అధినేత కేసీఆర్ తెలంగాణా ఉద్యమాల పేరిట కాంగ్రెస్ పార్టీని డబ్బులకోసం బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా? అని మీడియా అడిగిన మరో ప్రశ్నకు ఆమె ఖండించకపోగా ఆ సంగతి ఆయననే అడగండి అని జవాబు చెప్పడం, మీడియా సందేహాలు నిజమేనని ఆమె చెప్పకనే చెప్పినట్లు భావించవలసి ఉంటుంది.   కొద్ది రోజుల క్రితం కేంద్రమంత్రి బేణీ ప్రసాద్ వర్మ కూడా యుపీయే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు సమాజ్ వాది అధినేత ములాయం సింగు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి డబ్బు డిమాండ్ చేస్తున్నాడని ఆరోపించినట్లే, ఇప్పుడు రేణుకా చౌదరి కూడా కేసీఆర్ కు వ్యతిరేఖంగా ఆరోపిస్తున్నట్లు ఉంది.   తెలంగాణపై కాంగ్రెస్ ప్రభుత్వం స్వయంగా విదించుకొన్ననెలరోజుల గడువు వరకు కూడా తెరాసను కాంగ్రెస్ పార్టీలో కలిపేయడానికి షరతుల గురించి మీడియాలో చాలా పెద్ద చర్చే జరిగింది. ఆ సమయంలో కేసీఆర్ తన ఫామ్ హౌస్ నుండే కాంగ్రెస్ అధిష్టానంతో నేరుగా హాట్ లయిన్లో చర్చలు జరుపుతున్నట్లు ఆ పార్టీ నేతలు చెప్పుకోవడం అందరికి తెలిసిందే. గానీ, నెల రోజుల గడువు పూర్తయిన తరువాత కేసీఆర్ మాటలలో అకస్మాత్తుగా పెద్ద మార్పుకనబడింది. తానూ తెరాసను కాంగ్రెస్ పార్టీలో కలిపేందుకు సిద్దపడినా కూడా కాంగ్రెస్ (తెలంగాణా ఇచ్చేందుకు) ఒప్పుకోలేదని చెప్పడంతో అన్ని రాజకీయ పార్టీలు ఆయనపై తీవ్ర విమర్శలు చేశాయి.   సీపీఐ పార్టీ నాయకుడు నారాయణ అయితే మరో అడుగు ముందుకు వేసి అసలు కాంగ్రెస్ పార్టీ, తెరాసాలు తెలంగాణపై రహస్య ఒప్పందాలు చేసుకోవడానికి, బేరాలు ఆడుకోవడానికి తెలంగాణా ఏమి వ్యాపార వస్తువు కాదు, నాలుగు కోట్ల తెలంగాణా ప్రజల మనోభావాలకు సంబందించిన సున్నితమయిన సమస్య, అసలు ఆ రెండు పార్టీలు ఏ అధికారంతో ఈ విధమయిన రహస్య ఒప్పందాలు చేసుకొంటున్నాయంటూ నిలదీశారు.   అయితే ఇటువంటి దుమారాల నుండి బయటపడటం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య. ఆయన రహస్య ఒప్పందం పైనుండి అందరి దృష్టినీ మళ్ళించడానికి ‘ఎన్నికలు టికెట్స్’ అంటూ హడావుడి మొదలుపెట్టి తప్పించుకొన్నాడు.   అయితే, అతను తెలంగాణా ఉద్యమాలను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని డబ్బు లేదా ఇతరత్రా ప్యాకేజీలకోసం డిమాండ్ చేసాడని, అవేవి కుదరకపోవడం చేతనే కాంగ్రెస్ పార్టీని నిందిస్తూ మళ్ళీ ఉద్యమాల గురించి మాట్లాడుతున్నాడని, ఇప్పుడు రేణుకా చౌదరి తన మాటలతో చెప్పకనే చెపుతున్నారు. బహుశః కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆమె మాటలను అందుకే ఇంతవరకు ఖండించలేదు.   తెలంగాణా కోసం తల నరుకొంటాన్నన కేసీఆర్ ఇప్పుడు గ్రేటర్ హైదరాబాదు ఎన్నికలలో పార్టీని గెలిపించుకొనే పనిలో తలమునకలయి ఉన్నాడు. కానీ, అతని మాటలను, అతని ఉద్యమాలను నమ్మిన యువత మాత్రం తమ చదువులు పాడుచేసుకోవడమే కాకుండా ఆవేశంతో ఆత్మహత్యలు చేసుకొని కన్నవారికి జీవితకాలం తీరని దుఃఖం మిగిల్చారు. రాజకీయ పార్టీలు ఆడుకొంటున్న ఈ రాజకీయ చదరంగంలో సమిధలు కాకుండా విజ్ఞత చూపవలసిన బాద్యత ప్రజలదే.

రెబెల్ కాంగ్రెస్ నేతలకు వైకాపాలో చుక్కెదురు

  కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత కాలం తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన జగన్ అనుచరులు, మొన్న అవిశ్వాస తీర్మానం తరువాత కాంగ్రెస్ నుండి బయటపడి వైకాపాలో చేరిన తరువాత అక్కడ వారు ఊహించని సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఆ పార్టీలో చాల కాలంగా పనిచేస్తూ రాబోయే ఎన్నికలలో పార్టీ టికెట్లు ఆశిస్తున్న అనేక మందికి వీరిరాకతో భయాలు మొదలయ్యాయి. పాతవారి మద్యనే టికెట్స్ కోసం తీవ్రమయిన పోటీ ఉండగా ఇప్పుడు తానూ దూరకంత లేదు మెడకో డోలన్నట్లు కొత్తగా వచ్చిపడిన 9మంది కాంగ్రెస్ శాసన సభ్యులు పాతవారికి పోటీగా తయారవడంతో వైకాపాలో కుమ్ములాటలు కూడా మొదలయ్యాయి.   కొద్ది రోజుల క్రితం వైకాపా కు చెందిన కొందరు నాయకులు మచిలీ పట్నంలో పార్లమెంటరీ నియోజక వర్గం సమావేశం నిర్వహించినప్పుడు కొత్తగా జేరిన పేర్ని నాని ప్రసక్తి రావడంతో ఉద్రిక్తతలు సమావేశంలో చోటుచేసుకొన్నట్లు సమాచారం. నాని వచ్చిన తరువాత పార్టీ తమను చిన్న చూపు చూస్తోందని వారు అభిప్రాయపడ్డారు. దానికి తగ్గట్టుగానే, పేర్నినాని లేకుండా వారు సమావేశం నిర్వహించినందుకు పార్టీ వారికి చివాట్లు కూడా పెట్టినట్లు సమాచారం.   అదేవిధంగా నిన్న పశ్చిమ గోదావరి జిల్లాలో మైసూరా రెడ్డి నిర్వహించిన ఒక సమావేశంలో మాజీ జడ్పీటీసీ శ్రీనివాసరావు తదితరులు పార్టీలో ఎన్నాళ్ళగానో పనిచేస్తున్న తమను కాదని నిన్న గాక మొన్నపార్టీలోకి వచ్చిన మద్దాల రాజేష్ కు అధిక ప్రాదాన్యం ఇవ్వడమేమిటని నిలదీసినప్పుడు రెండు వర్గాల మద్య పెద్ద గొడవ జరగడంతో మైసూరా సమావేశం అర్ధంతరంగా ముగించక తప్పలేదు. ఇక నిడదవోలులో ను దాదాపు అదే కధ పునారావృతమయింది. అక్కడ ఆళ్ళ నానికి వ్యతిరేఖంగా బుద్ధాని, జక్కం శెట్టి, మరియు సంజయ్ లు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం.   ఇంకా ఎన్నికలకి ఏడాది సమయం ఉన్నప్పుడే పరిస్థితులు ఈవిధంగా ఉంటే, రేపు పార్టీ టికెట్స్ కేటాయించే సమయంలో ఏవిధంగా ఉంటుందో ఊహించుకోవచ్చును. పైగా నేటికీ బయట పార్టీలనుండి జనాలు చంచల్ గూడా జైలులోకి ప్రవేశిస్తూనే ఉన్నారు. ఇప్పుడు వైకాపాలో చేరుతున్నవారందరూ కూడా రాబోయే ఎన్నికలలో ఆ పార్టీ తమకు తప్పనిసరిగా టికెట్స్ కేటాయిస్తుందనే భరోసా దొరికిన తరువాతనే ఆ పార్టీలోచేరుతున్నారని భావించవచ్చును. అటువంటప్పుడు పార్టీలో ఉన్నపాత నాయకులకి, కొత్తగా వచ్చే వారికి మద్య ఇటువంటి ఘర్షణ వాతావరణం తప్పక పోవచ్చును.   ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి తప్ప పార్టీలో నెలకొన్న ఇటువంటి పరిస్థితులను చక్కదిద్దేవారు మరొకరు లేకపోవడం ఆ పార్టీకి చాలా పెద్ద సమస్యేనని చెప్పవచ్చును., ఒకవేళ ఉన్నపటికీ, ఎవరూ ఎవరి మాటను ఖాతరు చేయని పరిస్థితి ఆ పార్టీలో నెలకొందని మైసూరా రెడ్డి నిర్వహించిన సమావేశం నిరూపించింది.   ఇక, ఒకవేళ జగన్ మోహన్ రెడ్డి జైలు నుండి త్వరలో విడుదల కాకపోతే ఆ పార్టీ భాద్యతలను షర్మిల చెప్పడితే తప్ప ఇటువంటి సమస్యలను, అసమ్మతిని ఎదుర్కోవడం చాలా కష్టం. ఏమయినప్పటికీ, అధినేతలేని లోటు ఆ పార్టీని వెంటాడుతూనే ఉంటుందని చెప్పక తప్పదు.   అందువల్ల ఆ పార్టీ అధిష్టానం పాదయాత్రలు, బహిరంగ సభలపై దృష్టి పెట్టి జనాల్ని ఆకర్షించే ప్రయత్నం చేసే బదులు పార్టీని అంతర్గతంగా పటిష్టం చేసుకోవడం మేలు. తద్వారా ఒకవేళ జగన్ మోహన్ రెడ్డి జైలు నుండి విడుదల అవడం ఆలస్యమయినా పార్టీ వ్యవహారాలు సజావుగా సాగుతుంటే దైర్యంగా ఎన్నికలను ఎదుర్కోవడానికి వీలవుతుంది. లేదంటే, 2009 ఎన్నికల మధ్యలోనే ప్రజారాజ్యం పార్టీ కుప్ప కూలిపోయినట్లు వైకాపా కూడా కూలిపోయే ప్రమాదం ఉంది.

రెబెల్ కాంగ్రెస్ నేతలకు వైకాపాలో చుక్కెదురు

కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత కాలం తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన జగన్ అనుచరులు, మొన్న అవిశ్వాస తీర్మానం తరువాత కాంగ్రెస్ నుండి బయటపడి వైకాపాలో చేరిన తరువాత అక్కడ వారు ఊహించని సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఆ పార్టీలో చాల కాలంగా పనిచేస్తూ రాబోయే ఎన్నికలలో పార్టీ టికెట్లు ఆశిస్తున్న అనేక మందికి వీరిరాకతో భయాలు మొదలయ్యాయి. పాతవారి మద్యనే టికెట్స్ కోసం తీవ్రమయిన పోటీ ఉండగా ఇప్పుడు తానూ దూరకంత లేదు మెడకో డోలన్నట్లు కొత్తగా వచ్చిపడిన 9మంది కాంగ్రెస్ శాసన సభ్యులు పాతవారికి పోటీగా తయారవడంతో వైకాపాలో కుమ్ములాటలు కూడా మొదలయ్యాయి.   కొద్ది రోజుల క్రితం వైకాపా కు చెందిన కొందరు నాయకులు మచిలీ పట్నంలో పార్లమెంటరీ నియోజక వర్గం సమావేశం నిర్వహించినప్పుడు కొత్తగా జేరిన పేర్ని నాని ప్రసక్తి రావడంతో ఉద్రిక్తతలు సమావేశంలో చోటుచేసుకొన్నట్లు సమాచారం. నాని వచ్చిన తరువాత పార్టీ తమను చిన్న చూపు చూస్తోందని వారు అభిప్రాయపడ్డారు. దానికి తగ్గట్టుగానే, పేర్నినాని లేకుండా వారు సమావేశం నిర్వహించినందుకు పార్టీ వారికి చివాట్లు కూడా పెట్టినట్లు సమాచారం.   అదేవిధంగా నిన్న పశ్చిమ గోదావరి జిల్లాలో మైసూరా రెడ్డి నిర్వహించిన ఒక సమావేశంలో మాజీ జడ్పీటీసీ శ్రీనివాసరావు తదితరులు పార్టీలో ఎన్నాళ్ళగానో పనిచేస్తున్న తమను కాదని నిన్న గాక మొన్నపార్టీలోకి వచ్చిన మద్దాల రాజేష్ కు అధిక ప్రాదాన్యం ఇవ్వడమేమిటని నిలదీసినప్పుడు రెండు వర్గాల మద్య పెద్ద గొడవ జరగడంతో మైసూరా సమావేశం అర్ధంతరంగా ముగించక తప్పలేదు. ఇక నిడదవోలులో ను దాదాపు అదే కధ పునారావృతమయింది. అక్కడ ఆళ్ళ నానికి వ్యతిరేఖంగా బుద్ధాని, జక్కం శెట్టి, మరియు సంజయ్ లు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం.   ఇంకా ఎన్నికలకి ఏడాది సమయం ఉన్నప్పుడే పరిస్థితులు ఈవిధంగా ఉంటే, రేపు పార్టీ టికెట్స్ కేటాయించే సమయంలో ఏవిధంగా ఉంటుందో ఊహించుకోవచ్చును. పైగా నేటికీ బయట పార్టీలనుండి జనాలు చంచల్ గూడా జైలులోకి ప్రవేశిస్తూనే ఉన్నారు. ఇప్పుడు వైకాపాలో చేరుతున్నవారందరూ కూడా రాబోయే ఎన్నికలలో ఆ పార్టీ తమకు తప్పనిసరిగా టికెట్స్ కేటాయిస్తుందనే భరోసా దొరికిన తరువాతనే ఆ పార్టీలోచేరుతున్నారని భావించవచ్చును. అటువంటప్పుడు పార్టీలో ఉన్నపాత నాయకులకి, కొత్తగా వచ్చే వారికి మద్య ఇటువంటి ఘర్షణ వాతావరణం తప్పక పోవచ్చును.   ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి తప్ప పార్టీలో నెలకొన్న ఇటువంటి పరిస్థితులను చక్కదిద్దేవారు మరొకరు లేకపోవడం ఆ పార్టీకి చాలా పెద్ద సమస్యేనని చెప్పవచ్చును., ఒకవేళ ఉన్నపటికీ, ఎవరూ ఎవరి మాటను ఖాతరు చేయని పరిస్థితి ఆ పార్టీలో నెలకొందని మైసూరా రెడ్డి నిర్వహించిన సమావేశం నిరూపించింది.   ఇక, ఒకవేళ జగన్ మోహన్ రెడ్డి జైలు నుండి త్వరలో విడుదల కాకపోతే ఆ పార్టీ భాద్యతలను షర్మిల చెప్పడితే తప్ప ఇటువంటి సమస్యలను, అసమ్మతిని ఎదుర్కోవడం చాలా కష్టం. ఏమయినప్పటికీ, అధినేతలేని లోటు ఆ పార్టీని వెంటాడుతూనే ఉంటుందని చెప్పక తప్పదు.   అందువల్ల ఆ పార్టీ అధిష్టానం పాదయాత్రలు, బహిరంగ సభలపై దృష్టి పెట్టి జనాల్ని ఆకర్షించే ప్రయత్నం చేసే బదులు పార్టీని అంతర్గతంగా పటిష్టం చేసుకోవడం మేలు. తద్వారా ఒకవేళ జగన్ మోహన్ రెడ్డి జైలు నుండి విడుదల అవడం ఆలస్యమయినా పార్టీ వ్యవహారాలు సజావుగా సాగుతుంటే దైర్యంగా ఎన్నికలను ఎదుర్కోవడానికి వీలవుతుంది. లేదంటే, 2009 ఎన్నికల మధ్యలోనే ప్రజారాజ్యం పార్టీ కుప్ప కూలిపోయినట్లు వైకాపా కూడా కూలిపోయే ప్రమాదం ఉంది.

అజ్ఞానమా ఎన్నికలలో ఓటమిపై నమ్మకమా

  ఇదివరకు రోజుల్లో ప్రభుత్వాలకు సంక్షేమ ప్రభుత్వాలుగా ప్రజలలో ఒక గుర్తింపు, గౌరవం ఉండేవి. కానీ ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా లాభాలు, నష్టాలు అని మాట్లాడుతూ ఒక పెద్ద వ్యాపార సంస్థలలాగ పనిచేస్తున్నాయి. కేంద్రం పెట్రోలియం కంపెనీలకి యదేచ్చగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుకోవడానికి అనుమతినిచ్చేసిన తరువాత, ఇక నిత్యం పెరిగే పెట్రోల్ డీజిల్ దరల ప్రభావంతో నానాటికి సామాన్యుడు బ్రతుకు భారంగా మారుతుంటే, ‘ప్రజలలో ఆర్ధిక శక్తి పెరిగింది గనుక ఆ మాత్రం పెంపును వారు తట్టుకోగలరని’ సాక్షాత్ ప్రధాని మంత్రే అభిప్రాయపడటం చూస్తే ప్రజల కష్టాల పట్ల ప్రభుత్వానికి ఎంత గొప్ప అవగాహన ఉందో అర్ధం అవుతోంది. ఇక రైల్వే చార్జీలు, కరెంటు చార్జీల, భూములు దరల పెరుగుదల వంటి వాటి గురించి ప్రత్యేకంగా పేర్కొనవలసిన అవసరం లేదు.    పెరిగిన కరెంటు చార్జీలకి వ్యతిరేఖంగా ప్రతిపక్షాలన్నీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించి నిరాహార దీక్షలు, ధర్నాలు చేస్తుంటే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం, ప్రతిపక్షాలు కరెంటు సమస్యను రాజకీయం చేసి, తమ రాజకీయ ప్రయోజనాల కోసమే ఉత్తుత్తి పోరాటాలు చేస్తున్నాయని ఒక్క మాటలో తేల్చేసారు. ఒక వైపు రోము నగరం తగల బడుతుంటే తాపీగా ఫిడేల్ వాయించుకొంటూ కూర్చొన్న నీరో చక్రవర్తిని తలపిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తన స్వంత పార్టీలో నేతలే తీవ్రవిమర్శలు చేసేసరికి కొంచెం దిగి వచ్చితన ఇందిరమ్మ బాట కార్యక్రమం ముగించుకొని వచ్చేక 4, 5 తేదీలలో పెరిగిన విద్యుత్ ధరలను సమీక్షిస్తానని తాపీగా చెప్పడం ఆయన బాద్యత రాహిత్యానికి అద్దం పడుతోంది. ప్రతిపక్షాలు విద్యుత్ సమస్యను రాజకీయం చేస్తున్నాయని విమర్శించిన ముఖ్యమంత్రి, మరి తన స్వంత పార్టీ నేతలు కూడా విద్యుత్ బిల్లుల పెంపును వ్యతిరేఖించినప్పుడు మరి వారిని కూడా ఆయన అదే విధంగా ఎందుకు విమర్శించలేక పోయారు. ప్రతిపక్షాలు చేస్తే రాద్ధాంతం, స్వపక్షం చేస్తే సిద్ధాంతం అవుతుందా?   ఈ ప్రభుత్వాలు ప్రజలకి అవసరమయిన కరెంటు ఇవ్వలేవు, కానీ భారీగా డబ్బులు మాత్రం వసూలు చేయగలవు. పంటలు నాశనమయిపోతున్నా, వ్యాపారాలు, పరిశ్రమలు, చదువులు, చివరికి ఆసుపత్రులు కూడా మూసుకోవలసి వస్తున్నాప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేకపోవడమే కాకుండా శాసనసభలో ముఖ్యమంత్రితో సహా మంత్రులందరూ చాలా బాధ్యతా రాహిత్యంగా మాట్లాడటం చూస్తున్న ప్రజలు ఆవేశంతో రగిలిపోతున్నారు. తత్ఫలితమే ప్రతిపక్షాలు చేప్పటిన ధర్నాలకు, నిరాహర దీక్షలకు విశేష ప్రజా స్పందన కనిపిస్తోందిప్పుడు.   చివరికి, ఇంటిలో టీవీ చూసుకొనే భాగ్యం కూడా లేకుండా చేస్తూ, ఈ రోజు నుండి తప్పని సరిగా ప్రజలందరూ సెట్ టాప్ బాక్సులు అమర్చుకోవాలని హెచ్చరించడం పేద ప్రజలకి సైతం ఆగ్రహం తెప్పించింది. సెట్ టాప్ బాక్సులు విధిగా అమర్చుకోవాలని ప్రజలకి నిర్దిష్ట గడువు విదించినప్పుడు మరి ఇన్ని లక్షల మందికి ఒకేసారి అన్ని సెట్ టాప్ బాక్సులు మార్కెట్టులో అందుబాటులో ఉంటాయా లేదా, ఒక వేళ ఉంటే అకస్మాత్తుగా ఇంత డిమాండ్ ఏర్పడటంతో వ్యాపారులు వాటి ధరలు పెంచేసి ప్రజలను దోచుకోకుండా ఉంటారా? లేదా? అలా జరుగకుండా వారిని ఏవిధంగా నియంత్రణ చేయాలి? వంటి విషయలేమి పట్టించుకోకుండా ప్రభుత్వం అనాలోచితంగా ఏప్రిల్ 1వ తేదీ లోగా అందరూ సెట్ టాప్ బాక్సులు అమర్చుకోవాలని ప్రకటించేసింది. పైగా, మొన్న ఆర్ధిక మంత్రి చిదంబరం ప్రవేశ పెట్టిన తన బడ్జెట్లో సెట్ టాప్ బాక్సులపై 6% వరకు పన్నులు పెంచడం చాలా దారుణం. ఒకేసారి ఇన్ని లక్షల మంది ప్రజలు సెట్ టాప్ బాక్సులు అమర్చుకోవాలంటే వాటి ధరలు సామాన్యులకి కూడా అందుబాటులోకి తెకపోగా వాటిపై అమాంతం పన్ను పెంచేసి, వ్యాపారుల కంటే ముందుగానే ప్రభుత్వమే లాభాలు కళ్ళ జూసే ప్రయత్నం చేయడం చాలా దారుణం.   బహుశః ఈ పాటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాము వచ్చే ఎన్నికలలో ఓడిపోవడం ఖాయం అని గ్రహించడం వలననే ఇంత నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్నాయని భావించాలి లేదా ప్రజలలో నానాటికి పెరుగుతున్న వ్యతిరేఖతను గుర్తించదానికి ఇష్టపడని  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని నడుపుతున్న కాంగ్రెస్ పార్టీ ఆత్మవంచన చేసుకొంటూ భ్రమలోనే ఉండిపోవాలని కోరుకొంటున్నట్లుగా భావించాల్సి ఉంటుంది.      

కాంగ్రెస్ కు సింహ స్వప్నంగా మారిన మోడీ

  ఒక వైపు కర్ణాటక శాసనసభ ఎన్నికలకు ముహూర్తం ఖాయం అయిపోవడం, మరో వైపు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని పార్లమెంటరీ బోర్డులోకి మళ్ళీ తీసుకోవడానికి బాజపా సిద్ధం అవడంతో కలవరపడుతున్న కాంగ్రెస్ పార్టీ, తన యువనాయకుడయినా రాహుల్ గాంధీకి పెనుసవాలుగా మారనున్న నరేంద్ర మోడీ మీదకు తనకు బాగా అలవాటయిన చవకబారు అస్త్రాన్ని సందించి ఆయనను అప్రదిష్టపాలు చేసే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇటీవల అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యులు గుజరాత్‌ వచ్చి మోడీని కలవడం, ఆయనను ప్రశంసలతో ముంచెత్తడం, ఆయనను అమెరికా రమ్మని వారు ఆహ్వానించడం చూసి జీర్ణించుకోలేని కాంగ్రెస్ పార్టీ, వారి పర్యటనకు పరోక్షంగా బీజేపీయే డబ్బు అందించడమే కాకుండా, నరేంద్రమోడీని కలిసినందుకు కొన్ని బహుమతులు కూడా అందజేసిందని ఆరోపించింది. . చికాగో కేంద్రంగా పనిచేస్తున్న నేషనల్‌ ఇండియన్‌ అమెరికన్‌ పబ్లిక్‌ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌ ఈ ట్రిప్‌ను స్పాన్సర్ చేయగా, దానికి అమెరికాలో ఉంటున్న వ్యాపారవేత్తలు మరియు ఇతరులు కలిసి అవసరమయిన సొమ్ము సమకూర్చారని బాజపా విదేశీ వ్యవహారాల శాఖ కన్వీనర్ విజయ్ జోలీ మీడియాకు తెలిపారు.   అమెరికాలో ప్రతీ పనికి కొంత మూల్యం చెల్లించడం తప్పనిసరి అని, చివరికి అమెరికా అధ్యక్షుడు ఒబామాతో కలిసి కూర్చొని సరదాగా భోజనం చేయలన్నాకూడా దానికి అక్కడ డబ్బు వసూలు చేయడం సర్వసాదారణ విషయమని, అటువంటప్పుడు 18మంది అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యులు, వ్యాపారవేత్తలు కలిసి భారత్ పర్యటనకు రావడానికి కూడా తగిన మూల్యం చెల్లించక తప్పదని, దానిని అమెరికాలో స్థిరపడిన కొందరు భారతీయులు భరించారు తప్ప, నరేంద్ర మోడీ కానీ, గుజరాత్ ప్రభుత్వం గానీ భరించలేదని అటువంటప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏమిటి అభ్యంతరం అని ఆయన ప్రశ్నించారు.   అమెరికా నుండి వచ్చిన 18 మంది సభ్యులలో కేవలం ముగ్గురు కాంగ్రెస్‌ సభ్యులు ఆరన్‌ షాక్‌, సింథియా ల్యూమిస్‌, కాథే ఎం రోడ్జర్స్‌ మాత్రమే గుజరాత్ వెళ్లి మోడీని కలువగా మిగిలిన వారు దేశంలోని వివిధ రాష్ట్రాలను సందర్శిస్తున్నారని, వాటిలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా ఉన్నందున కాంగ్రెస్ కూడా వారి పర్యటనకు డబ్బు ఖర్చు చేస్తోందని భావించాలా? అని ఆయన ప్రశ్నించారు. భారత్ తో అమెరికా వ్యాపార సంబందాలు మరింత మెరుగుపడాలనే సదుదేశ్యంతో పంజాభీ ఎన్నారై సలభ్ సింగ్ నేతృత్వంలో నేషనల్‌ ఇండియన్‌ అమెరికన్‌ పబ్లిక్‌ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌ తీవ్ర ప్రయత్నాలు చేసి అమెరికన్ కాంగ్రెస్ సభ్యులను, వ్యాపారవేత్తలను భారత పర్యటనకు ఒప్పించి, తాము ప్రోగు చేసిన విరాళాలతో వారిని భారత్ కు పంపిస్తే, దానిని స్వాగతించకపోగా కాంగ్రెస్ పార్టీ ఈవిధంగా రాజకీయం చేయడం హేయమయిన పని అని బాజపా విదేశీ వ్యవహారాల శాఖ కన్వీనర్ విజయ్ జోలీ అన్నారు.   నేటికీ ‘సోనియా గాంధీ అల్లుడు’ అనే ఏకైక హోదాతో రాబర్ట్ వాద్రా యావత్ ఖర్చులను భారతప్రభుత్వం భరిస్తున్నప్పటికీ సిగ్గుపడని కాంగ్రెస్ పార్టీ, అమెరికాలో స్థిరపడినప్పటికీ భారత్ ప్రయోజనాల కోసం కృషిచేస్తున్నభారతీయులను అభినందించకపోగా, వారి కృషిని తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం చాల హేయమయిన పని అని ఆయన తీవ్రంగా విమర్శించారు.   ఇక, నరేంద్ర మోడీని ఓ ముగ్గురు అమెరికా దేశస్తులు పొగిడి, ఆయనను తమ దేశం రమ్మని ఆహ్వానిస్తే దానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఇంతగా భయపడిపోవడం చూస్తే నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీకి సింహస్వప్నంలా మారారని అర్ధం అవుతోంది. కాంగ్రెస్ పార్టీ ఆత్మవిశ్వాసాన్ని కొల్పోయినందునే ఇప్పుడు ఆ పార్టీకి ‘నరేంద్రమోడీ విశ్వరూపం’లో దర్శనమిస్తున్నారని భావించవచ్చును.   నరేంద్ర మోడీ తను సాధించిన విజయాలతో ముందుకు వెళ్తుంటే, కాంగ్రెస్ పార్టీ ఈ 5 సం.లలో అనేక కుంభకోణాలు తప్ప సాధించిన ఘనకార్యం ఏమి లేనందున, ఎదుటవారి లోపాలనే తన ఆయుదాలుగా చేసుకొని యుద్దానికి బయలుదేరుతోంది. ఆ ప్రయత్నంలోనే ఇప్పుడు మోడీపై ఈ బురద జల్లుడు కార్యక్రమానికి పూనుకొందని చెప్పవచ్చును. అయితే, ఇటువంటి ఆయుధాలతో యుద్ధంలో విజయం సాదించడం అసంభవమని కాంగ్రెస్ పార్టీకి గుజరాత్ ఎన్నికలలో బాగా అర్ధం అయింది. కానీ, ఆ పార్టీకి ఇంత కంటే మరో దారి లేనందునే ఈ విధంగా దాడి చేస్తోంది. ఇది కాంగ్రెస్ పార్టీ దయనీయమయిన పరిస్థితికి అద్దం పడుతోంది.

పార్టీకి సేవ చేసుకోవడానికీ పోటీయేనా?

  రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి ఉపాధ్యక్ష పదవి చేపడుతూనే ‘ఒక వ్యక్తికి- ఒకే పదవి’ అంటూ తన పార్టీ నేతల గుండెల్లో బాంబులు పేల్చారు. పార్టీ కోసం పనిచేసే వారు ప్రభుత్వంలో పదవులు చేపట్టకూడదు అంటూ మరో బాంబు కూడా పేల్చారు. అంతవరకు ఒక్కొకరూ రెండు మూడు పదవులలో రాజభోగం వెలగపెడుతున్నవారికి ఆయన మాటలు రుచించకపోయినా పాటించకతప్పని పరిస్థితి.   మిగిలిన వారి సంగతెలా ఉన్నపటికీ, అందరి కళ్ళు పీసిసి అధ్యక్షుడిగా, రవాణాశాఖ మంత్రిగా జోడు గుర్రాల రధంలో కులాసాగా సాగిపోతున్న బొత్స సత్యనారాయణ మీదనే పడ్డాయి. కానీ, రాహుల్ బాబుని తనకు ఓ రెండు నెలల సమయం కావాలని ముందుగానే ఒప్పించుకోవడంతో తన రధం మీద ఆయన మరికొంత దూరం ప్రయాణం పూర్తి చేసేసుకొన్నాక, తానూ మంత్రి పదవిని తృణ ప్రాయంగా త్యజించేసి శేషజీవితం పీసీసీ అధ్యక్షుడిగా పార్టీకే సేవచేసుకొని తరించాలనుకొంటున్నట్లు తెలియజేశారు. అందుకు అందరూ ఆయనను అభినందదించకపోగా అపార్ధం చేసుకొన్నారు.   ఇంతకాలం పీసీసీ అధ్యక్షుడిగా సాక్షాత్ ముఖ్యమంత్రిని కూడా గడగడలాడించి ఒక వెలుగు వెలిగిన ఆయన, తన పీసీసీ అధ్యక్ష పదవినికాదనుకొని ముఖ్యమంత్రి నించోమంటే నించొని కూర్చోమంటే కూర్చొనే మంత్రి పదవి తీసుకోవడం ఇష్టం లేకనే, పార్టీ సేవ అంటున్నారని కొందరు అభిప్రాయ పడితే, అదేమి కాదు పీసీసీ అధ్యక్ష పదవిలో తానుంటే తన యం.యల్యే. టికెట్టు, మంత్రి పదవి రెండూ కూడా తనవాళ్ళకే ఇప్పించుకొవచ్చునని, అప్పుడు మళ్ళీ రెండు పదవులు కూడా తమ ఇంట్లోనే ఉంటాయని ఆయన ఐడియా అని మరికొందరు సన్నాయి నొక్కులు నొక్క సాగారు. మరికొందరు ఆయన కావాలనుకొంటే తన వాళ్లకి యం.యల్యే. టిక్కెటు, మంత్రి పదవి ఇప్పించుకోగలరు కానీ, తానూ మంత్రి పదవి తీసుకొని తనవాళ్ళకి పీసీసీ అధ్యక్ష పదవి ఇప్పించుకోలేరు కదా అందుకే, పార్టీ సేవ అంటున్నారని ఆయన మీద లేనిపోని అభాండాలు వేయసాగారు.   మొత్తం మీద ఆయన ఐడియా ఆయన రాజకీయ జీవితాన్ని మార్చేస్తుందో లేదో ఇంకా స్పష్టం అవలేదు కానీ, ఆయన ఇంకా కుర్చీ లోంచి కాలు క్రింద పెట్టక ముందే అందులో కూర్చోవడానికి మల్లు రవికుమార్, డీ. శ్రీనివాస్, మల్లు బట్టి విక్రమార్క, గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ఆనంద భాస్కర్ తదితరులు తన కుర్చీ పక్కనే సిద్దంగా ఉండటం చూసి, ‘పార్టీకి సేవ చేసుకోవడానికి కూడా నాతో ఇంతమంది పోటీకి రావాలా?’ అంటూ ఆయన చాల నొచ్చుకొన్నారు.   ‘ముఖ్యమంత్రి, స్పీకర్, శాసన మండలి స్పీకర్ అందరూ మీ అంద్రోళ్ళే ఉన్నారు గనుక, మా పీసీసీ అధ్యక్షుడి పదవి మాగావలె’ అంటూ తెలంగాణా నేతలు కొంతమందిని తెలివిగా పోటీలోంచి తప్పించగలిగారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ‘బొత్స తప్ప వేరేవరయినా పరువలేదన్నట్లు’ బొత్స డిల్లీలో వాలకముందే కేంద్రానికి స్పష్టమయిన సంకేతాలు పంపేసినట్లు సమాచారం.   ఇక, కాంగ్రెస్ అధిష్టానం ఇటీవల పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఇటువంటి పరిస్థితులే తల ఎత్తుతే వెంటనే అక్కడ ప్రతాప్ సింగ్ బాజ్వ అనే యువకుడికి పీసీసీ అధ్యక్షపదవి కట్ట బెట్టినట్లు సమాచారం. ఇప్పుడు ఇక్కడ కూడా అదే ఫార్ములా తప్పదని అందరు అనుకొంటుంటే అసలు తన పరిస్థితి ఏమిటో తనకే అర్ధం కాకపోవడంతో బొత్సగారు చాల కలవరపడుతూ డిల్లీకి బయలుదేరిపోతున్నారు.

తెదేపాతో మైండ్ గేమ్స్ ఆడుతున్న వైకాపా

  తెలుగు దేశం పార్టీ నాయకుడు పయ్యావుల కేశవ్ త్వరలో తమ పార్టీలో చేరబోతున్నాడంటూ కొద్ది నెలలక్రితం వైకాపా ఆడిన మైండ్ గేమ్ కి ఆయన మీడియా ముందు కన్నీళ్ళు పెట్టుకొని బాధపడిన సంగతి అందరికీ తెలిసిందే. వివిధ పార్టీలకి చెందిన సీనియర్ నాయకులు కూడా త్వరలోనే తమ పార్టీలో చేరబోతున్నారంటూ ఆ పార్టీ ఆడిన మైండ్ గేమ్ దెబ్బకి అన్ని పార్టీలలో అలజడి రేగింది. ఆ విధంగా తమ ప్రత్యర్ధి పార్టీలలో గందరగోళం సృష్టించి, ఒకరినొకరు అనుమానించుకొనే విధంగా చేయగలిగితే తమ ప్రత్యర్ధులు, వారి పార్టీలు బలహీనపడవచ్చని వైకాపా ఆలోచన కావచ్చును.   ఇప్పుడు మళ్ళీ అదే అస్త్రాన్ని వైకాపా ఈసారి జూ.యన్టీఆర్ మీద ప్రయోగించినట్లు కనబడుతోంది. మూడు రోజుల క్రితం, మచిలీపట్నంలో షర్మిల పాదయాత్ర సందర్భంగా వైకాపా కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఒక ఫ్లెక్సీ బ్యానర్ మీద కొడాలి నాని పక్కన జూ.యన్టీఆర్ చిత్రాన్ని ముద్రించడంతో తెదేపా శ్రేణుల్లో కలకలం రేగింది. కానీ, ఆ బ్యానర్ ను ఏర్పాటు చేసిన వ్యక్తి తానూ యన్టీఆర్ కు, కొడాలి నానికి వీరాభిమానినని అందువల్లే వారిరువురి చిత్రాన్ని వేసి బ్యానర్ పెట్టానని సంజాయిషీ ఇచ్చుకోవడంతో ఆ కధ అక్కడితో ముగిసిపోయిందని అందరూ భావించారు.   అయితే, మళ్ళీ నిన్న అటువంటి బ్యానరే మరొకటి విజయవాడలో (షర్మిల పాదయాత్రకు జూ.యన్టీఆర్ స్వాగతం చెపుతున్నట్లు) ఏర్పాటుచేయడంతో తెదేపా నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో వెంటనే దానిని పోలీసులు తొలగించారు.   నీతి నిజాయితీ, విశ్వాసనీయత వంటి సకల మంచి లక్షణాలకు పేటెంట్ హక్కులు తమకే ఉన్నాయని నిత్యం గొప్పలు చెప్పుకొనే వైకాపా ఇటువంటి నీచ రాజకీయాలు చేయడం వలన ఆ పార్టీ నేతల మాటలకి విశ్వసనీయత కోల్పోవడం ఖాయం. రాజకీయ చైతన్యం కలిగిన ప్రజలకి ఇటువంటి నీచ రాజకీయాలను అర్ధం చేసుకోవడం పెద్ద కష్టం కాదు.   మాటలకి చేతలకి మద్యన పొంతన లేనప్పుడు, నీతి ప్రవచనాలతో ప్రజలను ఎల్లకాలం మభ్య పెట్టడం ఎవరికయినా అసాద్యం. ఇప్పటికే భ్రష్టు పట్టిపోయిన మన రాజకీయాలని ఇటువంటి మైండ్ గేమ్స్ తో మరింత భ్రష్టు పట్టిస్తే అది తిరిగి ఏదో ఒకనాడు ఆ పార్టీనే దెబ్బతీయవచ్చును. ఎదుట కొంపకి నిప్పు పెట్టి ఆనందిద్దామని అనుకొంటే రేపు తన కొంపకీ ఆ మంట అంటుకోకమానదని వైకాపా తెలుసుకోవడం మంచిది. ఈ రోజు ఆ పార్టీ మొదలుపెట్టిన ఆటనే రేపు ఇతర పార్టీలు కూడా ఆడటం మొదలుపెడితే అప్పుడు తానూ తవ్విన గోతిలో తానే తప్పక పడుతుంది.   కొడాలి నానితో జూ.యన్టీఆర్ కి ఉన్న సినిమా అనుబంధం వలన వారిరువురి మద్య స్నేహం ఉండిఉండవచ్చును. అయితే, దానిని ఈ విధంగా రాజకీయం చేయడం వలన తాత్కాలికంగా వైకాపాకు ప్రయోజనం కలిగించినా, అదే అంశం పట్ల మీడియాలో జరుగుతున్న చర్చలు, విశ్లేషణలు ఆ పార్టీపట్ల ప్రజలలో వ్యతిరేఖత ఏర్పరచగలదు కూడా.   ఈ బ్యానర్ రాజకీయాలతో తమకి ఏ సంబందము లేదని, తమకి తెలియకుండా ఇదంతా జరిగిందని వైకాపా చెప్పుకోలేదు. ఎందుకంటే, ఇంత జరుగుతున్నా కూడా ఆ పార్టీ నేతలెవరూ కూడా దీనిని ఖండించడం లేదు. మళ్ళీ అటువంటివి పునారావృతం కాకుండా తగిన చర్యలు కూడా చెప్పట్టకపోవడం వలననే మళ్ళీ నిన్న మరో బ్యానర్ వెలిసి వైకాపా నిజాయితీని శంకించేలా చేస్తోంది.   చివరికి జూ.యన్టీఆర్ కి స్నేహితుడుగా భావిస్తున్న వైకాపా నేత కొడాలి నాని కూడా ఈ విషయం పై స్పందించక పోవడం చూస్తుంటే ఇదంతా ఉద్దేశ్య పూర్వకంగానే వైకాపా ఆడుతున్న మైండ్ గేమ్ అనుకోక తప్పదు. జూ.యన్టీఆర్ బొమ్మను వాడుకొని తెదేపాలో చిచ్చు పెట్టేందుకు వైకాపా ప్రయత్నించడం ఆ పార్టీ దైన్య స్థితిని తెలియజేస్తుంది తప్ప మరొకటి కాదు.

జగన్ భార్య భారతి ఆవేదన

  జగన్‌ను అరెస్టుచేసి నేటికి 10 నెలలు పూర్తయింది. ఈ సందర్భంలో ఆయన అర్ధాంగి శ్రీమతి భారతి తన ఆవేదనను అక్షర రూపంలో వ్యక్తం చేసారు. 10 నెలల జైలు జీవితం గడిపిన తరువాత కూడా జగన్ లో ఇసుమంత అదైర్యం కానరాలేదు. దేవుని దయ ఆయనపై ఉన్నందునే ఆయనకు ఇన్ని కష్టాలను తట్టుకొని ఎదురు నిలువ గలిగే శక్తి కలిగింది.   ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలలో తిరుగుతున్న చంద్రబాబు చేయలేని పనిని జగన్ జైలులో నాలుగు గోడల మద్య ఉండే చేయించగలుగుతున్నారు. ప్రజలను కష్ట పెడుతున్న ప్రభుత్వానికి వ్యతిరేఖంగా తన పార్టీ చేత, తన అనుచరుల చేత అవిశ్వాసం పెటించినపుడు ప్రజల కష్టాలను చూసి కన్నీళ్లు కారుస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి మద్దతు పలికారు.   డిల్లీ చుట్టూ తిరిగి ముఖ్యమంత్రి పదవి సంపాదించుకొన్న సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ అధికారం చెప్పటిన తరువాత రాష్ట్రానికి ఏమి మేలు చేయగలిగారు. తన పరిపాలనకు తానూ శబాషీలు ఇచ్చుకోవడం కాదు, ఆ పని ప్రజలు చేసినప్పుడు గొప్పదనం తెలుస్తుంది. ఢిల్లీలో పెద్దలను కాకా పట్టడం, తప్పుడు నివేదికలు ఇవ్వడం తప్ప పరిపాలన గురించి ఆయనకేమి తెలియదు.   చంద్రబాబును వెన్ను పోటు పొడిచారని నిత్యం విమర్శించే కిరణ్ కుమార్ వైయస్సార్ గారి అండతో రాజకీయంగా పైకెదిగి ముఖ్యమంత్రి అయిన తరువాత తనకు రాజకీయ జీవితం ప్రసాదించిన వైయస్సార్ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్పించి మోసం చేసారు.   ప్రజలను కష్ట పెట్టడం తప్ప ఈ 18 నెలలో ఈ రాష్ట్రానికి చేసిన మేలు ఏమి లేదు. కనీసం స్వంత నియోజక వర్గాన్ని కూడా పట్టించుకోలేదు. ఆయన తన పరిపాలన గురించి ప్రజలను అడిగే ధైర్యం చేయగలరా? అప్పుడు ప్రజలు మాట్లాడితే వినే ధైర్యం ఆయనకుందా?   జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని 150 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేసిచ్చిన తరువాత కూడా కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు రోశయ్యగారికి తన మద్దతు ప్రకటించిన గొప్ప వ్యక్తి జగన్. డిల్లీ పెద్దలు ముందుగా కేంద్ర మంత్రి పదవి, తరువాత ముఖ్యమంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి పార్టీ నుండి బయటకి వచ్చి ప్రజలకోసం పోరాడిన గొప్ప వ్యక్తీ జగన్.   ప్రజల కోసం రెండున్నర సంవత్సరాలు ఎండనకా, వాననకా, రాత్రనకా, పగలనకా ప్రజలలో తిరుగుతూ ప్రజల ఇంట్లో ఒక సోదరుడిలా, కొడుకులాగా, మమేకమయ్యారు. అందుకు శిక్షగా కాంగ్రెస్, తెలుగుదేశం, సీబీఐలు కలిసి కుట్రలు పన్ని జగన్ను జైలులోకి పంపించాయి.   కిరణ్ కుమార్ రెడ్డికి, చంద్రబాబుకి కూడా జగన్ మోహన్ రెడ్డికి ఉండే చిత్తశుద్ధిలో, కార్యదక్షతలో, పట్టుదలలోనూరవవంతు కూడా లేదు. జగన్ కు ఉన్నదీ వీరిద్దరికీ బొత్తిగా లేనిది దేవుని దయ. దేవుని తోడు ఉన్న జగన్‌కు వ్యతిరేకంగా అన్యాయం, అక్రమం చేసేవారి దవడ ఎముకలు దేవుడు విరగ్గొట్టే సమయం ఎంతో దూరంలో లేదు.

శ్రీ లంక సమస్యపై తమిళ పార్టీల రాజకీయ చదరంగం

  రెండు నెలల క్రితం కమల్ హస్సన్ తన విశ్వరూపం సినిమాను తన స్వంత రాష్ట్రమయిన తమిళనాడులో విడుదల చేసుకోవడానికి ఎన్ని కష్టాలు పడ్డారో అందరికీ తెలిసిందే. పాము-ముంగీసల వంటి ఆజన్మ శత్రుత్వం ఉన్న డీయంకె పార్టీ అధ్యక్షుడు కరుణానిధి, ఏఐఏ డీయంకె పార్టీ అధ్యక్షురాలు మరియు ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారి జయలలితల మద్య జరిగే రాజకీయ పోరాటాలలో ఇటువంటివారు అనేకమంది బలయిపోతూనే ఉంటారక్కడ.   ఇటీవల డీయంకె పార్టీ అధ్యక్షుడు కరుణానిధి శ్రీ లంక సమస్యను సాకుగా చేసుకొని యుపీఏ ప్రభుత్వానికి తమ పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడంతో, రాష్ట్రంలో ఆయన పార్టీకి అనుకూలంగా రేటింగ్స్ ఒక్కసారిగా పెరిగిపోయాయి. పార్లమెంటు ఎన్నికలు దగ్గిరపడుతున్నఈ సమయంలో పూర్తిగా అణచివేశాననుకొన్న డీయంకె పార్టీ మళ్ళీ అనూహ్యంగా బలం పుంజుకోవడంతో అప్రమ్మత్తమయిన జయలలిత, వెంటనే దానికి విరుగుడు మంత్రం వేశారు.   త్వరలో చెన్నైల్ లో జరుగనున్న ఐపియల్ మ్యాచులో శ్రీ లంక క్రికెట్ ఆటగాళ్లను తమ రాష్ట్రంలో అడుగుపెట్టేందుకు అనుమతి ఇస్తే ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో వారికి బద్రత కల్పించడం కష్టం అవుతుంది కనుక, వారిని చెన్నై మ్యాచులో పాల్గొనకుండా నిషేదించాలని కోరుతూ జయలలిత ప్రధాని డా. మన్మోహన్ సింగుకు ఒక లేఖ వ్రాసారు.   డీయంకె పార్టీ మద్దతు ఉపసంహరణతో చిక్కులో పడ్డ యుపీయే ప్రభుత్వానికి, ఇంతవరకు బయట నుండి మద్దతు ఇస్తున్నసమాజ్ వాది పార్టీ కూడా క్రమంగా దూరమవుతున్న సూచనలు స్పష్టంగా కనబడటంతో, ప్రభుత్వం పడిపోకుండా ఉండాలంటే మరొక పార్టీ మద్దతు వెంటనే అత్యవసరం. కనుక, ఊహించని విధంగా జయలలిత నుండి వచ్చిన లేఖను ఒక అపూర్వ అవకాశంగా అందుకొన్న యుపీయే ప్రభుత్వం వెంటనే సానుకూలంగా స్పందిస్తూ బీసీసీఐ తో ఒక ప్రకటన కూడా చేయించింది. తద్వారా జయలలితను ప్రసన్నం చేసుకొని ఆమె పార్టీ మద్దతు పొందే ప్రయత్నాలు మొదలుపెట్టింది. డీయంకె పార్టీ కేంద్రాన్ని విరోధించి గనుక, జయలలిత తప్పకుండా తమ పార్టీ మద్దతు ఇచ్చే అవకాశం ఉంది.   అయితే, ఈ రెండు పార్టీలు కోడెద్దులా రాజకీయ పోరాటాలు చేస్తుంటే వాటి మద్య శ్రీ లంక తమిళ ప్రజలు మొదలుకొని క్రీడాకారుల వరకు అందరూ లేగ దూడలా నలిగిపోతుండటమే చాల బాధాకరం. నిజం చెప్పాలంటే శ్రీ లంక తమిళుల సమస్య ఈ నాటిది కాదు. గత మూడు దశాబ్దాలుగా ఉన్నదే. ఒకనాడు యల్.టీ.టీ.యి. నాయకుడు ప్రభాకరన్ చేతిలో అనేక మంది అమాయకులయిన తమిళులు ధన, మాన, ప్రాణాలు కోల్పోగా, ఇప్పుడు శ్రీ లంక ఆర్మీ చేతుల్లో కోల్పోతున్నారు.   ఈ రోజు వారికోసం వీదులకెక్కి పోరాటాలు మొదలుపెట్టిన రెండు తమిళ పార్టీలు ఏనాడు కూడా పూర్తి స్థాయిలో వారికి అండగా నిలబడలేదు సరికదా, అదే అంశం పట్టుకొని ఇద్దరూ రాజాకీయ లబ్ది పొందారు, ఇంకా ఇప్పటికీ పొందాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు.   గత శాసన సభ ఎన్నికలలో ఘోరంగా ఓటమిపాలయిన డీయంకె పార్టీకి నాటినుండి అనేక కష్టాలు చుట్టుముట్టాయి. కరుణానిధి కుమార్తె కనిమోలి, ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి ఎ.రాజా అరెస్టులు, మరో వైపు జయలలిత రాజకీయ కక్ష సాదింపులు, కరుణానిధి ఇద్దరు కొడుకులు అళగిరి, స్టాలిన్ ల మద్య పార్టీ పీఠంకోసం పోరాటాలు వంటి అనేక సమస్యలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న కరుణానిధి, మంచి ప్రతిఫలం అందించే శ్రీ లంక సమస్యను ఎత్తుకొని, రాష్ట్ర రాజకీయాలలో పార్టీ పరిస్థితిని చక్కబెట్టాలని పన్నిన వ్యూహం కొంత మేరకు సత్ఫలితాలు ఇచ్చినట్లే కనిపిస్తోంది.   కరుణానిధి తన వ్యుహాలతో ముందుకు సాగిపోతుంటే ఆయనను తీవ్రంగా వ్యతిరేఖించడమే తన పార్టీ సిద్ధాంతంగా చేసుకొన్న జయలలిత చేతులు ముడుచుకొని కూర్చోరు గనుక, ఆమె కూడా అందివచ్చిన ఐపియల్ మ్యాచులతో ఆట మొదలుపెట్టేసారు.   డీ.యం.కే.పార్టీ ఐక్యారాజ్య సమితిలో మానవ హక్కుల సదస్సులో శ్రీ లంకకు వ్యతిరేఖంగా భారత్ ఓటేయాలని డిమాండ్ చేస్తే, త్వరలో శ్రీ లంకలో జరుగనున్న కామన్వెల్త్ అధినేతల సమావేశాలను బహిష్కరించాలని జయలలిత డిమాండ్ చేసారు.   తమిళ ప్రజల సున్నితమయిన భావోద్వేగాల నుండి రాజకీయ లబ్ది పొందాలనే ప్రయత్నంలో యల్.టీ.టీ.యి. మరియు శ్రీ లంక ఆర్మీల కంటే కూడా చాల దారుణంగా శ్రీ లంక తమిళుల సమస్యలతో ఈ రెండు తమిళ పార్టీలు ఆడుకొంటున్నాయిప్పుడు. సాటి తమిళులు కష్టాలలో ఉంటే వారిని ఏవిధంగా ఆదుకోవాలో ఆలోచించాల్సిన ఈ రెండు తమిళ పార్టీలు అదే అంశం మీద రాజకీయ చదరంగం ఆడుకోవడం చాలా హేయమయిన చర్య.   ఇక మరో విచారకరమయిన విషయం ఏమిటంటే, మన జాతీయ నాయకులెవరూ కూడా ఇంతవరకు వీరి ఆటలను ఖండించలేదు. ఎందుకంటే రానున్న ఎన్నికల తరువాత వారి అవసరం పడవచ్చునని దురాలోచనతో వెనుకంజ వేస్తున్నారు.   ఇంత కంటే మరో దారుణమయిన విషయం ఏమిటంటే, జాతీయ మీడియా శ్రీ లంక తమిళుల సమస్య కేవలం తమిళనాడుకు మాత్రమే చెందిన సమస్యగా భావిస్తూ, శ్రీ లంకలో ఆర్మీ చేతిలో ధన, మాన, ప్రాణాలు కోల్పోతున్న వారిపట్ల కనీస మానవధర్మం పాటించక నిర్లక్ష్యం వహించడం. జాతీయ మీడియాకు దక్షిణ భారతదేశం మీద మొదటినుండి చిన్న చూపే ఉంది. అందుకే శ్రీ లంక తమిళుల సమస్యల పట్ల స్పందించక పోయినప్పటికీ, జయలలిత ఐపియల్ క్రికెట్ మ్యాచులకు అడ్డం పడటం గురించి మాత్రం చాల పెద్ద చర్చలే చేస్తున్నాయి.   ఈ పరిణామాలన్నీ మనుషుల్లో నానాటికి మానవత్వం, నైతిక విలువలు కనుమరుగవుతున్నట్లు స్పష్టం చేస్తున్నాయి.

సారీ! తెలంగాణా కోసం మాట్లాడలేను

        కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి తెలంగాణా విషయంలో ఇంతవరకు వెనుక నుండి సలహాలు ఈయడమే తప్ప, ఎన్నడూ తెర ముందుకు వచ్చి నిర్ద్వందంగా తన అభిప్రాయం చెప్పలేదు. తాను అధికార పార్టీలో బాధ్యతగల మంత్రి పదవిలో ఉన్నందునే మాట్లాడలేకపోతున్నానని ఆయన అనడం న్యాయమే. అయితే, ఆయన ఆ పదవిలో ఉనంతకాలం కూడా ఏమి మాట్లాడలేన్నపుడు, కేంద్రమంత్రిగా తన పరపతిని ఉపయోగించి కేంద్రాన్ని ఒప్పించలేనప్పుడు, ఆయన వలన తెలంగాణా కోరుకొంటున్నవారికి ఏమి ప్రయోజనం? ఆయన తెలంగాణాలో వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నప్పుడు కేంద్రమంత్రిగా తెలంగాణాపై మాట్లాడేందుకు తనకున్న పరిమితులు చెప్పుకొచ్చి, తన పరిస్థితిని అర్ధం చేసుకోమని ప్రజలను కోరడం నవ్వు తెప్పిస్తుంది.   ఆయనకు తెలంగాణ ఏర్పడాలని నిజంగా బలమయిన కోరికే ఉండి ఉంటే, అటు కేంద్రంతో తెలంగాణా కోసం పోరాడటమో లేక తెలంగాణా అనే పదం ఉచ్చరించడానికి కూడా అడ్డం పడుతున్న తన కేంద్రమంత్రి పదవిని, తన యంపీ పదవినీ త్యాగం చేసి, తెలంగాణా ఉద్యమానికి సారద్యం వహించడమో లేక వారితో కలిసి పోరాడటమో చేసి ఉండేవారు. గానీ, ఆయన తన మంత్రి పదవిని వదులుకోలేదు సరికదా, దాని వలననే తానూ తెలంగాణాపై మాట్లాడలేకపోతున్నానని క్షమించండంటూ తర్కం మాట్లాడుతున్నారు.   మే నెలలోగా కేంద్రం తెలంగాణా ప్రకటించకపోతే ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణా ఉద్యమానికి నాయకత్వం వహిస్తారని ఆయన అనుచరులు చెపుతున్నట్లు న్యూస్ పేపర్లలోవార్తలు ప్రచురితమయ్యాయి. ఆయన నిర్ణయం అదే అయినప్పుడు ఆ మాటేదో ఆయనే స్పష్టంగా ప్రజలకు, మీడియాకు చెప్పి ఉంటే హుందాగా ఉండేది. కానీ, తన అనుచరుల ద్వారా మీడియాకు చెప్పడం, మీడియా ద్వారా అధిష్టానం దృష్టికి వెళ్ళేలా చేయడం చూస్తుంటే తెలంగాణా పట్ల ఆయనకి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్ధం అవుతోంది.   దీని వెనుక ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే, ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం మీడియాలో వస్తున్న వార్తలను చూసి కంగారు పడి ఆయనకు నచ్చ జెప్పే ప్రయత్నం చేస్తే ఆయనది పైచేయి అవుతుంది. అధిష్టానం ఈ విషయంలో సీరియస్ అయినట్లయితే ఆ వార్తలు మీడియా సృష్టి అని చెప్పి చల్లగా తప్పుకోవడానికి మార్గమూ ఉంటుంది. తానెక్కడా స్వయంగా పదవికి రాజీనామా చేస్తానని కానీ, తెలంగాణా ఉద్యమానికి అనుకూలంగా కానీ మాట్లాడలేదని ఆయన చెప్పుకోవడానికి అవసరమయిన మార్గాలన్నిటినీ ఆయన సిద్దంగా ఉంచుకొని ఈ విధంగా పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోంది. లేదంటే అపార రాజకీయ అనుభవజ్ఞుడయిన ఆయన, న్యూస్ పేపర్లలో వచ్చిన వార్తలను వెంటనే ఖండించాలని తెలియక ఊరుకోలేదు.   ఇక, ఆయన తెలంగాణా కోసమే తన మంత్రి పదవిని త్యాగం చేయడం అనేది కూడా పూర్తిగా నిజం కాదు. గతంలో కీలకమయిన పెట్రోలియం శాఖను నిర్వహించిన ఆయన రిలయన్స్ కంపెనీకి అడ్డం పడుతునందునే ఆయనను ఆశాఖ నుండి తప్పించి అప్రదాన్యమయిన పట్టణాభివృద్ధి శాఖకు పంపేసారు. అంతకు మునుపు ఎన్నడూ కూడా ఆయనలో కాంగ్రెస్ అధిష్టానం పట్ల అసమ్మతి కనబడలేదు. కానీ, తనకు కేంద్రంలో ప్రాధాన్యత తగ్గిన తరువాతనే ఆయనకు పార్టీ అధిష్టానం పట్ల ఆగ్రహంతో ఉన్నసంగతి అందరికీ తెలిసిందే.   ప్రస్తుతం ఆయన చేప్పటిన మంత్రి పదవి ఆయనకు ఉన్నా ఊడినా ఒక్కటే గనుక, ఆయన ఆదేదో తెలంగాణా కోసమే త్యాగం చేస్తున్నట్లు చెప్పుకొంటే కనీసం రాష్ట్రంలోనయినా కొంచెం మంచి పేరు సంపాదించుకోవచ్చునని ఆయన ఉద్దేశ్యం కావచ్చును. కానీ, త్వరలో ఎన్నికలు రానున్న ఈ సమయంలో ఆయనే కాదు, పార్టీలో ఎవరూ కూడా పార్టీ అధిష్టానాన్ని ఎదిరించలేరు. ఎదిరిస్తే టికెట్లు రావని జగమెరిగిన సత్యం.   రాహుల్ యువమంత్రం పటిస్తున్న ఈ సమయంలో ఇటువంటి సీనియర్లలో ఎంతమందికి పార్టీ టికెట్స్ దక్కుతాయో ఎవరికీ తెలియదు. గనుక, టికెట్స్ రావనే విషయం కూడా కూడా పూర్తిగా రూడీ చేసుకొన్నతరువాతనే, ‘తెలంగాణా కోసమే’ రాజీనామా చేస్తే తీర్దానికి తీర్ధం ప్రసాదానికి ప్రసాదం రెండు కూడా దక్కుతాయని ఆయన ఉద్దేశ్యం కావచ్చును. అయినా, ప్రస్తుతం తెలంగాణా ఉద్యమాలు చేసేవారు ఇక్కడ చాలా మందే ఉన్నారు, గనుక అయన ఇప్పుడు వచ్చి కొత్తగా చేసేదేమీ ఉండదు.

జగన్ విడుదల అయితే పండగ చేసుకోండి

  జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల చేస్తున్నపాదయాత్రకి ఆదివారం నాడు 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఆమె గుంటూరు జిల్లా మంగళగిరిలో ఒక బహిరంగ సభ నిర్వహించారు. ఆ సభలో మాట్లాడుతూ ‘జగనన్న బయటకి వచ్చిన నాడే మనకి పండుగ’ అని, ‘రాజన్న రాజ్యం వచ్చినప్పుడే మనకు అసలైన పండుగ’ అని అన్నారు. ఆమె తన సోదరుడు జైలు నుండి విడుదలయి బయటకి రావాలని కోరుకోవడంలో తప్పు లేదు. కానీ, తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన బయటకి వచ్చినప్పుడే ప్రజలకి పండుగ అని చెప్పడం విడ్డూరంగా ఉంది.   జగన్ మోహన్ రెడ్డి తనకు ముఖ్యమంత్రి పదవి ఈయనందుకు కాంగ్రెస్ పై అలిగి బయటకి వచ్చి, స్వంత కుంపటి పెట్టుకొని, అక్రమాస్తుల కేసులో జైలు పాలయ్యారు తప్ప షర్మిల చెపుతున్నట్లు, ప్రజల కోసం జైలుకు వెళ్లి కష్టాలు పడటంలేదు. ఆయన జైలుకు వెళ్ళక మునుపు చేసిన ‘ఓదార్పుయాత్ర’, ప్రస్తుతం ఆమె చేస్తున్న’మరో ప్రస్థానం’ పాదయాత్ర రెంటి లక్ష్యం కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే తప్ప మరొకటి కాదు. అందువల్ల, ఆయన బయటకి వస్తే ఆయన కుటుంబం, ఆయన పార్టీ వారికీ, ఆయనను అభిమానించేవారికి పండుగ అవుతుంది తప్ప ప్రజలందరికీ కాదు.   ఆయన కష్టాలని ప్రజల కష్టాలుగా, అయనకి అధికారం దక్కితే ప్రజలకి పండుగని ఆమె చెప్పడం కేవలం ప్రజలను మభ్య పెట్టడమే అవుతుంది. ప్రజలలో ‘నిశబ్ద విప్లవం’ వచ్చి ఆయనకి ముఖ్యమంత్రి పదవి దక్కిస్తుందని చెప్పే బదులు, వచ్చే ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి జగన్ మోహన్ రెడ్డిని గెలిపించి ముఖ్యమంత్రిని చేయమని నేరుగా ప్రజలను కోరిఉంటే ఇంకా బాగుండేది.   వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికలలో గెలిస్తే, జగన్ జైలు నుండి నిర్దోషిగా బయపడి అధికారం చేపడితే, ఆమె ఇప్పుడు ప్రజలకి చేస్తున్నవాగ్దానాలను ఆయన నెరవేరిస్తే, ఆమె హామీ ఇస్తున్న ‘రాజన్న రాజ్యం’( అంటే ఆ రాజ్యంలో ప్రజలకి సుఖాలే తప్ప కష్టాలు అసలుండవని ఆమె ఉద్దేశ్యం) గనుక ఏర్పరిస్తే అప్పుడు ‘పండుగ చేసుకోండి’అని ప్రజలకు ఆమె చెప్పనవసరం లేదు. ప్రజలే స్వచ్చందంగా పండుగ చేసుకొంటారు.   కానీ, రాష్ట్రంలో యదార్ధ పరిస్థితుల గురించి ఏమాత్రం అవగాహన ఉన్నవారయినా, రాబోయే ఎన్నికల తరువాత ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా, వారి దగ్గర ఏదయినా ‘మంత్రం దండం’ ఉంటే తప్ప రాష్ట్ర పరిస్థితులను మార్చడం అసంభవం అని అర్ధం అవుతుంది. కానీ, తమ పార్టీలు అధికారంలోకి వస్తే చిటికెలో ప్రజల కష్టాలన్నిటినీ మాటుమాయం చేసేస్తామని చెప్పడం ప్రజలను అవివేకులుగా భావించి మభ్య పెట్టడమే అవుతుంది.   పైగా, ఏమాత్రం రాజకీయ అనుభవం కానీ, నీటి పారుదల, విద్యుత్ ఉత్పత్తి, వ్యవసాయం వంటి వివిధ వ్యవస్థల పట్ల ఏమాత్రం అవగాహనలేని ఆమె ఈవిధంగా మాట్లాడటమే కాకుండా వాటిపై వాగ్దానాలు కూడా చేయడం ప్రజలను మభ్య పెట్టడమే అవుతుంది.   ఇక, సీబీఐ కేవీపీని జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ చేయడమే కాకుండా, సీబీఐ జాయింటు డైరెక్టరు లక్ష్మి నారాయణ తమ విచారణ ముగించడానికి నిర్దిష్ట గడువేమి లేదని, ఈ విషయంలో సుప్రీం కోర్టు చెప్పిన విషయాలు సంబందిత వెబ్ సైటులో ఉన్నాయని చెప్పడంతో త్వరలో తన సోదరుడు జైలు నుండి విడుదల అవుతాడని గట్టిగా నమ్ముతూ, అదే విషయాన్ని ప్రజలకి కూడా పదే పదే చెపుతున్న షర్మిలకు ఊహించని ఎదురుదెబ్బగా తగిలాయి. అందువల్ల ఆమెకు ఆగ్రహం కలగడం సహజమే. అయితే సీబీఐ ఇంతకాలం విచారణ చేయకుండా గాడిదలు కాస్తోందా? అంటూ తీవ్రపదజాలం వాడటం ఆమెకు కొత్త సమస్యలు తెచ్చిపెట్టగలవు. గత కొద్ది నెలలుగా ఈవిధంగా నోరు జారిన అనేక మంది మహామహులు ఎదురు దెబ్బలు తినడం అందరూ చూస్తున్నదే.   ఆమె తన పాదయాత్ర ద్వారా పార్టీ క్యాడర్లను నిర్లిప్తలో కూరుకుపోకుండా చాలా చక్కగా కాపడుతున్నారనడంలో ఏమాత్రం సందేహం లేదు. కానీ, ప్రజలకు ఇటువంటి శుష్క వాగ్దానాలు చేస్తూ పాదయాత్రలతో ఈ ఏడాది కాలాన్ని వృధా చేసుకొనే బదులుగా, మిగిలిన ఈ కొద్దిపాటి విలువయిన సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొంటూ పార్టీని క్షేత్ర స్థాయి నుండి పటిష్టపరుచుకోవడంపై ఆమె దృష్టి కేంద్రీకరిస్తే, ఆమె పార్టీ ఎన్నికలలో గెలిస్తే అప్పుడు వారే పండుగ చేసుకోవచ్చును.

జబ్బలు చరుచుకొంటున్న కేంద్ర ప్రభుత్వం

    ఇటలీ ప్రభుత్వం ఎట్టకేలకు తన ఇద్దరు నావికులను భారత్ కు తిరిగి పంపడంతో, ఇంతవరకు నిందలు, కష్టాలే తప్ప ఒక్క ప్రశంస, విజయం కూడా చవి చూడని యుపీయే ప్రభుత్వం వారిరువురినీ వెనక్కి రప్పించడం తమ ఘనతే అంటూ మీడియా ముందు జబ్బలు చరుచుకొంటోందిప్పుడు.   విదేశాంగ శాఖ మంత్రి సల్మాన్ కుర్షిద్ నిన్న డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ తాము అవలంభించిన సమర్ధమయిన దౌత్యవిధానం వలనే ఇది సాధ్యం అయిందని చెప్పుకొన్నారు. అయితే, వారిని తిప్పి పంపేందుకు ఇటలీ ప్రభుత్వం తమ నుండి రెండు హామీలను కూడా కోరిందని వాటికి తాము అంగీకరిస్తూ వెంటనే జవాబు ఇచ్చినందునే ఇంత త్వరగా ఆ ఇద్దరు నావికులను భారత్ కు తిరిగి రప్పించగలిగామని ఆయన అన్నారు. ఇద్దరు భారతీయ మత్స్యకారులను చంపిన నేరంలో కేసులేదుర్కొంటున్న ఆ ఇద్దరు ఇటలీ నావికులను భారత్ లో అడుగుపెట్టిన తరువాత అరెస్ట్ చేయడం కానీ, వారికి మరణ శిక్ష విదించడం కానీ చేయరాదని ఇటలీ ప్రభుత్వం షరతులు విదించి, అందుకు భారత్ హామీ ఇచ్చిన తరువాతనే వారిని వెనక్కి తిప్పి పంపిందని ఆయనే స్వయంగా నిన్న మీడియాకు తెలిపారు. అయినా కూడా అది తమ ఘన విజయంగానే అభివర్ణించుకోవడం కాంగ్రెస్ పార్టీ నేతలకే చెల్లు.   ఇద్దరు భారతీయుల మరణానికి కారకులయిన వారిని అరెస్టు చేయడానికి కూడా వీలులేనపుడు వారిని ఏమిచేయాలని ఇటలీ ప్రభుత్వం ఆశిస్తోందో ఇటలీ పేర్కొనలేదు. వారితో ఏవిధంగా వ్యవహరించదలచకుందో భారత ప్రభుత్వం కూడా పేర్కొనలేదు.   వారిని భారత్ కి తిరిగి రప్పించడమే ఒక పెద్ద ఘన కార్యంగా భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం, ఇక ఇప్పుడు వారిరువురికీ సకల రాచమర్యాదలు చేస్తూ, ప్రభుత్వ ఖర్చులతో వారిని కొద్దిరోజులు కోర్టులు కేసులు అంటూ డిల్లీలో షికార్లు చేయించి, ఆనక ప్రతిపక్షాలు దృష్టి మరో అంశం మీదకు మళ్ళిన తరువాత వారిరువురినీ చడీచప్పుడు లేకుండా దేశం దాటించి పంపాలని ఆలోచిస్తున్నట్లు ఉంది. లేదంటే ఇటలీ ప్రభుత్వం విదించిన ఆ రెండు షరతులకు ఒప్పుకొని ఉండేది కాదని చెప్పవచ్చును.   ఒకవేళ సుప్రీం కోర్టు ప్రభుత్వం ఇటలీకి ఇచ్చిన హామీలకు విరుద్ధంగా వారిరువురినీ అరెస్ట్ చేయమని ఆదేశిస్తే అప్పుడు ప్రభుత్వం ఏమిచేస్తుంది? ఒకవేళ సుప్రీం కోర్టు వారిరువురినీ దోషులుగా తేల్చి ఇద్దరికీ శిక్షలు విదిస్తే అప్పుడు ప్రభుత్వం సుప్రీం కోర్టును అడ్డుకొంటుందా లేక ఇటలీ ప్రభుత్వానికి తానూ ఇచ్చిన హామీలను తీసి పక్కన పెడుతుందా?   భారతదేశానికి ఇటలీ రాయభారి సుప్రీం కోర్టుకు తమ ఇద్దరు నావికులను ఇటలీ నుండి వెనక్కి రప్పిస్తానని, అందుకు తానూ పూర్తి బాధ్యతా వహిస్తానని వ్రాతపూర్వకంగా ఇచ్చిన హామీని పట్టుకొని ఇటలీని నిలదీసిన భారత ప్రభుత్వం, ఇప్పుడు తానూ ఆ ప్రభుత్వానికి ఇచ్చిన హామీలను ఉల్లంఘించగలదా? లేక సుప్రీం కోర్టుకు వారిరువురి విషయంలో మార్గదర్శనం చేస్తుందా?   ఒకవేళ ప్రభుత్వ అభీష్టానికి విరుద్దంగా సుప్రీం కోర్టు తీర్పు ఇస్తే, అప్పుడు ఇటలీ దేశం అంతర్జాతీయ వేదికలపై ఇదేవిషయాన్ని పెడితే ఏర్పడే పర్యవసానాలను కేంద్ర ప్రభుత్వం ఊహించిందా? లేక ఇటలీ నావికులను భారత్ రప్పించే ప్రయత్నంలో యధాలాపంగా ఇటలీ షరతులకు బుర్ర ఊపి ఒప్పేసుకొందా? ఏమయినప్పటికీ, ఇది యుపీయే ప్రభుత్వ విజయం కాదు సరికదా దౌత్యపరంగా కూడా ఘోర వైఫల్యమేనని చెప్పక తప్పదు.   ఒక సమస్యను పరిష్కరించరించే ప్రయత్నంలో యుపీయే ప్రభుత్వం మరో పెద్ద సంక్షోభానికి తెర తీసింది. సుప్రీం కోర్టు ఆ ఇద్దరు దోషులను ప్రత్యామ్నాయ శిక్షలతో (నష్ట పరిహారం కింద కొంత డబ్బు చెల్లించడం వగైరా) సరిపెట్టి పంపేందుకు అంగీకరిస్తే మరో సంక్షోభం తప్పుతుంది. లేదంటే అంతర్జాతీయ వేదికల మీద భారత్ కు అవమానాలు, సంజాయిషీలు తప్పవు.

కెవిపికి సిబిఐ సమన్లు, జగన్ కు ఉచ్చుగా మారనున్నాయా

  షర్మిలతో సహా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అందరూ కూడా త్వరలో జగన్ మోహన్ రెడ్డి జైలు నుండి విడుదల కాబోతున్నడని ప్రకటించుకొంటున్న ఈ తరుణంలో, సీబీఐ నేడు కేవీపీ రామచంద్రరావుకి సమన్లు జారీచేయడం చర్చనీయాంశంగా మారింది.   మాజీ ముఖ్య మంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆయన తరువాత అంతటివాడుగాఒక వెలుగు వెలుగుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో చక్రం తిప్పిన ఆయన, రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం తీసుకొన్న ప్రతీ నిర్ణయంలోను ప్రమేయం ఉండేదని అందరికి తెలిసిన విషయమే. అయినప్పటికీ, ఇంతకాలంగా జగన్ అక్రమాస్తుల కేసులను, ఓబులాపురం గనుల వ్యవహారాల కేసులను చేపట్టి అనేక మందిని అరెస్ట్ చేసి కటకటాలు వెనుకకి పంపిన సీబీఐ, ఇంతకాలం కేవీపీ జోలికి మాత్రం వెళ్ళలేదు.   అయితే, ఇప్పుడు వైకాపా నేతలు తమ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి నేడో రేపో బయటకి వస్తాడని ఆశిస్తున్న తరుణంలో, సీబీఐ జగన్ అక్రమాస్తుల కేసులోనే ఆయనకు కూడా విచారణకు సమన్లు జారీ చేయడం చూస్తే, జగన్ మోహన్ రెడ్డి చుట్టూ మరింత ఉచ్చు బిగించేందుకే ఆయనను తమ ట్రంప్ కార్డుగా ఉంచుకొని ఇంతకాలం ఆయన జోలికి వెళ్ళలేదేమో? అనే సందేహం ఏర్పడుతుంది. అదే నిజమయితే, జగన్ మోహన్ రెడ్డి జైలు నుండి విడుదలకావడం సంగతి ఎలా ఉన్నా ముందు కేవీపీని లోపలి పంపకుండా సీబీఐ ఊరుకొంటుందా? అనే ప్రశ్నతల ఎత్తుతుంది.   కేవీపీ ఇటీవల కడప సహకార ఎన్నికలలోజగన్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వెంటనే డీసీసీబి అధ్యక్షపదవికి ఎన్నికలు జరిపించకపోతే ఆత్మహత్య చేసుకొంటానని బెదిరించడం చూస్తే ఆయన ఏ పార్టీ తరపున పనిచేస్తున్నాడని అందరికీ అనుమానం కలిగింది. అటువంటప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆయన మీద అనుమానం కలుగదని భావించలేము.   ప్రస్తుతం ఆయన అధికార కాంగ్రెస్ పార్టీకే అంటిపెట్టుకొని ఉన్నపటికీ, భవిష్యత్తులో, బహుశః సరిగ్గా ఎన్నికల ముందు వైయస్సార్ కాంగ్రెస్ లోకి మారే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ నమ్ముతున్నందునే ఇప్పుడు ఆయన పేరును కూడా సీబీఐ ఖాతాలో కాంగ్రెస్ చేర్పించి ఉండవచ్చును.   అయన కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలని గట్టిగా కోరుకొంటున్నవారెవరూ ఇప్పుడు పార్టీలో లేరు. కానీ, ఆయన తమ పార్టీని వీడి జగన్ పార్టీలో చేరాలని మాత్రం ఎవరూ కోరుకోవట్లేదు. అందువలన ఆయనను అటువైపు వెళ్ళకుండా చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ సీబీఐ అస్త్రాన్ని ప్రయోగించి ఉండవచ్చు కూడా.   అయితే, కేంద్ర రాష్ట్రస్థాయిలో అందరితో మంచి సంబందాలు , పలుకుబడి కలిగిన ఆయనపై సీబీఐ తన ప్రభావం చూపగలదా అని ఆలోచిస్తే, కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చినందునే సీబీఐ ఇప్పుడు ముందడుగు వేసి ఉంటుందని భావించాల్సి ఉంటుంది. అదే నిజమయితే, త్వరలోనే కేవీపీ కూడా లోపలి వెళ్ళడమే కాకుండా, జగన్ మోహన్ రెడ్డి మరి కొంత కాలం లోపలే కాలక్షేపం చేయక తప్పదు.   రేపు సీబీఐ ఆయనను ప్రశ్నించిన పద్దతిని బట్టి మిగిలిన కధ తేటతెల్లమవుతుంది అని చెప్పవచ్చును.

కర్ణాటకలో సెమీ ఫైనల్ ఆడనున్న రాహుల్ గాంధీ

  మే 5న జరుగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరుగనున్న సాధారణ ఎన్నికలకి సెమీ ఫైనల్స్ వంటివని చెప్పవచ్చును. దక్షిణాదిన ఏకైక బీజేపీ పాలిత రాష్ట్రమయిన కర్ణాటకలో రాహుల్ గాంధీ తన పార్టీని గెలిపించుకొనగలిగితే అది ఆయన సామర్ధ్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. అంతే కాకుండా అది వచ్చే సాధారణ ఎన్నికలను ఎదుర్కోవడానికి, ఆయనకు అవసరమయిన మనోబలం కూడా కలిగిస్తుంది. ఎన్నికల షెడ్యుల్ వెలువడక ముందే ఒకసారి ఆ రాష్ట్ర పర్యటన చేసి అక్కడి పరిస్థితులను ఆరా తీసివచ్చిన ఆయన, ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో సమీక్ష సమావేశాలు మొదలుపెట్టేసారు.   ఒకనాడు తిరుగులేని విధంగా ఆ రాష్ట్రాన్ని ఏలిన బీజేపీ ప్రభుత్వం, ప్రస్తుతం అవినీతి, అంతర్గత కుమ్ములాటలతో అత్యంత దయనీయమయిన పరిస్థితులలో చిక్కుకొని, కాంగ్రెస్ కొత్త రధసారధి రాహుల్ గాంధీకి అన్ని విధాల అనుకూలమయిన వాతావరణం కల్పించి ఆహ్వానిస్తోంది. రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం అందిస్తున్న ఇంత చక్కటి అవకాశం బహుశః మరెప్పుడూ, మరెక్కాడా కూడా ఆయనకి దొరకకపోవచ్చును.   కానీ, ఉత్తరాది రాష్ట్రాల ప్రజల పద్దతులు, ఆలోచన తీరు, కులాల లెక్కల గురించి అవగాహన ఉన్న రాహుల్ గాంధీకి దక్షిణాది రాష్ట్రాల మీద అంత పట్టులేదనే చెప్పవచ్చును. అయితే, అతిరధ మహారధులు తోడున్నఆయనకి ఇదేమంత పెద్ద సమస్య కాదు. కానీ, గత రెండు దశబ్దాలుగా ఆ రాష్ట్రంలో నిర్లక్ష్యం చేయబడిన కాంగ్రెస్ పార్టీని ఇంత తక్కువ సమయంలో చక్కదిద్ది, వారిలోంచి గెలుపు గుర్రాలను ఎంచుకోవడమే ఆయన ముందున్న అతి క్లిష్టమయిన సమస్య అని చెప్పవచ్చును.   కర్ణాటక రాష్ట్రంలో తన కాంగ్రెస్ పార్టీని చక్కదిద్దడమే కాకుండా రాహుల్ గాంధీకి మరో సవాలు కూడా ఎదుర్కోవలసి రావచ్చును. అది తన రాజకీయ జీవితాన్ని సవాలు చేయనున్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ నుంచి కావచ్చును. దక్షిణాదిన తనకున్న ఏకైక రాష్ట్రం కర్ణాటకను కేవలం నాయకత్వ సమస్య కారణంగా బీజేపీ అంత తేలికగా వదులుకొంటుందని భావించలేము. గనుక, రాబోయే సాధారణ ఎన్నికలను నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎదుర్కోవాలని ఆలోచిస్తున్న బీజేపీ, ఆయనను ఇప్పుడే ముందుంచుకొని కర్ణాటక ఎన్నికలలో రాహుల్ గాంధీని డ్డీ కొనవచ్చును. ఒకవేళ, బీజేపీ నరేంద్ర మోడీకి గనుక కర్ణాటక బాద్యతలు అప్పగించినట్లయితే, ఆయనను డ్డీ కొనడం రాహుల్ గాంధీకి తలకు మించిన పనే అవుతుంది.   కర్ణాటకలో ప్రస్తుతం నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు రాహుల్ గాంధీకి వరమయితే, మంచి రాజకీయ అనుభవజ్ఞుడు, పరిపాలనా దక్షుడు అనే మంచి పేరు నరేంద్ర మోడీకి సానుకూలాంశంగా ఉంటుంది. ఒకవేళ బీజేపీ తన అంతర్గత సమస్యల వలన నరేంద్ర మోడీకి కాకుండా మరెవరికి కర్ణాటక బాధ్యతలు అప్పగించినా అది రాహుల్ గాంధీకి, ఆయన పార్టీకి ఆ రాష్ట్రంలో మార్గం సుగమం చేస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చును.   ఇటీవల ఆ రాష్ట్రంలో జరిగిన పురపాలక సంఘాల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ , అధికార బీజేపీపై పూర్తి పై చేయి సాదించడమే బీజేపీ పట్ల ప్రజల వ్యతిరేఖతకు అద్దం పడుతోంది. అందువలన నరేంద్ర మోడీ తప్ప ఇతరులెవరు బీజేపీకి సారద్యం వహించినా కూడా, కర్ణాటక రాష్ట్రాన్ని పళ్ళెంలో పెట్టి కాంగ్రెస్ పార్టీకి అందించినట్లే అవుతుంది.   ఇదివరకు నితిన్ గడ్కారికి పార్టీ అధ్యక్షా పదవికి ఆఖరి నిమిషంలో గండికొట్టినట్లు, మళ్ళీ మోడీకి కూడా అడ్డుపడేందుకు కాంగ్రెస్ అధిష్టానం వద్ద ఏమయినా పధకాలు ఉంటే, కర్ణాటకలో రాహుల్ గాంధీ ప్రయాణం సజావుగా సాగిపోతుంది. లేదంటే మాత్రం ఆయనకు మోడీతో అగ్నిపరీక్ష ఎదుర్కోక తప్పదు.

The intentions behind Sadak bandh

  TRS and T-JAC seems halfway to success with their proposed sadak bandh program to be held today at Hyderabad and Bangalore highway as they receives exact reaction from the government which refused permission to it.   TRS president KCR and T-JAC Chief Prof. Kodandaram’s failure to pressurize the Congress high command in making a favorable announcement on Telangana issue even after the expiry of self-set-deadline, makes the people lost their confidence in the duo and their agitations.   Besides Nagam Janardhan Reddy’s allegations against the duo of diverting attention from Telangana agitations to elections also had its adverse effect on the people, which ultimately reflected in their big defeat in recent co-operative elections and partial defeat in MLC elections.   Hence, the duo is forced to take-upon this acid test to prove that they have not lost the confidence of their people as claimed by the Government and Congress high command and by their counterparts in Seemandhra region.   More over, UPA’s repeated provocative statements against Telangana are throwing a big challenge to KCR and Prof. Kodandaram to prove their strength in the Telangana. Hence, both these so-called-Telangana-saviors have called for sadak bandh to ignite the Telangana-fire again in the people and to revamp their lost status in the region and to ensure peoples’ support to them in the upcoming elections.   Hence, more the force used by police against their sadak bandh more the benefit and more the sympathy showers from the people. That’s why both the leaders have put their prestige at stake in facing the government and police forces with their sadak bandh.   CM Kiran Kumar Reddy is also well aware of their intentions behind sadak bandh, yet he couldn’t afford to let them take the roads as and when they plans, thus showing upper-hand over his government. Would he sit quite and let them allow blocking the most important highway, it will be considered as his government’s failure. If, he uses his forces against the protestors, then obviously they will boast themselves as war-heroes.   This is what KCR and Prof. Kodandaram exactly want to happen and so are they spearheading with sadak bandh program.

DMK’s decision makes Nitish and UPA come close

  Nitish Kumar’s latest demand for special status to his Bihar state has come as a blessing for the beleaguered UPA government, which falls into minority because of the DMK party withdrawal its support to it. Even before Nitish returns home, Congress has swiftly reacted to his appeal made to Finance Minister Chidambaram and Planning Commission vice president Mantec Ahuluwalia on yesterday. Congress has decided to form a committee to study the possibilities of granting special status to Bihar and the same is conveyed to him immediately.   Nitish Kumar acknowledging the Congress reaction has said “I am extremely happy to know that there is some progress in this direction.” The sudden change in political situation has turned the stars in Nitish favor. When, he made a rally at New Delhi on Sunday, actually he didn’t expect the UPA to act so swiftly as he too knows that the elections are one year away and hence time is not ripe for entering into any deal between the two parties. But, DMK’s decision has brings an unpredicted advantage and importance to him and his party at national level.   However, UPA government has begun its efforts to attract Nitish Kumar by earmarking huge part of the budget especially for his state Bihar. This was announced by Finance Minister Chidambaram, while submitting the budget few days ago. That attempt followed by Nitish Kumar’s latest demand for special status has now come as a blessing for UPA government, which badly need his support at a crucial time like this. As against Congress’ snail pace functioning style, it has reacted swiftly within hours of his appeal, only because of its desperate situation.

బీజేపీతో నితీష్ కుమార్ కటీఫ్?

  దేశంలో ప్రతిపక్ష పార్టీలలో నరేంద్ర మోడీ తరువాత అంతటి పేరు సంపాదించుకొన్న వ్యక్తి ఎవరంటే, బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అని చెప్పవచ్చును. వీరిద్దరూ కూడా తమ తమ రాష్ట్రాలను ప్రగతి పధంలో తీసుకు వెళ్లేందుకు చేస్తున్న కృషి కారణంగానే సుప్రసిద్దులయ్యారని చెప్పవచ్చును.   అయితే, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ నాయకత్వంలో అన్నివిధాల బ్రష్టు పట్టిన బీహార్ రాష్ట్రాన్ని చక్కదిద్దడం సాధారణ విషయం ఏమి కాదు గనుక, వీరిద్దరిలో నితీష్ కుమార్ ఎక్కువ శ్రమించవలసి ఉంటుంది. గనుక తన రాష్ట్రం త్వరితగతిన ప్రగతి సాధించాలంటే బీహార్ కు ‘ప్రత్యేక రాష్ట్ర హోదా’ అవసరమని ఆయన వాదన. తన వాదనను మరింత బలంగా వినిపించేందుకు ఆదివారం నాడు డిల్లీలో లక్షమందితో ఆయన అధికార ర్యాలీ కూడా నిర్వహించారు. అయితే, తన డిమాండ్ సాధనకు ఆయన ఎంచుకొన్న మార్గం, ఆయనకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసమా లేక బీజేపీ నేతృత్వం వహిస్తున్న ఎన్డీయేతో తెగతెంపులు చేసుకొని, కాంగ్రెస్ నేతృత్వం వహిస్తున్న యుపీయే కూటమిలో చేరెందుకా? అనే సందేహం తలఎత్తేలా చేస్తోంది.   అయన ర్యాలీలో పాల్గొన్న ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో తన రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమయితే కూటములకు అతీతంగా ఏ ప్రభుత్వానికయినా మద్దతు ఇచ్చేందుకు తానూ సిద్ధం అని ప్రకటించడం గమనిస్తే ఆయన యుపీయే కూటమిలో చేరేందుకు సిద్ధం అని కాంగ్రెస్ పార్టీకి సంకేతాలు పంపినట్లు అర్ధం అవుతోంది. ఆయన తన ర్యాలీకి బీజేపీని ఆహ్వానించకపోవడం, అభివృద్ధి అంటే ప్రభుత్వాన్ని ఒక వ్యక్తిగత సంస్థగా మార్చడం కాదని గుజరాత్ ముఖ్యమంత్రి మోడీపై పరోక్షంగా విమర్శలు చేయడం కూడా అదే సూచిస్తోంది.   నితీష్ కుమార్ ప్రస్తుతం ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్నపటికీ, ఆయన వ్యతిరేఖిస్తున్న నరేంద్ర మోడీని బీజేపీ తన ప్రధాని అభ్యర్ధిగా ప్రతిపాదించడమే ఆయనను ఎన్డీయే నుండి బయటకి వెళ్లేందుకు కారణమవుతోందని చెప్పవచ్చును. అంతేకాక మరో బలమయిన కారణం కూడా ఉంది. నితీష్ కుమార్ తానూ ప్రధాని పదవికి అనర్హుడిని స్వయంగా చెప్పుకొంటున్నపటికీ, ఒకవేళ బీజేపీలో అంతర్గత పోటీ గనుక ఏర్పడినట్లయితే, అప్పుడు అందరికీ ఆమోద యోగ్యుడయినా వ్యక్తిగా తానూ ఆ పదవిని దక్కించుకోవచ్చుననే ఆలోచన ఆయనకుందనేది బహిరంగ రహస్యమే.   అయితే, బీజేపీ అనూహ్యంగా మోడీని ముందుకు తీసుకు రావడంతో ఆయనకు నిరాశ తప్పలేదు. అందువల్లే ఆయన నరేంద్ర మోడీ ప్రధాని పదవికి అభ్యర్ధిత్వాన్ని మొదట నుండి వ్యతిరేఖిస్తున్నారు. గుజరాత్ రాష్ట్రంలో 2002 సం.లో మోడీ అధ్వర్యంలో జరిగిన మారణఖాండ కూడా ఆయనను వ్యతిరేఖించడానికి మరో కారణంగా చెప్పవచ్చును.   ఒకవేళ బీజేపీ మోడీని కాకుండా మరొకరిని ఎవరినయినా తన ప్రదాని అభ్యర్ధిగా ప్రతిపాదించి ఉంటే బహుశః ఆయన ఎన్డీయే కూటమిని వీడే ఆలోచన చేసేవారు కారేమో. అయితే, 2014సం.ల ఎన్నికలలో ఎలాగయినా సరే కేంద్రంలో అధికారం చేజిక్కించుకోవాలని పట్టుదలగా ఉన్న బీజేపీ, దేశవ్యాప్తంగా కాకపోయినా ఉత్తరాది రాష్ట్రాలలో మంచి సమర్దుడయిన ముఖ్యమంత్రిగా పేరు సంపాదించిన నరేంద్ర మోడీని కాదనుకొని వేరొకరిని తన రధసారధిగా చేసుకొని రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదు. కనుక మోడీనే తమ ప్రధాని అభ్యర్దని దాదాపు ఖాయం చేసుకోవడంతో నితీష్ కుమార్ కు ప్రత్యామ్నాయం చూసుకోక తప్పలేదు.   బీజేపీ కూడా నితీష్ కుమార్ తమ కూటమి నుండి బయటకి వెళ్లిపోయినట్లయితే, వచ్చే ఎన్నికలలో బీహార్ రాష్ట్రంలో ఆయనకి వ్యతిరేఖంగా పోటీకి సిద్ధం అని ప్రకటించడంతో, ఇక వారిరువురు మద్య ‘శాస్త్రోక్తంగా విడాకులు’ తీసుకోవడమొకటే మిగిలి పోయిందని చెప్పవచ్చును.   అయితే, నితీష్ కుమార్ ఎన్డీయేను వీడి యుపీయే ‘హస్తం’ గనుక అందుకొంటే ఇక ఆయన జీవిత కాలంలో దేశానికి ప్రధాని అయ్యే ఆలోచన కూడా మానుకోవచ్చును. ఎందుకంటే యుపీయేలో ఆ పదవి శాశ్వితంగా సోనియా గాంధీ కుటుంబానికే రిజర్వు చేయబడింది గనుక. అందువల్ల నితీష్ కుమార్ కేవలం తన రాష్ట్ర ప్రగతిని మాత్రమే గనుక కోరుకొంటే నిరభ్యంతరంగా ఆయన యుపీయే హస్తం అందుకోవచ్చును. కానీ, ప్రధాని పదవిపై ఆశలుంటే మాత్రం ఆయన ఎన్డీయే కూటమికే అంటిపెట్టుకొని ఉండటం మేలు. తద్వారా ఇవాళ్ళ కాకపోయినా రేపయినా ఆయనకు ఆ అవకాశం దక్కవచ్చును.   ఏది ఏమయినప్పటికీ, ఎన్డీయే కూటమిని వీడటం వలన నితీష్ కుమార్ కు కొత్తగా వచ్చే నష్టం లేకపోయినప్పటికీ, అటువంటి సమర్ధుడు ప్రజాకర్షక నాయకుడినీ, ఆయన పార్టీ మద్దతునీ కోల్పోవడం ఎన్డీయే కూటమికి, దానికి నాయకత్వం వహిస్తున్న బీజేపీకె తీవ్ర నష్టం కలిగిస్తుందని చెప్పవచ్చును.

నిర్భయ పేరును మనం దురుపయోగం చేస్తున్నామా?

  మూడు నెలల క్రితం డిల్లీలో జరిగిన సామూహిక అత్యాచార ఉదంతం తరువాత దేశం యావత్తు స్పందించడం, దానికి కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందిస్తూ, త్వరితగతిన కేసును విచారణ పూర్తి చేసి నిందితులకు శిక్షించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పరచడమే కాకుండా, జస్టిస్ వర్మ కమిటీని వేయడం, ఆ కమిటీ కూడా విస్తృత అధ్యయనం చేసి కేవలం నెలరోజుల్లోనే తన రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించడం జరిగాయి. కేంద్రప్రభుత్వం కూడా వెంటనే స్పందిస్తూ వర్మ కమిటీ చేసిన సిఫార్సులలో కొన్నిటిని స్వీకరించి, మరికొన్నిటికి సవరణలతో త్వరలో పార్లమెంటులో బిల్లు పెట్టేందుకు తీవ్ర కృషిచేయడం అభినందనీయమే.   కానీ, డిల్లీ ఉదంతం తరువాత మహిళలపై లైంగిక దాడులకు పాల్పడితే తీవ్ర శిక్షలు ఉంటాయని స్పష్టం అయినప్పటికీ, మన దేశంలో ఏదో ఒక ప్రాంతంలో నాటి నుండి నేటి వరకూ మహిళలపై అదే తరహ అత్యాచారాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. పైగా అవి ఇదివరకు కంటే ఎక్కువవడం చాలా ఆందోళనకరంగా మారాయి.   ‘అతిధి దేవో భవా’ అనే ఒక గొప్ప ఆలోచనకి, సంస్కృతికి మూలమయిన మన భారతదేశంలోనే మొన్న స్విట్జర్లాండ్ దేశానికి చెందిన ఒక విదేశీ పర్యాటకురాలిపై మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సామూహిక అత్యాచారం జరగడం మనల్ని ప్రపంచదేశాల ముందు తలదించుకోనేలా చేసింది. మళ్ళీ అదే రాష్ట్రంలో గల ఇండోర్ నగరంలో మొన్న శుక్రవారం నాడు బస్సులో ప్రయాణిస్తున్న ఒక నిస్సహాయ మహిళపై మరో సామూహిక అత్యాచారం జరగడం దేశంలో మహిళలకు భద్రత లేదని నిరూపించడమే కాకుండా, మహిళల పట్ల పురుష సమాజపు ఆలోచనలలో కూడా ఎటువంటి మార్పు రాలేదని, అది అంత త్వరగా రాదని కూడా నిరూపించాయి.   ‘ఎక్కడ మహిళలు గౌరవింపబడుతారో అక్కడ దేవతలు నివసిస్తారు’ అని ‘స్త్రీలను గౌరవించడం మన సంస్కృతి’ అని ‘కలకంటి కన్నీరు ఇంటికీ, సమాజానికి అరిష్టం’ అనే గొప్ప విశ్వాసాలు గల మన దేశంలోనే ఇటువంటి సంఘటనలు జరుగుతుండటం మన దేశానికి మన సంస్కృతికీ కూడా చాల అవమానం.   ప్రజలు సినిమాలలో మంచికి బదులుగా చెడునే స్వీకరించినట్లుగానే, డిల్లీ ఉదంతం తరువాత సమాజంలో ఆ తరహా సంఘటనలు పునరావృతమవడం గమనిస్తే, ఆ సంఘటన కొందరికి ప్రేరణ కలిగించినట్లు అర్ధం అవుతోంది.   మానసిక శాస్త్ర నిపుణులు ఇటువంటివి ఒక అంటురోగం (సామాజిక మానియా) వంటివని అభిప్రాయపడుతున్నారు. మంచికీ చెడుకీ కూడా సమాజం ఈ మానియాకు లోనవుతుందని తెలిపారు. అటువంటప్పుడు బాధ్యతా కలిగిన ప్రభుత్వాలు, ప్రజలు, మీడియా, ప్రజా సంస్థలు, స్వచ్చంద సంస్థలు అన్నీకూడా చేతులు కలిపి ఒక మంచి భావనలను సమాజంలోకి చొచ్చుకుపొయేలా చేయవలసి ఉండగా, మన ప్రభుత్వాలు డిల్లీలో ఘోర అకృత్యానికి బలైన బాధితురాలిని వీర నారీమణిగా అభివర్ణిస్తూ ఆమె పేరిట పధకాలు, అవార్డులు, చివరికి రైళ్లకు కూడా ‘నిర్భయ ఎక్స్ ప్రెస్’ వంటి పేర్లు కూడా పెడుతూ ఒక ఘోర అకృత్యాన్ని శాస్వితంగా మన కళ్ళ ముందు ఉంచే ప్రయత్నం చేయడం దురదృష్టం.   అటువంటి సంఘటనల నుండి పాఠాలు నేర్చుకొని, మళ్ళీ అటువంటి సంఘటనలు దేశంలో మరెక్కడా పునారావృతం కాకుండా ఉండేందుకు సమాజంలో తేవలసిన మార్పులను గురించి, మహిళల పట్ల పురుష సమాజం ఆలోచనల్లో తేవలసిన మార్పుల గురించి, మహిళల భద్రతకు దేశంలో చేప్పట్టవలసిన చర్యల గురించి అవసరమయిన ప్రక్రియలను సమాజంలోకి వ్యాపింప జేయవలసిన ప్రభుత్వాలు, తద్వ్యతిరేఖపు ఆలోచనలును తన చర్యల ద్వారా సమాజంలోకి చొప్పిస్తున్నట్లు కనిపిస్తోంది.   మన దేశంలో జరిగిన ఈ ఘోర అక్రుత్యంపై యావత్ ప్రపంచమూ కూడా తనదైన శైలిలో స్పందించడం ఇంకా మానవత్వం మిగిలే ఉందని నిరూపిస్తోంది. అయితే, ఇటీవలే అమెరికా ‘మహిళా దినోత్సవం’ సందర్భంగా మన దేశానికి ‘నిర్భయ అవార్డు’ను కూడా ప్రకటించడం, ప్రభుత్వం తో సహా అనేక మంది చాలా సంతోషపడ్డారు. అయితే, మనం ఏదో ఒక ఘనకార్యం చేసినందుకు ఆ అవార్డు రాలేదు. ఒక ఘనమయిన సంస్కృతీ, సంప్రదాయాలకు పెట్టింది పేరయిన మనదేశం ప్రపంచదేశాల మద్య సిగ్గుతో తలదించుకొనేలా జరిగిన ఒకానొక సంఘటనకు ఇచ్చిన అవార్డు అది అని మనం గ్రహించగలిగితే అది మనకి అవార్డు కాదు అమెరికా కొట్టిన చెప్పు దెబ్బ అని మనకి అర్ధం అవుతుంది.   ఒకప్పుడు ఎక్కడో మారు మూల గ్రామాలలో జరిగే ఇటువంటి అకృత్యాలు, నేడు దేశ, రాష్ట్ర రాజధానులలో జరగుతుండటం వలన ఇది ప్రపంచ దృష్టిని ఆకర్షించగలుగుతోంది. అన్ని రంగాలలో ముందడుగు వేస్తున్న మహిళలకు ముఖ్యంగా పెద్దపెద్దనగరాలలో ఉన్నత విద్యలు , ఉద్యోగాలకు వస్తున్న మహిళలకు ఊహించని ఈ పరిణామాలు కలవరం కలిగించడమే కాకుండా, వారి అభ్యున్నతికీ ప్రతిబందకంగా మారుతున్నాయి. క్రమంగా ఒక అంటు రోగంలా దేశమంతా వ్యాపిస్తున్న ఈ సమస్యని ఇక ఎంత మాత్రం ఉపేక్షించ వలసిన విషయం కాదు. ఉపేక్షించడం అంటే పక్కవారి ఇంటికి మంట అంటుకొంటే మనం ఉపేక్షిస్తే ఏమవుతుందో అదే జరుగవచ్చును.   గుజరాత్ వంటి రాష్ట్రాలు అమితాబ్ బచ్చన్ వంటి ప్రముఖుడిని తన బ్రాండ్ ఎంబాసిడరుగా నియమించుకొంటే, మన భారత ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చుచేసి విదేశాలలో ప్రకటనలు ఇస్తూ విదేశీ పర్యాటకులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి. తత్ఫలితంగా అనేకమంది విదేశీ పర్యాటకులు మన దేశంలో పర్యటించేందుకు వస్తున్నారు కూడా. అయితే, విదేశీయులను ఆకర్షించడానికి చేసే కృషిలో, చేసే ఖర్చులో, చూపే శ్రద్ధలో కనీసం పదోవంతు కూడా (విదేశీ) మహిళల భద్రతపైనా చూపకపోవడం గర్హించాల్సిన విషయం. ముందుగా మహిళల పట్ల మన పురుష సమాజం ఆలోచనలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నాలు చేయడం, దేశంలో మహిళలకు భద్రత కల్పించడం, మన దేశంలో పర్యటించేందుకు వస్తున్న విదేశీ (మహిళల) యుల రక్షణకు తగిన ఏర్పాట్లతో బాటు, వారికి తగిన భరోసా కలిగించడం వంటి చర్యలు చేపడితే అది మనకు మేలు కలిగిస్తుంది తప్ప ఏదో ఒక ఘనకార్యం చేసినట్లు ‘నిర్భయ’ పేరును వాడుకోవడం వల్ల సమాజం మీద మంచి కంటే చెడు ప్రభావమే ఎక్కువ ఉంటుందని జరుగుతున్న సంఘటనలు నిరూపిస్తున్నాయి. ఇకనయినా, ప్రజలు, ప్రభుత్వాలు, పోలీసులు, స్వచ్చంద సంస్థలు, మేధావులు మేల్కొని ఈ దిశలో వెంటనే ప్రయత్నాలు చేయడం చాల మంచిది.