మద్యం మత్తులో వాహనాలు నడిపే వారు టెర్రరిస్టులు : సీపీ సజ్జనార్

  కర్నూలు బస్సు ప్రమాదం తీవ్ర సంచ లనం సృష్టించిన విషయం తెలిసిందే.... ఓ ద్విచక్ర వాహన దారుడు మద్యం మత్తులో చేసిన తప్పు... ఎంతో మంది ప్రాణా లను బలితీసుకుంది. ఎన్నో కుటుంబాల్లో చీకట్లో నింపింది. ఈ ఘట నపై పోలీసులు దర్యాప్తు కొనసా గించగా... కర్నూలు జిల్లాకు చెందిన శివశంకర్ అనే యువకుడు తన స్నేహితుడితో కలిసి తెల్లవారు జామున 2:24 గంటల ప్రాంతంలో పెట్రోల్ కోసం ఓ పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లి నట్లుగా సీసీటీవీ ఫుటేజ్ లభించింది.  అనంతరం శివ శంకర్ మద్యం మత్తులో బైక్ స్పీడ్ గా నడుపుతూ తన స్నేహితుడిని ఇంటి దగ్గర దింపేందుకు బయలుదేరాడు. అదే సమయంలో బైక్ ఒక్కసారిగా అదుపుతప్పి అత్యంత వేగంగా వెళ్లి డివైడర్ను ఢీకొట్టడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో శివశంకర్ అక్కడి కక్కడే మృతి చెందాడు. శివశంకర్ స్నేహితుడికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు మీద పడి ఉన్న బైకును శివ శంకర్ మిత్రుడు తీసేందుకు ప్రయత్నిం చాడు. కానీ బైక్ మీద నుంచి వేమూరి కావేరి ప్రైవేట్ ట్రావెల్ బస్సు వెళ్లడంతో ఈ అగ్ని ప్రమాదం జరిగి నట్లుగా దర్యాప్తులో తేలింది.  అయితే ఈ ఘటనపై స్పందిం చిన హైదరాబాద్ సిపి వీసీ సజ్జనార్ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారు టెర్రరిస్టులు, మానవ బాంబులు అంటూ ఎక్స్ లో ట్వీట్ చేశారు....ఒక్కరి నిర్లక్ష్యం.. 20 మందిని ప్రాణాలను బలితీసుకుంది. మద్యం మత్తులో వాహనాలతో రోడ్డుపైకి వచ్చి అమాయకుల ప్రాణాలను పొట్టనబెట్టుకునే వాళ్లు టెర్రరిస్టులు, మానవ బాంబులు కాక ఇంకేమవు తారు.. చెప్పండి!! అంటూ ప్రశ్నించారు. వాళ్ళు చేసిన ఈ తప్పిదం వల్ల ఎన్ని కుటుంబాలు మానసిక క్షోభను అనుభవిస్తున్నాయి. మీ సరదా, జల్సా కోసం ఇతరుల ప్రాణాలను తీసే హక్కు మీకు ఎవరిచ్చారు!? అంటూ హైదరా బాద్ సీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు...సమాజంలో మన చుట్టే తిరిగే ఇలాంటి టెర్రరిస్టులు,మానవ బాంబుల పట్ల ప్రతి ఒక్కరు జాగ్రతగా ఉండండి.  వీరి కదలికలపై అనుమానం వచ్చిన వెంటనే డయల్ 100 కి గానీ, స్థానిక పోలీసులకు గానీ సమాచారం ఇవ్వండంటూ సిపి సూచించారు. చూస్తూ చూస్తూ వాళ్ళను ఇలాగే వదిలేస్తే రోడ్డు మీద కు వచ్చి ఎంతో మందిని చంపే స్తారు. వారిని మాకెందుకులే అని వదిలేస్తే చాలా ప్రాణ నష్టం జరుగు తుందంటూ  హైదరాబాద్ సీపీ సజ్జనార్ ట్వీట్ చేశారు.  

పోలీసుల త్యాగాల స్ఫూర్తిగా రక్తదాన శిబిరం : ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

  సమాజ రక్షణలో ప్రాణాలర్పించిన పోలీసు అమర వీరులకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి  ఘన నివాళులు అర్పించారు. పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని కోవూరు పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొని శాంతి భద్రతల రక్షణలో అశువులు బాసిన పోలీసుల త్యాగాలను కొనియాడారు.   ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి  మాట్లాడుతూ ఒక యూనిట్ రక్తంతో ముగ్గురి ప్రాణాలను రక్షించగలమనే సత్యాన్ని మనందరం గుర్తుంచుకోవాలన్నారు. రక్తదానం చేసేందుకు కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా ముందుకు వచ్చిన యువతను ఆమె అభినందించారు. పోలీసు అమర వీరుల సంస్మరణార్ధం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.  రక్తదానం చేస్తున్న ప్రతి రక్తదాత ఒక ప్రాణదాతగా ఆమె అభివర్ణించారు. రక్తదానం అనేది యాక్సిడెంట్, ప్రసూతి లాంటి సందర్భాలలో ఎక్కడో ఆసుపత్రిలో ప్రాణాపాయ పరిస్థితిలో వున్న వ్యక్తికి ప్రాణం పొసే మహత్తర కార్యమన్నారు. సేవా భావంతో రక్తదానం చేస్తున్న రక్తదాతలు మరెందరికో ప్రేరణ కావాలని  ప్రశాంతి రెడ్డి ఆకాంశించారు.  ఈ కార్యక్రమంలో నెల్లూరు రూమర్ డిఎస్పి ఘట్టమనేని శ్రీనివాసరావు, కోవూరు, కొడవలూరు, బుచ్చిరెడ్డి పాళెం సర్కిల్ సి ఐ లు సుధాకర్ రెడ్డి, సురేంద్రబాబు, శ్రీనివాసులు రెడ్డితో పాటు కోవూరు నియోజకవర్గ పరిధిలోని 5 పోలీస్ స్టేషన్ల సిబ్బంది మరియి పెన్నాడెల్టా ఛైర్మెన్ జెట్టి రాజగోపాలరెడ్డి, కోవూరు మండల టిడిపి అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, టిడిపి సీనియర్ నాయకులు ఇంతా మల్లారెడ్డి, జెట్టి మదన్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

స్నేహితుడు శివశంకర్‌పై ఎర్రిస్వామి పోలీసులకు ఫిర్యాదు

  కర్నూల్ బస్సు ప్రమాదంలో మరణించిన బైకర్  శివశంకర్‌పై అతని స్నేహితుడు ఎర్రిస్వామి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. శివశంకర్ నిర్లక్ష్యం వల్లే బైక్ డివైడర్‌ను ఢీకొట్టి, రోడ్డు మీద పడిందని ఫిర్యాదులో ఎర్రిస్వామి తెలిపాడు. రోడ్డు మీద పడ్డ బైక్‌ను ఒక వాహనం ఢీకొట్టడంతో నడిరోడ్డు పైకి వచ్చిందని, దానిపై నుండి బస్సు వెళ్ళడంతో మంటలు చెలరేగాయని ఎర్రిస్వామి పేర్కొన్నారు.  శివశంకర్‌ డెడ్ బాడీని పక్కకు తీసేందుకు ప్రయత్నించాను. మా బైక్‌ను మరో వాహనం ఢీకొట్టడంతో అది రోడ్డు మధ్యలో పడింది. దీంతో వేమురి కావేరి బస్సు ట్రావెల్స్ లాక్కుళ్లింది అని తెలిపారు. దీంతో బస్సుల్లో మంటలు చేలరేగి ప్రమాదం జరిగిందని ఎర్రిస్వామి వివరించాడు

ఈ తాగుబోతుల వ‌ల్ల‌...కుటుంబాల‌కు కుటుంబాలు బ‌లి

  నాణ్య‌మైన మ‌ద్య‌మో, న‌కిలీ మ‌ద్య‌మో.. అర్ధ‌రాత్రి పూట శివ‌శంక‌ర్, ఎర్రిస్వామి వంటి కొంద‌రు ఆక‌తాయి యువ‌కులు త‌ప్ప తాగి బ‌లాదూర్ తిర‌గ‌డం వ‌ల్ల వారి ప్రాణాల మీద‌కు రావ‌డం మాత్ర‌మే కాకుండా, కొన్ని కుటుంబాల‌కు కుటుంబాలు బలై పోయిన దృశ్యం క‌నిపించింది క‌ర్నూలు ఘ‌ట‌న‌లో. వీరిద్ద‌రికీ ఆ రోడ్ల మీద అర్ధ‌రాత్రి ప‌నేంటి? అంత తాగి ప‌ల్స‌ర్ వంటి బండి న‌డ‌ప‌డానికి మ‌న‌సెలా ఒప్పింది? అయినా ఇలాంటి వాళ్లు రోడ్ల‌పై ఇంతగా తిరుగుతోంటే హైవే నైట్ పెట్రోలింగ్ ఏమైంది? టోల్ గేట్లు పెట్టి కోట్లు దండుకుంటున్న ఏజెన్సీలు ఇలాంటి వాళ్లు హైవేల‌పై ఇంత‌టి నేరాలు- ఘోరాల‌కు పాల్ప‌డుతుంటే.. నిఘా ఎక్క‌డా? అన్న‌దొక ప్ర‌శ్నా ప‌రంప‌ర‌గా మారింది. మాములుగా ట్రైన్ ట్రాకింగ్ సిస్ట‌మ్ లో ఎవ‌రైతే ప్ర‌మాదానికి కార‌ణ‌మ‌య్యేలా ట్రాక్ పైకి వ‌చ్చి యాక్సిడెంట్ల‌కు కార‌కుల‌వుతారో.. వారిదే నేరంగా ప‌రిగ‌ణిస్తుంది రైల్వే యాక్ట్. స‌రిగ్గా అదే రూలు ఇక్క‌డా వ‌ర్తింప చేయాలి. ఈ నేరంలో శివ‌శంక‌ర్ లేకుంటే, అత‌డి కుటుంబాన్ని బాధ్యుల‌ను చేయాలి. ఇక ఎర్రిస్వామికి కూడా పెద్ద ఎత్తున క‌ఠిన శిక్ష వేయాలి. ఎందుకంటే అత‌డు మొద‌ట త‌న స్నేహితుడి ప‌రిస్థితేమిటో చూడ‌కుండా ఎలాగోలా చేసి బండిని ప‌క్క‌కు లాగి ఉండాలి. ఆ టైంలో త‌న‌కు అది వీలు కాని ప‌క్షంలో వెంట‌నే అటు వైపు వెళ్ల వాహ‌నాల‌ను సిగ్న‌ళ్లు ఇచ్చి ఉండాలి.. ఇక్క‌డ బైక్ ప‌డి ఉంది.. ద‌య చేసి దూరంగా వెళ్లండ‌ని చేతులు ఊపి ఉండాల్సింది.  దారిన పోయే వాహ‌న‌దారుల్లో ఎవ‌రో ఒక‌రు అది చూసి ఆగి బండి ప‌క్క‌కు తీయ‌డానికి స్కోపుండేది. అత‌డి నిర్ల‌క్ష్యం కార‌ణంగా కుటుంబాల‌కు కుటుంబాలు బుగ్గి పాలు అయిపోయాయి.ఏది ఏమైనా హైవే పెట్రోలింగ్ స‌రిగా లేని విధానికిదో ప‌రాకాష్ట‌. ఆపై టోల్ గేట్లు డ‌బ్బు దండుకోడానికి త‌ప్ప ఎందుకూ ప‌నికి రావ‌డం లేద‌ని చెప్ప‌డానికిదో నిద‌ర్శ‌నం. మ‌రి మీరేమంటారు???

రేబిస్ వ్యాధి సోకి బాలిక మృతి

  వీధి కుక్క కరవడంతో రేబిస్ వ్యాధి సోకి 10 ఏళ్ల బాలిక మృతి చెందింది. నిజామాబాద్ జిల్లా బాల్కొండకు చెందిన లక్షణ అనే బాలికను నెల రోజుల క్రితం కరిచిన వీధి కుక్క కరిచింది. ఈ విషయాన్ని బాలిక ఇంట్లో చెప్పలేదు. మూడు రోజుల క్రితం ఆమె  వింతగా ప్రవర్తించడంతో ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. రేబిస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ లక్షణ మృతి చెందింది. మున్సిపాలిటిలో వీధి కుక్కల నిర్మూలనకు అధికారుల చర్యలు నామమాత్రంగా ఉన్నాయి. నిత్యం ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు అందిన మున్సిపల్‌ అధికారులు మాత్రం వీధి కుక్కల బెడద నుంచి ప్రజలను కాపాడలేకపోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎప్పుడో ఒక్కసారి వీధి కుక్కలను పట్టుకోని పోయి అనంతరం చేతులు దులుపుకోవడం మున్సిపల్‌ అధికారుల వంతుగా మారిందనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా మున్సిపల్‌ అధికారులు వీధి కుక్కల స్వైర విహారంపై స్పందించి నివారణకు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరతున్నారు.  

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల నిత్యం భక్తులతో కిటకిట లాడు తుంటుంది. తిరుమలేశుని దర్శనానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి కూడా భక్తులు తరలి వస్తుంటారు.ఆదివారం (అక్టోబర్ 26) తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వైకుంఠం కాంప్లెక్స్ లో 21 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి.  టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక శనివారం (అక్టోబర్ 25) శ్రీవారిని మొత్తం82 వేల  10  మంది దర్శించుకున్నారు. వారిలో 29,634 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 58 లక్షల రూపాయలు వచ్చింది. 

లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన సూపర్ సక్సెస్

ఏపీ ఐటీ, మానవ వనరులు, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్   ఏడు రోజుల ఆస్ట్రేలియా పర్యటన విజయవంతమైంది. ఏడు రోజుల పాటు నాలుగు నగరాలలో సాగిన ఈ పర్యటన ఫలవంతమైంది.  త్వరలోనే కీలక భాగస్వామ్యాలు కుదరనున్నాయి. ఈ విషయాన్ని నారా లోకేష్ స్వయంగా పేర్కొన్నారు. తన ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగిరానున్న నేపథ్యంలో ఆయన తన పర్యటన విషయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ పర్యటన ద్వారా తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నాననీ, అలాగే పలు సంస్థలతో తాను జరిపిన చర్చలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా ఫలవంతంగా సాగాయని లోకేష్ పేర్కొన్నారు.  ఈ ఏడు రోజుల ఆస్ట్రేలియా పర్యటనలో యూనివర్సిటీలు,  ప్రముఖ పరిశ్రమలు, ఇండియా-ఆస్ట్రేలియా కౌన్సిళ్లు, సీఫుడ్ వాణిజ్య సంస్థలు, క్రీడా సముదాయాల ప్రతినిధులతో సమావేశమయ్యానని పేర్కొన్న లోకేష్..  ఈ భేటీలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2.4 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలన్న తమ ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకోవడానికి దోహదం చేస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. తన ఈ పర్యటనలో క్రీడారంగానికి ఉన్న ఆర్థిక ప్రాధాన్యతను  గుర్తించినట్లు లోకేశ్ తెలిపారు. క్రీడలను కేవలం వినోదంగానే కాకుండా, బలమైన ఆర్థిక కార్యకలాపాలుగా మార్చడంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని గుర్తించినట్లు వివరించారు.  తన ఏడు రోజుల పర్యటనలో బాగంగా ఆస్ట్రేలియాలో జరిపిన చర్చలు త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌కు అర్థవంతమైన భాగస్వామ్యాలుగా మారతాయనే పూర్తి విశ్వాసంతో తిరిగి వస్తున్నానని లోకేశ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టులో పేర్కొన్నారు.  

సార్.. ఇప్పుడు జిల్లా పర్యటన వద్దు.. డిప్యూటీసీఎంకు కలెక్టర్ సూచన

బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాన్ కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనావేసింది. తీవ్ర తుపానుగా రూపాంతరం చెందిన మొంథా మంగళవారం నాటికి కాకినాడ సమీపంలో తీరాన్ని తాకే అవకాశం ఉ:దన్న హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శనివారం (అక్టోబర్ 25) జిల్లా కలెక్టర్ తో టెలీకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఎట్టి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు జిల్లాయంత్రాంగాన్ని సన్నద్ధం చేయాలని   ఉండాలని దిశానిర్దేశం చేశారు.   కాకినాడ జిల్లాలో సముద్ర తీరం ఉన్న తుని, పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్ నియోజక వర్గాలతోపాటు తాళ్ళరేవు మండలంపైనా తుపాన్ ప్రభావం ఎక్కువగా ఉండబోతుందన్న అంచనాల నేపథ్యంలో  తుపానుపై ప్రజలను అప్రమత్తం చేయాలనీ, . జిల్లావ్యాప్తంగా తీరం వెంబడి ఉన్న గ్రామాల ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలనీ, అలాగే తుపాను షెల్టర్లలో ఆహారం, ఔషధాలు, పాలు లాంటివన్నీ అందుబాటులో ఉంచాలని పవన్ ఈ సందర్భంగా సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరికలకు  అనుగుణంగా అన్ని విభాగాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. రెవెన్యూ, వ్యవసాయ, నీటిపారుదల, పోలీస్, అగ్నిమాపక శాఖలతోపాటు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలను సిద్ధంగా ఉంచుకోవాలనీ, అదే విధంగా ఉప్పాడ సమీపంలో తీరం కోతకు గురయ్యే ప్రాంతంలో తగు జాగ్రత్తలు తీసుకోవాని పవన్ కల్యాణ్ సూచించారు. తుపాను సహాయక చర్యల పర్యవేక్షణకు జల్లా పర్యటనకు వస్తానని పవన్ కల్యాణ్ అన్నారు. దీంతో జిల్లా కలెక్టర్ సున్నితంగా వారించారు. తీవ్ర తుపాను నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అంతా  సహాయక చర్యలకు సన్నద్ధమయ్యే పనిలో నిమగ్నమై ఉంటుందనీ, ఈ పరిస్థితులలో జిల్లా పర్యటన వద్దని కోరారు. దీంతో పవన్ కల్యాణ్ పర్యటన ఉద్దేశాన్ని విరమించుకున్నారు.  

ఆత్మరక్షణలో భాగంగానే డీసీపీ కాల్పులు జరిపారు : వీసీ సజ్జనార్

  చాదర్‌ఘాట్  విక్టోరియా గ్రౌండ్‌ కాల్పులు సంఘటనా స్థలాన్ని పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్ పరిశీలించారు. ఆత్మరక్షణలో భాగంగానే డీసీపీ కాల్పులు జరిపారని తెలిపారు. సాయంత్రం 5 గంటల సమయంలో రౌడీషీటర్‌ మహ్మద్‌ ఉమర్‌ అన్సారీ, అతని సహచరుడు స్నాచింగ్‌ చేస్తుండగా డీసీపీ చైతన్య పట్టుకునేందుకు ప్రయత్నించారని వివరించారు.  ఉమర్‌ అన్సారీపై 20కి పైగా కేసులు ఉన్నాయని, కాలాపత్తర్‌ పోలీస్‌ స్టేషన్‌లో రౌడీషీట్‌ ఓపెన్‌ అయి ఉందని తెలిపారు. అతనిపై రెండు పీడీ యాక్ట్‌ కేసులు నమోదు అయ్యాయని, రెండేళ్లు జైల్లో ఉన్నాడని వెల్లడించారు. దొంగను పట్టుకునే ప్రయత్నంలో డీసీపీ సిబ్బంది గన్‌మెన్‌పై ఉమర్‌ కత్తితో దాడి చేశాడని, ఆపదలో డీసీపీ చైతన్య రెండు రౌండ్లు కాల్పులు జరిపారని చెప్పారు. దాంతో ఉమర్‌ చేతి, కడుపు భాగాల్లో గాయాలయ్యాయని తెలిపారు. గాయపడిన దొంగను మలక్‌పేట యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. పరారీలో ఉన్న మరో దొంగ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనలో డీసీపీ చైతన్యకు స్వల్ప అస్వస్థత కలిగిందని, గాయపడిన ఇద్దరు కానిస్టేబుళ్లు క్షేమంగా ఉన్నారని సజ్జనార్‌ వెల్లడించారు.మొత్తం ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని, ఉమర్‌ అన్సారీ నేరచరిత్రతో పాటు అతనికి సహకరిస్తున్న వారిని గుర్తిస్తామని తెలిపారు. నగరంలో రౌడీలు, స్నాచర్లపై ఉక్కుపాదం మోపుతామని సజ్జనార్‌ హెచ్చరించారు   

జగన్‌‌లో ఏదో తేడా కనిపిస్తోంది...వెంటనే ట్రీట్మెంట్ అవసరం : సోమిరెడ్డి

  టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ సీఎం జగన్‌పై మండిపడ్డారు. నెల్లూరులో మాట్లాడిన ఆయన, జగన్ ప్రవర్తనలో ఏదో తేడా స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు “ఒకప్పుడు నందమూరి బాలకృష్ణ అభిమానిగా ఆయన బ్యానర్లు, ఫ్లెక్సీలు మోసినోడు. ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చుని విచిత్రంగా వ్యవహరిస్తున్నాడు. దమ్ముంటే అసెంబ్లీకి రావాలి, కానీ ఆ దమ్ము లేదు. తాడేపల్లిలో కూర్చుని నోటికొచ్చినట్లు మాట్లాడుతాడు,” అని సోమిరెడ్డి విమర్శించారు. జగన్‌పై మరింత సూటిగా విమర్శిస్తూ, ఆయన మాట్లాడుతూ  “దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా 2.30 గంటలు ఆపకుండా అబద్ధాలు మాట్లాడిన రాజకీయ నాయకుడు ఇంకెవరూ ఉండరేమో. పబ్లిక్ మీటింగుల్లో గంటపాటు స్పీచ్ ఇచ్చే వారిని చూశాం కానీ ఇంత సేపు ప్రెస్ మీట్ పెట్టేవారిని ఎప్పుడూ చూడలేదు. శాసన సభలో అరగంట కూడా కూర్చోలేని పెద్దమనిషి మీడియ సమావేశంలో 2.30 గంటలు కూర్చుంటాడు,” అన్నారు. జగన్ వ్యవహారశైలిపై ఆందోళన వ్యక్తం చేస్తూ, “ఆయనలో చాదస్తం కాదు... కచ్చితంగా ఏదో తేడా ఉంది. తల్లి, చెల్లి ఆయనకు దూరంగా ఉన్నారు. కనీసం భార్య భారతమ్మ అయినా ఆస్పత్రికి తీసుకెళ్లి బ్రెయిన్ టెస్ట్ చేయించాలి. నా దృష్టికి ఆయనకు వెంటనే ట్రీట్మెంట్ అవసరం అనిపిస్తోంది,” అని హితవు పలికారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి ఏదైనా సాధిస్తే దానికి జగన్ బ్లూ మీడియా వ్యతిరేకిస్తుందని, తర్వాత రోజు అదే విషయాన్ని తానే సాధించానని చెప్పుకునే స్థితికి ఆయన చేరుకున్నారని సోమిరెడ్డి విమర్శించారు. “ఇలాంటి రాజకీయ నాయకుడిని గత 50 ఏళ్ల చరిత్రలో చూడలేదు,” అని ఘాటుగా సోమిరెడ్డి వ్యాఖ్యలు చేశారు.  

ఉద్యోగుల జీతాల చెల్లింపుపై ప్రభుత్వం కీలక నిర్ణయం

  తెలంగాణలో ఉద్యోగుల జీతాలు చెల్లింపుపై  తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆధార్ లింక్ చేయని ఉద్యోగులకు శాలరీలు చెల్లించొద్దని సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇవాళ అర్ధరాత్రి IFMIS పోర్టల్‌లో ఆధార్ వివరాలు లింక్ చేయాలని డెడ్‌లైన్ విధించింది. లేని పక్షంలో అక్టోబరు జీతం కట్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది.  సుమారు 10.14 లక్షల మంది శాశ్వత, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరికీ ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొన్నారు. ట్రెజరీ, వర్క్స్ అకౌంట్స్, పే అండ్ అకౌంట్స్, ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, కార్పొరేషన్లు, సొసైటీలు అందరూ పాటించాలని రేవంత్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఆధార్ లింక్ చేయని వారి అక్టోబరు జీతాలు నిలిపివేయాలని ఆదేశించింది. ఈ సర్క్యులర్‌పై ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా సంతకం చేశారు. ఈ ఆదేశాలని ఉల్లంఘిస్తే తీవ్రంగా వ్యవహరిస్తామని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరించింది.

మొంథా తుఫాన్ ఎఫెక్ట్...స్కూళ్లకు సెలవులు

  మొంథా తుఫాన్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. మూడు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. కృష్ణా జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు 27,28,29 తేదీల్లో సెలవు ప్రకటించారు. తూర్పుగోదావరి, అన్నమయ్య జిల్లాల్లో 27,28న హాలిడే ఇచ్చారు. విద్యార్థులు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను కాకినాడ పరిసరాల్లో తీరాన్ని తాకే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలని తెలిపారు. శనివారం కాకినాడ జిల్లా కలెక్టర్ తో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.  కాకినాడ జిల్లాలో సముద్ర తీరం ఉన్న తుని, పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్ నియోజక వర్గాలతోపాటు తాళ్ళరేవు మండలంపైనా తుపాన్ ప్రభావం ఎక్కువగా ఉండబోతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ విషయంపై చర్చించారు. ఈ సందర్భంగా  పవన్ కళ్యాణ్  మాట్లాడుతూ "తుపానుపై ప్రజలను అప్రమత్తం చేయండి. జిల్లావ్యాప్తంగా తీరం వెంబడి ఉన్న గ్రామాల ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు తగిన చర్యలు తీసుకోండి. తుపాను షెల్టర్లలో ఆహారం, ఔషధాలు, పాలు లాంటివన్నీ సమకూర్చి ఉంచండి. వాతావరణ శాఖ హెచ్చరికలకు  అనుగుణంగా అన్ని విభాగాలను సిద్ధం చేయాలని సూచించారు.  రెవెన్యూ, వ్యవసాయ, నీటిపారుదల, పోలీస్, అగ్నిమాపక శాఖలతోపాటు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలను సిద్ధంగా ఉంచుకోవాలి. ఉప్పాడ సమీపంలో తీరం కోతకు గురయ్యే ప్రాంతంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మత్స్యకారులను అప్రమత్తం చేయండి" అని స్పష్టం చేశారు. మొంథా తుపాను ప్రభావం కాకినాడ జిల్లాపై ఉంటుందని తెలిసిన క్రమంలో కాకినాడ వెళ్ళేందుకు ఉప ముఖ్యమంత్రి సిద్ధంకాగా, ఈ పరిస్థితుల్లో వద్దని సహాయక చర్యల సన్నద్ధతలో యంత్రాంగం నిమగ్నమై ఉంటుందని, ఇప్పుడు జిల్లా పర్యటన వద్దని జిల్లా కలెక్టర్ సున్నితంగా సూచించారు.  

మొంథా తుఫాన్ వస్తోంది...అప్రమత్తంగా ఉండండి : సీఎం చంద్రబాబు

  ఏపీకి 'మొంథా' తుఫాను పొంచివున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘మొంథా’ తుపాన్ రాష్ట్రంపై ఈనెల 26, 27, 28, 29 తేదీల్లో తీవ్ర ప్రభావం చూపించనుందని వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేయడంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రధానంగా ఈ నెల 28న సాయంత్రం కాకినాడ సమీపంలో ‘మొంథా’ తీవ్ర తుపానుగా మారి తీరం దాటుతుందని, ఆ సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చంద్రబాబు స్పష్టం చేశారు.  శ్రీకాకుళం జిల్లా నుంచి తిరుపతి వరకూ దీని ప్రభావం ఉంటుందని... 80 నుంచి 100 మి.మీ. మేర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, వరదల నుంచి ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిళ్లకుండా ఇప్పటి నుంచే సన్నాహక చర్యలు సమగ్రంగా చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రతీ జిల్లా కలెక్టర్ తుఫాన్ రక్షణ చర్యలకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకుని... తగిన వనరులతో సన్నద్ధంగా ఉండాలని చెప్పారు. తీరప్రాంత ప్రజలకు తుఫానుపై అవగాహన కల్పించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.  అవసరమైతే విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని చెప్పారు. అన్ని ప్రధాన, మధ్య తరహా రిజర్వాయర్లలో నీటిమట్టాలను పర్యవేక్షించి నీటి విడుదల శాస్త్రీయంగా జరపాలన్నారు. రియల్ టైమ్‌లో వచ్చే సమాచారాన్ని తక్షణం ప్రభుత్వ యంత్రాంగంలోని కింది స్థాయి వరకు తీసుకువెళ్లాలని చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్  బృందాలను ముందుగానే సిద్ధం చేయాలని ఆదేశించారు. కాకినాడలో హాస్పిటల్ ఆన్ వీల్స్ సేవలను ప్రారంభించాలని సూచించారు.  ఆర్ అండ్ బీ, విద్యుత్, నీటిపారుదల, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలు అన్నీ అప్రమత్తంగా ఉండాలన్నారు. తాగునీరు, విద్యుత్ సరఫరా, మొబైల్ టవర్స్, సివిల్ సప్లైస్ వంటి అత్యవసర సేవలు నిరంతరం కొనసాగేలా చూడాలని నిర్దేశించారు. తుఫాన్ ప్రభావిత జిల్లాలకు ఇన్‌ఛార్జి అధికారులను నియమించి, తుఫాను నష్ట నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

హైదరాబాద్‌లో మరోసారి కాల్పుల కలకలం

    హైదరాబాద్‌ నగరంలో శనివారం సాయంత్రం సమయంలో చాదర్‌ ఘాట్ ప్రాంతంలోని విక్టోరియా గ్రౌండ్ వద్ద జరిగిన కాల్పుల ఘటన స్థానికంగా సంచ లనం సృష్టించింది. సౌత్ ఈస్ట్ డిసిపి చైతన్యతో పాటు పోలీస్ సిబ్బంది సెల్ఫోన్ దొంగలను పట్టుకుని ప్రయత్నంలో  సెల్‌ఫోన్ స్నాచర్ కత్తితో ఒక్కసారిగా డిసిపి చైతన్య పై దాడి చేయడానికి యత్నించాడు. అయితే డిసిపి చైతన్యకు మరియు సెల్ఫోన్ స్నాచర్ మధ్య తోపులాట జరగడంతో డిసిపి చైతన్య గన్మెన్ వెపన్ కింద పడిపోయింది. దీంతో డిసిపి చైతన్య వెంటనే గన్ను తీసుకొని మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు.  చాదర్‌ఘాట్ పరిసర ప్రాంతంలో  సెల్‌ఫోన్ స్నాచింగ్ జరుగుతున్నట్లు సమాచారం రావడంతో వెంటనే సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య, సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఒక దొంగను పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆ దొంగ డీసీపీపై కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించాడు. తనకు ప్రాణాపాయం ఉన్న నేపథ్యంలో డీసీపీ చైతన్య స్వయంగా తన గన్ తీసుకుని దొంగపై కాల్పులు జరిపారు.  మొత్తం మూడు రౌండ్ల  కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. తోపులాటలో డీసీపీ గన్‌మెన్ కింద పడి గన్ నేలపై పడగా, వెంటనే డీసీపీ స్వయంగా ఆయు ధాన్ని స్వాధీనం చేసుకొని ఫైర్ చేసినట్టు పోలీసులు తెలిపారు.ఈ కాల్పుల్లో ఇద్దరు దొంగలకు గాయాలయ్యాయి.  వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అదృష్టవశాత్తూ డీసీపీ చైతన్యతో పాటు మిగతా పోలీస్ సిబ్బంది క్షేమంగా ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే హైదరాబాద్ సీపీ సజ్జనార్ సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. మొత్తం రెండు రౌండ్లు దొంగలపై ఫైర్ చేసినట్లు ఆయన తెలిపారు. నగర పోలీసుల అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పిందని  వెల్లడించారు.

కార్ పూలింగ్ తో ట్రా‘ఫికర్’కు చెక్

హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఆర్టీసీ ఓ ప్రణాళికతో ముందుకు వచ్చింది. ముఖ్యంగా హైదరాబాద్ ఐటీ కారిడాన్ లో ట్రాఫిక్ సమస్య అత్యంత తీవ్రంగా మారడంతో ఆర్టీసీ ఐటీ కంపెనీల ముందుకు ఒక ప్రతిపాదన తీసుకువచ్చింది. అందుకు ఐటీ కంపెనీలు కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. ఇంతకీ ఆర్టీసీ ప్రతిపాదన ఏంటంటే..   ప్రజా రవాణాను విస్తరించేందుకు ఐటీ కారిడార్లో బస్సుల సంఖ్యను పెంచడంతో పాటు ప్రతి ఐటీ కంపెనీకి ఒక ఆర్టీసీ బస్సును అద్దె ప్రాతిపదికన కేటాయించడం ద్వారా ఉద్యోగులు సొంత వాహనాలకు బదులుగా బస్సులలో వచ్చేలా ప్రోత్సహించాలన్నది ఒక భాగం కాగా, కార్ పూలింగ్ అన్నది రెండో భాగంగా ఆర్టీసీ ప్రతిపాదన చేసింది.   ఇందులో భాగంగా ముందుగా మైండ్ స్పేస్ ప్రాంతంలో వన్ బస్ పర్ కంపెనీ విధానాన్ని అమలులోకి తీసుకువచ్చేందుకు దాదాపుగా నిర్ణయం జరిగిపోయింది. సైబరాబాద్ పోలీసులు కూడా ఈ విధానాన్ని అమలులోకి తీసుకువస్తే చాలా వరకూ ట్రాఫిక్ కష్టాలు సమసిపోతాయని అంటున్నారు.  సో ముందుగా మైండ్ స్పేస్ ఏరియాలో వన్ బస్ పర్ వన్ కంపెనీ పాలసీలో భాగంగా ఐటీ ఉద్యోగులు రాకపోకలు సాగించే 250 కార్లను 50 బస్సులతో రీప్లేస్ చేయాలని నిర్ణయించారు. ఇందు కోసం సైబరాబాద్ పోలీసులు ఓ సర్వే కూడా చేశారు.  ఆ సర్వే ప్రకారం ఐటీ హబ్  ప్రాంతాలలో  పనిచేసే చాలామంది ఉద్యోగులు ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తూ ఒకే ఏరియాలో ఉంటూ కూడా ఎవరికి వారుగా సొంత వాహనాల్లో వస్తున్నారు. ఆ కారణంగా పీక్ అవర్స్ లో  ట్రాఫిక్  సమస్య తీవ్రమౌతోంది. ఇలా ఒకే ఆఫీసులో పని చేస్తూ ఒకే ప్రాంతం నుంచి వచ్చే ఉద్యోగులు కార్ పూలింగ్ పద్ధతి అనుసరిస్తే ట్రాఫిక్ సమస్య చాలా వరకూ పరిష్కారమౌతుందని ఈ సర్వే ద్వారా తేలిందని అంటున్నారు. అలాగే మైండ్ స్పేస్ ప్రాంతంలోని కంపెనీలలో పని చేసే ఉద్యోగులు దాదాపు 250 కార్లలో తమతమ కార్యాలయాలను హాజరౌతున్నారని సర్వేలో తేలింది. ఈ కార్లను 50 బస్సులతో రీప్లేస్ చేస్తే తక్కువలో తక్కువ పాతిక శాతం ట్రాఫిక్ సమస్య పరిష్కారమౌతుందని అంటున్నారు. అంటే వన్ బస్ పర్ వన్ కంపెనీ పద్ధతిలో ఐటీ ఉద్యోగులు సొంత కార్లకు ప్రత్యామ్నాయంగా బస్సులను ఆశ్రయించేలా చేస్తే చాలా వరకూ ట్రాఫిక్ కష్టాలు కడతేరుతాయని అంటున్నారు. అదే సమయంలో ఆర్టీసీ తన బస్సులను ఐటీ కంపెనీలకు అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయం కూడా సమకూర్చుకునే అవకాశం కలుగుతుందంటున్నారు.  త్వరలోనే దీనిపై ఐటీ కంపెనీలు, ఉద్యగులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. 

కర్నూల్ బస్సు ప్రమాదంలో మరో ట్విస్ట్

  కర్నూలు జిల్లా చిన్నటేకూరులో వి. కావేరి బస్సు దగ్ధ ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. బస్సు, బైక్ ప్రమాదాలు వేర్వేరుగా జరిగినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే— బైక్‌పై ప్రయాణిస్తున్న శివశంకర్, ఎర్రిస్వామి హైవేపై ప్రమాదానికి గురయ్యారు. ఆ ప్రమాదంలో శివశంకర్ తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు.  వెంటనే రోడ్డుపై పడిపోయిన బైక్‌ను పక్కకు తీసేందుకు ఎర్రిస్వామి ప్రయత్నిస్తుండగా, చీకట్లో వేగంగా వస్తున్న వి. కావేరి బస్సు బైక్‌ను ఈడ్చుకెళ్లింది.దీంతో బైక్ పెట్రోల్ ట్యాంకు లీక్ అయి మంటలు చెలరేగాయి. దీని వల్ల పెట్రోలు లీకై మంటలు చెలరేగి బస్సుకు అంటుకున్నాయని ఎర్రిస్వామి పోలీసుల విచారణలో వెల్లడించారు. ఆయన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.   ప్రమాదానికి ముందు శివశంకర్ మరో యువకుడితో కలిసి బైక్ లో పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్లిన వీడియో తాజాగా బయటకు వచ్చింది. పెట్రోల్ బంక్ లోని సీసీటీవీ కెమెరాలో రికార్డైన ఈ వీడియోలో శివశంకర్ మత్తుతో తూలుతుండడం స్పష్టంగా కనిపిస్తోంది.  ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనలో 19 మంది సజీవదహనమయ్యారు. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సులో ప్రయాణిస్తున్న బాధితులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు. ప్రస్తుతం డీఎన్ఏ పరీక్షల ఆధారంగా మృతదేహాలను బంధువులకు అప్పగిస్తున్నారు. ఈ దారుణం రెండు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నెలకొల్పింది.  

రాణించిన రోహిత్‌, కోహ్లీ...భారత్ ఘన విజయం

  ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. 237 పరుగుల టార్గెట్‌ను ఒకే వికెట్ కోల్పోయి టీమిండియ ఘన విజయం సాధించింది. ఓపెనర్ రోహిత్ శర్మ సూపర్ సెంచరీతో చెలరేగగా , విరాట్ కోహ్లీ 74 పరుగుల అద్బుత ఇన్నింగ్స్ ఆడారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 46.4 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌట్ అయింది.  భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌కు ఆసీస్ బ్యాటర్లు వరుసగా వికెట్లు కోల్పోయారు. రెన్‌షా (56) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో యువ పేసర్ హర్షిత్ రాణా 4 వికెట్లతో సత్తా చాటగా, వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు పడగొట్టాడు. 237 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టిమీండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (24) త్వరగానే ఔటైనా, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీతో కలిసి రోహిత్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు  

శివయ్యపై ఇద్దరు నాగేంద్రుల దర్శనం

  నెల్లూరు జిల్లా మనుబోలు మండలం చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారి దేవస్థానంలో ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. దేవస్థాన పరిసరాల్లో నాగేంద్రుడు సంచరిస్తున్న సంగతి భక్తులకు తెలిసిందే.  అయితే, తాజాగా ఉదయం తెల్లవారుజామున ఇద్దరు నాగేంద్రులు ఒక్కసారిగా విశ్వనాథ స్వామి సన్నిధిలో ప్రత్యక్షమై భక్తులకు దర్శనమిచ్చారు. అందులో ఒక నాగేంద్రుడు శ్వేతనాగ రూపంలో కనిపించి, భక్తులందరికీ కడువిందు చేసినట్లు అక్కడివారు తెలిపారు. ఇప్పటివరకు ఒకే నాగేంద్రుడు దర్శనమిచ్చిన ఈ దేవస్థానంలో ఇద్దరు నాగేంద్రులు ప్రత్యక్షమవడం విశేషంగా మారి, మనుబోలు ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.

కర్నూలు బస్సు దుర్ఘటనలో మృతదేహాల కోసం ఎదురుచూపులు

  కర్నూలు బస్సు దుర్ఘటనలో చనిపోయిన వారి మృతదేహాల కోసం వారి బంధువులు ఎదురుచూస్తున్నారు. చనిపోయిన వారందరి మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోవడంతో వారిని డీఎన్ఏ సేకరించి ఎవరి చెందిన మృతదేహాలను వారికి అప్పగించేందుకు అధికారులు నిన్నటి నుంచి ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగానే  డీఎన్ఏ సేకరణకు మొత్తం 16 బృందాలను ఏర్పాటు చేశారు.  బస్సు ప్రమాదంలో బస్సులో ఉన్నవారు 19 మంది చనిపోగా వారిలో ఇప్పటికే 14 మంది డిఎన్ఏ ను సేకరించి ల్యాబ్ కు పంపించినట్టుగా అధికారులు చెబుతున్నారు. మిగిలిన ఐదు మంది డీఎన్ఏల సేకరణ కూడా ఈరోజు పూర్తవుతుందని ఫారెన్సీక్ డాక్టర్లు చెబుతున్నారు. మృతుల దగ్గర నుంచి సేకరించిన డీఎన్ఏ పరీక్షలు పూర్తిచేసుకుని తిరిగి తిరిగి రిపోర్టులు రావడానికి 48 గంటలకు పైగా సమయం పడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఆ తర్వాతనే మృతదేహాలు అప్పగింత ప్రారంభమవుతుందని చెప్తున్నారు.  దీనితో చనిపోయిన వారి బంధువుల బాధ వర్ణాతీతంగా మారింది. అసలే అయినవారు చనిపోయిన దుఃఖంలో శవాల అప్పగింతకు కూడా అధిక సమయం పడుతుండటంతో, ఎటు పాలుపోనీ నందిగ్ధంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. చనిపోయిన వారిలో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సా రాసిన చెందినటువంటి వారు ఉన్నారు. వీరందరూ కూడా ఆస్పత్రి మార్చురీ దగ్గర నిన్నటి నుంచి పదిగాపులు కాస్తున్నారు.  అయితే మృతదేహాలు అప్పగింతకు అధిక సమయం పడుతున్న నేపథ్యంలో వీరందరినీ అధికారులు స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కి తరలించి అక్కడ బసవ ఏర్పాట్లను చేశారు. సమయం ఆలస్యం అవుతున్న కొద్దీ చనిపోయిన వారి బంధువులు ఒకరు ఒకరిగా అక్కడికి చేరుతుండటంతో బంధువుల ఆక్రందనలు చూసేవారికి సైతం కంటతడి తెప్పిస్తున్నాయి..