కర్నూలు బస్సు దుర్ఘటనలో మృతదేహాల కోసం ఎదురుచూపులు
posted on Oct 25, 2025 @ 3:10PM
కర్నూలు బస్సు దుర్ఘటనలో చనిపోయిన వారి మృతదేహాల కోసం వారి బంధువులు ఎదురుచూస్తున్నారు. చనిపోయిన వారందరి మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోవడంతో వారిని డీఎన్ఏ సేకరించి ఎవరి చెందిన మృతదేహాలను వారికి అప్పగించేందుకు అధికారులు నిన్నటి నుంచి ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగానే డీఎన్ఏ సేకరణకు మొత్తం 16 బృందాలను ఏర్పాటు చేశారు.
బస్సు ప్రమాదంలో బస్సులో ఉన్నవారు 19 మంది చనిపోగా వారిలో ఇప్పటికే 14 మంది డిఎన్ఏ ను సేకరించి ల్యాబ్ కు పంపించినట్టుగా అధికారులు చెబుతున్నారు. మిగిలిన ఐదు మంది డీఎన్ఏల సేకరణ కూడా ఈరోజు పూర్తవుతుందని ఫారెన్సీక్ డాక్టర్లు చెబుతున్నారు. మృతుల దగ్గర నుంచి సేకరించిన డీఎన్ఏ పరీక్షలు పూర్తిచేసుకుని తిరిగి తిరిగి రిపోర్టులు రావడానికి 48 గంటలకు పైగా సమయం పడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఆ తర్వాతనే మృతదేహాలు అప్పగింత ప్రారంభమవుతుందని చెప్తున్నారు.
దీనితో చనిపోయిన వారి బంధువుల బాధ వర్ణాతీతంగా మారింది. అసలే అయినవారు చనిపోయిన దుఃఖంలో శవాల అప్పగింతకు కూడా అధిక సమయం పడుతుండటంతో, ఎటు పాలుపోనీ నందిగ్ధంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. చనిపోయిన వారిలో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సా రాసిన చెందినటువంటి వారు ఉన్నారు. వీరందరూ కూడా ఆస్పత్రి మార్చురీ దగ్గర నిన్నటి నుంచి పదిగాపులు కాస్తున్నారు.
అయితే మృతదేహాలు అప్పగింతకు అధిక సమయం పడుతున్న నేపథ్యంలో వీరందరినీ అధికారులు స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కి తరలించి అక్కడ బసవ ఏర్పాట్లను చేశారు. సమయం ఆలస్యం అవుతున్న కొద్దీ చనిపోయిన వారి బంధువులు ఒకరు ఒకరిగా అక్కడికి చేరుతుండటంతో బంధువుల ఆక్రందనలు చూసేవారికి సైతం కంటతడి తెప్పిస్తున్నాయి..