ఐపీఎల్ 6 షెడ్యూల్

ఐపీఎల్ ఆరో సీజన్ ఆరంభానికి తెరలేచింది. ఈ మెగా టోర్నీ తొలి మ్యాచ్‌లో బోణీ కొట్టేందుకు గతేడాది చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తోపాటు ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్లు రెడీ అయ్యాయి. బుధవారం జరగనున్న ఆరంభ మ్యాచ్‌కు ఇక్కడి ఈడెన్ గా ర్డెన్స్ వేదికకానుంది. డిఫెండిం గ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగుతున్న కోల్‌కతాపై ఈ సారీ అంచనాలు భారీగానే ఉన్నాయి.   గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని కోల్‌కతా వరుసగా రెండోసారీ టైటిల్‌పై కన్నేసింది. కాగా, పటిష్ట జట్లలో ఒకటిగా ఉన్నప్పటికీ ఇంతవరకూ ఒక్కసారి కూడా టైటిల్ నెగ్గని ఢిల్లీ ఈ సారైనా ఆ కల నెరవేర్చుకోవాలని తలపోస్తోంది.  

విజేందర్ డ్రగ్స్ వాడాడు ... పోలీసులు

  ఒలంపిక్ బాక్సింగ్ లో కాంస్య పతాక విజేత విజేందర్ డ్రగ్స్ తీసుకున్నారని డ్రగ్స్ పరీక్ష చేస్తామని పోలీసులు పట్టుబట్టినా విజేందర్ నిరాకరించారు. పంజాబ్ పోలీసులు పట్టువిడవకుండా విజేందర్ ఫోన్ కాల్స్ లిస్టు పై నిఘా పెట్టి నార్కోటిక్ డీలర్, స్మగ్లర్ కెనడాకు చెందిన అనూప్ సింగ్ కహ్లోన్ అలియాస్ రూబీతో విజేందర్ 80 సార్లు ఫోన్లో మాట్లాడినట్టు కాల్ రికార్డుల్లో తేలిందని ఆదివారం పోలీసులు వెల్లడించారు. విజేందర్ స్నేహితుడు రాంసింగ్ లకు రూబీతో చాలాకాలం నుంచి పరిచయం ఉందని, విజేందర్, రూబీ మధ్య ఎస్.ఎం.ఎస్.ల రాయబారం కూడా నడిచిందని, రాంసింగ్ ఐదు సార్లు డ్రగ్స్ తీసుకున్నాడని పోలీసులు తేల్చారు. ఫోన్ కాల్ లిస్టు, ఎస్.ఎం.ఎస్. ల ఆధారంగా విజేందర్ వెంట్రుక, రక్తం పరీక్షలకు కోర్టు నుంచి అనుమతి పొందాలని లూథియానా రేంజ్ డిఐజి ఫరూఖీ తెలిపారు. పోలీసుల విచారణలో విజేందర్ 12 సార్లు డ్రగ్స్ వాడాడని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

కోమా నుంచి కోలుకున్న జెస్సీ రైడర్

        ఆగంతకుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ న్యూజిలాండ్ క్రికెటర్ జెస్సీ రైడర్ కోమా నుంచి బయటపడ్డాడు. కుటుంభ సుభ్యులు, స్నేహితులతో కూడా మాట్లాడుతున్నాడు. అయితే దాడికి సంబంధించిన వివరాలను మాత్రం వెల్లడించలేకపోతున్నాడు. ఆరోజు ఏం జరిగిందో చెప్పలేకపోతున్నాడని రైడర్ వ్యక్తిగత మేనేజర్ శనివారం వెల్లడించాడు. అతని పరిస్థితి ఇప్పుడు బాగానే ఉందని, అయితే పూర్తిగా కోలుకోవాలంటే మాత్రం మరింత సమయం పడుతుందని కివీస్ క్రికెటర్ల సంఘం ముఖ్య కార్యనిర్వహణాధికారి హీత్ మిల్స్ అన్నాడు. బుధవారం అర్ధరాత్రి క్రైస్ట్‌చర్చ్‌లోని ఓ బార్ ఎదుట జరిగిన ఘర్షణలో రైడర్ తలకు, ఊపిరి తిత్తులకు బలమైన గాయాలైన సంగతి తెలిసిందే. కాగా, ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు ఏప్రిల్ 4న వారిని కోర్టులో హాజరుపర్చనున్నారు. ఐపీఎల్ ఆరో అంచె పోటీల్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరుఫున ఆడాల్సిన రైడర్ ఈ ఘటనతో లీగ్‌కు దూరమయ్యాడు. మే, జూన్ నెలల్లో జరిగే ఇంగ్లండ్‌తో సిరీస్ లోపు రైడర్ గ్రౌండ్‌లో అడుగుపెట్టే పరిస్థితి లేదు.

కోమాలో క్రికెటర్ జెస్సీ రైడర్

        న్యూజిలాండ్ క్రికెటర్ జెస్సీ రైడర్ తీవ్ర గాయాలతో కోమాలోకి వెళ్లాడు. న్యూజిలాండ్ లోని క్రిస్ట్‌చర్చ్ ప్రాంతంలో ఓ బార్ వద్ద జరిగిన గొడవలో రైడర్ ను కొందరు తీవ్రంగా కొట్టడంతో అతను ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. రైడర్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. రైడర్ వ్యక్తిగత జీవితం ఎప్పుడూ వివాదాలతో ముడిపడిందే. మద్యానికి బానిసైన రైడర్ పలుమార్లు తప్పతాగి వివాదాల్లో చిక్కుకున్నాడు. జట్టు నుంచి అనేకసార్లు అతణ్ని తప్పించారు. మరో ఆరు రోజుల్లో మొదలయ్యే ఐపీఎల్ ఆరో సీజన్లో రైడర్ పుణె వారియర్స్ తరఫున ఆడాల్సి ఉంది. గత ఏడాది ఆ జట్టు తరఫున రైడర్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తాజాగా రైడర్ పై దాడికి పాత కక్షలే కారణమని తెలుస్తోంది. గతంలో రైడర్ తో గొడవపడిన ఓ వ్యక్తి తన స్నేహితులతో కలిసి వచ్చి అతనిపై దాడికి దిగినట్లు తెలుస్తోంది.

ఐసిసి టేస్ట్ ర్యాంకింగ్స్ లొ భారత్ కు మూడవస్థానం

  భారత్ క్రికెట్ జట్టు టేస్ట్ క్రికెట్ ర్యాంకింగ్స్ లొ మూడవ స్థానానికే పరిమితం కావలసి వచ్చింది. ఏప్రిల్ 1 కట్ ఆఫ్ డే కి సౌత్ ఆఫ్రికా 128 పాయింట్లతో మొదటిస్థానాన్ని నిలుపుకుని 450,000 యు.ఎస్. డాలర్లు సొంతం చేసుకుంది. న్యూజిల్యాండ్ - ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఆఖరి మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు డ్రా చేసుకుంది. ఒకవేళ ఇంగ్లాండ్ కనుక న్యూజిల్యాండ్ చేతిలో పరాజయం అయివుంటే భారత్ కు రెండో స్థానం దక్కించుకుని 350,000 యు.ఎస్. డాలర్లు అందుకునేది. ఇంగ్లాండ్ డ్రా చేసుకోవడంతో ఇంగ్లాండ్ కు రెండో స్థానం భారత్ మూడోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇండియాకి 250,000 యు.ఎస్. డాలర్లు దక్కాయి. అలాగే నాలుగవ ర్యాంక్ పొందిన ఆస్ట్రేలియా జట్టుకు 150,000 యు.ఎస్. డాలర్లు దక్కాయి.

34 ఏళ్ళలో ఇదే ఆసీస్ చెత్తజట్టు

      భారత పర్యటనలో చిత్తుగా ఓడిపోయిన ఆస్ట్రేలియా జట్టుపై ఆ దేశ మీడియా విమర్శల వర్షం కురిపించింది. 34 ఏళ్లలో ఇదే చెత్త జట్టని క్లార్క్‌సేనను తీవ్రంగా దుయ్యబట్టింది. ఆసీస్ టాపార్డర్ బ్యాట్స్‌మెన్ షాట్ల ఎంపికలో పిచ్చిగా వ్యవహరించారని పేర్కొంది. 'భారత పర్యటనలో ఆస్ట్రేలియా క్రికెట్ ప్ర దర్శన అధ్వాన్నంగా ఉంది' అని టెలీగ్రాఫ్ పేర్కొంది. టాపార్డర్ బ్యాట్స్‌మెన్, తాత్కాలిక కెప్టెన్ షేన్‌వాట్సన్ పేలవ ఆటతీరును విమర్శించింది. వాట్సన్ ఇదే ఫామ్‌తో ఎక్కువ రోజులు కొనసాగడం కష్టమని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. సిడిల్, స్టార్క్ వం టి టెయిలెండర్లు కీలక పరుగులు చేసినపుడు టాపార్డర్ బ్యాట్స్‌మెన్‌కు ఏమైందని ప్రశ్నించారు.

చరిత్ర సృష్టించిన భారత్

        ఆస్ట్రేలియాపై ఇండియా రికార్డ్ విజయం సాధించింది. ఢిల్లీలో జరిగిన చివరి టెస్టు లో భారత్ ఆరు వికెట్లతో గెలుపొందింది. నాలుగు టెస్టుల సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేసి చరిత్ర సృష్టించింది. 80ఏళ్ల భారత్ క్రికెట్ చరిత్రలో ఇదే అతి పెద్ద సిరీస్ విజయం. చివరిసారిగా 1993-94లో ఇంగ్లండ్‌పై అజహరుద్దీన్ టీం 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. రవీంద్ర జడేజా 'మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్', రవిచంద్రన్ అశ్విన్ కు 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' వరించాయి.   తొలి ఇన్నింగ్స్‌లో ఎనిమిది వికెట్ల నష్టంతో 266 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్ కేవలం 6 పరుగులు మాత్రమే జోడించి మిగిలిన ఇషాంత్(0),ఓజా(0) వెను వెంటనే ఔటయ్యారు. దీంతో భారత్ తొలిఇన్నింగ్స్‌లో 272 పరుగులు చేసి 10 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. అనంతరం సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఆటగాళ్లపై భారత బౌలర్లు విరుచుకుపడ్డారు. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 164 పరుగులకే ఆలౌట్ అయి, భారత్ ముందు 155 పరుగులు విజయలక్ష్యాన్ని ఉంచింది. ఆసీస్ ఆటగాడు సిడల్ ఒంటిపోరాటం చేశాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో సిడిల్ అర్ధసెంచరీ పూర్తి చేశాడు. కోవాన్(24),వేడ్(19) స్మిత్(18) పరుగులు మినహా మిగిలిన వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత్ బౌలర్లు జడేజాకు ఐదు వికెట్లు, అశ్విన్, ఓజాకు చెరో రెండు వికెట్లు, ఇషాంత్ శర్మకు ఒక వికెట్ దక్కాయి. తర్వాత 155 పరుగుల విజయమే లక్ష్యంగా ఆట ప్రారంభించిన భారత్ నిలకడగా ఆడి ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. పుజారా (82)పరుగులు, ధోని(11) పరుగులతో నాటౌట్‌గానిలిచారు.

ఢిల్లీ టెస్ట్: భారత్ లక్ష్యం 155

        ఢిల్లీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాల్గో టెస్ట్ మూడో రోజు 266/8తో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ మరో ఆరు పరుగులు మాత్రమే జోడించి ఆలౌట్ అయింది. లియోన్ ఏడు వికెట్లు తీసి సత్తా చాటాడు. మాక్స్‌వెల్, సిడిల్, పాటిన్సన్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. ఆతరువాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ వార్నర్, మాక్స్‌వెల్‌లు ఆరంభంలోనే అవుటయ్యారు. మాక్స్‌వెల్, వార్నర్‌ జడెజా ఆవుట్ చేసి ఆదిలోనే దెబ్బ తీశాడు. కొవాన్, హ్యూస్ క్రీజులో నిలకడగా అడే ప్రయత్నాలు చేసినప్పటికీ కుదరలేదు. కేవలం 53 పరుగులకే ఆసీస్ ఐదు కీలక వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత వేడ్, స్మిత్‌లు కాసేపు నిలకడగా ఆడారు. అనంతరం స్మిత్(18) జడెజా బౌలింగులో ఆరో వికెట్‌గా అవుటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన జాన్సన్ పరుగులేమీ చేయకుండానే క్రీజు వదిలాడు. ఆ తర్వాత వేడ్(19) ఓజా బౌలింగులో ధోనీకి క్యాచ్ ఎనిమిదో వికెట్‌గా వెనుదిరిగాడు. 157 పరుగుల వద్ద పాటిన్సన్(11) రూపంలో తొమ్మిదో వికెట్ పడిపోయింది. సిడిల్(50) ఒక్కడే రాణించాడు. తోమ్మిదో నెంబరులో వచ్చి రెండు వరుస అర్ధసెంచరీలు చేసిన ఘనత సిడిల్‌కి దక్కింది. 164 పరుగుల వద్ద ఆసీస్ ఆఖరి వికెట్ కోల్పోయింది. జడెజా ఐదు, ఓజా, అశ్విన్‌లు చెరో రెండు, ఇషాంత్ శర్మలు చెరో వికెట్ తీసుకున్నారు. భారత్ లక్ష్యం 155 పరుగులు.

అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్న ప్రజ్ఞాన్ ఓజా

  ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగవ టేస్ట్ మ్యాచ్ రెండో రోజు భారత ఎడమచేతి వాటం స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకున్నాడు. ఓజా 22 టెస్టు మ్యాచుల్లో 100వ వికెట్ గా జేమ్స్ పాటిన్సన్ విరాట్ కోహ్లీ అందుకున్న క్యాచ్ ద్వారా అవుట్ చేసి సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. మూడవ భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. అంతకుముందు ఎర్రపల్లి ప్రసన్న 20 టెస్టులు, భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే 21 టెస్టు మ్యాచుల్లో 100 వికెట్లు తీసినవారిలో ఉన్నారు. ఇండియా తరపున వంద వికెట్లు పడగొట్టిన వారిలో ఓజా 18వ వాడుగా, ప్రపంచ క్రికెట్ చరిత్రలో 163వ ఆటగాడిగా నిలిచాడు. ఎడమచేతి వాటం బౌలర్ గా ఓజా ఇండియా తరపున ఐదవ ఆటగాడు కాగా అంతకుముందు ఇండియా తరపున వంద టేస్ట్ వికెట్లు సాధించిన ఎడమచేతి వాటం స్పిన్ బౌలర్లు బిషన్ సింగ్ బేడీ, వినూ మన్కడ్, రవి శాస్త్రి, దిలిప్ దోషి ఉన్నారు.

ఢిల్లీ టెస్ట్: ఆస్ట్రేలియా 63/1

        ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఢిల్లీలో జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ దీగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. వార్నర్ పరుగులేమీ చేయకుండా ఇషాంత్ శర్మ బౌలింగులో అవుటయ్యాడు. నాలుగు పరుగుల స్కోరు వద్ద ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. ఆస్ట్రేలియా కెప్టెన్ క్లార్క్ కు గాయకావడంతో ఈ మ్యాచ్ కి కెప్టెన్ గా వాట్సన్ ను నియమించారు. గాయం కారణంగా శిఖర్ ధావన్ దూరం కావడంతో భారత్ ఓపెనర్‌గా అజింక్యా రహనేకు చోటు కల్పించింది. ఆస్ట్రేలియా అత్యధిక ఐదు మార్పులు చేసింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 63/1 తో బ్యాటింగ్ చేస్తోంది. ఎడ్ కోవాన్ 20, హ్యూజ్ 40పరుగులతో క్రీజులో వున్నారు.

మెరుగైన మురళీ విజయ్, విరాట్ కోహ్లీ ఐసిసి టేస్ట్ ర్యాంకింగ్స్

  తాజాగా విడుదలైన టెస్టు బ్యాట్స్ మెన్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి)లో భారత ఆటగాళ్ళు విరాట్ కోహ్లీ 24 ర్యాంక్ నుండి 20వ ర్యాంక్ కు, మురళీ విజయ్ ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై జరుగుతున్నా టేస్ట్ క్రికెట్ సీరీస్ భాగంగా మొహాలీలో సోమవారం ముగిసిన మూడో టేస్ట్ లో 153 పరుగులు సాధించి భారతజట్టు విజయంలో కీలకపాత్ర వహించిన మురళీ విజయ్ 59ర్యాంక్ నుండి 43వ ర్యాంక్ కు చేరుకున్నాడు. వీరిద్దరూ అంతర్జాతీయ టెస్టు బ్యాట్స్ మెన్ జాబితాలో తమ కెరీర్ లోనే అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. హైదరాబాద్ ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జరిగిన రెండో టెస్టులో డబుల్ సెంచరీ చేసిన సౌరాష్ట్ర యువ బ్యాట్స్ మెన్ చటేశ్వర పూజారా ఐసిసి టాప్ 10 బ్యాట్స్ మెన్ జాబితాలో చోటు దక్కించుకున్నాడు అయితే తాజాగా విడుదలైన ర్యాంకులలో పుజారాకు 12వ ర్యాంగ్ తో సరిపెట్టుకోవలసి వచ్చింది.

మొహాలి టెస్ట్: ఆసీస్ పై హాట్రిక్ కొట్టిన భారత్

        ఆస్ట్రేలియాతో మొహాలి లో జరుగుతున్న మూడో టెస్ట్ లో ఇండియా హాట్రిక్ విజయం సాదించింది. ఇండియా మూడో టెస్టులోను గెలిచి 3-0తో బోర్డర్ - గవాస్కర్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. 75/3తో సోమవారం ఉదయం ఆట ప్రారంభించిన ఆసీస్ త్వరగానే వికెట్‌ను కోల్పోయింది. ఓఝా బౌలింగులో లియోన్(18) ధోనీకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. గాయం కారణంగా ఆడుతాడా, లేడా అనే అనుమానం నేపథ్యంలో ఆసీస్ కెప్టెన్ మైకెల్ క్లార్క్ బ్యాటింగ్ చేశాడు, అవుటయ్యాడు. అతను 18 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రవీంద్ర జడేజా చేతిలో అవుటయ్యాడు. 179 పరుగులకు 9 వికెట్లు కోల్పోయినా ఒక్క వికెట్‌తో 233 పరుగుల వరకు లాక్కొచ్చారు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో 136 పరుగులు చేసింది. 133 పరుగుల లక్ష్యాన్ని భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

మొహాలి టెస్ట్: ఆస్ట్రేలియా 213/4

        మొహాలిలో ఆస్ట్రేలియా తో జరుగుతున్న మూడో టెస్ట్ లో భారత బౌలర్లు వికెట్ల వేట మొదలు పెట్టారు. రెండో రోజు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా కు ఓపెనర్లు కొవాన్, వార్నర్‌లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. మొదటి వికెట్ కు 139 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తరువాత వార్నర్ 147బంతుల్లో ‌71 పరుగులు చేసి జడేజా బౌలింగ్ లో అవుటయ్యాడు. ఆతరువాత వచ్చిన ఆసీస్ సారథి క్లార్క్ పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగారు. ఓజా బౌలింగులో హ్యూజెస్ రెండు పరుగులకే పెవిలియన్ దారి పట్టాడు. దీంతో ఆస్ట్రేలియా 151 పరుగుల వద్ద మూడు వికెట్లు కోల్పోయింది. ఆసిస్ మరో ఓపెనర్ ఎడ్ కోవాన్ కూడా అర్థ సెంచరీ చేశాడు. 238 బంతుల్లో 86 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్ లో అవుటయ్యాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 213/4 కోల్పోయి బ్యాటింగ్ చేస్తుంది.

దేవధర్ ట్రోఫీ విజేత వెస్ట్ జోన్

  దేశవాళీ దేవధర్ ట్రోఫీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది. గౌహతి నెహ్రూ స్టేడియంలో బుధవారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో వెస్ట్ జోన్, నార్త్ జోన్ పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీని కైవసంచేసుకుంది. మన రాష్ట్ర ఆటగాడు అంబటి రాయుడు వెస్ట్ జోన్ గెలుపులో ముఖ్యమైన పాత్ర వహించాడు. అంబటి రాయుడు ఈ మ్యాచ్ లో 78 నాటౌట్ గా నిలిచి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు. టాస్ గెలిచి వెస్ట్ జోన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. నార్త్ జోన్ నిర్ణీత 50 ఓవర్లలో 289 పరుగులు చేసింది. నార్త్ జోన్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ ఉన్ముక్త్ చంద్ 88పరుగులు, యువరాజ్ సింగ్ 67 పరుగులు చేశారు. వీరిద్దరూ 120 పరుగుల భాగస్వామ్యాని నెలకొల్పారు. నార్త్ జోన్ ఇన్నింగ్స్ ముగిసిన తరువాత ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్ట్ జోన్ 48.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 293 చేసి విజయం సాధించింది. వెస్ట్ జోన్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ పార్థివ్ పటేల్ 58పరుగులు, మన్ ప్రీత్ జునేజా 56 పరుగులు, కేదార్ జాదవ్ 57 పరుగులు, అంబటి రాయుడు 78 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

చిరకాల ప్రత్యర్థిపై భారత్ గెలుపు

మలేషియా లో జరుగుతున్న అజ్లాన్ షా మెన్స్ హాకీ టోర్నమెంట్ లో భారత్ తన చిరకాల ప్రత్యతి పాకిస్తాన్ పై 3-1 గోల్స్ తేడాతో గెలుపొందింది. రెండు పరాజయాలను ఎదుర్కొన్న భారతజట్టు ఈ విజయంతో టోర్నీలో కొనసాగే అవకాశాలను నిలుపుకుంది. అత్యంత కీలకమైన ఈ మ్యాచ్ లో భారతజట్టు ఆటగాళ్ళు చక్కటి సంయమనంతో ఆడింది. మ్యాచ్ ఆరంభమైన నాలుగో నిముషంలో పాకిస్తాన్ ఆటగాడు మహమ్మద్ వకాస్ గోల్ చేయడంతో ఖంగుతిన్న భారతజట్టు ఎదురుదాడికి దిగింది. ఈ క్రమంలో మరు నిముషంలోనే భారత ఆటగాడు రూపీందర్ సింగ్ గోల్ చేయడంతో స్కోరు సమానమయింది. భారత్ తొమ్మిదో నిముషంలో ఆకాశ్ దీప్ రెండో గోల్.  56వ నిముషంలో మన్దీప్ సింగ్ మూడో గోల్ చేశారు. పాకిస్తాన్ ఆటగాళ్ళు ఎంత ప్రయత్నించినా భారత గోల్ కీపర్ శ్రీజేష్ అడ్డుకోవడంతో గోల్ సాధించడంలో విఫలమయ్యారు.

ఆస్ట్రేలియా ప్లేయర్లకు షాక్ ...

భారతదేశ పర్యటనలో వున్న ఆస్ట్రేలియా క్రికెట్ టీంకు ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డు షాకిచ్చింది. క్రికెట్ బోర్డు ఆదేశాలను పాటించనందుకు నలుగురు క్రికెటర్లపై ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు వేటు వేసింది. వైస్ కెప్టెన్ వాట్సన్, బౌలర్లు ప్యాటిన్సన్, జాన్సన్, ఖాజాలను పంజాబ్ లో మొహాలిలో జరిగే ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరిగే మూడో టెస్టు నుండి తప్పించింది. ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్నా నాలుగు టేస్ట్ సీరిస్ ను భారత్ రెండు టెస్టు మ్యాచుల్లో నెగ్గి ఆధిక్యంలో ఉంది. మూడో టేస్ట్ నుండి నలుగురు ఆటగాళ్ళుపై వేటు పడడంతో మూడో టేస్ట్ రసకందాయంలో పడింది. బోర్డు ఆదేశాలను పాటించనందుకే వీరిపై వేటు పడిందని ఆస్ట్రేలియా క్రికెట్ కోచ్  మికి ఆర్థర్ అంటున్నారు. ఈ వార్త తెలిసిన వెంటనే వైస్ కెప్టెన్ వాట్సన్ స్వదేశానికి తిరిగి వెళ్లిపోయినట్లు సమాచారం.