రోహిత్, రైనా దూకుడు, వన్డే సిరీస్ మనదే

        ఎట్టకేలకు టీమిండియా విజయపధంలో దూసుకుపోతుంది. ఇటీవల సొంతగడ్డపై కూడా సిరీస్‌లు సమర్పించుకున్న భారత్ ఇంగ్లండ్‌తో ఐదు వన్డేల సిరీస్ లో హ్యాట్రిక్ విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. మొహాలీ లో ఇంగ్లాండ్ పై ఐదు వికెట్లు తేడాతో విజయం సాధించింది.   258 పరుగుల లక్ష్య౦తో బరిలోకి దిగిన ఇండియా రహానె స్థానంలో వచ్చిన రోహిత్ 83 పరుగులు చేసి జట్టును పటిష్ట స్థితిలో నిలపాడు. రైనా 79 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్‌తో 89 నాటౌట్ గా నిలిచి లక్ష్యాన్ని పూర్తిచేసి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అందుకున్నాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ పూర్తి ఓవర్లలో ఏడు వికెట్లకు 257 పరుగులు చేసింది. కుక్ 76, కెవిన్‌పటర్సన్ 76పరుగులు చేసి అవుటయ్యారు. రూట్ 45 బంతుల్లో 57 పరుగులు చేసి నాటౌట్ నిలిచాడు. రవీంద్ర జడేజా (3/39) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఇషాంత్ శర్మ, అశ్విన్ రెండేసి వికెట్లు తీశారు. ఓ దశలో కుక్‌సేనను 43 ఓవర్లలో 176/4తో కట్టడి చేసిన భారత బౌలర్లు చివరి ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకున్నారు.  

బ్రిస్బేన్ వన్డేలో ఆస్ట్రేలియా చిత్తు, 74 ఆలౌట్

        బ్రిస్పేన్ లో శ్రీలంక తో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఘోర పరాజయం పాలైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ మొత్తం రెండంకెల స్కోరు కూడా నమోదు చేయలేకపోయారు. శ్రీలంక బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్లు పెవిలియన్ కి క్యూకట్టారు. ఆస్ట్రేలియా ఒక సందర్భంలో 40 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. అయితే, మిచెల్ స్టార్క్, జేవియర్ దొహర్తీ 8.1 ఓవర్లలో 34 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి కాస్తా ఊరట కల్పించారు. శ్రీలంక బౌలర్లు నువాన్ కులశేఖర (5/22), లసిత్ మలింగ (3/14) కంగారూలకు చుక్కలు చూపించారు. శ్రీలంక బౌలర్లు చెలరేగిపోవడంతో ఆస్ట్రేలియా 74 పరుగులకే పరిమితమైంది. 1986 తర్వాత ఆస్ట్రేలియా ఇంత దారుణమైన స్కోరు సాధించడం ఇదే మొదటిసారి. శ్రీలంక 75 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి చేదించింది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా, శ్రీలంక చెరో మ్యాచులో విజయం సాధించాయి. దీంతో సిరీస్ 1-1 స్కోరుతో సమంగా ఉంది.

రెండో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా

        కోచిలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో వన్డే లో ఇండియా జట్టు కెప్టెన్ ధోని టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇంగ్లాండు, భారత్ రెండో వన్డే జట్టులో ఓ మార్పు జరిగింది. ఫాస్ట్ బౌలర్ అశోక్ దిండా స్థానంలో పాకిస్తాన్‌తో జరిగిన చివరి వన్డేలో సత్తా చాటిన పేసర్ షమీ అహ్మద్‌కు తుది జట్టులో చోటు కల్పించారు. ఇంగ్లాండు కూడా ఒక మార్పు చేసింది. టిమ్ బ్రెస్నన్ స్థానంలో క్రిస్ వోక్స్ తుది జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌ను గెలుచుకోవాలని భారత్ ఉవ్విళ్లూరుతున్నా, రెండో వన్డేలోనూ విజయం సాధించి తీరాలని కుక్ సేన పట్టుదలతో ఉంది.   ఇండియా: ఎంఎస్ ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), గౌతం గంభీర్, అజింక్యా రహనే, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, సురేష్ రైనా, ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, షమీ అహ్మద్ ఇంగ్లాండు: అలిస్టిర్ కుక్ (కెప్టెన్), జ్యో రూట్, ఇయాన్ బెల్, జడే డెర్న్‌బ్యాచ్, స్టీవెన్ ఫిన్, క్రెయిగ్ కీష్వెట్టర్ (వికెట్ కీపర్), ఇయోన్ మోర్గాన్, సమిత్ పటేల్, కెవిన్ పీటర్సన్, జేమ్స్ ట్రెడ్‌వెల్, క్రిస్ వోక్స్

రాజ్ కోట్ వన్డేలో ఓడిన భారత్

        రాజ్ కోట్ లో ఇంగ్లాండ్ తో జరిగిన తొలి వన్డే లో ఇండియా 9 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి నష్టానికి 316 పరుగులు చేసింది. 326 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ కి దీగిన భారత్ ఓపెనింగ్ జోడి చాల రోజుల తరువాత మంచి ఆరంభాన్ని ఇచ్చారు. అజింక్యా రహనే 47 పరుగులు చేయగా, ఆ తర్వాత గంభీర్ 52 పరుగులు చేసి అవుటయ్యాడు.యువరాజ్ సింగ్, సురేష్ రైనా, గంభీర్ అర్థ సెంచరీలు చేసినా ఇండియాను గెలిపించలేకపోయారు. ట్రెడ్‌వెల్ నాలుగు వికెట్లు తీసి భారత్ దెబ్బ కొట్టాడు. భారత్ ఓడిన చివరి వరకు పోరాడింది.   టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ నాలుగు వికెట్ల నష్టానికి 325 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇంగ్లాండ్ ఓపెనర్లు అలిస్టర్ కుక్, ఇయాన్ బెల్ ఇండియా బౌలర్లను ఆటాడుకున్నారు. మొదటి వికెట్ కి వీరిద్దరూ 158 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇయాన్ బెల్ (85) పరుగులు చేయగా, అలిస్టర్ కుక్ (75) పరుగుల వద్ద అవుటయ్యాడు. ఆతరువాత బ్యాటింగ్ కి వచ్చిన ఇయాన్ మోర్గాన్, పీటర్సన్‌లు బాగా ఆడినప్పటికీ అర్ధసెంచరీలలు చేయలేక పోయారు.మోర్గాన్(41), పీటర్సన్(44) పరుగులు చేసి అవుటయ్యారు. అనతరం బ్యాటింగ్ కు దీగిన పటేల్, క్రెయిగ్ కీష్టెట్టర్ ఇండియా బౌలర్లను అదరగొట్టారు. పటేల్ 20 బంతుల్లో 44 పరుగులు చేశారు. క్రెయిగ్ కీష్టెట్టర్ 24 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు.     

రాజ్కోట్ వన్డే: ఇండియా టార్గెట్ 326

        రాజ్ కోట్ లో ఇండియా తో జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ నాలుగు వికెట్ల నష్టానికి 325 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇంగ్లాండ్ ఓపెనర్లు అలిస్టర్ కుక్, ఇయాన్ బెల్ ఇండియా బౌలర్లను ఆటాడుకున్నారు. మొదటి వికెట్ కి వీరిద్దరూ 158 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.   ఇయాన్ బెల్ (85) పరుగులు చేయగా, అలిస్టర్ కుక్ (75) పరుగుల వద్ద అవుటయ్యాడు. ఆతరువాత బ్యాటింగ్ కి వచ్చిన ఇయాన్ మోర్గాన్, పీటర్సన్‌లు బాగా ఆడినప్పటికీ అర్ధసెంచరీలలు చేయలేక పోయారు.మోర్గాన్(41), పీటర్సన్(44) పరుగులు చేసి అవుటయ్యారు. అనతరం బ్యాటింగ్ కు దీగిన పటేల్, క్రెయిగ్ కీష్టెట్టర్ ఇండియా బౌలర్లను అదరగొట్టారు. పటేల్ 20 బంతుల్లో 44 పరుగులు చేశారు. క్రెయిగ్ కీష్టెట్టర్ 24 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు.    

అదరగొట్టిన సచిన్..కాళ్లకు దండం పెట్టిన ఓ అభిమాని

      వన్డే క్రికెట్ రిటైర్మెంట్ తరువాత క్రికెట్ గాడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన కుటుంబంతో కలిసి ముస్సోరిలో గడిపాడు. అనంతరం ము౦బై తిరిగి వచ్చిన సచిన్ రంజీ మ్యాచ్ లో అదరగొట్టాడు. 35 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ముంబాయి ను సచిన్, జాఫర్ సెంచరీలతో నిలబెట్టారు. సచిన్ (233 బంతుల్లో 108; 10 ఫోర్లు, 1 సిక్సర్), వసీం జాఫర్ (256 బంతుల్లో 137 బ్యాటింగ్; 16 ఫోర్లు, 3 సిక్సర్లు) శతకాలతో చెలరేగారు. తొలిరోజు ఆట ముగిసే సరికి ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. సచిన్‌కు రంజీల్లో ఇది 18వ సెంచరీ కాగా, ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 80వది. భారత్ తరఫున గవాస్కర్ పేరిట ఉన్న అత్యధిక సెంచరీల (81) రికార్డుకు సచిన్ మరో సెంచరీ దూరంలో నిలిచాడు. ముంబయి జట్టు తరఫున ఆడుతున్న సచిన్ ప్రత్యర్థి బరోడా టీం బౌలర్లకు చుక్కలు చూపించాడు. సచిన్ టెండుల్కర్ చేసి పాంలోకి రావడంతో అభిమానులు కేరింతలు కొట్టారు. ఓ అభిమాని ఏకంగా స్టేడియం దిశగా దూసుకొచ్చాడు. అయితే అతనిని నిరాశపర్చడం ఇష్టం లేని సచిన్ చేతులు కలిపాడు. దీంతో ఆ అభిమాని సచిన్ కాళ్లకు దండం పెట్టడం విశేషం.

చివరి వన్డేలో గెలిచిన భారత్, రాణించిన బౌలర్లు

      ఢిల్లీ లో జరిగిన మూడో వన్డేలో ఇండియా పాకిస్తాన్ పై 10పరుగులతో విజయం సాధించింది. భారత్ యువ బౌలర్ల దెబ్బకు పాకిస్తాన్ 157 పరుగులకె ఆలౌటైంది. ఇషాంత్ శర్మ మూడు వికెట్లు తీయగా, భువనేశ్వర్ కుమార్, అశ్విన్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. షమీ అహ్మద్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీసుకున్నారు. మిస్బావుల్ హక్ 39, జంషెడ్ 34 పరుగులు చేశారు. ఉమర్ అక్మల్ 25 పరుగులు, హఫీజ్ 21 పరుగలు చేశారు. మిగితా బ్యాట్స్‌మెన్ ఎవరూ రాణించలేకపోయారు. మూడు వన్డేల సిరీస్‌ను పాకిస్తాన్ భారత్‌పై 2-1 స్కోరుతో కైవసం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 43.4 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాట్స్‌మెన్‌లలో కెప్టెన్ ధోనీ 36, రైనా 31, జడేజా 27, యువరాజ్ 23, గంభీర్ 15 పరుగులు చేయగా మిగిలిన వారందరూ కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. పాక్ బౌలర్లలో అజ్మల్ 5 వికెట్లు పడగొట్టగా, ఇర్ఫాన్ 2, జునైద్, ఉమర్ గుల్, హఫీజ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

కివీస్ చిత్తు, దక్షిణాఫ్రికా ఘనవిజయం

      కేప్‌టౌన్ లో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా ఘనవిజయం సాధించింది. న్యూజిలాండ్ పై ఇన్ని౦గ్స్ 27 పరుగులతో భారీ విజయం సాధించింది. మూడు రోజుల్లో ముగిసిన తొలి టెస్ట్ విజయం తో దక్షిణాఫ్రికా రెండుటెస్ట్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఓవర్‌నైట్ స్కోరు 169/4తో మూడోరోజ రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన కివీస్ 275 పరుగులకు ఆలౌటైంది. బ్రౌన్‌లీ (109) కెరీర్‌లో తొలి సెంచరీ సాధించినా ఓటమి నుంచి గట్టెక్కించలేకపోయాడు. బ్రెండన్ మెకల్లమ్ (51), వాట్లింగ్ (42) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. మొదటి ఇన్నింగ్స్‌లో కివీస్ 45 పరుగులకే ఆలౌట్‌కాగా, దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో ఎనిమిది వికెట్లకు 347 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.

కోల్ కతా వన్డే లో భారత్ ను చిత్తు చేసిన పాకిస్తాన్

      కోల్ కతాలో జరిగిన రెండో వన్డేలో పాకిస్తాన్ భారత్ ను చిత్తు చేసింది. 85 పరుగుల తేడాతో భారత్ పై ఘనవిజయం సాధించింది. మూడు మ్యాచ్ ల సిరీస్ ను ఇంకా ఒక వన్డే మిగిలి ఉండాగానే కైవసం చేసుకుంది. 251 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు శుభారంభాన్ని ఇవ్వలేకపోయారు. గంభీర్ 25 బంతుల్లో 11పరుగులు మాత్రమే చేసి జునైద్ బౌలింగ్ లో అవుటయ్యాడు. విరాట్ కోహ్లి కేవలం ఆరు పరుగులు చేసి పెవిలియన్ చేరుకున్నాడు. దీంతో ఇండియా 55 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తరువాత సెహ్వాగ్ కూడా 31 పరుగులు చేసి ఉమర్ గుల్ బౌలింగ్ లో అవుటయ్యాడు. పాకిస్తాన్ బౌలర్ల దెబ్బకి భారత బాట్స్ మెన్ లు మాత్రం వచ్చిన వాళ్ళు వచ్చినట్టు పెవిలియన్ కి క్యూ కట్టారు. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ఓపెనర్ మొహమ్మద్ హఫీజ్‌ను 76 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జడేజా అవుట్ చేయడంతో ప్రారంభమైన వికెట్ల పతనం చివరి వరకు కొనసాగుతూ వచ్చింది. ఓ వైపు వికెట్లు పడిపోతుంటే జంషెడ్ గట్టిగా నిలబడి సెంచరీ చేశాడు. 124 బంతుల్లో 106 పరుగులు చేసి అతను జడేజా బౌలింగులో అవుటయ్యాడు. ఒక దశలో 300 పైగా స్కోరు పాకిస్తాన్ చేస్తుందని అనుకున్నారు. కాని రవీంద్ర జడేజా మూడు ముఖ్యమైన వికెట్లు తీసి పాకిస్తాన్ మిడిల్ ఆర్డర్ ను దెబ్బ తీశాడు. రవీంద్ర జడేజా కు ఇషాంత్ శర్మ సూపర్ బౌలింగ్ తోడవడంతో పాకిస్తాన్‌ను 250 పరుగులకు భారత్ కట్టడి చేసింది.      

కోల్‌కతా వన్డేలో పాకిస్తాన్ 250 ఆలౌట్

      కోల్‌కతా లో జరుగుతున్న రెండో వన్డేలో పాకిస్తాన్ 250 పరుగులకు ఆలౌటైంది. స్కోరు బోర్డు వేగం పెంచే క్రమంలో పాకిస్తాన్ బ్యాట్స్ మెన్ లు ఒకరి వెనుక ఒకరు పెవిలియన్ కి క్యూ కట్టారు. ఒక దశలో 300 పైగా స్కోరు పాకిస్తాన్ చేస్తుందని అనుకున్నారు. కాని రవీంద్ర జడేజా మూడు ముఖ్యమైన వికెట్లు తీసి పాకిస్తాన్ మిడిల్ ఆర్డర్ ను దెబ్బ తీశాడు. రవీంద్ర జడేజా కు ఇషాంత్ శర్మ సూపర్ బౌలింగ్ తోడవడంతో పాకిస్తాన్‌ను 250 పరుగులకు భారత్ కట్టడి చేసింది. పూర్తి ఓవర్లను కూడా పాకిస్తాన్ ఆడలేకపోయింది. 48.3 ఓవర్లు మాత్రమే ఆడింది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ఓపెనర్ మొహమ్మద్ హఫీజ్‌ను 76 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జడేజా అవుట్ చేయడంతో ప్రారంభమైన వికెట్ల పతనం చివరి వరకు కొనసాగుతూ వచ్చింది. ఓ వైపు వికెట్లు పడిపోతుంటే జంషెడ్ గట్టిగా నిలబడి సెంచరీ చేశాడు. 124 బంతుల్లో 106 పరుగులు చేసి అతను జడేజా బౌలింగులో అవుటయ్యాడు. ఆ వెంటనే కమ్రాన్ అక్మల్ జడేజా చేతిలోనే డకౌట్ అయ్యాడు. పాకిస్తాన్ 34.3 ఓవర్లలో 177 పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయి పటిష్టమైన స్థితిలో ఉన్న పాకిస్తాన్ భారత బౌలర్ల ధాటికి కుప్పకూలింది.

న్యూజిలాండ్ 45 ఆలౌట్, కల్లిస్ రికార్డ్

      దక్షిణాఫ్రికా తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ 45 పరుగులకే తొలి రోజు కుప్పకూలింది. సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ల ధాటికి న్యూజిలాండ్ బాట్స్ మెన్ లు పెవిలియన్ కి క్యూకట్టారు. విలియమ్సన్ తప్ప ఒక్క బ్యాట్సుమెన్ కూడా రెండంకెల స్కోరు చేయలేదు. 19.2 ఓవర్లలోనే న్యూజిలాండ్ ఆలౌటైంది. టెస్టు లో న్యూజిలాండ్ కు ఇది మూడో అత్యల్ప స్కోరు. ఫిలాండర్ 5, మోర్కెల్3, స్టెయిన్ 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా అలవిరో పీటర్సన్(103) సెంచరీతో చెలరేగాడు. ఆమ్లా(66), కలిస్(60) రాణించారు. దీంతో దక్షిణాఫ్రికా 3 వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది. టెస్టు క్రికెట్లో 13వేల పరుగులు చేసిన నాలుగో బ్యాట్స్‌మన్‌గా 37 ఏళ్ల కలిస్ ఖ్యాతిగాంచాడు. మొదటి మూడు స్థానాల్లో సచిన్, పాంటింగ్, ద్రావిడ్ ఉన్నారు.

పాకిస్తాన్ పై భారత్ గెలుస్తుంది : సచిన్

      పాకిస్తాన్ తో జరుగుతున్న వన్డే సిరీస్ సెకండ్ మ్యాచ్ లో ఇండియా తిరిగి పుంజుకుంటుందని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ భరోసా వ్యక్తం చేశాడు. తాను ఇప్పుడు జట్టులో లేను కాని, తన మనస్సు ఎప్పుడు జట్టుతోనే ఉంటుందని అన్నాడు. కోల్ కత్తా లో జరుగనున్న మ్యాచ్ లో భారత్ తిరిగి పుంజుకొని సిరీస్ సమం చేస్తుందని సచిన్ ధీమా వ్యక్తం చేశాడు. తన 23 ఏళ్ల క్రికెట్ ప్రయాణంలో సహకరించిన వారందరికీ సచిన్ కృతజ్ఞతలు తెలిపాడు. తన సుదీర్ఘ ప్రయాణంలో కుటుంబంతో ఎక్కువ కాలం గడిపే సమయం చిక్కలేదని, ఇక్కడ ఉంటే మన దేశం ఎంత అందమైన దో, ఈ చోటు ఎంత చక్కగా ఉందో తెలుస్తోందని సచిన్ వివరించాడు.  తానిపుడు బ్యాడ్మింటన్, టెన్నిస్, టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడడంతో పాటు టీవీలో క్రికెట్ చూస్తూ గడుపుతున్నానని ఈ దిగ్గజం చెప్పాడు.                  

పాకిస్తాన్ పై ఇండియా సూపర్ విక్టరీ

      అహ్మదాబాద్ లో పాకిస్తాన్ తో జరిగిన రెండో ట్వంటీ20 మ్యాచులో యువరాజ్ సింగ్ సిక్స్ ల మోత మోగించాడు. పాకిస్తాన్ పై భారత్ 11 పరుగుల తేడాతో గెలిచింది. రెండు మ్యాచ్ ల ట్వంటీ20 సిరీస్ ను సమం చేసింది. 36 బంతుల్లో 72 పరుగులు చేశాడు. ఏడు సిక్స్‌లు, నాలుగు ఫోర్లతో యువీ సత్తా చాటాడు. ఓ వికెట్ కూడా తీసుకున్నాడు. యువరాజ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచుగా ఎంపికయ్యాడు.   టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దీగిన భారత్ కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభానిచ్చారు. గౌతమ్ గంభీర్ 21, రహనే 28 పరుగులు చేసి ఉమర్ గుల్ బౌలింగ్ లో అవుటయ్యారు. యువరాజ్ మెరుపులకు, ధోని సహకారం అందించడంతో ఇండియా 20 ఒవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దీగిన పాకిస్తాన్ ఓపెనర్లు అదరగొట్టినప్పటికీ, ఆ తరువాత బ్యాట్స్ మెన్లు ఎవరు నిలదొక్కుకోలేకపోయారు. నసీర్ జంషెడ్ 41 పరుగులు, సెహజాద్ 31, కెప్టెన్ మొహ్మద్ 39 బంతుల్లో 55 పరుగులు చేసినా ఫలితం లేకుండా పోయింది. పాకిస్తాన్ ఏడు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.భారత బౌలర్లలో దిండా మూడు వికెట్లు తీసుకోగా, కుమార్, అశ్విన్ చెరో వికెట్ తీసుకున్నారు.

వన్డేల్లో ఆగిన పరుగులయంత్రం

  క్రికెట్ నే శ్వాసించి జీవించే కోట్లాది క్రికెట్ అభిమానుల క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ మరిక మైదానంలో వారికి దర్శనం ఈయబోనని చెప్పి హట్టాత్తుగా మాయమయిపోనున్నాడు. 23 సం.లు పాటు నిర్విరామంగా పనిచేసి 18,468 పరుగులు సృష్టించి ప్రపంచంలో తనకి మరే యంత్రం సాటిరాదని నిరూపించిన పరుగులయంత్రం తనకీ ఇక విశ్రాంతి కావాలని సవినయంగా విన్నవించుకొని శాశ్వితంగా ఆగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తూ భారత క్రికెట్ రారాజు సచిన్ సచిన్ టెండూల్కర్ వన్డే క్రికెట్ నుండి తప్పుకొంటున్నట్లు ఈరోజు (ఆదివారం) ప్రకటించేడు.   త్వరలో జరగనున్న ఇండియా-పాకిస్తాన్ వన్-డే సిరీస్ లో తన విశ్వరూపం చూపించి దాయదులను కట్టడిచేస్తుంటే చూడాలనుకొంటున్న కోట్లాది అభిమానులను తీవ్రనిరాశకు గురిచేస్తూ, సరిగ్గా 23సం.ల క్రితం ఏ పాకిస్తాన్ టీమ్ తో ‘ఆడుకొని’ తన సుదీర్ఘ క్రికెట్ యాత్రని ప్రారంభించేడో, నేడు అదే టీముతో ఆడాల్సిన తరుణంలో సచిన్ టెండూల్కర్ వన్-డే పోటీలనుండి తప్పుకొంటున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. చివరికి, సెలక్టర్లు కూడా అతను తన నిర్ణయాన్ని ప్రకటించిన సమయం (టైమింగ్) చూసి చాలా ఆశ్చర్యపోయారు. ఏమయినప్పటికీ, క్రికెట్ రారాజు సచిన్ టెండూల్కర్ మరిక వన్డే క్రికెట్ లో మనకిక కనిపించబోడు.   తన నిర్ణయం ప్రకటిస్తూ సచిన్ టెండూల్కర్ ఇంతవరకు తనను తన ఆటను ఆదరించి గౌరవించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, 2015 సం.లో జరుగనున్న ప్రపంచ కప్ పోటీలకు సరయిన జట్టుకూర్పు ఏర్పడేందుకు వీలుకల్పించాలనే ఆలోచనతోనే తానూ తప్పుకొంటున్నట్లు ప్రకటించి హుందాగా జంటిల్ మ్యాన్ తప్పుకొన్నాడు. అయితే, గత కొంతకాలంగా తన పేలవమయిన ఆటతీరుతో ఇబ్బందిపడుతున్న సచిన్ టెండూల్కర్ కు తన రిటైర్మెంటు కోసం మీడియాలో జరుగుతున్నరగడ చూసి భాధతోనే క్రికెట్ నుండి హటాత్తుగా నిష్క్రమిస్తున్నట్లు అర్ధమవుతుంది.   అతని నిష్క్రమణ మంచిదా, కాదా అనే విషయాన్ని పక్కన పెడితే అతను భారత క్రికెట్ కు చేసిన సేవలు మరువరానివి. భారత క్రికెట్ టీం కీర్తిని దశ దిశలా వ్యాపింపజేసిన వారిలో అతనూ ఒక్కడు. సచిన్ టెండూల్కర్ అంటే భారతీయ క్రికెట్టుకి ప్రతిరూపం. భారతీయ క్రికెట్ అంటే సచిన్ టెండూల్కర్ అని క్రికెట్ ప్రేమికులు బావించడం అతనిపట్ల వారికున్న ప్రేమాభిమానాలకు ఒక నిదర్శనమయితే, వారు ఆవిధంగా అనుకొనే విదంగా ఆటలో జీవించిన ఘనత టెండూల్కర్ ది.   1989 వ సం.లో పాకిస్థానుతో అంతర్జాతీయ క్రికెట్ లోకి ప్రవేశించిన సచిన్ టెండూల్కర్ తన 23 సం.ల కెరీర్‌లో 463 వన్డేలు ఆడి 49 సెంచరీలు, 96 అర్ధ సెంచరీలతో అనితర సాద్యమయిన విదంగా 18, 428 పరుగుల్ని సాధించాడు. అంతే గాకుండా, తన జీవితాశయమయిన భారత్ దేశానికి ప్రపంచకప్ కూడా సాదించి నిష్క్రమిస్తున్నాడు.   అతను సాదించిన ఘన విజయాల వివరాలన్నిటినీ ఔపోసనపట్టిన క్రికెట్ ప్రేమికులకి మళ్ళీ ప్రత్యేకంగా వివరించనవసరం లేదు. వివరించదలిస్తే అది ఒక మహాగ్రందం అవుతుందని అందరికీ తెలుసు. సచిన్ టెండూల్కర్ భారత క్రికెట్ కు అందించిన సేవలకు భారత ప్రభుత్వం అతనిని పద్మవిభూషణ్, రాజీవ్ ఖేల్ రత్న అవార్డులతో సత్కరించింది. అతనికి దక్కిన అరుదయిన మరో గౌరవం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తన గ్రూప్ కెప్టెన్ హోదాతో గౌరవించడం. కొద్దికాలం క్రితం మైసూర్ విశ్వవిద్యాలయం వారు అతనికి గౌరవడాక్టరేట్ తో గౌరవించేరు. భారత ప్రభుత్వం కూడా అతని విశిష్ట సేవలకు గుర్తింపుగా రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేసి క్రికెట్ ప్రేమికులను సంతోషపరిచింది. అయితే కోట్లాది అభిమానుల కోరిక ‘భారత రత్న’ మాత్రం ఇంకా సాకారం కాక పోవడం వారికి విచారం కలిగిస్తోంది. అది అతనికి ఎంత గౌరవం కలిగిస్తుందో, డాన్ బ్రాడ్ మన్ లాంటి క్రికెట్ దిగ్గజాల సరసన నిలిచిన సచిన్ వల్ల కూడా ఆ బిరుదుకు అంతే వన్నె పెరుగుతుంది.   సచిన్ టెండూల్కర్ను కేవలం ఒక క్రికెట్ ఆటగాడిగా మాత్రమే గాకుండా, అతనిని భారత క్రీడా రాయభారిగా కూడా ప్రపంచం భావిస్తుంది. అందుకు, అతని విశిష్టమయిన ఆట ఒక్కటే కారణం మాత్రo కాదు. అతని విశితమయిన వ్యక్తిత్వం కూడా అందుకు ఒక కారణమని చెప్పవచ్చును. అతను క్రికెట్ ఆటను ఎంతగా ప్రేమిస్తాడో అంతకంటే ఎక్కువగా తన దేశాన్ని, తన ప్రజలను ప్రేమిస్తాడు. నిత్యం ప్రపంచం దేశాలు చుట్టి వచ్చే అతనికి భారత దేశంలో అడుగుపెట్టినప్పుడే సంపూర్ణమయిన ఆనందం అనుభూతి చెందుతానని చెప్పడమే అతని భారతీయ హృదయాన్ని ఆవిష్కరిస్తుంది.   ప్రపంచ దేశాల నడుమ తన మువ్వనెల భారతీయ పతాకం టీవిగా రెపరెపలాడుతూ నిలిపిన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నిష్క్రమణతో భారతీయ క్రికెట్ చరిత్రలో ఒక పెద్ద అధ్యాయం ముగిసింది. ఇక, భారతీయ క్రికెట్ చరిత్రలో సచిన్ కి ముందు, సచిన్ కి తరువాత అని రెండు శకాలుగా మనం ప్రస్తావించుకోక తప్పదు.

వన్డే క్రికెట్ కు సచిన్ టెండూల్కర్ గుడ్ బై

    భారత క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వన్డే క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. సడన్ గా సచిన్ టెండూల్కర్ వన్డేల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకోవడం అభిమానులను షాక్ కు గురిచేసింది. వన్డేలనుంచి తప్పుకుంటున్నట్టు సచిన్ చేసిన అభ్యర్థనను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ధృవీకరించింది. టెస్టు మ్యాచుల్లో కొనసాగుతానని సచిన్ ఈ సంధర్భంగా ప్రకటించారు. బీసీసీఐతో సహా తోటి క్రీడాకారులందరికీ కృతజ్ఞతలు తెలిపిన సచిన్ వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టులో తాను ఉండటం అదృష్టమని అన్నారు.463 వన్డేలు ఆడిన సచిన్ 18426 పరుగులు చేశాడు. వన్డేలలో 49 సెంచరీలు, 96 అర్ధ సెంచరీలను సచిన్ నమోదు చేశాడు.

ఢిల్లీ గ్యాంగ్ రేప్ బాధితురాలకు అంకితం: యువీ

ఇంగ్లాండ్ తో ట్వంటీ20 మ్యాచ్ లో ఆల్ రౌండ్ షోతో యువరాజ్ సింగ్ అదరగొట్టాడు. తనకు వచ్చిన 'మాన్ అఫ్ ది మ్యాచ్' అవార్డు ను ఢిల్లీ గ్యాంగ్ రేప్ బాధితురాలకు అకింతం చేశాడు. ఢిల్లీలో మెడికో పై జరిగిన గ్యాంగ్ రేప్ తనను ఎంతో కలచివేసిందని అన్నాడు. బాధితురాలు త్వరగా కోలుకోవాలని దేవుడుని దేవుణ్ని ప్రార్థిస్తున్నట్టు యువీ చెప్పాడు.   CLICK HERE FOR india vs england t20 PHOTOS యువరాజ్ ఆటపై ధోని ప్రశంసల జల్లు కురిపించారు.  ఇంగ్లాండ్ తో ట్వంటీ20 మ్యాచ్ లో యువరాజ్ అద్బుతంగా ఆడాడని అన్నాడు. మ్యాచ్ మొదట్లో ఇంగ్లాండ్ దూకుడు చూసి కొద్దిగా ఆందోళన చెందానని, తమ బౌలర్లు కట్టడి చేయగలిగారని అన్నాడు. మొదట్లో అశ్విన్ బాగా బౌలింగ్ చేశాడని అన్నాడు.తాము తగినన్ని పరుగులు చేయకపోవడమే ఓటమి కారణమని ఇంగ్లాండు కెప్టెన్ ఇయోన్ మోర్గాన్ అన్నాడు.    

భారత్ లో రికార్డ్ సృష్టించిన ఇంగ్లాండ్

    భారత్ లో ఇంగ్లాండ్ రికార్డ్ సృష్టించింది. 28 ఏళ్ల తర్వాత భారత గడ్డపై ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ చేజిక్కించుకుంది. నాగపూర్ లో ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాల్గో టెస్ట్ డ్రాగా ముగిసింది. 2-1తో ఇంగ్లాండ్ సిరీస్‌ను గెలుచుకుంది. నాగపూర్ టెస్ట్ కీలకమైన ఐదో రోజు ఇండియా బౌలర్లు వికెట్లు తీయడంలో విఫలమయ్యారు. రోజంతా ఆడి ఒక్క ఒక్క ట్రాట్ వికెట్ మాత్రమే తీశారు. ఇంగ్లాండు ఆటగాళ్లు పరుగుల కంటే వికెట్‌ను కాపాడుకునేందుకే ప్రాధాన్యత ఇచ్చారు. బెల్ (103) సెంచరీ చేశాడు. నాగపూర్ పిచ్‌పై భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తీవ్ర అసంతృప్తి వ్యక్థం చేశాడు. మరో మూడు నాలుగు రోడులు ఆడినా ఈ మ్యాచు డ్రా అయి ఉండేదని ఆయన నాలుగో టెస్టు మ్యాచ్ ఫలితంపై వ్యాఖ్యానించాడు.