భారత్ విజయాలకు వెస్టిండీస్ బ్రేక్

      భారత్ పర్యటనలో వెస్టిండీస్ వరుస పరాజయాలకు బ్రేక్ పడింది. విశాఖపట్న౦లో జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ రెండు వికెట్ల తేడాతో భారత్ పై గెలిచింది. డారెన్ సామి 45బంతుల్లో 63 పరుగులు చేసి విండీస్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు రోహిత్, ధావన్ శుభారంభాన్ని అందించలేకపోయారు. ఆ తరువాత కోహ్లి 99, ధోని 51 నాటౌట్ గా నిలిచి ఇండియాకు 288 పరుగులను అందించారు.     289 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. చార్లెస్ 12, ఆతరువాత వచ్చిన శామ్యూల్స్ 8 పరుగులు చేసి వెంటనే అవుటయ్యారు. ఈ స్థితిలో విండీస్ ను పావెల్, డారెన్ బ్రావో శతక భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. ఆ తరువాత సిమన్స్ 62, డారెన్ సామి 63 పరుగులు చేసి వెస్టిండీస్ కు విజయాన్ని అందించారు. ఈ విజయంతో విశాఖలో భారత్ వరుస విజయాలకు బ్రేక్ పడింది.   

వెస్టిండీస్ తో రెండో వన్డేకు 'వర్షం' దెబ్బ

      భారత్, వెస్టిండీస్ మధ్య రేపు విశాఖపట్నంలో జరగనున్న రెండో వన్డే కు వర్షం ఆటంకంగా మారె అవకాశం ఉంది. రెండు రోజులుగా విశాఖలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మైదానం మొత్తం నీటితో నిండివుంది. అత్యాధునిక డ్రైనేజ్ విధానం కలిగిన వైఎస్ రాజశేఖరరెడ్డి ఎసిఎ-విడిసిఎ స్టేడియంలో మ్యాచ్ ఆరంభానికి కనీసం ఆరు గంటలకు ముందు వర్షం నిలిచిపోతే మ్యాచ్ నిర్వాహణకు ఎటువంటి ఆటంకం ఉండదని ఎసిఎ ప్రతినిధులు చెబుతున్నారు. ప్రస్తుత వాతావరణాన్ని బట్టి మ్యాచ్ సాగే అవకాశాలున్నాయని చెబుతున్నారు. సాయంత్రం ప్రాక్టీస్‌కు మైదానం అనుకూలిస్తుందని భావిస్తున్నారు. రెండో వన్డే మ్యాచ్ జరుగుతుందని భావిస్తున్నారు. ఇరు దేశాల జట్లు శుక్రవారం సాయంత్రం విశాఖపట్నం చేరుకున్నాయి.

కొత్త ప్రపంచ ఛా౦పియన్ 'కార్ల్‌సన్‌'

      ప్రపంచ చెస్ సరికొత్త చాంపియన్ గా యువ ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సన్‌ ఆవిర్భవించాడు. సొంతగడ్డపై ఐదుసార్లు చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ కు షాకిచ్చాడు. నార్వేకి చెందిన మాగ్నస్ కార్ల్‌సన్ తొలిసారిగా ప్రపంచ చాంపియన్‌షిప్ కిరీటాన్ని సొంతం చేసుకున్నాడు. హోరాహోరీగా సాగిన పదో రౌండ్‌ను డ్రా చేసుకున్న కార్ల్‌సన్ 12 గేమ్‌ల ఈ మ్యాచ్‌లో మరో రెండు రౌండ్లు మిగిలుండగానే టైటిల్‌ను ఎగరేసుకుపోయాడు.   పది రౌండ్లు ముగిసే సరికి 6.5-3.5తేడాతో చాంపియన్‌గా నిలిచాడు. ఈ పది రౌండ్లలో మూడు గేమ్‌లు నెగ్గిన కార్ల్‌సన్, ఏడు గేమ్‌లు డ్రా చేసుకున్నాడు. కాగా, సొంతగడ్డపై నిర్వహించిన ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ ఆనంద్ ఒక్క గేమ్‌లో కూడా విజయం సాధించలేకపోయాడు. ఆనంద్ 2000, 2007, 2008, 2010, 2012లో ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిళ్లు సాధించాడు. ఆనంద్ తన 22 ఏళ్ల కెరీర్‌లో కనీసం ఒక్క విజయం కూడా లేకుండా ప్రపంచ చాంపియన్‌షిప్‌ను ముగించడం ఇదే తొలిసారి.

నయన్ తో శ్రీశాంత్ వివాహం

      ఐపిఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో జైలుకు వెళ్లిన బెయిల్ పై బయటకు వచ్చిన క్రికెటర్ శ్రీశాంత్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. శ్రీశాంత్ వివాహం గురువాయూర్ లోని శ్రీ కృష్ణ ఆలయంలో డిసెంబర్ 12న జరగనుందని శ్రీశాంత్ తల్లి సావిత్రి దేవి తెలిపారు. రాజస్థాన్ కు చెందిన ఓ రాయల్ కుటుంబానికి చెందిన నయన్ తో శ్రీశాంత్ వివాహం జరగనుంది. వీరిద్దరూ గతకొద్ది సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. శ్రీశాంత్ జైలుకి వెళ్ళిన సమయంలో నయన్ ఆసరాగా నిలిచి, తన ప్రేమను చాటుకుంది. దాంతో వీరి ప్రేమను అర్థం చేసుకున్న పెద్దలు కూడా ఒప్పేసుకున్నారు. శ్రీశాంత్ పెళ్లి వివరాలు త్వరలోనే మరిన్ని తెలియనున్నాయి.

నేటి నుంచే సచిన్ ఆఖరి మ్యాచ్

      ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాచ్ రానే వచ్చింది. మాస్టర్ బ్లాస్టర్ తన కెరీర్ కు ముగింపు పలికే ఆ పోరు ఈ రోజు మొదలైంది. క్రికెట్‌లో ఓనమాలు దిద్దిన ముంబై గడ్డపైనే ఈ పరుగుల వేటగాడు ఆఖరి ఆట ఆడుతున్నాడు. తన 200వ టెస్ట్‌తో తన పరుగుల దాహానికి పరిసమాప్తి పలుకనున్నాడు. మ్యాచ్ జట్ల మధ్యే జరుగుతున్న దృష్టంతా ఆ ఒక్కడిపైనే...ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. ఈ మ్యాచ్ లోనూ సచిన్ పై భారీగా అంచనాలున్నాయి. సచిన్ టెండూల్కర్ శతకంతో కెరీర్ కు ముగిస్తే చూడాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు.   మరోవైపు మొదటి మ్యాచ్ లో విజయంతో జోరు మీదున్న భారత్ జట్టు ఈ మ్యాచ్ లోనూ గెలిచి మాస్టర్ కు ఘనమైన వీడ్కోలు పలకాలనే పట్టుదలతో ఉంది. అయితే ఈ మ్యాచ్లోనైనా గెలిచి భారత అభిమానుల ఆశలపై నీళ్ళు చల్లాడానికి వెస్టిండీస్ సిద్దమైంది.

ఇండియా టార్గెట్ 351

      ఇండియాతో జరుగుతున్న ఆరో వన్డే మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా, భారత్ ముందు 350 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఒడి బ్యాటింగ్ కు దీగిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 350/6 పరుగులు చేసింది. ఆరంభంలో ఓపెనర్లను త్వరగా కోల్పోయిన ఆస్ట్రేలియా... ఆతరువాత వాట్సన్, కెప్టెన్ బెయిలీ సెంచరీలతో వీర విహారం చేశారు. కెప్టెన్ బెయిలీ156 (114బంతుల్లో13ఫోర్లు6 సిక్సర్లు), వాట్సన్102 (94బంతుల్లో13ఫోర్లు3సిక్సర్లు) చేయడంతో భారీ స్కోరు చేయగలిగింది. వోజేస్ 44 పరుగులతో నాటౌట్ నిలిచాడు. ఇండియా బౌలర్లలో అశ్విన్, జడేజా రెండేసి వికెట్లు తీయగా..భువనేశ్వర్, షామి ఒక వికెట్ తీశారు.

రంజీల్లో గెలిచిన సచిన్

      మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన చివరి రంజీ మ్యాచ్ లో అజేయంగా 79 పరుగులు చేసి ముంబై జట్టును గెలిపించాడు. హర్యానా జట్టుతో జరిగిన రంజీ ట్రోఫీరి మ్యాచులో ముంబై జట్టు నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మూడోరోజు మంగళవారం ఆటముగిసే సమయానికి ఆరు వికెట్లకు 201 రన్స్ చేసి విజయానికి 39 పరుగుల దూరంలో నిలిచింది. రహానె (40), కౌస్తుబ్ పవార్ (47) రాణించారు. మిగిలిన 39 పరుగులను బుధవారం ముంబై జట్టు సాధించి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.తన చివరి రంజీ ట్రోఫీ మ్యాచులో తన అనుభవాన్ని జోడించి తనదైన శైలిలో ఆడడం ద్వారా ముంబైకి సచిన్ ఈ విజయాన్ని అందించాడు.

జగన్ లోటస్ పాండ్ చేరుకోవడానికి 5 గంటల సమయం

      అక్రమాస్తుల కేసులో 16 నెలల అనంతరం జైలు నుండి విడుదలయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. జైలు నుంచి బయటకు వచ్చిన జగన్ ను చూసేందుకు అభిమానులను భారీ సంఖ్యలో రావడంతో జగన్ వాహనం కదలడం కష్టమయ్యింది. అభిమానులకు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ జగన్‌ కాన్వాయ్‌ ఊరేగింపులా సాగింది. జైలు వద్ద నాలుగు గంటలకు బయలు దేరిన జగన్ లోటస్ పాండ్ లోని తన ఇంటికి చేరుకోవడానికి సరిగ్గా ఐదు గంటల సేపు పట్టింది. జగన్ కు తల్లి విజయమ్మ, ఆయన భార్య భారతీ, చెల్లెలు షర్మిలాతో బంధువులు పెద్ద ఎత్తున జగన్ కి స్వాగతం పలికారు. కార్యకర్తల సందడితో లోటస్ పాండ్ ప్రాంతమంతా కోలాహలంగా మారింది.

జననీరాజనాల మధ్య ఇంటికి చేరిన జగన్

      అక్రమాస్తుల కేసులో 16 నెలల అనంతరం జైలు నుండి విడుదలయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంగరంగ వైభవంగా హైదరాబాద్ నగరంలో 12 కిలోమీటర్లు ర్యాలీ చేసుకుంటూ జయజయ ద్వానాల మధ్య 5 గంటల పాటు హంగామా చేసుకుంటూ లోటస్ పాండ్ లోని తన ఇంటికి వెళ్లారు.   ఉదయం నుంచే చంచల్‌గూడ జైళు దగ్గర గుమికూడిన జగన్‌ పార్టీ కార్యకర్తలు రాజకీయ సభను తలపించారు. కార్యకర్తలతో పాటు పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు కూడా జైళు వద్ద చేరి జగన్‌ రాకకోసం ఎదురు చూశారు. సాయంత్రం నాలుగంటల ప్రాంతంలో జగన్‌ అభిమానలకు పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తూ జైళు నుంచి బయటికి వచ్చారు. జగన్‌ జైళు నుంచి బయటి వచ్చిన దగ్గర నుంచే మొదలైంది అసలు కథ, ఎలాంటి ప్రదర్శనలకు అనుమతి తీసుకోక పోయిన ప్రతి కూడలిలో అభిమానులకు, కార్యకర్తలకు అభివాదం చేస్తే జగన్‌ కాన్వాయ్‌ ఊరేగింపులా సాగింది. సాయంత్ర వేల కావడంతో ప్రతి చోట భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. అయితే ప్రదర్శనకు అనుమతి లేకపోయినా ఎక్కడ పోలీసులు జగన్‌ కాన్వాయ్‌ని త్వరగా తీసుకెళ్లే ప్రయత్నం చేయకుండా బలప్రదర్శనకు సహకరించారు.

''మిస్ అమెరికా'' గా ఎంపికైన తెలుగమ్మాయి

      అమెరికా అందాల పోటిల్లో తెలుగుద‌నం త‌ళుక్కు మంది.. భార‌త్ చెందిన నీనా దావులూరి అమెరికాలో జ‌రిగిన అందాల పోటిల్లో మిస్ అమెరికా కిరీటాన్ని సొంతం చేసుకుంది. మిస్ న్యూయార్క్‌గా పోటిలో నిలిచిన నీనా 15 మంది ఫైన‌లిస్ట్‌ల‌ను అధిగ‌మించి మిస్ అమెరికా కిరీటంతో పాటు 50 వేల డాల‌ర్ట ప్రైజ్ మ‌నీ కూడా సొంతం చేసుకుంది. విజ‌య‌వాడ కు చెందిన నీనా త‌న అందంతోనే కాదు త‌న మాట‌ల‌తో కూడా అమెరిక‌న్స్ మ‌న‌సు గెలుచుకుంది. పుట్టుకతో వచ్చే శారీరక అందం, ఏ సర్జరీకి తలవంచని మాససిక ఆనందమే గొప్పదని చెప్పి అందరినీ ఆకట్టుకుంది. 24 నాలుగేళ్ల ఈ ముద్దుగుమ్మ అమెరికా అందాలపోటిల్లో గెలిచి మ‌రోసారి మ‌న దేశ‌గౌర‌వాన్ని తెలుగు వారి కీర్తిని పాశ్చాత్యుల‌కు ప‌రిచ‌యం చేసింది.

ప్రారంభ‌మైన తెలుగుజాతి ఆత్మగౌర‌వ యాత్ర

  తెలంగాణ ఏర్పాట ప్రక‌ట‌న‌తో రాష్ట్రం అగ్ని గుండంగా మారిన నేప‌ధ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలుగు జాతి ఆత్మగౌర‌వ యాత్ర చేస్తున్నారు. ఆదివారం నుంచి ఈ యాత్రను చెప‌ట్టనున్నారు చంద్రబాబు. ఆదివారం ఉద‌యం ఎన్టీఆర్ ఘాట్లో నివాళు అర్పించిన ఆయ‌న గుంటూరు జిల్లా దాచేప‌ల్లి మండ‌లం పొందుగుల వెళ్లారు. అక్కడి నుంచే యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. మొద‌టి విడ‌త‌లో గుంటూరు, కృష్ణా జిల్లాలో ప‌ర్యటించ‌నున్నారు. చంద్రబాబు యాత్రకు సంబందించి తొలి 5 రోజుల షెడ్యూల్ ఖ‌రార‌యింది. తొలి రోజు పొందుగుల నుంచి యాత్ర ప్రారంభించి శ్రీన‌గ‌ర్‌, గామాల‌పాడు, న‌డికుడి, దాచేప‌ల్లి, పిఠాపురం, బ్రాహ్మణ‌ప‌ల్లి మీదుగా పిడుగురాళ్ల వ‌ర‌కు 35 కిలో మీట‌ర్ల యాత్ర చేయ‌నున్నారు.

ఆ రేటుకు ఒప్పేసుకుంది

  దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్న సామెత హీరయిన్లు బాగా ఫాలో అవుతున్నారు. వయసు మీదపడుతున్న కొద్దీ హీరోయిన్ల గుండెల్లో గుబులు పెరుగుతుంది.. అందుకే అందం ఉండగానే అందినంత సంపాదించేయాలనుకుంటున్నారట. అందుకే ఓ భామ సినిమాలతో పాటు యాడ్స్ కు కూడా బాగా కాసులు వసూలు చేస్తుంది. ఏజ్ బార్ అవుతున్నా క్రేజ్ మాత్రం తగ్గకుండా కాపాడుకుంటున్న ఈ హీరోయిన్లు ఇప్పుడు కొన్ని బ్రాండ్స్ కి అంబాసిడర్ గా పనిచేస్తున్నారు. నయనతార కూడా ఇప్పుడు అదే జాభితాలో చేరింది. కొన్నేళ్లుగా పరిశ్రమలో తెలుగు , తమిళ భాషల్లో నటిస్తూ వచ్చిన నయన్‌ ఎన్నో మంచి మంచి సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులను అలరించింది. కొత్త వాళ్లు ఎంతమంది వచ్చినా గ్లామర్ విషయంలో మాత్రం నయన్ ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. అంతేకాక అమ్మడు ఇమేజ్ కూడా ఏమాత్రం తగ్గలేదు. మధ్యలో కొన్ని వివాదాలతో గ్యాప్ తీసుకున్న రీ ఎంట్రీలో మరోసారి దుమ్ములేపింది ఈ బ్యూటి దీంతో బ్రాండ్ అంబాసిడర్గా కూడా నయన్కు మంచి క్రేజ్ వచ్చింది. హైదరాబాద్ లో ని ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ త్వరలో ప్రారంభిస్తున్న ఓ బ్రాండుకు నయనతారను బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక చేసుకున్నారు. ఇప్పటికే నయన్ కూడా అందుకు అంగీరించిందట.

రూపాయి! రూపాయి! ఎందుకు పడిపోతున్నావ్?

    ......రమ     అప్పుడెప్పుడో అప్పటి అమెరికా ప్రెసిడెంటు భారతీయులు తెగ తినేస్తున్నారు... అందుకే ఆహార కొరత ఏర్పడి౦ది అంటే మనం గింజుకున్నాం... అంత మాటంటాడా అని అ పెద్దమనిషి మీద కారాలు, మిరియాలు నూరాం. కాని కొన్ని నిజాలు తెలుసుకుంటే నిజమే సుమీ! మనకి కాస్త తిండియావ ఎక్కువే... అనుకున్నాం కాని మరీ ఇంత అనుకోలేదు అని మన ముక్కులమీదే కాదు ఎదుటివాడి ముక్కుమీద కూడా వేలు వేసి మరీ ఆశ్చర్యపోతాం... వివరంగా చెప్పాలంటే రోజుకో ఆపిల్‌ తింటే ఆరోగ్యానికి మంచిదన్నారు కదా అని ఏకంగా పదకొండు వందల ఏభైరెండు కోట్ల రూపాయల ఆపిల్స్‌ని తినిపడేసారు... మంచిదేగా అంటారా? ఆ డబ్బు చేరింది మన దేశ రైతులకి కాదు విదేశీయులకి, డాలర్స్‌గా మారి చేరిపోయింది. మన సిమ్లా ఆపిల్స్‌.. పనికిరావని.. విదేశాల నుంచి గుట్టలుగుట్టలు అపిల్స్‌ని దిగుమతి చేసుకుని తిని పడేసారు... ఇండియాలో పండిన పండు తింటే స్టేటస్‌కి సరిపడదనేమో అమెరికా ఆపిల్సు, ఆస్ట్రేలియా అరంజస్‌.. వీటితో పాటు ఓ పక్క గిట్టుబాటుధర రాక మన రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే జీడిపప్పు లాంటివి కూడా దిగుమతి చేసేస్తున్నారు.. అక్షరాల 5వేల కోట్లకిపైగా విదేశీ మారకద్రవ్యాన్ని ఖర్చు చేసిమరీ... ఇలా మన ‘పెద్దల’ ప్రభుత్వం... ఆ పెద్దలకి విదేశీపళ్ళన్ని బంగారు పళ్ళెంలో పెట్టి మరీ అందిస్తూ... సామాన్యుడి నోటికి నాలుగు ముద్దలు కూడా చేరకుండా చేస్తోంది. ఆ పెద్దల తిండియావ ఎంతంటే 40 రూపాయల డాలర్‌ 65కి చేరిపోయేంత..    ఇవి చాలవన్నట్టు.. ఎవరికైనా మందుతో కొనటమెలాగో తెలిసిన మన ప్రభుత్వం విదేశీ ముద్యంకోసం 1150 కోట్లకి పైగా ఖర్చు చేసింది. ఖరీదైన తాగుబోతుల సౌకర్యార్దం ప్రభుత్వం అందిస్తున్న ఈ సదావకాశాన్ని పూర్తిగా సద్వినియోగ పరుచుకుంటూ కడుపునిండా తాగెస్తున్నారు బడాబాబులు. ఇలాంటి తిండి, తాగుడు... బడాబాబుల స్టేటస్‌కి తగ్గట్టు అందించటానికి సామాన్యుడిని బలి చేస్తోంది ప్రభుత్వం. ఇవన్నీ ఒక ఎత్తైతే కళ్ళద్దాలు, టీవిలు, వాచీలు, కారులు, ఫోన్లు... ఇలా ఒకటా రెండా ‘ఫారిన్‌’ పేరుని గొప్పలు చెప్పుకోటానికి లక్షల కోట్లు... బయటకి పంపిచెస్తూ సామాన్యుడిని ధరల కొరడాతో బాదెస్తోంది. బలిసిన వారి ఆకలి బక్కచిక్కిన వారి కడుపు కోడుతోంది. కొందరి విదేశీమోజు కోట్ల భారతీయులని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిస్తోంది. కర్ణుడి చావుకి వంద కారణాలు అన్నట్టు..రూపాయి విలువ పడిపోవటానికి ఈ దిగుమతులూ ఓ కారణం.  మన వల్ల కానట్టు మనకి చేత కాదన్నట్టు దిగుమతులకి అనుమతులు ఇచ్చేసి చేతులు దులుపుకుని.. హాయిగా సామాన్యుడి కష్టాలని... చూస్తూ ఆనందిస్తున్న మన ప్రభుత్వం...సంక్షేమ ప్రభుత్వమెలా అవుతుంది? పేదవాడి ప్రభుత్వమని ఎలా అంటారు...మన రైతుని బలవంతంగా చంపెస్తున్నారు... మన చిరువ్యాపారి ఊపిరి తీసెస్తున్నారు. మన పరిశ్రమలని మూసెస్తున్నారు. కేవలం బడాబాబుల సంక్షేమ ప్రభుత్వ మిది..    జయహో కాంగ్రెస్‌ జయహో మన్మోహన్‌ జయహో చిదంబరం

జూ.ఎన్టీఆర్ ను థ్రిల్ చేసిన సుకుమార్

      యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన రూట్ మార్చాడు. ఎప్పుడు భారీ స‌క్సెస్ లు ఇచ్చిన డైరెక్టర్స్‌తో సినిమాలు చేసే యంగ్ టైగర్..ఎప్పుడు క్రియేటివ్ డైరెక్టర్స్ కి కూడా ఛాన్స్ ఇస్తున్నాడు. ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా సుకుమార్ ఢైరెక్షన్లో చేయ‌బోతున్నాడు. ఇప్పటికే సుకుమార్ లైన్ విన్న ఎన్టీఆర్ సూప‌ర్‌గా ఇంప్రెస్ అయ్యాడ‌ట‌. దీంతో ప్రస్తుతం త‌ను చేస్తున్న రామ‌య్య వ‌స్తావ‌య్యా, ర‌భ‌స చిత్రాలు పూర్తవ‌గానే సుకుమార్ డైరెక్షన్లో సినిమాను సెట్స్ మీద‌కు తీసుకెళ్లే ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ట‌. బివియ‌స్ ఎన్ ప్రసాద్ నిర్మించనున్న ఈసినిమాకు సంభందించిన మ‌రిన్ని విష‌యాలు త్వర‌లో వెల్లడించ‌నున్నారు. సుకుమార్ ప్రస్థుతం మ‌హేష్‌బాబు హీరోగా వ‌న్ నేనొక్కడినే అనే సినిమా తెర‌కెక్కిస్తున్నాడు. చాలా రోజులుగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ సినిమా మ‌హేష్ స్లో పాల‌సీకి, సుకుమార్ ప‌ర్ఫెక్షన్ తోడై మ‌రింత ఆల‌స్యం అవుతుంది. అయితే మేకింగ్ సంగ‌తి ఎలా ఉన్న ఇప్పటికే రిలీజ్ అయిన టీజ‌ర్ సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డంతో సినిమా మీద కూడా అంచ‌నాలు భారీగా ఉన్నాయి.  

తెలంగాణ ఎఫెక్ట్: డిఐజి రాజీనామ

      కేంద్ర తెలంగాణ‌కు అనుకూలంగా సంకేతాలు ఇస్తున్న నేప‌ధ్యంలో ఇప్పుడు త్యాగాలు చేయ‌డం సీమాంద్ర ప్రజ‌ల వంతు అయింది.. గతంలో ఓ మ‌హిళ డిఎస్పీ రాజీనామ చేయ‌టం అప్పట్లో సంచ‌ల‌నం సృష్టించింది..ఇప్పుడు మ‌రోసారి అంలాటి రాజీనామనే తెర మీద‌కు వ‌చ్చింది.రాష్ట్ర విభ‌జ‌న‌ను నిర‌సిస్తూ డిఐజి ఇక్బాల్ రాజీనామ చేశారు.   తెలంగాణ పై నిర్ణయం తీసుకునే క్రమంలో భాగంగా రాయ‌ల‌సీమ‌ను విభ‌జించే ప్రయ‌త్నం కేంద్రం చేస్తుండ‌టంతో అందుకు నిర‌స‌న‌గా ఇక్బాల్ రాజీనామ చేశారు. సిన్సియ‌నర్ ఆఫీస‌ర్‌గా మంచి పేరున్న ఇక్బాల్‌కు ఇంకా 5 సంవ‌త్సరాల‌కు పైగా ప‌ద‌వీ కాలం మిగిలే ఉంది.చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న స‌మ‌యంలో చీఫ్ సెక్యూరిటీ ఆఫీస‌ర్‌గా ప‌నిచేసిన ఇక్బాల్ ఇటువంటి నిర్ణయం తీసుకోవ‌టం అంద‌రిని ఆశ్చర్యానికి గురిచేసింది.

నటి నిత్యా మీనన్ ఎంత పని చేసింది

      టాలివుడ్ అందాల భామ నిత్య మీనన్ వాళ్ళఇద్దరూ పైలట్లని ఉద్యోగంలోంచి సస్పెండ్ చేసేసారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే ..నిత్య మీనన్ బెంగుళూరు నుండి హైదరాబాద్ కి ఎయిర్ ఇండియా విమానంలో వెళ్తూన్నపుడు, ఆ ముద్దు గుమ్మకి అసలు ఇంత పెద్ద విమానాన్ని కేవలం ఇద్దరు మనుషులు ఎలా నడుపుతారో తెలుసుకోవాలని కోరిక పుట్టింది. అంతే ఆమె నేరుగా కాక్ పిట్ వద్దకు వెళ్లి తలుపు మీద సుతారంగా టక్ టక్మని కొట్టగానే తలుపు తీసి బయటకి తొంగి చూసిన మన కుర్ర పైలట్లు జగన్, కిరణ్ (ముఖ్యమంత్రి, జగన్ మోహన్ రెడ్డి కాదు లెండి)లకి తమ కోసమే ఆకాశం నుండి దిగివచ్చిన (ఆ టైంకి వాళ్ళు కూడా ఆకాశంలోనే ఉన్నారనే సంగతి మరిచిపోయారు) అప్సరసలా తలుపు దగ్గిర నిలబడి, ఓరకంట చూసి నవ్వుతున్న నిత్యా మీనన్ కనబడగానే నిజంగానే వారి గుండెలు జారి గల్లంతయిపోయాయి. ఇంకేముంది, ఆమెను సాదరంగాలోనకి ఆహ్వానించి తమ పక్కన ఖాళీగా ఉన్నసీటులో (ఆ సీటు కేవలం విమాన శిక్షణ ఇచ్చే మాస్టర్లకి, లేదా అటువంటి వారికి మాత్రమే కేటాయించబడింది) కూర్చోబెట్టుకొని, ఆమె తన పెద్దకళ్ళను విప్పార్చి తమవైపే చూస్తుంటే, వారిద్దరూ ఆమెతో ఉల్లాసంగా ఉత్సాహంగా కబుర్లు చెప్పుకొంటూ అలా అలా గాలిలో తేలిపోతున్నట్లు (విమానమన్నాక గాలిలోనే తేలుతుందని అందరికీ తెలుసు. గానీ, ఆ రోజు మరింత బాగా తేలిపోయిందని ప్రయాణికుల అభిప్రాయం) విమానాన్ని అలవోకగా ఎడం చేత్తో నడిపి చూపించి ఆమె నుండి మరిన్ని ముసిముసి నవ్వులు రాల్చుకొని పరమానందపడిపోయారు మన కుర్ర పైలట్లు ఇద్దరూ. ఆ తరువాత ఆమె హైదరాబాద్ రాగానే వారికి ‘టాటా టాటా బై బై’ చెప్పేసి బ్యాగు ఊపుకొంటూ వెళ్లిపోయింది. అంతే ఇంకేముంది? ఇద్దరు కుర్ర పైలట్లని సస్పెండ్ చేస్తూ ఆర్డర్లు చేతిలో పెట్టేసారు సదరు విమాన సంస్థ వారు. ఇప్పుడు వారిద్దరూ ‘ఎంతపనిచేసావే నిత్యా!’ అంటూ ఆక్రోశిస్తున్నారు పాపం!  

షరపోవా కొత్త కోచ్ గా మాజీ నెంబర్ వన్ ఆటగాడు

  యునైటెడ్ స్టేట్స్ మాజీ ఆటగాడు, ఎ.టి.పి. మాజీ నెంబర్ వన్ ఆటగాడు జేమ్స్ స్కాట్ జిమ్మీ కానర్స్ జులై 29, 1974 నుండి ఆగస్ట్ 22, 1977 వరకు ఎ.టి.పి. వరల్డ్ నెంబర్ వన్ ఆటగాడిగా కొనసాగాడు. రష్యా క్రీడాకారిణి మరియా షరపోవా వ్యక్తిగత కోచ్ స్వీడన్ కు చెందిన థామస్ హోగ్ స్టెడ్ తో ఇటీవల మనస్ఫర్థ లు ఏర్పడటంతో అతనితో ఉన్న కాంట్రాక్ట్ ను షరపోవా రద్దు చేసుకుంది. ఆపై షరపోవా వ్యక్తిగత కోచ్ కోసం జిమ్మీ కానర్స్ ను సంప్రదించగా జిమ్మీ కానర్స్ ఒప్పుకున్నట్లు షరపోవా ఒక ప్రకటనలో పేర్కొంది. ఇటీవల ముగిసిన 2013 వింబుల్డన్ టోర్నమెంట్ లో రెండో రౌండ్ లో వెనుదిరగాల్సి వచ్చింది. ఇకపై జిమ్మీ కానర్స్ ఆధ్వర్యంలో ముమ్మర ప్రాక్టీస్ చేసి తిరిగి తాను వరల్డ్ నెంబర్ వన్ స్థానాన్ని నిలేబట్టుకుంటానని షరపోవా తెలియజేసింది.