నాగపూర్ టెస్ట్ : ధోని 99 అవుట్, భారత్ 297/ 8

    నాగపూర్ లో ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా తొలి ఇన్నింగ్స్ లో 8 నష్టానికి 297 పరుగులు చేసింది. ఇంకా ఇండియా 33 పరుగులు వెనుకబడి ఉంది. ధోని ఒక్క పరుగు తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. 99 పరుగులు వద్ద ధోని రనౌటయ్యాడు. విరాట్ కోహ్లి సెంచరీ సాధించాడు. 289 బంతుల్లో 11 ఫోర్లతో సెంచరీ బాదాడు. టెస్టుల్లో అతడికిది మూడో సెంచరీ. కోహ్లికి తోడు ధోని రాణించడంతో భారత్ గౌరవ ప్రధామైన స్కోరు చేయగలిగింది. జడేజా(12), ధోనీ (99), చావ్లా(1) వెంటనే అవు టయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆండర్సన్ నాలుగు, స్వాన్ మూడు వికెట్లు తీశారు.

ఇంగ్లాండ్ 330 ఆలౌట్, సెహ్వాగ్ డకౌట్

    నాగపూర్ లో టెస్ట్ లో మొదటి ఇన్నింగ్ లో ఇంగ్లాండ్ 330 పరుగుల కు ఆలౌటైంది. ఐదు వికెట్ల నష్టానికి 199 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 242 పరుగుల వద్ద అశ్విన్ బౌలింగులో ప్రియర్ వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత వెంటనే ఇషాంత్ శర్మ బౌలింగులో బ్రెస్నన్ డకౌట్ అయ్యాడు. దీంతో 242 పరుగుల వద్ద ఇంగ్లాండు ఏడో వికెట్‌ను కోల్పోయింది. నిలకడగా ఆడుతున్నరూట్ 73 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పియూష్ చావ్లా బౌలింగులో అవుటయ్యాడు. భారత బౌలర్లలో పియూష్ చావ్లా మెరిశాడు. అతను నాలుగు వికెట్లు తీసుకున్నాడు. ఇప్పటి వరకు అంతగా రాణించని ఇషాంత్ శర్మ ఈ ఇన్నింగ్సులో మూడు వికెట్లు తీసుకున్నాడు. ఇంగ్లాండుతో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచులో భారత్ బ్యాటింగ్ చాలా నిరాశాజనకంగా ప్రారంభమైంది. తొలి ఇన్నింగ్సులో బ్యాటింగుకు దిగిన వీరేంద్ర సెహ్వాగ్ అండర్సన్ బౌలింగులో పరుగులేమీ చేయకుండా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రెండో బంతికే అతను పెవిలియన్ దారి పట్టాడు. ప్రస్తుతం గంభీర్, పుజారా క్రీజులో ఉన్నారు. 

అంధుల టీ-20 ప్రపంచకప్: పాక్ ను చిత్తు చేసిన భారత్

    అంధుల టి-20 ప్రపంచ కప్ ఫైనల్లో పాకిస్తాన్ ను చిత్తుచేసి భారత్ వరల్డ్ చాంపియన్ గా నిలిచింది. గురువారం జరిగిన ఫైనల్లో ఇండియా పాకిస్తాన్ పై 29 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా 20 ఓవర్లలో 258 పరుగులు చేసింది. కేతన్ భాయ్ పటేల్ 98 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. 259 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 229 పరుగులు చేసింది. గ్రూప్ దశలో పాకిస్తాన్ చేతిలో ఓటమిపాలైన భారత్ అందుకు ప్రతీకారం తీర్చుకుంది. గ్రూప్ దశలో వరుసగా ఎనిమిది మ్యాచ్‌లు గెలిచిన పాకిస్తాన్ ఫైనల్‌లో అదే స్థాయిలో రాణించలేకపోవడం గమనార్హం.

నాగపూర్ టెస్ట్ : తొలి రోజు ఇంగ్లాండ్ 199/5

    నాగపూర్ లో ఇంగ్లాండ్ తో జరుగుతున్న నాల్గో టెస్టులో ఇండియా బౌలర్ల జోరు కొనసాగుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు 5 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ కు ఆదిలోనే దెబ్బతగిలింది. మూడు పరుగులకే ఇషాంత్ శర్మ కాంప్టన్ వికెట్ తీసుకున్నాడు. ఆ తరువాత కొద్దిసేపటికే ఈ సిరీస్ లో సెంచరీలు మీద సెంచరీలు చేస్తున్న కుక్ ను కూడా శర్మ అవుట్ చేశాడు. లంచ్ బ్రేక్ తరువాత నిలకడగా రాణిస్తున్న ట్రాట్ 44 పరుగుల వద్ద జడేజా అవుట్ చేశాడు. ఇంగ్లాండ్ 119 పరుగుల బెల్ (1) తొందరగానే అవుటయ్యాడు. డేంజర్ బ్యాట్స్ మెన్ నిలకడగా ఆడుతున్న పీటర్సన్ 73 పరుగులకు జడేజా అవుట్ చేసి ఇంగ్లాండ్ ని కోలుకొని దెబ్బ తీశాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ ఆటగాళ్లు రూట్ 31, ప్రయర్ 34 పరుగులతో క్రీజులో ఉన్నారు.ఇ షాంత్, జడేజాలిద్దరు రెండేసి వికెట్లు తీసుకున్నారు.

నాగపూర్ టెస్ట్ లో ఇండియా బౌలర్ల జోరు, ఇంగ్లాండ్ 156/5

    నాగపూర్ లో ఇంగ్లాండ్ తో జరుగుతున్న నాల్గో టెస్టులో ఇండియా బౌలర్ల జోరు కొనసాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ కు ఆదిలోనే దెబ్బతగిలింది. మూడు పరుగులకే ఇషాంత్ శర్మ కాంప్టన్ వికెట్ తీసుకున్నాడు. ఆ తరువాత కొద్దిసేపటికే ఈ సిరీస్ లో సెంచరీలు మీద సెంచరీలు చేస్తున్న కుక్ ను కూడా శర్మ అవుట్ చేశాడు. లంచ్ బ్రేక్ తరువాత నిలకడగా రాణిస్తున్న ట్రాట్ 44 పరుగుల వద్ద జడేజా అవుట్ చేశాడు. ఇంగ్లాండ్ 119 పరుగుల బెల్ (1) తొందరగానే అవుటయ్యాడు. డేంజర్ బ్యాట్స్ మెన్ నిలకడగా ఆడుతున్న పీటర్సన్ 73 పరుగులకు జడేజా అవుట్ చేసి ఇంగ్లాండ్ ని కోలుకొని దెబ్బ తీశాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ 76 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి156 పరుగులతో బ్యాటింగ్ చేస్తుంది. 

అంబటి రాయుడికి లక్కీ ఛాన్స్..!

    ఆంధ్ర క్రికెటర్ అంబటి రాయుడు ఎదురు చూపులు ఫలించాయి. తొలిసారి ఇండియా టీంలో ఎంపికయ్యాడు‌. గాయాలతో బాధపడుతున్న మనోజ్ తివారీ స్థానంలో రాయుడికి చోటు దక్కింది. మొదట తివారీని టీమ్‌లోకి ఎంపిక చేసినా గాయం కారణంగా అతను తప్పుకున్నాడు. ప్రస్తుతం బరోడాకు ఆడుతున్న అంబటి రాయుడికి అవకాశం దక్కింది. ఈ రంజీ సీజన్‌లో ఇప్పటికే ఆరు మ్యాచ్‌లు ఆడిన రాయుడు ఓ సెంచరీతో పాటు నాలుగు అర్థ సెంచరీలు చేశాడు. 27 ఏళ్ల రాయుడు జాతీయ జట్టుకు ఎంపికవడం ఇదే తొలిసారి. మంచి ఫాంలో ఉన్న రాయుడు ఐపీఎల్ 5లో 15 ఇన్నింగ్స్‌లో 333 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్‌తో జరిగే టీ 20 మ్యాచ్‌లో రాయుడు ఆడనున్నాడు.

నేనయితే వెంటనే రిటైర్మెంట్ తీసుకోనేవాడిని: గంగూలి

  మొన్న కొల్కోట ఈడెన్ గార్డెన్స్ లో పేలవమయిన ప్రదర్శన ఇచ్చిన సచిన్ టెండూల్కర్ ఆటతీరుపై స్పందిస్తూ, ‘బెంగాలీ దాదా’ సౌరభ్ గంగూలి మీడియాతో మాట్లాడుతూ “ఒక మేటి బ్యాట్స్ మ్యాన్నుంచి ఆశించవలసిన ఆట కాదు అది. ఈ సిరీస్ లో సచిన్ సగటు పరుగులు కేవలం 22 మాత్రమె. అతని అత్యదిక స్కోరు కేవలం 76 పరుగులు మాత్రమె. అతనిని నుండి ఏంతో ఆశించిన అభిమానులు, నేనుకూడా చాలా నిరాశకి గురయ్యాము. నేనే అతని స్తానంలో ఉండిఉంటె ఈ విధమయిన పేలవమయిన ఆట ఆడేబదులు తప్పక టీంనుండి వైదోలగుతూ రిటైర్మెంట్ తీసుకోనేవాడిని,” అని అన్నాడు.   అసలే సచిన్ ఆట తీరుపై అన్నివైపులనుండీ విమర్శలు జడివానలా కురుస్తుండగా, ఇప్పుడు గంగూలి చేసిన వ్యాక్యలతో సచిన్ పరిస్తితి మరింత ఘోరంగా మారింది. తన ఆట తీరుని గమనించుకొని కూడా, అందరు రిటైర్మెంట్ తీసుకోమని ఒత్తిడి చేస్తున్నాకూడా, ఇంకా తన పేలవమయిన ప్రదర్శన కొనసాగిస్తూ, ఇంత కాలం తానూ కష్టపడి సంపాదించుకొన్న కీర్తి ప్రతిష్టలను తానే తుడిచిపెట్టేసుకొంటున్నడేమో అతను ఆలోచించాలి. మరింత అవమానకర పరిస్తితుల్లో నిష్క్రమించడం కన్నా, పూర్తిగా పరువుపోక మునుపే ఇప్పుడే హుందాగా తప్పుకొంటే బాగుంటుందేమో అతను ఆలోచించాలి.

మూడో టెస్టులో ఇంగ్లాండ్ ఘనవిజయం

    ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ లో ఇండియా ఘోర పరాజయం పాలైంది. ఇంగ్లాండ్ బాట్స్ మెన్లు సెంచరీలు మీద సెంచరీలు చేస్తున్న పిచ్ పై భారత బాట్స్ మెన్లు మాత్రం పరుగులు చేయలేక చతికలపడ్డారు. ఇంగ్లాండ్ ఇండియా పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. సిరీస్ లో ఇంగ్లాండ్ 2-1తో ముందంజలో ఉంది.   239/9 పరుగులతో ఐదో రోజు ఆటను ప్రాంభించిన ఇండియా మరో ఎనిమిది పరుగులు జోడించి పదో వికెట్‌ను కూడా కోల్పోయింది. అండర్సన్ బౌలింగులో ఓఝా(3) ఔటయ్యాడు. రెండో ఇన్నింగ్ కోసం బ్యాటింగుకు దిగిన ఇంగ్లాండ్ తొలి ఓవర్ లోనే వికెట్ కోల్పోయింది. కుక్(1) అశ్విన్ బౌలింగులో పెవిలియన్ చేరుకున్నాడు. మూడో ఓవర్లో ట్రాట్(3) ఓఝా బొలింగులో ఎల్బీగా వెనుదిరిగాడు.  ఆ తరువాత క్రీజులోకి వచ్చిన పీటర్సన్ పరుగులేమీ చేయకుండానే ధోనీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరుకున్నాడు.మొదటి నాలుగు ఓవర్లలోనే మూడు ముఖ్యమైన వికెట్లు పోవడంతో భారత్ అభిమానులు ఏమైనా అద్భుతం జరుగుతుందేమోనని ఆశ పడ్డారు.బెల్ దూకుడుగా ఆడి 28 బంతుల్లో 28 పరుగులు చేసి ఇంగ్లాండుకు విజయం సాధించి పెట్టాడు. ఇండియా సిరీస్ పరాజయం నుంచి తప్పించుకోవాలంటే తరువాతి మ్యాచ్ గెలవడం తప్పనిసరి.

523 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్

      కోల్ కతాలో జరుగుతున్న మూడో టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 523 పరుగులకు ఆలౌటైంది. 509/6 పరుగులతో నాల్గో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ భారత బౌలర్ల దెబ్బకి 15 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి ఆలౌటైంది. దీంతో ఇంగ్లాండ్ కు భారత్ పై 207 పరుగుల ఆధిక్యం లభించింది. నాల్గో రోజు ఆట ప్రారంభమైన రెండో బంతికే ప్రజ్ఞాన్ ఓజా గ్రేమ్ స్వాన్ ఔట్ చేసాడు. తర్వాతి ఓవర్లో జహీర్ ఖాన్ మరో ఓవర్ నైట్ బ్యాట్స్ మెన్ మాట్ ప్రియర్ ను పెవిలియన్ దారి పట్టించాడు. ఆ తర్వాత అశ్విన్ రెండు బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టాడు. జేమ్స్ అండర్సన్, మాంటీ పనేసర్ ను ఔట్ చేసాడు. ఇండియా బౌలర్లలో ఓజాకు నాలుగు వికెట్లు లభించగా, అశ్విన్ కి మూడు వికెట్లు, ఇషాంత్ శర్మ, జహీర్ ఖాన్ తలో వికెట్ తీసుకున్నారు.

రామ్ చరణ్ జోక్యంతో వాయిదా పడ్డ ‘నాయక్’ ఆడియో

  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ, అందాల భామలు కాజల్ అగర్వాల్, మరియు అమల పాల్ కలిసి నటించిన ‘నాయక్’ సినిమా గురించి అభిమానులు చాల ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాని వివివినాయక్ దర్శకత్వం వహిస్తుండటంతో సినిమాపై అభిమానుల్లో భారిఅంచనాలే ఉన్నాయి. సినిమా షూటింగ్ మొదలు పెట్టిన మొదటి వారంలోనే ‘ఫస్ట్-లుక్-స్టిల్స్’ రిలీజ్ చేసిన వినాయక్ అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అది కూడా మంచి యాక్షన్ సీన్లకి సంబందిచినవి కావడంతో సినిమా షూటింగ్ మొదలు పెట్టిన మొదటి వారంలోనే సినిమాకి మంచి క్రేజ్ సృష్టించగలిగేడు.   ఈ సినిమా జనవరి 9న సంక్రాంతి బరిలో దిగబోతోందని ముందే ప్రకటించేరు. ఇక, ఆడియో రిలీజ్ ఫంక్షన్ కూడా ఈనెల 14వ తేదిన హైదరాబాదులో గల శిల్పకళా వేదికలో ఘనంగా జరిపేందుకు ముందు అనుకొన్నపటికీ, రామ్ చరణ్ జోక్యం తో అది వాయిదా పడినట్లు తెలుస్తోంది. ముందు అనుకున్నదానికంటే మరింత భారి ఏర్పాట్లు చేసి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తన అభిమానులందరూ పాల్గోనేవిదంగా ఘనంగా నిర్వహిస్తే బాగుంటుందని ఆతను సలహా ఇచ్చినట్లు తెలిసింది. అందుకే, 14న జరుపదలపెట్టిన ఆడియో రిలీజ్ ఫంక్షన్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. అదిగాకుండా, ఆ రోజు రామ్ చరణ్ ‘నాయక్’ సినిమాకోసం కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించాలని అనుకొంటుంనందువల్ల ఫంక్షన్ మరో రోజుకి వాయిదా వేసుకొంటే బాగుంటుందని దర్శకుడు వినాయక్, నిర్మాత దానయ్య కూడా అభిప్రాయ పడినట్లు తెలుస్తోంది. అందువల్ల త్వరలోనే మరో తేది ప్రకటించే అవకాశం ఉంది.   నిర్మాతలు: దానయ్య మరియు రాధాకృష్ణ, బ్యానర్:యూనివర్సల్ మీడియా; దర్శకత్వం:వివి వినాయక్; సంగీతం: తమన్, కేమెర: చోట కే.నాయుడు.

కేన్సరంటే నాకు భయం లేదు: మనీషా కొయిరాలా

    బాలీవుడ్ నటి మనీషా కొయిరాలాకు అండాశయ కేన్సర్ అని వైద్యులు నిర్థారించారు. తను అండాశయ కేన్సర్ వ్యాధి బారిన పడిన తర్వాత తొలిసారిగా స్పందించారు. మనీషా ట్విట్టర్ లో తనకు  కేన్సర్ కేన్సర్ వ్యాధి అంటే భయం లేదనీ ,  అభిమానులు కూడా తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందవద్దని  పేర్కొంది. అభిమానుల ప్రేమాభిమానాలతో తిరిగి తను పూర్తి  ఆరోగ్యంతో  ఇండియా వస్తానని చెప్పింది .  కేన్సర్ వ్యాధి నుంచి కోలుకుంటానన్న నమ్మకం ఉందని పేర్కొంది. తన  ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేస్తున్న వారందరికీ పేరుపేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్లు పేర్కొంది. 

ధోని 50..ఇండియా 316 ఆలౌట్

    ఈడెన్ గార్డెన్స్ లో ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ మొదటి ఇనింగ్స్ లో భారత్ 316 పరుగులకు ఆలౌటైంది. ఏడు వికెట్ల నష్టానికి 273 పరుగులతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇండియా కేవలం నాలుగు పరుగుల వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయింది. జహీర్ ఖాన్(6), ఇషాంత్ శర్మ(0)తో ఔటయ్యారు. ఒంటరి పోరాటం చేసిన ధోని 52 పరుగుల చేసి అవుటవ్వడంతో ఇండియా 316పరుగులు చేయగలిగింది.ఇంగ్లాండు బౌలర్లలో అండర్సన్ మూడు, పనేసర్ నాలుగు, స్వాన్ ఒక వికెట్ తీసుకున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచకున్న ఇండియా 47 పరుగుల వద్ద సెహ్వాగ్ 23 తొలి వికెట్ కోల్పోయింది. ఆ తరువాత పనేసర్ పుజారాను 16 పరుగుల వద్ద అవుట్ చేశాడు. గంభీర్ 60 అర్థ సెంచరీ చేసి పనేసర్ బౌలింగులో ట్రాట్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఇంగ్లాండుతో జరుగుతున్న సిరీస్‌లో విరాట్ కోహ్లీ విఫలమవుతూ వస్తున్నాడు. కేవలం ఆరు పరుగులు చేసి కోహ్లీ అండర్సన్ బౌలింగ్‌లో పెవిలియన్ దారి పట్టాడు. ఆ తర్వాత కాసేపటికి వచ్చిన యువరాజ్ సింగ్ నిలదొక్కుకున్నట్లుగానే కనిపించాడు. అయితే 32 వ్యక్తిగత పరుగుల వద్ద స్వాన్ బౌలింగులో కుక్‌‌కు క్యాచ్ ఇచ్చాడు. 215 పరుగుల వద్ద భారత్ 5 వికెట్ కోల్పోయింది. సచిన్ టెండూల్కర్ సెంచరీ దిశగా వెళ్తున్న సమయంలో అతను అండర్సన్ బౌలింగులో ప్రియర్‌కు దొరికిపోయాడు. సచిన్ రూపంలో ఆరో వికెట్ భారత్ కోల్పోయింది. సచిన్ 76 పరుగులు చేశాడు. భారత్ స్కోర్ 230 వద్ద ఉన్నప్పుడు ఔటయ్యాడు. ఇది టెండూల్కర్‌కు 66వ అర్థ సెంచరీ.

జగన్ పార్టీలోకి మాజీ మంత్రి వసంత

    తెలుగు దేశం పార్టీ నేత, మాజీ మంత్రి వసంత నాగేశ్వర రావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కృష్ణా జిల్లా కేడిసిసి బ్యాంకు చైర్మన్ గా ఉన్న వసంత గతంలో ఆప్కాబ్ చైర్మన్ గా కూడా పని చేశారు. జిల్లాలోని నందిగామ మండలం ఇతవరం గ్రామంలో స్థానిక నాయకులతో కలిసి వసంత జగన్ పార్టీ లో చేరారు. తన కుమారుడు వెంకట కృష్ణ కూడా జగన్ పార్టీలో చేరాలని భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. జగన్ పార్టీలో చేరి, వైఎస్ ఋణం తీర్చుకుంటానని వసంత అన్నారు. 1983-84 మధ్య కాలంలో ఎన్టీఆర్ మంత్రి వర్గంలో వసంత రాష్ట్ర హోం మంత్రిగా పని  చేశారు. అయితే, వసంత జగన్ పార్టీలో చేరికఫై భిన్న కధనాలు వినిపిస్తున్నాయి. విజయవాడ ఎంపి లగడపాటి రాజ్ గోపాల్ తో వైరం వల్ల జగన్ పార్టీలో చేరారా లేక వేరే కారణాలు ఉన్నాయా అనేది మాత్రం ఇంకా స్పష్టం కాలేదు.

ప్రిన్స్ మహేష్ బాబు సినిమా ఏది...?

  సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మరో నెల రోజుల వ్యవధిలో విడుదల అయ్యే అవకాశం ఉంది, ఇక సుకుమార్ తో సినిమా ఆ తర్వాత వస్తుంది. మరి ఆ తర్వాత ప్రిన్స్ మహేశ్ బాబు సినిమా ఏది? ఇకపై వేగంగా సినిమాలు చేస్తానని మాట ఇచ్చిన మహేశ్ బిజినెస్ మ్యాన్ తర్వాత మాట నిలుపుకోలేదు. ఆ సినిమా విడుదల అయిన ఏడాదికి కానీ మళ్లీ ప్రేక్షకులను పలకరించలేదు. మరి వరసగా రెండు సినిమాలు వచ్చే అవకాశం ఉందిప్పుడు. ఆ రెండు విడుదలయిన తర్వాత మళ్లీ ఏడాది వరకూ మళ్లీ మహేశ్ సినిమా ఏదీ విడుదల అయ్యే అవకాశం కనపడటం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకూ తర్వాతి ప్రాజెక్టు విషయంలో కన్పర్మేషన్ లేదు. అయితే రూమర్లు మాత్రం ప్రచారంలో ఉన్నాయి. మహేశ్ బాబు, క్రిష్, అశ్వినీదత్ కాంబినేషన్ లో ఒక సినిమా రావొచ్చు అని అంటున్నారు. దాని పేరు ‘శివం’ అని ప్రచారం లో ఉంది. ఇంకా మహేశ్, శ్రీనువైట్ల కాంబోలో మరోసినిమా వస్తుందంటున్నారు. ఇది కూడా కాదంటే…మహేశ్ కొంచెం రిలీఫ్ కోసం ఒక బాలీవుడ్ పిక్చర్ చేసే యోచన కూడా ఉందట! మరి వీటిలో ఏది పట్టాలెక్కుతుందో!

రవితేజ 'సారొచ్చారు' ఆడియో ట్రాక్ లిస్ట్

    మాస్ మహరాజ రవితేజ కొత్త సినిమా ‘సారొచ్చారు' ఆడియో సాంగ్స్ రిలీజ్ డేట్ ను ఖరారు చేశారు. రేపు ఈ చిత్రం ఆడియోను హైదరాబాద్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో దేవిశ్రీ ప్రసాద్ ‘రచ్చ రంబోలా' అనే మసాలా సాంగును కంపోజ్ చేసారు. రవితేజ - దేవిశ్రీ కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్ని మంచి మ్యూజికల్ హిట్ అయ్యాయి. ‘సారొచ్చారు' లో రవితేజ సరసన కాజల్, రిచా గంగోపాధ్యయ్ హీరోయిన్లుగా చేసారు. డిసెంబర్ 21న ఈచిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రాన్ని వైజయంతిమూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. ‘సారొచ్చారు' ఆడియో సాంగ్స్ ట్రాక్ లిస్ట్: 1. మేడ్ ఫర్ ఈచ్ అదర్ 2. జగదేక వీరా 3. రచ్చ రంబోలా... 4. గుస గుస 5. కాటుక కళ్లు

ఆస్ట్రేలియాను చిత్తు చేసిన సౌతాఫ్రికా

    పెర్త్ టెస్టులో ఆస్ట్రేలియాను సౌతాఫ్రికా చిత్తు చేసింది. దక్షిణాఫ్రికా 309 పరుగులతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాదించింది. 40/0 పరుగులతో నాల్గో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా సౌతాఫ్రికా బౌలర్ల దెబ్బకి 322 పరుగులకే ఆలౌట్ అయింది. ఆఖరి బ్యాట్స్ మెన్ మైఖేల్ స్టార్క్, నాథన్ లియోన్‌లు కొద్ది సేపు పోరాడి వెనుదిరిగారు. స్టార్క్ 68, లియోన్‌లు 43 పరుగులు చేశారు. డేల్ స్టెయిన్, రాబిన్ పీటర్స్ మూడేసి, మార్నే మోర్కెల్, వెర్నాన్ ఫిలాండర్‌లు రెండేసి వికెట్లు తీసుకున్నారు. సఫారీ జట్టు 1-0తో సిరీస్ సొంతం చేసుకొని టెస్టుల్లో నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది.