రవితేజ 'సారొచ్చారు' ఆడియో ట్రాక్ లిస్ట్

    మాస్ మహరాజ రవితేజ కొత్త సినిమా ‘సారొచ్చారు' ఆడియో సాంగ్స్ రిలీజ్ డేట్ ను ఖరారు చేశారు. రేపు ఈ చిత్రం ఆడియోను హైదరాబాద్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో దేవిశ్రీ ప్రసాద్ ‘రచ్చ రంబోలా' అనే మసాలా సాంగును కంపోజ్ చేసారు. రవితేజ - దేవిశ్రీ కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్ని మంచి మ్యూజికల్ హిట్ అయ్యాయి. ‘సారొచ్చారు' లో రవితేజ సరసన కాజల్, రిచా గంగోపాధ్యయ్ హీరోయిన్లుగా చేసారు. డిసెంబర్ 21న ఈచిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రాన్ని వైజయంతిమూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. ‘సారొచ్చారు' ఆడియో సాంగ్స్ ట్రాక్ లిస్ట్: 1. మేడ్ ఫర్ ఈచ్ అదర్ 2. జగదేక వీరా 3. రచ్చ రంబోలా... 4. గుస గుస 5. కాటుక కళ్లు

ఆస్ట్రేలియాను చిత్తు చేసిన సౌతాఫ్రికా

    పెర్త్ టెస్టులో ఆస్ట్రేలియాను సౌతాఫ్రికా చిత్తు చేసింది. దక్షిణాఫ్రికా 309 పరుగులతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాదించింది. 40/0 పరుగులతో నాల్గో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా సౌతాఫ్రికా బౌలర్ల దెబ్బకి 322 పరుగులకే ఆలౌట్ అయింది. ఆఖరి బ్యాట్స్ మెన్ మైఖేల్ స్టార్క్, నాథన్ లియోన్‌లు కొద్ది సేపు పోరాడి వెనుదిరిగారు. స్టార్క్ 68, లియోన్‌లు 43 పరుగులు చేశారు. డేల్ స్టెయిన్, రాబిన్ పీటర్స్ మూడేసి, మార్నే మోర్కెల్, వెర్నాన్ ఫిలాండర్‌లు రెండేసి వికెట్లు తీసుకున్నారు. సఫారీ జట్టు 1-0తో సిరీస్ సొంతం చేసుకొని టెస్టుల్లో నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది.

లంకలో టెస్ట్ గెలిచిన కివీస్

    శ్రీలంక ఫై న్యూజీలాండ్ జట్టు 14 ఏళ్ల తర్వాత ఓ టెస్టు మ్యాచ్ లో విజయం సాధించ గలిగింది. చివరి సారిగా 1998 లో కివీస్ లంక గడ్డ ఫై విజయం సాధించింది. దీనితో రెండు మ్యాచ్ ల సిరీస్ లో చెరో జట్టు విజయాన్ని సాధించి రెండు జట్లు ట్రోఫీ ని పంచుకున్నాయి. 363 పరుగుల విజయ లక్ష్యాన్ని చేదించే క్రమంలో శ్రీ లంక 195 పరుగులకే కుప్ప కూలి కివీస్ చేతిలో 167 పరుగుల ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఈ మ్యాచ్ లో కివీస్ మొదటి ఇన్నింగ్స్ లో 412 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్ ను  194/9 వద్ద డిక్లేర్ చేసింది. శ్రీ లంక తొలి ఇన్నింగ్స్ ను 244 పరుగుల వద్ద ముగించగా, రెండో ఇన్నింగ్స్ లో 195 పరుగులకు అల్ అవుట్ అయింది.  శ్రీ లంక రెండో ఇన్నింగ్స్ లో మాథ్యూస్ 84 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. మిగిలన బాట్స్ మన్ ఎవరూ 30 పరుగుల స్కోరును కూడా చేయలేక పోయారు. రాస టేలర్ కు ‘ప్లేయర్ అఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించగా, హెరాత్ కు ‘ ప్లేయర్ అఫ్ ది సిరీస్’ అవార్డు లభించింది.  

దర్శిలో వెలసిన దిగంబర బాబా

    ప్రకాశం జిల్లా దర్శి సమీపంలో ఓ గుట్టమీద దిగంబర బాబా వెలిశాడు. ఒంటిమీద నూలుపోగైనా లేకుండా యజ్ఞాలూ, యాగాలు చేయడం ఈయన ప్రత్యేకత. ఈ పూజలకు ఎవరైనా హాజరు కావొచ్చు. ఎంతసేపైనా చూసిపోవచ్చు.   బాబాకి చాలా మహిమలున్నాయని, ఆయన్ని చూస్తే చాలు సమస్యలన్నీ తీరిపోతాయనీ పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరగడంతో చిన్నా పెద్దా తేడాలేకుండా భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. పూర్తిగా దిగంబరంగా ఉన్న స్వామివారిని దర్శించుకోవడానికి మహిళలుకూడా అశేషంగా తరలిరావడం మరో విశేషం.   భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేవుగానీ.. మహిళా సంఘాలు మాత్రం బాబా తీరుపై విరుచుకు పడుతున్నాయి. ఆడవాళ్లు తిరిగే చోట బట్టలూడదీసుకుని కూర్చోవడమేంటంటూ నిలదీశాయి. మాట వినకపోయేసరికి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి కాస్త సాఫ్ట్ గానే ఉపదేశం చేశాకగానీ బాబా బట్టలు కట్టుకోలేదు.

అత్యాచారం, దారుణ హత్య

    హైదరాబాద్ శివారులో దారుణం జరిగింది. ఓ వివాహితను ఎత్తుకెళ్లి గుర్తుతెలియని వ్యక్తులు రేప్ చేసి చంపేశారు. ఆల్వాల్ జవహర్ నగర్ లో పదిరోజుల్లో ఇలాంటిది ఇది రెండో దారుణ హత్య కావడం విశేషం.   పదిరోజుల క్రితం పన్నెండేళ్ల బాలికను ఎత్తుకెళ్లిన దుండగులు దారుణంగా చెరిచి తమ గుట్టు బైటపడుతుందేమోనని చంపేశారు. శవాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తుని ముమ్మరం చేశారు.   మహారాష్ట్రకి చెందిన దత్తూరాజ్, సక్కుబాయ్ హైదరాబాద్ ఆల్వాల్ ప్రాంతంలో ఉన్న జవహర్ నగర్ లో ఉంటూ కూలిపని చేసుకు బతుకుతున్నారు. పిల్లాడికి అన్నం ఇచ్చేందుకు స్కూల్ కెళ్లిన సక్కుబాయి రాత్రియినా తిరిగి రాకపోవడంతో దత్తూరాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.   మర్నాటి ఉదయం రచన కాలనీలో సక్కుబాయి శవం పోలీసులకు దొరికింది. ఎవరో దారుణంగా చెరిచి గొంతుకోసి మరీ చంపేసినట్టు పోలీసులు ప్రాథమిక అంచనాకి వచ్చారు. క్లూస్ టీమ్ ఆధారాల్ని సేకరించింది. జాగిలాల్ని రంగంలోకి దించారు.

ముంబై టెస్ట్ మ్యాచ్ : ఇంగ్లాండ్ పై చిత్తుగా ఓడిన ఇండియా

    స్పిన్ పిచ్, స్పిన్ పిచ్ అని పట్టుబట్టినా ధోనికి ఎదురు దెబ్బ తగిలింది. ఇంగ్లాండ్ స్పిన్నర్లు బంతిని గింగరాలు తిప్పిన పిచ్ పై ఇండియన్ స్పిన్నర్లు ఏమి చేయాలేక నోర్లు వెళ్ళబెట్టారు. తొలి టెస్ట్ పరాజయానికి ఇంగ్లాండ్ మాత్రం గట్టిగా ప్రతికారం తీర్చుకుంది. పది వికెట్ల తేడాతో భారత్ ను చిత్తుగా ఓడించింది. నాలుగు టెస్టుల సిరీస్ ను సమం చేసింది.   ఏడు వికెట్లకు 117 పరుగుల వద్ద ఆటను ప్రారంభించిన ఇండియా 142 పరుగులకు ఆలౌటైంది. భారత్‌కు 56 పరుగుల ఆధిక్యత లభించింది. గంభీర్ ఒక్కడే కాస్తా నిలబడి 65 పరుగులు చేసి స్వాన్ బౌలింగులో అవుటయ్యాడు. ఇంగ్లాండ్ మాత్రం 56 పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా చేదించింది. ఇంగ్లాండు స్పిన్నర్లు పనేసర్, స్వాన్ ఇండియా బ్యాటింగ్‌ను తుత్తునియలు చేశారు. పనేసర్ ఆరు వికెట్లు తీసుకోగా, మరో స్పిన్నర్ స్వాన్ 4 వికెట్లు పడగొట్టాడు.

ఓజా స్పిన్ మాయ, ఇంగ్లాండ్ ఆలౌట్

    నిలకడగా ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ బాట్స్ మెన్లు లంచ్ తరువాత ఒకరి వెనుక ఒకరు పెవిలియన్ కి క్యూకట్టారు. 178 పరుగులతో మూడో రోజు బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు ధాటిగా ఆటను ప్రారంభించింది. కుక్ 270 బంతుల్లో 122 పరుగులు, పీటర్సన్ 233 బంతుల్లో 186 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఆ తర్వాత ఎవరూ బాగా ఆడలేదు. ఇంగ్లాండ్ 413 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ స్పిన్నర్లు రెచ్చిపోయి ఆరు వికెట్లు తీశారు. ప్రజ్ఞాన్ ఓఝా 5, హర్భజన్ సింగ్ 2, అశ్విన్ రెండు వికెట్లు తీశారు. ప్రయర్‌ను కోహ్లీ బౌలింగ్‌లో ధోనీ రనౌట్ చేశాడు. కీలకమైన కుక్ వికెట్‌ను అశ్విన్, పీటర్సన్ వికెట్‌ను ఓఝా తీశారు.

ఇండియా 327 ఆలౌట్

    ముంబైలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 327 పరుగులకు ఆలౌటైంది. ఆరు వికెట్ల నష్టానికి 266 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ బ్యాట్స్ మెన్ కేవలం 61 పరుగులు మాత్రమే చేశారు. భారత బాట్స్ మాన్ లలో పుజారా ఒంటరి పోరాటం చేసి 350 బంతుల్లో పుజారా 12 ఫోర్లతో 135 పరుగులు చేశాడు. అశ్విన్ పరుగులు చేశాడు. మిగిలిన భారత బాట్స్ మ్యాన్లు ఎవ్వరు చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. సెహ్వాగ్ 30, ధోనీ 29, భజ్జీ 21, కోహ్లీ 19, జహీర్ ఖాన్ 11, సచిన్ 8, సెహ్వాగ్ 30, గంభీర్ 4 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో పనేసర్ ఐదు వికెట్లు పడగొట్టగా, స్వాన్ నాలుగు వికెట్లు,ఆండర్సన్ ఒక వికెట్ తీశారు.

ఇంగ్లాండ్ పై పుజారా దూకుడు

    ముంబైలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో ఇండియా కష్టాల్లో పడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నభారత్ ఇంగ్లాండ్ బౌలర్ల దెబ్బకు టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ఒకవైపు వికెట్లు పడుతున్న పుజారా మాత్రం తన దూకుడు కొనసాగిస్తున్నాడు. మొదటి టెస్టులో డబుల్ సెంచరి చేసిన పుజారా, రెండో టెస్టులో కూడా సెంచరీతో ఇండియాకి అండగా నిలిచాడు. అశ్విన్ కూడా హాఫ్ సెంచరీతో పుజారాకి మంచి సహకారం అందిస్తున్నాడు. తన వందో టెస్టు మ్యాచులో శతకం చేస్తాడని ఆశించిన వీరేంద్ర సెహ్వాగ్ అబిమానులను నిరాశపరిచాడు. ఇంగ్లండ్ ఆటగాళ్లు పనేసర్ నాలుగు వికెట్లు, అండర్సన్ ఒకటి, స్వాన్ ఒక వికెట్ తీశారు. 90 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 266 పరుగుల వద్ద ఆట ముగిసింది.   ఇండియా స్కోర్ వివరాలు : గౌతమ్ గంభీర్ : 4, సెహ్వాగ్ : 30, పుజారా (నాటౌట్) : 114, సచిన్ : 8, కోహ్లీ : 19, యువరాజ్ సింగ్: 0, కెప్టెన్ ధోనీ : 29, అశ్వీన్ (నాటౌట్) : 60, ఎక్స్‌ట్రా : 2.

ఇంగ్లాండ్ పై భారత్ ఘనవిజయం

    అహ్మదాబాద్ లో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ పై 9 వికెట్ల తేడాతో ఇండియా నెగ్గింది. 77 పరుగుల టార్గెట్ ను భారత్ ఒక్క వికెట్ నష్టపోయి చేదించింది. వీరేంద్ర స్వెవాగ్ పరుగులు చేసి స్వాన్ బౌలింగ్లో అవుటయ్యాడు. పుజారా 41 విరాట్ కోహ్లీ 11 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. ఐదు వికెట్ల నష్టానికి 340 పరుగులతో ఐదో రోజు ఆటను ప్రారంభించిన తర్వాత ఇంగ్లాండు 356 పరుగుల వద్ద ఆరో వికెట్ పడిపోయింది. ప్రియర్ 91 పరుగుల  వద్ద అవుటయ్యాడు. కెప్టెన్ అలిస్టిర్ కుక్ కూడా 176 పరుగుల వద్ద అవుటయ్యాడు.  365 పరుగుల వద్ద ఇంగ్లాండు కుక్ రూపంలో ఏడో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత ఇంగ్లాండు బ్యాట్స్‌మెన్ భారత బౌలర్లను దీటుగా ఎదుర్కోలేకపోయారు.  రెండో ఇన్నింగ్సులో ఓజా నాలుగు వికెట్లు తీసుకోగా, ఉమేష్ యాదవ్ మూడు వికెట్లు , జహీర్ ఖాన్ రెండు, అశ్విన్ ఒక వికెట్ తీసుకున్నారు.  

కుక్ ఒంటరి పోరాటం, ఇంగ్లాండ్ 235/5

    అహ్మదాబాదులో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 123 పరుగుల వద్ద కామ్టన్ జహీర్ ఖాన్ బౌలింగులో అవుట్ కాగా, ఓజా బౌలింగ్‌లో పీటర్సన్, ట్రాట్ వెనుదిరిగారు. ఉమేష్ యాదవ్ రెండు వరుస బంతుల్లో ఇయాన్ బెల్, సమిత్ పటేల్‌ను ఔట్ చేశాడు. నాల్గో రోజు ఆట ప్రారంభమైన కాసేపటికే ఇంగ్లాండ్ వికెట్‌ను కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకే ఆల్ ఔట్ అయిన ఇంగ్లాండ్ ఫాలో ఆన్ ఆడుతోంది. ఓ వైపు వికెట్లు పడిపోతున్నా కుక్ ఒంటరి పోరాటంతో సెంచరీ చేశాడు. కామ్టన్ 37, ట్రాట్ 17, పీటర్సన్ 2, ఇయాన్ బెల్ 22 పరుగులు చేసి అవుటయ్యారు. సుమిత్ డకౌట్ అయ్యాడు. ఇంగ్లాండ్ ఐదు వికెట్లు కోల్పోయి 230పరుగులతో ఆడుతోంది.

అహ్మదాబాద్ టెస్ట్ : కష్టాల్లో ఇంగ్లాండ్

  భారత్ ఇంగ్లాండ్ మధ్య అహ్మదాబాద్ లో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్ 115 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 41/3 ఓవర్ నైట్ స్కోరుతో ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ బాట్స్ మెన్ లు ఎక్కువ పరుగులు చేయకుండానే వెనుదిరిగారు. భారత్ స్పిన్నర్ ఓజా ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి ఇంగ్లాండ్ ను కష్టాల్లోకి నెట్టాడు. పీటర్సన్ 17, కెప్టెన్ కుక్ 41, సమిత్ పటేల్ 10, బెల్ 0 పరుగులకే అవుటయ్యారు. భారత బౌలర్లలో ఓజా, అశ్విన్‌ మూడు వికెట్లు పడగొట్టగా ఉమేష్ యాదవ్ ఒక వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. భారత్ తన తొలి ఇన్నింగ్స్‌ను ఎనిమిది వికెట్ల నష్టానికి 521 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన విషయం తెల్సిందే.

పూజారా డబుల్ సెంచరి, ఇండియా 521/8 డిక్లేర్

    ఇంగ్లాండ్ తో జరుగుతున్న మొదటి టెస్టు లో ఇండియా తొలి ఇనింగ్స్ ను 8 వికెట్ల నష్టానికి 521 పరుగులకు డిక్లేర్ చేసింది. పుజారా 374 బంతుల్లో 21 ఫోర్లతో 206 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. యువరాజ్ సింగ్ 74 పరుగుల వద్ద, అశ్విన్ 23 పరుగుల వద్ద ధోనీ ఐదు పరుగుల వద్ద అవుట్ అయ్యారు.   323/4 స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియాను పూజారా భారీస్కోరు దిశగా నడిపించాడు. తొలి రోజు ఆటలో 98 పరుగులు సాధించిన పూజారా, రెండో రోజు తనదైన శైలిలో ఇంగ్లీష్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. తద్వారా 374 బంతులాడిన పూజారా డబుల్ శతకాన్ని సాధించగలిగాడు. 160 ఓవర్లు ఆడిన ఇండియా 8 వికెట్ల నష్టానికి 521 పరుగులకు డిక్లేర్ చేసింది.     

అదరగొట్టిన సెహ్వాగ్, పుజారా దూకుడు

  అహ్మదాబాద్‌లో ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో మొదటిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 323 పరుగులు సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా, ఓపెనర్లు సెహ్వాగ్, గౌతంగంభీర్ శుభారంభం చేశారు. మొదటి వికెట్ కు 130 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. గంభీర్ 45 పరుగులు సాధించగా, సెహ్వాగ్ దూకుడుగా ఆడి ఒక సిక్స్, 15 ఫోర్లతో 90 బంతుల్లో సెంచరీ చేశాడు. 117 పరుగుల వద్ద స్వాన్ బౌలింగ్ లో సెహ్వాగ్ అవుటైయ్యాడు.   రంజీ మ్యాచ్ లో సెంచరీతో ఫామ్ లోకి వచ్చిన సచిన్ ఇంగ్లాండ్ పై నిరాశపరిచాడు. 18 బంతులు ఆడిన మాస్టర్ బ్లాస్టర్ 13 పరుగులకే అవుటయ్యాడు. పూజారా మాత్రం తన సూపర్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. 181 బంతుల్లో 13 ఫోర్లతో సెంచరీ దిశగా అడుగులేస్తున్నాడు. ప్రస్తుతం పూజారా (98) యువరాజ్ సింగ్ (24) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో గ్రేమ్ స్వాన్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. 

నిరాశపర్చిన సచిన్ టెండూల్కర్

  ఇంగ్లాండ్ తో జరుగుతున్న మొదటి టెస్టులో సచిన్ భారత్ అభిమానులను నిరాశపర్చాడు. రంజీ మ్యాచ్ లో సెంచరీతో ఫామ్ లోకి వచ్చిన సచిన్ ఇంగ్లాండ్ పై కూడా సెంచరీ చేస్తాడని అందరు భావించారు. 18 బంతులు ఆడిన మాస్టర్ బ్లాస్టర్ 13 పరుగులకే అవుటయ్యాడు. సచిన్‌ది మూడో వికెట్. మొదటి వికెట్ గంభీర్ రూపంలో 134 పరుగుల వద్ద, రెండో వికెట్ సెహ్వాగ్ రూపంలో 224 పరుగుల వద్ద అవుట్ కాగా సచిన్ 250 పరుగుల వద్ద అవుటయ్యాడు. తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ దూకుడుగా ఆడి సెంచరీ చేశాడు. రెండేళ్ల తర్వాత సెంచరీ సాధించాడు. ఒక సిక్స్, 15 ఫోర్లతో 90 బంతుల్లో సెంచరీ చేశాడు.