సీబీఐ కోర్టులో జగన్ కేసుల రోజువారీ విచారణ

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రికి కష్టాలన్నీ ఓకే సారి చుట్టుముడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఎన్నికలలో పరాజయంతో జగన్ కు మొదలైన బ్యాడ్ పీరియడ సుదీర్ఘ కాలం కొనసాగేలా ఉంది. ఇటు క్యాడర్ ను, అటు లీడర్ ను కూడా కాపాడుకోవడం ఎలాగో తెలియక సతమతమౌతున్న జగన్ రెడ్డికి ఇప్పుడు తన అక్రమాస్తల కేసు ను సీబీఐ కోర్టులో  రోజు వారీ విచారణకు రానుండటం మూలిగే నక్కపై తాటి పండు పడిన చందంగా మారింది. అసెంబ్లీలో బలం లేకపోతేనేం మండలలో మనదే ఆధిక్యం, ప్రభుత్వాన్ని గట్టిగా ఎదిరించండి, ఇరుకున పెట్టండి అని పరాజయం తరువాత తొలి రోజులలో ఎమ్మెల్సీలకు పిలుపునిచ్చిన జగన్, ఆ తరువాత రోజుల వ్యవధిలోనే ఎమ్మెల్సీలలో ఎందరు మన మాట వింటారో, మనతో ఉంటారో తెలియడం లేదు అంటూ బేల మాటలు మాట్లాడారు. ఫిరాయింపులను ఆపడం నా చేతుల్లో లేదంటూ చేతులెత్తేశారు. ఇక తాజాగా జగన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల విచారణ రోజువారీగా చేపట్టాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఆయనకు మరిన్ని కష్టాలు చుట్టుముట్టనున్నాయి. మొత్తంగా సీబీఐ కోర్టులో జగన్ పై20 కేసులు సుదీర్ఘ కాలంగా విచారణ దశలోనే ఉన్నాయి. వాటిని త్వరిత గతిన విచారణ పూర్తి చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య గత ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్ పై తాజాగా విచారణ చేపట్టిన హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.   ప్రజా ప్రతినిధులపై పలు కోర్టులలో ఉన్న కేసులపై కూడా హైకోర్టు ఈ సందర్భంగా విచారణ చేపట్టింది. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను త్వరగా తేల్చాలని సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు గత ఏడాది హైకోర్టు సుమోటాగా విచారణకు స్వీకరించింది. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల విచారణను వేగవంతం చేయాలని ఆయా కోర్టులను ఆదేశించింది. అలాగే విచారణకు సంబంధించిన నివేదికు సమర్పించాలని మూడు వారాల గడువు విధించింది. 

తెలుగుజాతి వెలుగు కిరణం చంద్రబాబుకు స్వాగ‌తం సుస్వాగ‌తం!

ఆంధ్రుల న‌మ్మ‌కం.. పేద‌ల స‌మ్మ‌తం.. న‌డిసంద్రంలో ఉన్న న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్‌కు ఆశాదీపం.  ఆయ‌న‌ శ్వాస అమ‌రావ‌తి..  ధ్యాస పోల‌వ‌రం..  మొత్తంగా తెలుగు ప్ర‌జ‌ల అభివృద్ధి ఆయన ఏకైక ల‌క్ష్యం.. ఆయ‌న అడుగు పెడితే తెలుగు రాష్ట్రాల్లోని ఏ ప్రాంత‌మైనా పులకించి పోతుంది..  ఆయన మాట వింటే గుండెల్లో తెలియ‌ని ధైర్య‌ం వస్తుంది..  ఆయన రాజ‌కీయ చ‌క్ర‌వ‌ర్తి..  అయినా అంద‌రి ఇళ్ల‌లో సాధార‌ణ మ‌నిషి.. ఆయ‌నే టీడీపీ అధినేత‌, సైబరాబాద్ రూపకర్త,   అభివృద్ధి చిరునామా, న‌వ్యాంధ్రప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు.  ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్  నుంచి విడిపోయిన న‌వ్యాంధ్ర‌ను ప్ర‌పంచంలో అగ్ర‌గామిగా నిలిపేందుకు ఐదే ళ్లు కృషి చేశారు. ప్ర‌పంచ దేశాల్లో పేరున్న కంపెనీల‌ను రాష్ట్రానికి ర‌ప్పించి యువ‌త‌కు ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించారు.  అన్ని రంగాల్లో న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ దూసుకుపోయేలా చేయ‌డంతో పాటు.. తెలుగు ప్ర‌జలు గొప్ప‌గా చెప్పుకొనేలా అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణానికి అంకురార్ప‌ణ చేశారు.  కానీ,  2019లో రాక్ష‌స‌ పాల‌నకు ద్వారాలు తెరుచుకున్నాయి. ఫ‌లితంగా గ‌డిచిన ఐదేళ్ల‌లో న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానిలేని అనాథ‌గా మారిపోయింది. ప్ర‌జ‌లు పొట్ట‌చేత ప‌ట్టుకొని ఇత‌ర రాష్ట్రాల‌కు వ‌ల‌స‌లు వెళ్లాల్సి వ‌చ్చింది.  చంద్ర‌న్న‌తోనే మా బ‌తుకులు మారుతాయ‌ని గుర్తించిన న‌వ్యాంధ్ర ప్ర‌జానీకం 2024లో  చరిత్ర కనీవినీ ఎరుగని మెజార్టీతో అధికార పీఠాన్ని అప్ప‌గించారు. న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ కు రెండోసారి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత తొలిసారి హైద‌రాబాద్ లో అడుగుపెడుతున్న తెలుగు ప్ర‌జ‌ల గుండె చప్పుడు చంద్ర‌బాబు నాయుడి గారికి ఘ‌న స్వాగ‌తం ప‌లుకుదాం. ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్ నుంచి జూబ్లీ హిల్స్ చెక్పోస్ట్ వరకు తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ ఆధ్వర్యంలో జరిగే ర్యాలీలో  భారీ సంఖ్యలో పాల్గొనేందుకు తరలిరండి. జనం కోసం బాబు.. బాబు కోసం జనం అని చాటుతూ  రండి కదిలిరండి.. తెలుగుజాతి వెలుగు కిరణం చంద్రబాబుకు ఘన స్వాగతం పలుకుదాం. అదే విధంగా ఆదివారం (జులై 7)న ఉదయం 11 గంటలకు ఎన్టీఆర్ భవన్ లో  జరిగే ఆత్మీయ సమ్మేళనంలో చంద్రబాబు దార్శనికత, అభివృద్ధి కాముకతపై ముచ్చటించుకుందాం.. ఆయన విజయగాథలను నెమరువేసుకుందాం.  

జగన్ కు ప్రత్యేక చట్టాలున్నాయా?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నెల్లూరు జైలులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని పరామర్శించి బయటకు వచ్చిన తరువాత మీడియా ఎదుట చాలా చాలా మాట్లాడారు. రాజకీయ పండితులు అయితే ఆ ప్రసంగం ఒక్కటి చాలు మరో ఆలోచన లేకుండా పోలీసులు కేసు నమోదు చేసి ఆయనను జైలులో పడేయడానికి అని అంటున్నారు. ఆవేశంతో పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఈవీఎంను పగలగొట్టడం తప్పెలా అవుతుందని ప్రశ్నించిన జగన్.. వైసీపీ కోసం ప్రత్యేక చట్టాలున్నాయని భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. ఆ చట్టాల ప్రకారం వైసీపీ నేతలు ఏమైనా చేయొచ్చు. దాడులకు పాల్పడవచ్చు. కానీ పోలీసులు మాత్రం కేసులు నమోదు చేయకూడదు అని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అటువంటి వ్యక్తి ఐదేళ్లు సీఎంగా ఎలా ఉన్నాడన్న ఆశ్చర్యం సర్వత్రా వ్యక్తం అవుతుంది. అదే సమయంలో ఈ ఐదేళ్లూ సీఎంగా ఒక్క ప్రెస్ మీట్ కూడా ఎందుకు ఏర్పాటు చేయలోదో కూడా జనానికి బాగానే అర్ధమైంది. ప్రశ్నలకు జవాబులు చెప్పడం ఆయనకు తెలియదు. రాసుకొచ్చిన స్క్రిప్ట్ చదివేసి వెళ్లిపోవడమే. ఇంతోటి దానికి ప్రెస్ మీట్లు ఎందుకు అని భావించి ఉంటారు. ఇక ఆయనకు విలువలు, రాజ్యాంగం, చట్టం ఇలాంటి వాటితో పనీ లేదు. పరిచయమూలేదనడానికి నెల్లూరు జైలు బయట ఆయన మాటలు వింటే అర్ధం అవుతుంది. ఓ వైపు పిన్నెళ్లి ఈవీఎంను ధ్వంసం చేశారని అంగీకరిస్తూనే.. అక్కడ ఎమ్మెల్యేకు ఓట్లు పడటం లేదనీ.. అందుకే ఈవీఎంను పగులగొట్టి అన్యాయాన్ని ఎదిరించాడనీ సమర్ధిస్తున్నారు.  వాస్తవానికి పిన్నెల్లి ఈవీఎంను పగులగొట్టడం, ఆ తరువాత   అక్కడ ఉన్న తెలుగుదేశం ఏజెంట్ పై హత్య ప్రయత్నం చెయ్యడం వరకూ అన్నిటికీ ఆధారాలు ఉన్నాయి. అయితే పిన్నెల్లిని అరెస్టు చేయడం దారుణం అంటూ ఆవేశపడిపోయిన జగన్ కు అవేమీ కనిపించడం లేదు.   ఈవీఎం   పగలకొట్టిన కేసులో పిన్నేల్లికి బెయిలు వచ్చింది కాబట్టి  మిగిలిన కేసులను పట్టించుకోవడం తప్పు అంటున్న జగన్ కు చట్టాలపై ఇసుమంతైనా గౌరవం కానీ, అవగాహన కానీ ఉన్నట్లు కనిపించదు.  ఇంకా ఆయన వ్యాఖ్యల సారాంశం ఏమిటంటే..   తమ అంటే తమ పార్టీ విషయంలో  పోలీస్ వ్యవస్థ, న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోకూడదు. తమకు అన్యాయం అనిపిస్తే  మేం చేసిందే చట్టం. మేం చెప్పిందే న్యాయం అనే అర్ధం చేసుకోవాలి. మేం చెప్పిన మాట వినలేదు కనుక కొడతాం. మాకు వ్యతిరేకంగా ఉన్న పార్టీల కార్యాలయాలను ధ్వంసం చేస్తాం. గత ఐదేళ్లూ అదే చేశాం. ఎప్పుడైనా చట్టం, న్యాయం జోక్యం చేసుకున్నాయా? అన్నదే జగన్ నెల్లూరు జైలు బయట మాట్లాడిన మాటల  సారాంశమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇలా చట్టాలను అతిక్రమించండి, ఇష్టారీతిగా రెచ్చిపొండి అని బహిరంగంగా తన పార్టీ వారికి జగన్ చెబుతున్నారంటే.. ఆయన రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించి  రాజకీయ లబ్ధి, సానుభూతి పొందాలని భావిస్తున్నట్లు కనిపిస్తోందంటున్నారు.  

ఎన్‌సీసీ భూ కుంభ‌కోణం.. వైసీపీ నేత‌ల‌ అరెస్ట్ కు రంగం సిద్ధం?

వైసీపీ హ‌యాంలో భూ క‌బ్జాల ప‌ర్వం భారీగానే జ‌రిగింది. రాష్ట్రంలోని న‌లుమూల‌లా వైసీపీ నేత‌లు భూ క‌బ్జాల‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ప‌లు ప్రాంతాల్లో ప్ర‌భుత్వ భూముల‌తోపాటు, ప్రైవేట్ భూముల‌ను త‌క్కువ ధ‌ర‌ల‌కు కొట్టేశారు. గ‌తంలో ప్ర‌తిప‌క్ష తెలుగుదేశం నేత‌లు వైసీపీ నేత‌ల భూ కుంభ‌కోణాల‌పై ఆధారాల‌తో స‌హా బ‌య‌ట‌పెట్టారు. అధికార పార్టీ నేత‌లు కావ‌డంతో వారి జోలికి వెళ్లేందుకు అధికారులు సాహ‌సించ‌లేక‌పోయారు.  వైసీపీ పరాజయం పాలై  రాష్ట్రంలో తెలుగుదేశం  కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చింది. దీంతో వైసీపీ హ‌యాంలో జ‌రిగిన భూ కుంభ‌కోణాలపై ప్ర‌భుత్వ పెద్ద‌లు కూపీలాగుతున్నారు. ఈ క్ర‌మంలో  భూక‌బ్జాల వ్య‌వ‌హారాలు ఒక్కటొక్కటిగా కుప్పతెప్పలుగా వెలుగులోకి వ‌స్తున్నాయి. తాజాగా వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు పి. విజ‌య‌సాయిరెడ్డి క‌నుస‌న్న‌ల్లో విశాఖ‌లో జ‌రిగిన భూ క‌బ్జా వ్య‌వ‌హారంపై తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వం దృష్టి కేంద్రీక‌రించింది. పెద్ద ఎత్తున అక్ర‌మాలు, నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న‌లు జ‌రిగిన‌ట్లు గుర్తించింది. దీంతో ఆ భూముల‌ను తిరిగి స్వాధీనం చేసుకొని, అక్ర‌మాల‌కు స‌హ‌క‌రించిన‌ విజ‌య‌సాయిరెడ్డి, మ‌రికొంద‌రిపై కేసులు న‌మోదు చేసి అరెస్టు చేసేందుకు   రంగం సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టిన కొద్ది రోజుల‌కే  ఏపీలో మూడు రాజ‌ధానులు ఏర్పాటుకు నిర్ణ‌యం తీసుకున్నారు. విశాఖ‌ప‌ట్ట‌ణాన్ని ప‌రిపాల‌నా రాజ‌ధానిగా నిర్ణ‌యించి అక్క‌డి నుంచే పాల‌న కొన‌సాగిస్తామ‌ని చెప్పారు. దీంతో వైసీపీ ప్ర‌భుత్వంలో  కొద్ది రోజులు షాడో సీఎంగా చ‌క్రం తిప్పిన విజ‌య‌సాయిరెడ్డి విశాఖ‌లో తిష్ట‌వేసి పెద్ద ఎత్తున భూ క‌బ్జాల‌కు పాల్ప‌డిన‌ట్లు గ‌తంలో తెలుగుదేశం నేత‌లు ఆరోప‌ణ‌లు చేశారు. దీనికి తోడు ఎన్‌సీసీ భూకుంభ‌కోణంలో విజ‌య‌సాయిరెడ్డి పాత్ర‌కూడా ఉన్న‌ట్లు విమ‌ర్శ‌లు ఉన్నాయి. విశాఖప‌ట్ట‌ణంలోని మధురవాడలో ఐటీ పార్కు, అపార్ట్‌మెంట్‌లు, విల్లాలు, వాణిజ్య సముదాయాల నిర్మాణానికి 2005లో అప్పటి సీఎం రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం టెండర్లు పిలిచి 97.35 ఎకరాల భూమిని ఎన్‌సీసీ సంస్థకు కేటాయించింది. ప్రభుత్వానికి ఎకరానికి రూ.93.20 లక్షల చొప్పున చెల్లించేందుకు ఎన్‌సీసీ, ఏపీహెచ్‌బీ మధ్య ఒప్పందం కుదిరింది. ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వచ్చాక ఆ భూమిని పూర్తి హక్కులతో ఎన్‌సీసీ సంస్థకు విక్రయించాలని నిర్ణయించింది. ఈ క్ర‌మంలో పెద్ద ఎత్తున ప్ర‌భుత్వ ఆదాయానికి గండికొట్టి, వంద‌ల కోట్లు వైసీపీ నేతలు దండుకున్నారన్న ఆరోపణలున్నాయి. 2005  నాటికి , 2019లో వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన నాటికి మధురవాడ రూపురేకలు పూర్తిగా మారిపోయాయి. అక్క‌డ‌ చదరపు గజం భూమి విలువ రూ.50 వేలకు తక్కువ లేదు. అయితే, ఈ భూముల‌కు సంబంధించి జ‌రిగిన రిజిస్ట్రేష‌న్ల‌లో భూమి విలువ‌ను బాగా త‌గ్గించి చూపించి స్టాంప్ డ్యూటీ  ఎగ్గొట్టారు. వాస్త‌వానికి రాష్ట్ర ప్ర‌భుత్వానికి రిజిస్ట్రేష‌న్ ఫీజుల కింద సుమారు రూ. 280 కోట్ల స్టాంప్ డ్యూటీ రావాల్సి ఉంది. కానీ, భూమి విలువ త‌గ్గించ‌డంతో కేవ‌లం రూ. 14కోట్లు మాత్ర‌మే ప్ర‌భుత్వానికి ఆదాయం వ‌చ్చింది. దీని వెనుక విజ‌య‌సాయిరెడ్డితోపాటు, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శి కె. నాగేశ్వ‌రరెడ్డి త‌దిత‌రుల హ‌స్తం ఉంద‌ని తెలుస్తోంది. వీరంతా క‌లిసి మాజీ ఉప ముఖ్య‌మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ త‌మ్ముడు జీపీఆర్ఎల్ కంపెనీ అధినేత కొట్టు ముర‌ళీకి రిజిస్ట్రేష‌న్లు చేశారు. కొంద‌రు అధికారులు కూడా స‌హ‌క‌రించి ప్ర‌భుత్వ  ఆదాయానికి భారీగా గండికొట్టారు. ఈ తంతుకు త‌ప్పుడు స‌మాచారంతో స‌హ‌క‌రించిన‌, ప్ర‌భుత్వాన్ని మోస‌గించిన అధికారుల‌ను గుర్తించే ప‌నిని కూట‌మి ప్ర‌భుత్వం ప్రారంభించింది. వారిపై చ‌ర్య‌లుకు రంగం సిద్ధం చేసింది.   విశాఖ ఎన్‌సీసీకి చెందిన విలువైన భూముల‌ను వైసీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో త‌ప్పుడు జీవోలు, నివేదిక‌లు, అనుమతుల‌తో సూట్ కేస్ కంపెనీల‌కు బ‌దిలీ చేసిన తీరుపై సీబీఐ విచార‌ణ చేప‌ట్టింది. ఈ భూముల వ్య‌వ‌హారానికి సంబంధించిన వివ‌రాల‌తో విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సిందిగా సీబీఐ ఇప్ప‌టికే ఎన్‌సీసీ సంస్థ బాధ్యుల‌కు స‌మ‌న్లు జారీ చేసింది. దీనికితోడు సూట్ కేస్ కంపెనీల‌ను సృష్టించి భూములు కాజేసిన కొట్టు స‌త్య‌నారాయ‌ణ సోద‌రుడు ముర‌ళీకి నోటీసులు జారీ అయ్యాయి. సీబీఐతో పాటు ఆర్థిక లావాదేవీల‌కు సంబంధించి విచార‌ణ జ‌రిపే ఈడీ కూడా రంగంలోకి దిగ‌నుంది. ఈ భూముల ఆధారంగా పెద్ద ఎత్తున మ‌నీ ల్యాండ‌రింగ్ జ‌రిగింద‌నే ఆరోప‌ణ‌ల‌తో విచార‌ణ ప్రారంభించిన‌ట్లు తెలిసింది. దీంతో ఈ భూముల అక్ర‌మాల వెనుకఉన్న వైసీపీ నేత‌లు, అధికారుల అరెస్ట్ త‌ప్ప‌ద‌న్న వాద‌న వినిపిస్తోంది. మ‌రో వైపు ఈ వ్య‌వ‌హారం త‌రువాత   భూ కేటాయింపుల‌ను ర‌ద్దు చేసే అవ‌కాశాల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌రిశీలిస్తున్న‌ట్లు తెలుస్తోంది. విశాఖ ఐటీ పార్క్ కు ఆనుకొని అత్యంత విలువైన ఈ భూములు ఉండ‌టంతో భ‌విష్య‌త్ లో ఐటీ ప‌రిశ్ర‌మ విస్త‌ర‌ణ‌కు ఈ భూములు అవ‌స‌ర‌మ‌వుతాయ‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. దీంతో కుంభ‌కోణాల‌కు కార‌ణ‌మైన ఈ కేటాయింపుల‌ను ర‌ద్దు చేసి ఐటీ ప‌రిశ్ర‌మ‌ల‌కు భూముల‌ను కేటాయిస్తే వేలాది మందికి ఉపాధి అవ‌కాశాలు ల‌భించ‌డంతోపాటు.. ప్ర‌భుత్వానికి మంచిపేరు వ‌స్తుంద‌న్నఆలోచ‌న‌లో కూట‌మి ప్ర‌భుత్వం పెద్ద‌లు ఉన్న‌ట్లు తెలుస్తోంది.

విజ‌య‌వాడ తూర్పు బైపాస్ రోడ్ , ఫ్లైఓవర్ కి గ్రీన్ సిగ్న‌ల్

కేంద్ర‌మంత్రి కి ఎంపి కేశినేని శివనాథ్( చిన్ని) కృత‌జ్ఞ‌త‌లు  విజ‌య‌వాడ న‌గ‌ర‌ ఆర్థిక వృద్దిని పున‌ర్నిర్మించ‌డానికి దోహ‌ద‌ప‌డే విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డు,అవుట‌ర్ రింగ్ రోడ్డు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి నిడమానూరు వరకు ఫ్లైఓవర్ ఏర్పాట‌కు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప‌చ్చ జెండా ఊపినట్లు విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ వెల్ల‌డించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర‌ ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడు త‌న రెండు రోజుల ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా గురువారం కేంద్ర‌మంత్రి నితిన్ గ‌డ్క‌రీతో స‌మావేశ‌మ‌య్యారు. ఈ భేటీలో   రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పలు హైవేల నిర్మాణంపై చర్చించిన‌ట్లు తెలియ‌జేశారు. అదే విధంగా విజ‌య‌వాడ  వెస్ట్రన్ బైపాస్ పై కూడా  సమీక్ష జ‌రిగింద‌ని, ఈ ప‌నులు మ‌రో ఆరు నెలల్లో పూర్తి కానున్నట్లు ఎంపి కేశినేని శివ‌నాథ్ తెలిపారు.  గ‌త  నెల జూన్ 29వ తేదీ మంగ‌ళ‌గిరిలోని తెలుగు దేశం పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో సీఎం చంద్ర‌బాబు నాయుడ్ని త‌ను  క‌లిసి విజ‌య‌వాడ లో పెండింగ్ లో వున్న హైవే నిర్మాణం ప‌నుల గురించి తెలియ‌జేయ‌టం జ‌రిగింద‌న్నారు. ఈ భేటీలో ఆ అంశాల‌ను ప్ర‌స్తావించి ఆ ప‌నుల‌కు అనుమ‌తి ల‌భించే విధంగా కృషి చేసిన ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకి, అనుమ‌తులిచ్చిన కేంద్ర‌మంత్రి నితిన్ గడ్కరీకి ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)  కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

బూమ్‌బూమ్ వాసుదేవరెడ్డి మీద సీఐడీ సిట్‌కి ఫిర్యాదు!

ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ వాసుదేవరెడ్డి మీద సిఐడి సిట్‌కు గుడివాడవాసి, సీనియర్ జర్నలిస్ట్ దుగ్గిరాల ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో గుడివాడలో చేసిన అవినీతిపై వాసుదేవ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, అప్పటి ఉమ్మడి కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ మాధవిలతారెడ్డిలపై దుగ్గిరాల ప్రభాకర్ సిఐడి సిట్‌కు ఫిర్యాదు చేశారు. గుడివాడ ఆటోనగర్‌లోని తన కార్యాలయంలో దుగ్గిరాల ప్రభాకర్  ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి, తన ఫిర్యాదుకు సంబంధించిన వివరాలు తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వ హయంలో గుడివాడలో జరిగిన లక్షల రూపాయల కుంభకోణంపై దుగ్గిరాల ప్రభాకర్ పూర్తి ఆధారాలను మీడియాకు చూపించారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన వివరాల బుల్లెట్ పాయింట్స్... * వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్  మాజీ మేనేజింగ్ డైరెక్టర్ వాసుదేవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, అప్పటి జాయింట్ కలెక్టర్ మాధవిలతారెడ్డి భారీగా అవినీతికి పాల్పడ్డారు. వారంతా  చేసిన అవినీతిని పూర్తి ఆధారాలతో సిఐడి సిట్‌కు ఫిర్యాదు చేశాను. * ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పబ్లిక్ టెండర్ ద్వారా కేవలం స్క్వేర్ ఫీట్‌కు నాలుగు రూపాయలకు నా తల్లి సీతామహాలక్ష్మి ఏపీ బేవరేజెస్ గుడివాడ గోడౌన్ దక్కించుకున్నారు.  * ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే 20వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆటోనగర్‌లో గోడౌన్ నిర్వహిస్తున్నాం. * 2019 వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత... పద్మా రెడ్డి అనే వ్యక్తికి లబ్ధి చేకూర్చేందుకు రెండేళ్లు కాల పరిమితి ఉన్నప్పటికీ కారణం లేకుండా  గోడౌన్ మార్చేందుకు వాసుదేవరెడ్డి ప్రయత్నించాడు. ఇదేమిటని అప్పటి కార్పొరేషన్ ఎండి వాసుదేవ రెడ్డిని అడిగితే మాపై దుర్భాషలాడారు.  * అప్పట్లో మా కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, వైసీపీ నేత దుక్కిపాటిశశి భూషణ్ ఫోన్లు చేసి బెదిరించారు. * కారణం లేకుండా ఎందుకు గోడౌన్ మారుస్తున్నారని నా తల్లి సీతామహాలక్ష్మి 2020 మే నెలలో అడిగితే వాసుదేవ రెడ్డి బూతులు తిట్టారు. * ఆయన బూతులతో మనస్తాపం చెందిన నా తల్లి సీతామహాలక్ష్మి జూన్ నెలలో మరణించారు. * తర్వాత కార్పొరేషన్ పబ్లిక్ టెండర్ పిలువగా టెండర్‌లో పాల్గొనవద్దని మమ్మల్ని బెదిరించారు.  * మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసేలా గోడౌన్‌లోని  లిక్కర్ కేసులు పగలగొట్టి తగులపెట్టారు.  * ఈ దారుణాని వీడియో ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కనీసం మా కంప్లైంట్ కూడా తీసుకోలేదు. * మా మీదే కేసులు పెడతావా అంటూ మళ్ళీ కొడాలి నాని, దుక్కిపాటి శశిభూషణ్ బూతులు తిడుతూ మా కుటుంబాన్ని బెదిరించారు. దాంతో మేము టెండర్ వేయకుండా సైలెంట్‌గా ఉండిపోయాం. పూర్తి ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా టెండర్ ప్రక్రియ జరిగింది. * రూరల్ ప్రాంతాల్లో చదరపు అడుగు ఐదు రూపాయలు మాత్రమే ఉండాలని నిబంధనలో ఉండగా, లీస్ట్ టెండర్ దారులను పరిగణలోకి తీసుకోకుండా పద్మా రెడ్డికి 9.99 పైసలకు టెండర్ కట్టబెట్టారు. పబ్లిక్ టెండర్లు ఐదు రూపాయలకు మరో ముగ్గురు టెండర్ వేసిన.... వాటిని పరిగణలోకి తీసుకోలేదు. లక్షలాది రూపాయల కార్పొరేషన్ సొమ్ము వైసీపీ నేతలు తమ జేబుల్లోకి వేసుకున్నారు. *  అంతేకాకుండా గోడౌన్ క్యానోపి (వరండా)కు ఎటువంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేకపోయినా పద్మా రెడ్డి కి లబ్ధి చేకూర్చేలా ప్రతినెల లక్షా 12 వేలు అదనంగా చెల్లిస్తున్నారు. * ఈ మొత్తం వ్యవహారంలో పద్మా రెడ్డి అల్లుడైన ఐఆర్ఎస్ అధికారి కర్రీ రామ్ గోపాల్ రెడ్డి కూడా భాగస్వామ్యం అయ్యి, కార్పొరేషన్ సొమ్మును వాటాలుగా పంచాడు. * కార్పొరేషన్‌లో జరిగిన అవినీతిపై మాజీ ఎండి వాసుదేవరెడ్డి, అప్పటి జేసి మాధవి లతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, పద్మా రెడ్డి, వైసీపీ నేత దుక్కిపాటి శశిభూషణ్ చేసిన లక్షలాది రూపాయల కుంభకోణంపై పూర్తి ఆధారాలతో సిఐడి సిట్‌కు అందచేశాను.

అమరావతికి శుభారంభం.. XLRI ఏర్పాటు!

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన భారతీయ విద్యాసంస్థ XLRI అమరావతిలో తమ బ్రాంచ్‌ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. XLRI ఏర్పాటు అమరావతికి శుభారంభంగా భావించవచ్చు.  * మేనేజ్‍మెంట్ ఇన్‍స్టిట్యూట్‍లో దేశంలో ప్రఖ్యాతిగాంచిన XLRI. * XLRI అహ్మదాబాద్ IIM తర్వాత XLRIకు స్థానం. * టీడీపీ ప్రభుత్వ హయాంలో XLRIకు 50 ఎకరాలు కేటాయించిన CRDA. * XLRIకు భూమిని రిజిస్టర్ చేసిన CRDA. * వైసీపీ ప్రభుత్వ హయంలో అభివృద్ధి పనులకు అడ్డుపడిన అధికారులు. * మళ్ళీ చంద్రబాబు సీఎం కావడంతో ఇన్‍స్టిట్యూట్ ఏర్పాటుకు ముందుకువచ్చిన XLRI. * భూములు అప్పగిస్తే వెంటనే నిర్మాణం చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పిన XLRI. * XLRIకు వెంటనే భూమి అప్పగించేందుకు సిద్ధమైన CRDA. * సుమారు 250 కోట్ల రూపాయలతో XLRI భవన నిర్మాణాలు.  మేనేజ్‍మెంట్ కోర్సుల్లో తరగతులు, శిక్షణ ఇవ్వడంలో XLRIకు పేరు.

వైసీపీ ఉంటుందో, లేదో చూసుకో జగన్ రెడ్డీ..!

నెల్లూరు సెంట్రల్ జైల్ దగ్గర హడావిడి చేసిన జగన్మోహన్ రెడ్డి మీద మాజీ మంత్రి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పంచ్‌లు విసిరారు. * ఈవీఎం పగలగొట్టి, సీఐపై హత్యాయత్నం చేస్తే తప్పు లేదా? * పాపాలు చేశారు కాబట్టే ఈ రోజు ఫలితం అనుభవిస్తున్నారు. * పిన్నెల్లి పరామర్శ కోసం నెల్లూరుకు వచ్చిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హితబోధలు చేయడం హాస్యాస్పదం. * ఆయన అన్నీ డోర్ డెలివరీ చేశారంట.. అవును నిజమే..డ్రైవర్ సుబ్రహ్మణ్యం డెడ్ బాడీని కూడా డోర్ డెలివరీ చేశారు. * మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసులో చిన్నరాయి కారణంగా సీఐ తల పగిలిందంట. * ఈయన మీద చిన్నగులకరాయి పడిందని విజయవాడ యువకుడిని నెల్లూరులో ఇదే జైలులో పెట్టిన విషయం మాత్రం గుర్తులేదా? * భుజంపై బఠానీ గింజంత గాయం లేకపోయినా కోడికత్తి కేసులో శ్రీనుపై కనికరం లేకుండా ఐదేళ్లు జైలులో పెట్టించారు. * కులం చూడలేదంట, మతం చూడలేదంట. పార్టీ చూడలేదంట. ఇది కూడా నిజమే. * ఒక రామోజీరావు, ఒక అమర్ రాజా ఫ్యాక్టరీ, సంగం డెయిరీ, రఘురామకృష్ణంరాజు, అచ్చెన్నాయుడు చివరకు చంద్రబాబు నాయుడిని కూడా వదిలిపెట్టకుండా కక్షసాధింపుల్లో అందరినీ సమానంగా చూశాడు. * ఈవీఎం పగలకొడితే తప్పేమిటని ఒక సీఎంగా పనిచేసిన వ్యక్తి అనడం చాలా దురదృష్టకర పరిణామం. * ప్రజాస్వామ్యం. చట్టం, ఎన్నికల కమిషన్ పై జగన్మోహన్ రెడ్డికి కనీస గౌరవం లేదు. * చంద్రబాబు నాయుడు అనుభవిస్తారంటూ శాపనార్థాలు పెట్టడం కాదు. మీరు చేసిన పాపాలకు వచ్చే ఎన్నికల వరకు వైసీపీ ఉంటుందో.. లేదో చూసుకోండి. * మీరు మంచి చేసి ఉంటే ప్రజలు మిమ్మల్ని 11 సీట్లకు ఎందుకు పరిమితం చేశారో ఆలోచించుకోండి. * వైసీపీ ఐదేళ్ల పాలనలో అనేక దుర్మార్గాలకు పాల్పడ్డారు కాబట్టే ఈ రోజు పాపాలకు ప్రాయశ్చితం అనుభవిస్తున్నారు.

‘కర్మఫలం’ తప్పని విజయకుమార్‌రెడ్డి!

జగన్ రాక్షసరాజ్యంతో అంటకాగి, ఇష్టారాజ్యంగా పరిపాలన చేసిన ఐ అండ్ పీఆర్ కమిషనర్ విజయకుమార్‌రెడ్డికి అసలైన కష్టాలు మొదలయ్యాయి. జగన్ ప్రభుత్వ హయాంలో ఆయన చేసిన తప్పులకు ఇప్పుడు మూల్యం చెల్లించక తప్పని పరిస్థితి ఏర్పడింది. చేసిన తప్పులకు సమాధానం చెప్పకుండా, తన బాధ్యతలు ఇతరులెవరికీ అప్పగించకుండా, సమాచార శాఖను గాలికి వదిలేసి ఢిల్లీకి పారిపోయిన విజయకుమార్ రెడ్డికి అక్కడ ఎదురుగాలి వీచింది. తన డిప్యూటేషన్ పూర్తయిందని, తనను వెంటనే కేంద్ర సర్వీసులోకి తీసుకోవాలని విజయకుమార్‌రెడ్డి పెట్టుకున్న అప్లికేషన్‌ని కేంద్ర ప్రభుత్వం  తిరస్కరించింది. రాష్ట్ర ప్రభుత్వ రిలీవ్ ఆర్డర్ వుంటేనే మళ్ళీ కేంద్ర సర్వీసులోకి తీసుకుంటామని కేంద్రం స్పష్టం చేసింది. దాంతో ఏపీ నుంచి చెప్పాపెట్టకుండా పరారైన విజయకుమార్‌రెడ్డి ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో వున్నారు. తన త‌న డిప్యుటేష‌న్ జూన్‌9తో అయిపోయింది క‌నుక తాను రిలీవ్ అయిన‌ట్లే అని ఆయ‌న వాదిస్తున్నారు. తన డిప్యుటేషన్ పొడిగింపును తాను రద్దు చేసుకున్నానని, తనకు డిప్యుటేషన్ వద్దని జీఏడీని కోరానని, అయితే దానిని ఆమోదించాల్సిన ప్రభుత్వం ఆమోదించలేదు కాబట్టి, తన డిప్యుటేషన్ ముగిసినట్టేనని ఆయన అంటున్నారు. దీనిపై ఆయ‌న క్యాట్‌ను ఆశ్రయిస్తారన్న ప్రచారం జరుగుతోంది.  కానీ, ఆయన ఈ విషయంలో క్యాట్‌కి వెళ్ళినా ఉపయోగం వుండదని పరిశీలకులు అంటున్నారు.  జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ వస్తుందన్న ఉద్దేశంతో ఆయన రెండేళ్ళ డిప్యుటేషన్ కోరారు. దానిని కేంద్రం ఆమోదించింది. అందువల్ల ఆయన ఏపీ ప్రభుత్వ సర్వీసులో ఉన్నట్టేనని పరిశీలకులు చెబుతున్నారు. ఈ విషయకుమార్ రెడ్డికి తెలుసు. కానీ తెలియనట్టు అమాయకత్వం నటిస్తున్నారు. బుధవారం నాడు ఆయన స‌చివాల‌యానికి వ‌చ్చి జిఏడి అధికారుల‌ను క‌లిశారు. తనను రిలీవ్ చేయించుకునేందుకే ఆయ‌న అక్కడకి వెళ్ళారని ఆయ‌న స‌న్నిహితులు చెబుతున్నారు. అయితే, ఢిల్లీ వెళ్ళిపోవాలన్న ఆత్రుతతో ఆయన ఐ అండ్ పీఆర్‌ని అనాథలా వదిలేశారని, బాధ్యతలను ఎవరికీ అప్పగించకుండా పరారవడం దారుణమని, గతంలో ఇలా ఎవరూ చేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.  ఏ ప్రభుత్వలో అయినా ఐ అండ్ పీఆర్ శాఖ కీలకంగా వుంటుంది. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా వుంటుంది. మంత్రి ఉన్నప్పటికీ, కమిషనర్ లేకపోవడంతో ఈ శాఖలో పనిచేసేవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇంకా రాలేదు. కమిషనర్ వుంటేనే వారి జీతాలు విడుదలవుతాయి. ఈ శాఖకు కమిషనర్ ఉన్నట్టా.. లేనట్టా అర్థం కావడం లేదు. ఏది ఏమైనా, విజయకుమార్ రెడ్డి బాధ్యతలు స్వీకరించక తప్పదని, గతంలో జగన్‌తో అంటకాగిన పాపాన్ని మోయక తప్పదనే బాధలో విజయకుమార్ సన్నిహితులు వున్నారు.

అనిల్‌ కుమార్‌కి ఏమైంది? బుల్లెట్ దిగిందా?

నెల్లూరు సెంట్రల్ జైల్లో వున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం, ఆ తర్వాత మీడియా మైకుల ముందు మాట్లాడుతూ అవాకులూ చవాకులూ పేలడం, చివర్లో మీడియా వాళ్ళు ప్రశ్నిస్తే పారిపోవడం.. ఇవన్నీ అందరూ గమనించారు. అయితే ఈ ఇష్యూలో ఒక హైలైట్ పాయింట్‌ని కొంతమంది మాత్రమే గమనించారు. ఆ పాయింట్ మరోదో కాదు.. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.  నెల్లూరు సెంట్రల్ జైలు బయట జగన్ మీడియా మైకుల ముందు అవాకులూ, చవాకులూ పేలుతున్న సమయంలో సరిగ్గా ఆయన వెనకే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నిల్చుని వున్నారు. జగన్ మాట్లాడినంతసేపూ అనిల్ కుమార్ యాదవ్ చాలా ఇబ్బందిగా ముఖం పెట్టుకుని కనిపించారు. మొదటి నుంచి చివరి వరకు రకరకాల ఎక్స్.ప్రెషన్లు ఇస్తూ కనిపించారు. ఏదో బాధపడిపోయినట్టు.. ఎక్కడో బుల్లెట్టు దిగినట్టు.. అనవసరంగా ఈ పార్టీలో వున్నాన్రా దేవుడా అన్నట్టుగా ముఖం పెట్టుకుని వున్నారు. మనిషి నిల్చున్నాడే గానీ, ఏదో బాధపడిపోతున్నారు. ఎలా వుండేవాడిని ఎలా అయిపోయాను అన్నట్టుగా, వికారంగా, విచిత్రంగా, తంటాలు పడుతున్నట్టుగా నిల్చుని వున్నారు. అసలు ఆయన సమస్యేంటో అర్థం కావడం లేదు. అలాగే జగన్‌కి మరోపక్కన నల్లకళ్లద్దాలతో నిల్చుని వున్న అంబటి రాంబాబు సినిమాల్లో కనిపించే గూండాల అసిస్టెంట్ లాగా ఎక్స్.ప్రెషన్ పెట్టుకుని నిల్చున్నారు. మొత్తానికి జగన్ మాట్లాడిందంతా చెత్తా చెదారమేగానీ, ఒకవైపు అనిల్ కుమార్ యాదవ్, మరోవైపు అంబటి రాంబాబు భలే కామెడీగా వున్నారు.

పిన్నెల్లి పరామర్శ ఖర్చు పాతిక లక్షలు!

మంచివాడు, ఏదో సరదాగా హత్యాయత్నం చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు సెంట్రల్ జైల్లో వుంటే, శాంతిదూత, సుద్దపూస జగన్ వెళ్ళి పరామర్శించారు. దీనికి అయిన ఖర్చు ఎంతో తెలుసా? అక్షరాలా పాతిక లక్షలు. గన్నవరం నుంచి నెల్లూరు వరకు హెలికాప్టర్ రానూ పోనూ ఖర్చులు.. హెలిపాడ్ నుంచి జైలు వరకు రాను పోనూ ఖర్చులు, ప్రైవేట్ సెక్యూరిటీ... వీటన్నిటికీ అయిన ఖర్చుతో ఒక పేద కుటుంబం జీవితాంతం చీకూ చింతా లేకుండా బతకొచ్చు. ఏపీ ప్రజల టైమ్ బాగుండి జగన్ అధికారంలో లేదు. అధికారంలో వుంటే ఖర్చు ఇంకా భారీగా వుండేది. చెట్లు కొట్టడం, పరదాలు వేయడం, ఇంకా భారీ సెక్యూరిటీ.. ఎంత లేదన్నా రెండు మూడు కోట్లు స్వాహా అయిపోయేవి.   నిజానికి జగన్ వెళ్ళింది పిన్నెల్లిని పరామర్శించి, ఓదార్చడానికి కాదు.. పరామర్శ పేరుతో పనికిమాలిన రాజకీయాలు చేయడానికి... తన సైకోయిజాన్ని ప్రదర్శించడానికి.. ఘర్షణ వాతావరణం క్రియేట్ చేయడానికి! వాస్తవానికి నెల్లూరు సెంట్రల్ జైలులో పిన్నెల్లిని కలిసే ములాఖత్‌ల కోటా అయిపోయింది. అయినప్పటికీ, జగన్ వెళ్తానన్నాడు కదా అని ప్రభుత్వం అవకాశం కల్పించింది. మొన్న అసెంబ్లీలో పోనీలే అని మొదటగా ప్రమాణ స్వీకారం చేయిస్తే, ఆ తర్వాత జగన్ ఎంత కంపు చేశారో తెలిసిందే. ఇప్పుడు కూడా అంతే, పోనీలే కదా పిన్నెల్లిని కలిసే అవకాశం ఇస్తే అక్కడ కూడా రచ్చ చేసి వదిలిపెట్టాడు. 

బెజవాడ ఈస్ట్రన్ బైపాస్ రోడ్డుకు గడ్కరీ గ్రీన్ సిగ్నల్!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరితో భేటీ అయ్యారు. ఈ భేటీ సుహృద్భావ వాతావరణంలో జరిగింది. చంద్రబాబు ప్రతిపాదనల పట్ల గడ్కరీ సానుకూలంగా స్పందించారు. చంద్రబాబుతో భేటీ తరువాత గడ్కరీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ  చంద్రబాబుతో భేటీలో  ఆంధ్రప్రదేశ్ లో నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారులపై సమీక్షించినట్లు పేర్కొన్నారు. అలాగే చంద్రబాబు కూడా  ట్విట్టర్ వేదికగా గడ్కరీతో జాతీయ రహదారుల ప్రాజెక్టుపై చర్చించినట్లు పేర్కొన్నారు. కాగా ఈ భేటీలో గడ్కరీ బెజవాడ ఈస్ట్రన్ బైపాస్ రోడ్డుకు అనుమతి ఇచ్చారని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. అలాగే రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు, ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ నుంచి నిడమానూరు వరకూ ఫ్లై ఓవర్ నిర్మాణానికి కూడా అనుమతిచ్చారని వెల్లడించిన కేశినేని చిన్ని.. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలో ఇస్తానని గడ్కరి చెప్పారన్నారు.  కాగా, గడ్కరీతో సమావేశంలో చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా పాల్గొన్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో  రాధా కిషన్ రావు అరెస్ట్ 

 ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు రాధాకిషన్ రావును పోలీసులు అదుపులోకీ తీసుకున్నారు. చంచల్‌గూడ జైల్లో ఉన్న ఆయనను పీటీ వారెంట్‌పై అదుపులోకి తీసుకుని, నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుకు సంబంధించి రాధాకిషన్ రావును అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఓ ల్యాండ్ వ్యవహారంలో వ్యాపారవేత్తను బెదిరించినందుకు ఆయనపై జుబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఓ కంపెనీ వ్యవహారంలో రాధాకిషన్ రావు జోక్యం చేసుకొని సెటిల్మెంట్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. రూ.150 కోట్ల విలువైన కంపెనీని తక్కువ ధరకు మరొకరికి ఇప్పించినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు.రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో అరెస్టై, ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్‌ రావును మరో కేసులో జూబ్లీహిల్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పీఎస్‌లో నమోదైన ఓ కేసులో పీటీ వారెంట్‌పై ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. చెన్నుపాటి వేణుమాధవ్‌ అనే వ్యక్తి గతంలో రాధాకిషన్‌రావుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాధాకిషన్‌ తనను కిడ్నాప్‌ చేసి షేర్లు బదలాయించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. క్రియా హెల్త్‌కేర్‌ షేర్లను బలవంతంగా బదిలీ చేయించుకున్నారని ఆయన ఆరోపించారు. వేణుమాధవ్‌ ఫిర్యాదుతో రాధాకిషన్‌ రావును పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఈయనతో పాటు మరో ఇద్దరు టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్లపైనా కేసు నమోదు చేశారు. 

తెలుగుదేశం కార్యాలయంపై దాడి.. అప్పిరెడ్డి, అవినాష్ , నందిగం సురేష్ అరెస్ట్‌ కు రంగం సిద్ధం

అధికారమదంతో ఇష్టారీతిగా చెలరేగిపోయిన వైసీపీ నేతలకు ఇప్పుడు ఫలితం అనుభవించే టైం వచ్చింది. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై మూడేళ్ల కిందట జరిగిన  దాడి ఘటనకు సంబంధించి దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎంపీ నందిగం సురేష్ ల అరెస్టుకు రంగం సిద్ధమైంది. వీరి నేతృత్వంలోనే దాడి జరిగినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇందుకు సంబంధించి అన్ని ఆధారాలూ సేకరించారు. లేళ్ల అప్పిరడ్డి, దేవినేని అవినాష్, నందిగం సురేష్ లు వారి వారి ముఖ్య అనుచరులను రాళ్లు, కర్రలతో నేరుగా తెలుగుదేశం ఆఫీసుపైకి పంపినట్లు పోలీసులు సీపీ ఫుటేజీ ఆధారంగా నిర్ధారించారు. దాడి జరిగిన రోజజున గుంటూరు, విజయవాడ, మంగళగిరి నుంచి తెలుగుదేశం కేంద్ర కార్యాలయం వైపు కర్రలు, రాడ్లు, రాళ్లతో వచ్చిన వారిని గుర్తించారు. అలాగే వారు వచ్చిన వాహనాల వివరాలను టోల్ గేట్ రికార్డుల ద్వారా సేకరించిన పోలీసులు అరెస్టులకు రంగం సిద్ధం చేశారు. అలాగే కాల్ డేటా ద్వారా  దాడికి పాల్పడిన వారు ఎవరెవరి ఆదేశాల మేరకు ఆ పని చేశారో కూడా నిర్ధారించుకున్నారు.   పక్కా వ్యూహం ప్రకారం ఈ దాడి జరిగిందని కూడా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిథి పట్టాభి నివాసంపైనా, తెలుగుదేశం  కేంద్ర కార్యాలయంపైనా ఏకకాలంగా దాడి జరిగేలా  దేవినేని అవినాష్ తన అనుచరులను ప్రేరేపించారనీ కూడా పోలీసులు తమ దర్యాప్తులో కనుగొన్నారు.  అలాగే గుంటూరు నుంచి లేళ్ల అప్పిరెడ్డి తన అనుచరులను పంపారని తాడేపల్లిలోని  వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఆయన తన అనుచరులకు ఆదేశాలు ఇచ్చారని పోలీసులు చెబుతున్నారు. అలాగే నందిగం సురేష్ అనుచరులు కూడా దాడిలో పాల్గొనడమే కాకుండా, తెలుగుదేశం కార్యాలయంపై దాడి, విధ్వంసం వీడియోలను అక్కడి నుంచే వారు నందిగం సురేష్ కు షేర్ చేశారని పోలీసులు కనుగొన్నారు.   ఇక అప్పిరెడ్డి, అవినాష్, నందిగం సురేష్ ల అరెస్టు మాత్రమే కాకుండా వారిని వెనకుండి ప్రేరేపించినదెవరో కూడా తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురికీ తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు వచ్చాయా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ దాడి వెనుక  సజ్జల ఉన్నారన్న అనుమానం పోలీు వర్గాలలో వ్యక్తం అవుతోంది.   

లైంగిక వేధింపుల కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ అరెస్ట్

వైస్సార్‌సీపీ నేత, కోడుమూరు మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. బాలికపై లైంగిక వేధింపుల కేసులో ఆయనపై కేసు నమోదుకాగా.. ఇవాళ ఈ కర్నూలులోని నివాసంలో టూ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుధాకర్‌కు ఆస్పత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు.. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్ విధించారు. వైసీపీ నేత, కోడుమూరు మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. గ‌తంలో త‌న ఇంట్లో ప‌నిచేసే బాలికపై లైంగిక‌ వేధింపులకు పాల్ప‌డ‌గా ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో భాగంగా ఇవాళ కర్నూలులోని నివాసంలో పోలీసులు ఆయ‌న‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం సుధాకర్‌ను వైద్యపరీక్షల కోసం ఆస్పత్రికి త‌ర‌లించారు.  జరదొడ్డి సుధాకర్‌ తన ఇంట్లో పనిచేసే బాలికతో గతంలో అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో ఎన్నికల సమయంలో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ ఘటనపై ఇటీవల పోలీసులు సుధాకర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. తాజాగా అరెస్ట్ చేశారు. ఇదిలాఉంటే.. సుధాకర్ 2019 ఎన్నికల్లో వైసీపీ త‌ర‌ఫున‌ కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించారు. అయితే, 2024 ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు. ఆయన స్థానంలో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ సోదరుడు సతీష్‌కు టికెట్ దక్కింది.

జగన్‌ది నోరా? చెత్తకుండీనా?

త్వరలో జైలుకు వెళ్ళబోతున్న జగన్, ప్రాక్టీసు కోసం అన్నట్టుగా నెల్లూరు సెంట్రల్ జైల్లో వున్న తన దండుపాళ్యం బ్యాచ్ సభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించారు. ఆ తర్వాత బయటకి వచ్చి మీడియాతో మాట్లాడారు. జగన్ మాటలన్నీ విన్నాక అసలు జగన్‌ది నోరా, లేక చెత్తకుండీనా అనే సందేహం ఎవరికైనా సరే వచ్చి తీరుతుంది. నోరు తెరిచిన దగ్గర్నుంచి అబద్ధాలే అబద్ధాలు.. పచ్చి అబద్ధాలు.. నోటికొచ్చిన అబద్ధాలు. విన్నవాళ్ళు ఛీ అని ఊస్తారని కూడా సిగ్గుపడని అబద్ధాలు.. ఈ వీరుడు ముఖ్యమంత్రిగా వున్నంతకాలం రాష్ట్రం రామరాజ్యంలా వుందట.. ఈయన ముఖ్యమంత్రి పదవి ఊడిపోగానే రావణ కాష్టంలా మారిపోయింట. కేవలం వైసీపీకి ఓటు వేసినందుకే దాడులు చేస్తున్నారట. పిన్నెల్లికి సంబంధం లేకపోయినా అతని మీద హత్యాయత్నం కేసు పెట్టారట. ఎన్నికల సందర్భంగా అక్రమాలను చూసి భరించలేక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొట్టాడట. ఇందులో రామకృష్ణారెడ్డి తప్పేమీ లేదని అర్థం చేసుకున్న కోర్టులు కూడా బెయిల్ ఇచ్చాయట. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన శాంతిదూత పిన్నెల్లిని అన్యాయంగా అరెస్టు చేశారట. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తాను ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, వైసీపీ వారిని హింసించడమే లక్ష్యంగా పెట్టుకుందట. చంద్రబాబు న్యాయంగా, ధర్మంగాపాలన చేయాలని ఈ సుద్దపూస సలహాల మీద సలహాలు ఇచ్చారు. ఇదే ధోరణి కొనసాగితే మర్యాదగా వుండదని చంద్రబాబుని హెచ్చరించారు.  నిజంగా, ఈ జగన్‌ని అందరూ ‘సైకో’ అని ఎందుకు అంటారో నెల్లూరు జైలు దగ్గర జగన్ మాట్లాడిన తీరు చూస్తుంటే స్సష్టంగా అర్థమవుతోంది. మనిషి ముఖంలో ద్వేషం... క్రూరత్వం.. సిగ్గులేనితనం... తాను చెప్పిందే వేదం అనుకునే మూర్ఖత్వం.. దేనికైనా తెగించినతనం... నేను ఎన్ని అబద్ధాలు చెప్పినా అడిగేది ఎవరనే ధీమా...  మైగాడ్.. ఇలాంటి మనిషిని ఐదేళ్ళు భరించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హేట్సాఫ్. జగన్ తన ద్వేషమంతా మీడియా ముందు వెళ్ళగక్కి... తన మనసులో వున్న విషాన్నంతా మీడియా మైకుల ముందు వాంతి చేసుకుని చివర్లో ‘‘ప్రజలు అంటున్నారు’’ అని ఈ దరిద్రాన్నంతా ప్రజల అకౌంట్లో వేస్తున్నారు. జగన్ మైకుల ముందు ఈ దిక్కుమాలిన వాగుడు వాగుతూ వుంటే, ఆయన వెనుక, అటూ ఇటూ దేభ్యం ముఖాలతో, విలన్ వెనుక వుండే ‘‘ఎస్ బాస్’’ కేరెక్టర్ల టైపులో అంబటి రాంబాబు... అనిల్ కుమార్ యాదవ్.. మైకుల మీద జగన్ వాంతి చేసుకోవడం అయిపోయిన వెంటనే, మీడియావాళ్ళు ప్రశ్నిస్తుంటే, ఈ మహానటుడు విననట్టు యాక్టింగ్ చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. జగన్ సార్‌కి మీడియా ముందు నిల్చుని అడ్డమైన వాగుడు వాగడం తెలుసుగానీ, మీడియావాళ్ళు అడిగిన ఒక్క ప్రశ్నకి అయినా సమాధానం చెప్పే దమ్ము లేదు.. పైగా ఈ పిరికి నాయకుడికి మళ్ళీ ‘పులివెందుల పులి’ అనే సంబంధం లేదని భజన కార్యక్రమం.. మిస్టర్ జగన్.. జనం మీ అబద్ధాలను నమ్మే స్థితిలో లేరు. తమరు ఎంతైనా వాగండి.. అంతా వృధా. గతంలో తమరి మాటలను విని మోసపోయిన జనం ఐదేళ్ళపాటు నీలాంటి వాడిని ముఖ్యమంత్రిగా చేసినందుకు బాధపడుతూనే వున్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా.. ఈ సైకోని ఎప్పుడు తరిమికొడదామా అని ఎదురు చూశారు. అందుకే మీ పార్టీని 11 సీట్లకు పరిమితం చేసి, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో.. ఇప్పటికైనా మారు.. ఇప్పటికైనా మనిషిలా ప్రవర్తించు.. అని మీకు చెప్పి ఉపయోగం లేదు.. ఎందుకంటే, మీలోగానీ, మీ దండుపాళ్యం బ్యాచ్‌లో గానీ ఎలాంటి మార్పు రాదు.. రాదు.. రాదు.! ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకే ఒక్కదానికోసం ఎదురుచూస్తున్నారు.. అదే జగన్ జైలుకి వెళ్ళే శుభదినం కోసం.. ఈలోపుగా మీరు మీ ఇష్టం వచ్చినట్టు వాగుడు కార్యక్రమాలు నిర్వహించుకోండి.

డ్ర‌గ్స్, గంజాయి మాఫియా అంతం.. హోంమంత్రి అనిత పంతం

ఏపీలో గ‌డిచిన ఐదేళ్ల కాలంలో డ్ర‌గ్స్ మాఫియా రెచ్చిపోయింది. అంగ‌డిలో దొరికే వ‌స్తువులా డ్ర‌గ్స్, గంజాయిని మార్చేశారు. డ్ర‌గ్స్ మాఫియాకు ప్ర‌భుత్వం పెద్ద‌ల అండ‌దండ‌లు ఉండ‌టంతోపాటు.. మాఫియాలో భాగ‌స్వాములుగా కొంద‌రు వైసీపీ నేత‌లు ఉన్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దీంతో గ‌డిచిన ఐదేళ్ల కాలంలో డ్ర‌గ్స్‌, గంజాయికి బానిస‌లై వేలాది మంది యువ‌తీయువ‌కులు, విద్యార్థులు త‌మ జీవితాల‌ను ఛిద్రం చేసుకున్నారు. దేశంలో ఎక్క‌డ డ్ర‌గ్స్ దొరికినా దాని మూలాలు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోనే ఉంటూ వ‌చ్చాయి. స‌రిగ్గా ఎన్నిక‌ల స‌మ‌యంలో విశాఖ పోర్టులో భారీ డ్ర‌గ్స్ పట్టుబడటంతో  దేశం మొత్తం ఉలికిపాటుకు గురైంది. విశాఖ పోర్టులో 25 వేల కేజీల డ్రగ్స్‌ను సీబీఐ స్వాధీనం చేసుకుంది. దీని విలువ కొన్ని వేల కోట్లు ఉంటుంద‌ని అధికారులు అంచనా వేశారు. ముఖ్యంగా ప్ర‌శాంతంగా ఉండే విశాఖ ప‌ట్ట‌ణం కేంద్రంగా వైసీపీ ప్ర‌భుత్వం హ‌యాంలో డ్ర‌గ్స్, గంజాయి ర‌వాణా, విక్ర‌యాలు పెరిగాయి. ప్ర‌స్తుతం ఏపీలో ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలో రావ‌డం.. హోం మంత్రిగా వంగ‌ల‌పూడి అనిత బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డంతో డ్ర‌గ్స్‌, గంజాయి మాఫియాపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ద‌మ‌య్యారు. అందుకు అనుగుణంగా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నారు. డ్ర‌గ్స్‌, గంజాయి ర‌హిత ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను దేశానికి ప‌రిచ‌యం చేసేందుకు ఆమె వ‌డివ‌డిగా అడుగులు వేస్తున్నారు.  హోంమంత్రి అనిత ఇటీవ‌ల విశాఖ సెంట్ర‌ల్ జైలును సంద‌ర్శించారు. గంజాయి కేసుల్లో జైలులో ఉన్న ఖైదీల‌ను ఆమె క‌లిశారు. అక్క‌డ ఖైదీలుగా ఉన్న‌వారిలో కొంద‌రినిచూసి ఆశ్చ‌ర్య‌పోయారు. అంతేకాదు.. రాష్ట్రంలో ఇంత దారుణ ప‌రిస్థితులు ఉన్నాయా అంటూ ఆవేద‌న‌ వ్య‌క్తం చేశారు. మైన‌ర్లు గంజాయి కేసుల్లో ఖైదీలుగా ఉన్నారు. వారిని మంద‌లించ‌గా.. డ్ర‌గ్స్‌, గంజాయిని స్మ‌గ్ల‌ర్లు చెప్పిన‌ చోటుకు చేర్చితే ఐదు, ప‌దివేలు ఇస్తార‌ని, అందుకే గంజాయిని త‌ర‌లించేందుకు ఒప్పుకునేవాళ్ల‌మ‌ని వారు చెప్పుకొచ్చారు. నిజంగానే వైసీపీ ప్ర‌భుత్వం హ‌యాంలో స్మ‌గ్ల‌ర్లు గంజాయి, డ్ర‌గ్స్ ప్యాకెట్ల‌ను ర‌వాణా చేసేందుకు మైన‌ర్ల‌ను ఉప‌యోగించారు. పేద కుటుంబాల్లోని మైన‌ర్ల‌ను టార్గెట్ గా చేసుకొని వారికి డ‌బ్బులు ఆశ‌జూపి డ్ర‌గ్స్‌, గంజాయిని స‌ర‌ఫ‌రా చేస్తూ వ‌చ్చారు. ప్ర‌భుత్వం, పోలీస్ యంత్రాంగానికి ఈ విష‌యం తెలిసినా.. స్మ‌గ్ల‌ర్ల‌ ఆగ‌డాల‌కు అడ్డ‌క‌ట్ట వేయ‌డానికి ఏ మాత్రం ప్రయత్నించలేదు. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం.. మాఫియాలో భాగ‌స్వాములుగా వైసీపీ ముఖ్య‌నేత‌లు ఉండ‌ట‌మేన‌ని గ‌తంలోనే విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. వైసీపీ హ‌యాంలో రాష్ట్రంలో గంజాయి, డ్ర‌గ్స్ ర‌వాణా, విక్ర‌యాలు పెరిగాయ‌ని, వాటికి అడ్డుక‌ట్ట వేయాలంటూ అనేక‌ సార్లు పోలీసుల‌కు, ప్ర‌భుత్వానికి గ‌తంలో అనిత‌ విజ్ఞ‌ప్తులు చేశారు. ప్ర‌స్తుతం ఆమే హోం మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డంతో డ్ర‌గ్స్‌, గంజాయి స్మ‌గ్లింగ్‌ను కూక‌టివేళ్ల‌తో పెకిలించేందుకు అధికార యంత్రాంగంతో క‌లిసి ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నారు. సీఎం చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల‌తో ఏపీలో గంజాయి లేకుండా చేసేందుకు పోలీస్‌శాఖ‌ న‌డుం బిగించింది. ఈ క్ర‌మంలో గంజాయికి సంబంధించిన స‌మాచారాన్ని పోలీసుల‌కు అందిస్తే వారికి న‌గ‌దు రివార్డు ఇస్తామ‌ని హోంమంత్రి అనిత బంప‌రాఫ‌ర్ ఇచ్చారు. అంతేకాదు, గంజాయిపై ఉక్కుపాదం మోపేందుకు టోల్ ఫ్రీ న‌వంబ‌ర్ ఏర్పాటు చేశారు. ఇటీవ‌ల విశాఖ సెంట్ర‌ల్ జైలును అనిత సంద‌ర్శించిన స‌మ‌యంలో జైలు సామ‌ర్థ్యం 800మంది ఖైదీలు అయితే.. దాదాపు రెండు వేల మంది ఖైదీలు ఉన్న‌ట్లు గుర్తించారు. అందులోనూ 1230 మంది గంజాయి కేసుల్లో ప‌ట్టుప‌డిన వారే కావ‌టంతో ఆమె ఆశ్చ‌ర్య‌పోయారు. అయితే, గంజాయి, డ్ర‌గ్స్ కేసుల్లో ప‌ట్టుబ‌డింది ఎక్కువ‌గా పేద కుటుంబాల‌కు చెందిన యువ‌కులే. వారిలోనూ అధికంగా మైన‌ర్లే ఉన్నారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం గ‌త ఐదేళ్ల కాలంలో ఏపీ ప్ర‌భుత్వ నిర్వాక‌మే. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సీఎంగా ఉన్న ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో ఎక్క‌డా అభివృద్ధి జ‌ర‌గ‌లేదు. కేవ‌లం నెల‌నెలా పింఛ‌న్లు వేయ‌డానికే ఆయ‌న ప‌రిమితం అయ్యారు. వివిధ శాఖ‌ల‌కు సంబంధించి నిధుల‌ను సైతం పింఛ‌న్ల పంపిణీకి మ‌ళ్లించారు. దీంతో పేద వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ కోసం వివిధ శాఖ‌ల కింద ప్ర‌త్యేకంగా అందాల్సిన నిధులు వారి ద‌రికి చేర‌క‌పోవ‌టంతో పాటు.. వారు ప‌నులు చేసుకునేందుకు క‌నీసం ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించ‌డంలో జగన్ ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంది. ముఖ్యంగా గిరిజ‌న గ్రామాల్లో యువకులు, మైన‌ర్ బాలురు కుటుంబాల పోష‌ణ కోసం ఐదు, ప‌దివేల‌కు గంజాయి, డ్ర‌గ్స్ ర‌వాణా చేయ‌డానికి సిద్ధ‌ప‌డ్డారు. వారి ఆర్థిక ప‌రిస్థితిని అవ‌కాశంగా తీసుకొని త‌మ వ్యాపారాన్ని స్మ‌గ్ల‌ర్లు ద‌ర్జాగా కొన‌సాగించారు. ఒక‌వేళ పోలీసులు దాడులు చేసినా ప‌ట్టుబ‌డిన వారిలో పేద కుటుంబాల‌ యువ‌కులు, మైన‌ర్లే ఉంటూ వ‌చ్చారు. ఆ విష‌యాన్ని ఆక‌ళింపు చేసుకున్న ప్ర‌భుత్వం.. డ్ర‌గ్స్, గంజాయి ర‌వాణా, త‌యారీ, విక్ర‌యాలు జ‌రిగే స‌మ‌యంలో త‌మ‌కు స‌మాచారం ఇస్తే న‌గ‌దు రివార్డు అందిస్తామ‌ని ప్ర‌క‌టించింది. దీనికితోడు.. గంజాయి త‌ర‌లించే స‌మ‌యంలో దొరికిన వారిపైనే కేసులు పెట్టి స‌రిపెట్ట‌కుండా.. వారి వెన‌క ఉన్న స్మ‌గ్ల‌ర్ల గుట్టును ర‌ట్టుచేసి, క‌ట‌క‌టాల పాలుచేసేందుకు హోం మంత్రి అనిత ఆధ్వ‌ర్యంలో పోలీస్ శాఖ చ‌ర్య‌లు చేప‌ట్టేందుకు సిద్ధ‌మైంది. మొత్తానికి.. గత ఐదేళ్ల వైసీపీ పాల‌న‌లో ఏపీ డ్ర‌గ్స్‌, గంజాయికి కేంద్రంగా మార‌గా.. ప్ర‌స్తుత ప్ర‌భుత్వం గంజాయి, డ్ర‌గ్స్ ర‌హిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు వ‌డివ‌డిగా అడుగులు వేస్తుండ‌టంతో ఏపీ ప్ర‌జ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. 

ఢిల్లీలో రేవంత్ బిజిబిజీ 

కాంగ్రెస్ బిజెపి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విభేధాలు ఉన్నాయి. అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజెపి పెద్దలను వరుసగా కలుసుకోవడం చర్చనీయాంశమైంది. ఢిల్లీ    పర్యటనలో సీఎం రేవంత్​ రెడ్డి బిజీబిజీగా గడుపుతున్నారు. రెండో రోజు దిల్లీలో పర్యటిస్తున్న రేవంత్​ కేంద్రమంత్రి అమిత్​ షాను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి దిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్​షాతో ఆయన భేటీ అయ్యారు. సీఎం వెంట అమిత్​ షా వద్దకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా వెళ్లారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చిస్తున్నారు. అలాగే విభజన హామీలపై కూడా చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ భేటీ ముగిసిన అనంతరం ప్రధాని మోదీతో సమావేశం అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రానికి నిధులపై ప్రధానితో సీఎం రేవంత్​ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చర్చించనున్నట్లు తెలిసింది.ఢిల్లీ పర్యటనలో ఉన్న‌ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆయ‌న వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా వెళ్లారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చిస్తున్నారు. అలాగే విభజన హామీలపై కూడా చర్చిస్తున్నట్లు సమాచారం.